Fashion collection
-
జస్ట్ డ్రెస్సింగ్ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!
చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం. అయితే ప్రతి సీజన్లో రకరకాల ట్రెండ్లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్లు అందిస్తున్న సూచనలివి.. లేయరింగ్, స్టాకింగ్.. పలు రకాల లెంగ్త్ ఉన్న చైన్ పెండెంట్లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్లెట్లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్ పీసెస్ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్ కారకంగా ఉండాలి. షాండ్లియర్ చెవిపోగులు.. ఈ షాండ్లియర్ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు. డైమండ్ షాండ్లియర్స్ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బోల్డ్ రింగులు.. ఒక పెద్ద డేరింగ్ రింగ్ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. జడౌ..జతగా.. ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది. ఆమె..ఆభరణం.. కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. ఆఫీస్..డైమండ్ పీస్.. పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్ డైమండ్ హగ్గీలు లేదా సాలిటైర్ స్టడ్లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్ ఫార్మల్స్ ధరించడం ఇష్టపడితే, డైమండ్ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్ పోల్కీ ఇయర్ స్టడ్‌తో సరిపెట్టొచ్చు. (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..) -
చీరలో మగవాళ్లు కూడా స్టైలిష్‌గా కనిపించొచ్చు ఇలా..!
ఫ్యాషన్‌కి లింగ భేదం, సరిహద్దులు లేవని చూపించారు చాలామంది. కొద్దిపాటి సృజనాత్మకతతో మహిళల అందాన్ని రెట్టింపు చేసే చీర కూడా పురుషులను అందంగా చూపించగలదని విన్నారా..?. అవును మీరు వింటుంది నిజమే..!. మగవాళ్లు చీర కట్టుకుంటారా ఏంటి..? అని అనుకోకండి..ఎందుకంటే చీరను మగవాళ్లు ధరించే వాటిలా మలిచి స్టైలిష్‌గా చూపించొచ్చట. పైగా ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం ఇస్తున్నారు ఇలా..!.అదెలా అంటే... భారతదేశపు తొలి పురుష మోడల్‌గా పేరుగాంచిన వ్యక్తి, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ అదెలాగో చేతల్లో చూపించాడు. ఫిట్నెస్ ఐకాన్‌గా పేరుతెచ్చుకున్న సోమన్..ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ ర్యాంప్‌పై చాలా అందంగా మెరిశాడు. అతడి స్టైలిష్ లుష్ కళ్లు తిప్పుకోనివ్వలేనంతగా కట్టిపడేసింది. సంప్రదాయానికి ప్రతీగా చూసే బంగారు చీరలో తళుక్కుమని కనిపించాడు. అది కూడా ఓ సాధారణ చీర మగవాళ్లకు కూడా ఇంత మంచి లుక్ ఇవ్వగలదా అనే ఆశ్యర్యానికి గురిచేసేలా అతడి ఆహార్యం అందర్నీ ఆకర్షించింది. అందులోనూ రుద్రాక్షలను ధరించి.. రుద్ర అవతారాన్ని ఓ సరికొత్తఫ్యాషన్ లుక్‌లో చూపించాడు సోమన్. ఆ లుక్ చూడటానికి మన సాంస్కృతిక సంప్రదాయాలకు ఆధునికతను జోడిస్తే.. ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నానుడికి అసలైన అర్థంలా అతడి స్టైలిష్ లుక్ ఆకర్షిస్తోంది. అంతేగాదు సోమన్ ఆ ఫ్యాషన్ ర్యాంప్‌పై చెప్పులు లేకుండా ధోతీ కట్టులో వస్తున్న తీరు..మన సంప్రదాయ లుక్ ఇచ్చే ఆత్మవిశ్వాసమే వేరేలెవెల్ అన్నట్లుగా ఉంది. అలనాటి రాజవంశికులు పండుగలు, పర్వదినాల్లో ధరించే వస్త్రధారణ తీరుని గుర్తు చేసింది సోమన్ ఫ్యాషన్ వేర్. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ధరించే రుద్రాక్షలు శక్తికి ప్రతీకలు. అందువల్లే ఈ ఫ్యాషన్ ర్యాంప్‌పై సోమన్ లుక్ శక్తిమంతంగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Suta- Mindful Lifestyle Brand (@suta_bombay) (చదవండి: స్పేస్ ఫుడ్ టేస్ట్‌ని ఇలా పరీక్షిస్తారా..? వీడియో వైరల్) -
సమ్మర్లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!
సంప్రదాయ రూపమైనా ఇండో వెస్ట్రన్ కాంబినేషన్ అయినా కాటన్‌తో డ్రెస్సింగ్ స్టైల్స్ ఏమీ ఉండవు అనుకునేవారికీ ప్రతి వేసవి కొత్త మోడల్స్‌ని పరిచయం చేస్తూనే ఉంది. ఉన్న మోడల్స్‌ని మరింత వినూత్నంగా కళ్లకు కడుతోంది. ఫ్యాషన్ వేదికలపైనా స్టైలిష్‌గా వెలిగిపోతోంది... ఇంటింటికీ వచ్చి కాటన్ షో చేస్తోంది.ఇంటికి వచ్చిన.. కాటన్ షోశరీరానికి పట్టిన చెమటను పీల్చుకొని, కంఫర్ట్‌గా ఉంచే కాటన్ ఫ్యాబ్రిక్‌ను స్టైలిష్ వేర్‌కు జతచేసేటప్పుడు ఆ మెటీరియల్ బరువు, నేత, రంగును కూడా చూడాలి.సల్వార్ సూట్రోజువారీ ధరించేదే కదా ఏముంది స్పెషల్... అనుకోవడానికి వీలు లేని కంఫర్ట్బుల్ డ్రెస్‌గా మన్ననలు అందుకుంది సల్వార్ సూట్. స్ట్రెయిట్ కట్, ఎ లైన్, ఫ్రాక్ స్టైల్, పలాజో, టులిప్, ధోతీ ప్యాట్స్.. అంటూ సోషల్ మీడియా ట్రెండ్‌గా ఉన్న సల్వార్స్ కాటన్స్లో కంఫర్ట్‌గా లభిస్తున్నాయి.బ్రైట్ వైట్కాటన్ పాప్లిన్ క్లాత్ వేడి వాతావరణానికి అనువైనదిగా పేరొందింది. మస్లిన్, వాయిల్, సీర్ సకర్.. వంటివి ఈ కాలం తేలికగా అనిపించే మెటీరియల్. సాధారణంగా కాటన్స్లో వైట్, లైట్ షేడ్స్ మెటీరియల్ లభిస్తుంది. డల్‌గా ఉండే కలర్ ఫ్యాబ్రిక్ అంటూ పక్కన పెట్టేసే రోజులు కావివి. ఫ్లోరల్ మోటిఫ్స్, ప్యాచ్‌వర్క్, టై అండ్ డై తో షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్స్టైల్లో ఆకట్టుకునే ట్యునిక్స్.. ఈ సమ్మర్లో వెలిగిపోనున్నాయి.ఫెదర్ లైట్జమదాని, ఫెదర్ లైట్ మల్ మల్ కాటన్స్, చందేరీ, ఇక్కత్ కాటన్స్తో చేసే ప్రయోగాలు స్టైలిష్వేర్ని వినూత్నంగా చూపుతున్నాయి. ఎంపిక చేసుకునేటప్పుడు స్టైలిష్‌గానే కాదు మన్నిక ఎంత ఉన్నాయో చూసుకోవాలి.రెడీమేడ్ అయితే ఆ డ్రెస్‌పై ఉండే లేబుల్‌ను చెక్ చేయాలి. ఉతకడం, ఆరబెట్టడం వంటి సూచనలపై లేబుల్ తగిన సమాచారాన్ని ఇస్తుంది. కొన్ని రకాల కాటన్ డ్రెస్సులు నీళ్లలో పెట్టినప్పుడు రంగు పోతుంటాయి. ఒకదాని కలర్ మరో డ్రెస్‌కు పట్టే అవకాశం ఉంటుంది. ముదురు, లేత రంగులు, ఒకే రంగు కలవి విడివిడిగా ఉతకడం మేలు. నీళ్లలో పెట్టినప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ ష్రింక్ అవడం, స్టార్చ్ పోవడం జరుగుతుంది. శుభ్రపరచడానికి చల్లటి నీటిని ఉపయోగించడం, డ్రైయర్‌ను ఉపయోగించకుండా ఆరవేయడం వల్ల కాటన్ క్లాత్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. (చదవండి: ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!) -
మనీష్ మల్హోత్రా పింక్ గోల్డ్ డ్రెస్: ‘ఉమ్రావ్ జాన్’ రేఖ మేజిక్ రిపీట్
-
కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?
పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో జరిగిన ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్ షో దూమారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్లో జరిగిన ఈ ఫ్యాషన్ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్‌కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్లు ఉన్న ట్రాన్స్పరేంట్ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ హాలిడే. ఇది కేన్స్‌లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్ హాలిడే రిసార్ట్, స్విమ్ దుస్తుల పరంగా ఫ్యాషన్‌లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్ఎఫ్ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్‌ని ఎక్కువగా బాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్‌కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్ డిజైనర్లు గుల్మార్గ్ ఫ్యాషన్ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..) -
'ఈడెన్ ది షాపే' ఫ్యాషన్ ఫోర్కాస్ట్: సరికొత్త డిజైనరీ కలెక్షన్లు..!
నేటి తరం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఈడెన్ ది షాపే సరికొత్త డిజైనరీ కలెక్షన్లతో ఫోర్కాస్ట్-2025తో ముందుకు వచ్చింది. వినూత్న డిజైనరీ కలెక్షన్లతో ఆకట్టుకునేలా ఫ్యాషన్ కలెక్షన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది ఫ్యాషన్ ఫోర్‌కాస్ట్‌లో భాగంగా ఫ్యాషన్ రంగంపై పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని, ఐకానిక్ 90, 2000ల ప్రారంభంలో ఫ్యాషన్ పునః ప్రవేశం, ఫ్యాషన్ డిజైన్‌లో ఏఐ పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించింది. అదేవిధంగా మహిళలు, యవతకు నచ్చే ఫ్యాషన్ కలెక్షన్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ఏడాది ఫ్యాషన్ ట్రెండ్లు:సుస్థిరమైన సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ : జీరో-వేస్ట్ డిజైన్లు, సుస్థిరమైన మెటీరియల్‌లు అభివృద్ధి చేస్తూ, పర్యావరణహితమైన, మన్నికమైన హ్యాండ్ మేడ్ డిజైనరీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం.నోస్టాల్జియా ఫ్యాషన్: 1990 నుంచి 2000 వరకు ఐకానిక్‌గా ఉండే షార్ట్ జీన్స్, కార్గో ప్యాంట్లు, భారీ పరిమాణంలో ఉండే బ్లేజర్లు వింటేజ్ గ్రాఫిక్ టీ షర్టులన్నీ కూడా ఆధునాతన సొబగులతో మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మినిమలిజం - నాణ్యత: మినిమలిస్ట్ ఫ్యాషన్ ఇప్పటికీ బలంగానే ఉంది. మెటీరియల్ ఎంపిక నుంచి మొదలుకుంటే క్రాఫ్ట్మ్యాన్షిప్ సుస్థిరమైన సౌకర్యంతో కూడిన కాలనుగుణమైన మన్నికైన బహుముఖ వస్తువుల తయారీ. AI-జనరేటెడ్ కస్టమ్ ఫ్యాషన్: ఏఐ-ఆధారిత ఫ్యాషన్ ఆవిష్కరణలతో వినియోగదారుల ఫ్యూచరిస్టిక్ ఫ్యాషన్ అనుభూతితో, వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా దుస్తుల రూపకల్పన, బట్టలను ఎంపిక చేసుకోవడం మరింత సులభతరం కానుంది. ఫ్యాషన్ ముఖ్యాంశాలు:టాప్‌లు: సౌకర్యవంతంతోపాటు, స్టైలిష్‌గా కనిపించే దుస్తులతోపాటు, భారీగా ఉండే బటన్-డౌన్ షర్టులు, కుర్తా టాప్‌లు, టర్టిల్నెక్ టాప్‌లు మపఫ్డ్ స్లీవ్లతో కూడిన ఆర్టిస్టిక్ డిజైనరీ వస్త్రాలు.బాటమ్స్: అందుబాటులో హై-వెయిస్టెడ్ ప్యాంటు, కార్గో ప్యాంట్లు, డెనిమ్ స్కర్టులు, ప్లీటెడ్ స్కర్టులు, బూట్‌కట్ జీన్స్ వంటివి యువతకు నప్పే, మెప్పించే సౌకర్యవంతమైన వస్త్రాలు. లోదుస్తులు: విశేషమైన ఆదరణ ఉన్నా లగ్జరీ సిల్క్, శాటిన్‌తో చేసిన లోదుస్తులు, వైర్లెస్ బ్రా, బోల్డ్, స్పోర్టీ-చిక్ డిజైనరీ క్లాత్.ఆభరణాలు, ఉపకరణాలు: మినిమలిస్ట్, వింటేజ్-ప్రేరేపిత ఆర్టిస్టిక్ ఆభరణాలు, ముఖ్యమైన ఉపకరణాలలో క్రాస్బాడీ, మినియేచర్ బ్యాగులు, బోల్డ్ శిల్పకళా సంచులు, మెటల్ ఫ్రేమ్‌తో కూడిన సన్ గ్లాసెస్, రెట్రో-ప్రేరేపిత డిజైన్లు, ఫ్యూచరిస్టిక్ ఆకృతులతో ట్రెండీ వేర్. ఫుట్‌వేర్: చంకీ స్నీకర్లు, బోల్డ్ బూట్లు, ప్లాట్‌ఫామ్ హీల్స్ క్యాజువల్ వేర్‌కు అనువైన పాదరక్షలు.బ్యూటీ ట్రెండ్స్: 2025లో ఫ్యాషన్ రంగాన్ని నడిపించే గ్రాఫిక్ ఐలైనర్లు, గ్లో-బూస్టింగ్ హైలైటర్లు, వీగన్ లిప్‌స్టిక్‌లు ఈడెన్-ది షాపే గురించి:హైదరాబాద్‌లోని గాంధీనగర్ కేంద్రంగా ఈడెన్-ది షాపే అంచనాలకు మించి క్యూరేటెడ్ ఫ్యాషన్ కలెక్షన్లను అందిస్తోంది. గ్యాలరీ-ప్రేరేపిత లేఅవుట్‌తో ఇదొక ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని అందిస్తోంది. వినియోగదారులు కూడా సరసమైన లగ్జరీ తాజా ట్రెండ్లను సులభంగా పొందవచ్చు. 2016లో ప్రారంభమైన నాటి నుంచి ఈడెన్-ది షాపే ఫ్యాషన్ ఆవిష్కరణలతో బ్రాండెడ్, డిజైనరీ కలెక్షన్లకు వేదికగా నిలుస్తోంది. వివరాల కోసం: ఈడెన్-ది షాపే- ఈడెన్ అనెక్స్, గాంధీనగర్,హైదరాబాద్ - 500080 వద్ద సందర్శించవచ్చుమొబైల్ : +91 9652132812ఈమెయిల్: edentheshoppe@gmail.com(చదవండి: Fashion going back to the root మూలాల్లోకి ఫ్యాషన్ ప్రయాణం) -
Paris Fashion Week 2025: ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కలెక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్
-
హైలైఫ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
తన ఫ్యాషన్ బ్రాండ్ అకుటీ బెనారసీ చీరలో సాగరికా ఘట్గే
-
కొత్త పెళ్లికూతుళ్లకు అదిరిపోయే బ్రైడల్ లుక్ (ఫోటోలు)
-
రిలయన్స్ ‘యూస్టా’ స్టోర్ ప్రారంభం
రిలయన్స్ రిటైల్ తన వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సమీపంలో నాగోల్-అల్కపురి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ‘యూస్టా’ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లు ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.దేశంలోని యువత అధికంగా ఇష్టపడే స్టైల్స్‌లో విభిన్న మోడల్స్‌ను యూస్టా అందిస్తోందన్నారు. ప్రస్తుతం యూస్టా స్టోర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు చెప్పారు. ప్రీమియం మోడల్స్‌తోపాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..యువతను ఆకర్షించేలా చాలా ఫ్యాషన్ రిటైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందుబాటు దరల్లోనే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా స్థానికంగా ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులు అధికమవుతున్నాయి. స్థానికంగా మంచి ఉత్పత్తులు అందిస్తే సంస్థల బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
విజయవాడ : హై లైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
విజయవాడలో సందడి చేసిన సినీ నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన నటి దివి, దీక్షా పంత్ (ఫొటోలు)
-
ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో నటించిన షాలిని పాసి లేటెస్ట్ సెన్సేషన్. ఢిల్లీకి చెందిన ఈమె సోషల్ యాక్టివిస్ట్, ఆర్టిస్ట్ కూడా. ఫ్యాషన్‌కు మారు పేరు. మరోవిధంగా చెప్పాలంటే వాకింగ్ ఫ్యాషన్ఎగ్జిబిషన్. అదిరిపోయే డ్రెస్‌లు, అద్భుతమైన హెడ్‌పీస్‌లు, ఆకట్టుకునే బ్యాగ్‌లు ఇలా షాలిని స్టైల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె బ్యాగులు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.ఆమె బ్యాగుల కలెక్షన్ చాలా స్పెషల్మాత్రమేకాదు, ధర కూడా కళ్లు చెదిరే రేంజ్‌లోనే. పావురాలు, చిలుకలు, పాత కెమెరాలు ఇలా రకరకాల షేపుల్లో ఆమె బ్యాగులు మెస్మరైజింగ్‌గా ఉంటాయి.ఒక ఎపిసోడ్లో, షాలిని క్లాసిక్ క్లిక్ కెమెరాను పోలి ఉండే క్లచ్‌తో కనిపించింది. పాతకాలపు కెమెరా ఆకారంలో క్రిస్టల్-స్టడెడ్ హ్యాండ్‌బ్యాగ్ ధర సుమారు 5 లక్షల రూపాయలు. మరో ఎపిసోడ్లో ఆమె చేతిలో మెరిసిన ఫ్లెమింగో క్లచ్ ధర అక్షరాలా రూ. 5,400,000.బ్రిక్ ఫోన్ బ్యాగ్ ధర రూ. 600,000, ఇంకా 8 లక్షల, 30వేల విలువ చేసే టీవీ టెస్ట్ స్క్రీన్ బ్యాగ్, దాదాపు రూ. 3 లక్షల విలువ చేసే క్రిస్టల్ హార్ప్ క్లచ్‌తో ఆకర్షణీయమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఇవి కాకుండా, షాలిని జెల్లీ ఫిష్, టెడ్డీ బేర్స్, చిలుకలు, గులాబీలు, కుక్కలు , ఇతర ఫన్నీ బ్యాగ్స్కూడా ఆమె సొంతం.కాగా షాలిని పాసి భర్త బిలియనీర్,పాస్కో గ్రూప్ ఛైర్మన్ సంజయ్ పాసి. ఈ దంపతుల రాబిన్ రాబిన్ . ఇక ఈ సిరీస్‌లో మహీప్ కపూర్, నీలం కొఠారి, భావన పాండే, రిద్ధిమా కపూర్ సాహ్ని, సీమా సజ్దేహ్ మరియు కళ్యాణి సాహా చావ్లా కూడా నటించారు -
రిలయన్స్ రిటైల్ విస్తరణ
రిలయన్స్ రిటైల్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. యువతకు ఫ్యాషన్ ఉత్పత్తులను అందించే ‘అజార్ట్’ బ్రాండ్ స్టోర్లను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలిపింది. జైపూర్, ఉదయపూర్, రాయ్‌పూర్, దెహ్రాదూన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.ఇప్పటికే బెంగళూరులో అజార్ట్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ వీటి సంఖ్యను ఐదుకు పెంచింది. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అజార్ట్ బ్రాండ్‌ను 2022లో స్థాపించాం. క్రమంగా బ్రాండ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాం. యువత నుంచి ఈ బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ బ్రాండ్ యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వినియోగదారుల జీవనశైలిని ప్రతిబింబించేలా, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా కంపెనీ పనిచేస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్పండగ సీజన్లో చాలా కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించాలని యోచిస్తుంటాయి. ఫెస్టివల్ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నమ్ముతాయి. కంపెనీ ఉత్పత్తులు వినియోగదారులకు నచ్చితే తదుపరి గిరాకీ ఏర్పడుతుందని భావిస్తాయి. -
ఫెస్టివ్ లుక్.. ఫ్యాషన్ క్లిక్..
వరుసగా రెండు పెద్ద పండుగలు వచ్చేస్తున్నాయి. పుట్టినరోజులు, నైట్ పార్టిలు, వార్షికోత్సవాలు తదితర సందర్భాల్లో ధరించే దుస్తులతో నగరవాసులు అత్యాధునిక ఫ్యాషన్‌కు కేరాఫ్ అ‘డ్రెస్’లా మారిపోతారు. అయితే పండుగల సందర్భం మాత్రం పూర్తిగా విభిన్నం. తమ ఫెస్టివల్ లుక్ మోడ్రన్‌గా మెరిపించడంతో పాటు ట్రెడిషన్‌కు కేరాఫ్‌గా కూడా చూపించాలని తపిస్తారు. అలాంటి ఫ్యాషన్ ప్లస్ ట్రెడిషన్ ప్రియులైన నగర యువత కోసం నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ పలు సూచనలు అందిస్తోంది. ఇటీవల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్ ద్వారా శారీ డ్రేపింగ్ స్టైల్స్ ప్రభావితమవుతున్నాయి. ముందుగా కుట్టిన చీరలు, ధోతీ స్టైల్ ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్.. వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ స్టైల్స్‌లో అసిమెట్రికల్ కట్స్, స్ట్రక్చర్డ్ సిల్హౌట్‌లతో సహా పాశ్చాత్య ఫ్యాషన్ మేళవింపులతో విభిన్న రకాల మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఇవి సంప్రదాయ చీరల్ని అత్యాధునికంగా మారుస్తాయి. వీటితోపాటు అనేక రకల సంప్రదాయ దుస్తులు ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి..డిజైనర్స్ సూచనలు.. పండుగ సీజన్లో స్టైలి‹Ùగా, సౌకర్యవంతంగా ఉండటానికి లైమ్ గోటా పట్టి ఉన్న చందేరి కార్డ్ సూట్ సెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది మోనోక్రోమాటిక్ లుక్స్‌కి రంగురంగుల వైబ్స్‌ని జోడిస్తుంది. ఎంబ్రాయిడరీ చేసిన ఐవరీ కో–ఆర్డ్ షరారా పండుగ దుస్తులకు పర్ఫెక్ట్ క్లాసిక్ చిక్ రూపాన్ని అందిస్తుంది. బ్లేజర్లు కార్పొరేట్ స్టైల్‌కి మాత్రమే పరిమితం అనుకుంటారు. కానీ, ఇటీవల ఆల్–టైమ్ ఫేవరెట్‌గా మారాయి. ఒక ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో మేళవించాలి. నడుముకు బెల్ట్‌తో ఏ సమయంలోనైనా ఈ డ్రెస్ బెస్ట్ ఎంపికగా నిలుస్తుంది. ఈ నవరాత్రి రోజుల్లో మస్టర్డ్ షరారా చీర ధరిస్తే చాలా స్టైలి‹Ùగా, తేలికగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. డ్రేప్డ్ బాటమ్తో సెట్ చేసే డ్రెస్సులు ఇటీవల ట్రెండ్‌లో ఉన్నాయి. పర్ఫెక్ట్ ఈవెనింగ్ వేర్ కోసం డ్రేప్డ్ స్కర్ట్, ఎంబ్రాయిడరీ క్రేప్‌తో జత చేయాలి. అదనపు డోస్ కోసం సీక్వెన్స్ జుతీస్ బెస్ట్. పేస్టెల్, బ్రైట్ కలర్స్‌తో ఓ సరికొత్త చిక్ కాంబినేషన్. ఈ ఆఫ్–వైట్– పింక్ కేడియా టాప్, షెల్– మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన షార్ట్ అవుట్‌ఫిట్‌తో ప్రకాశవంతమైన పసుపు ధోతీతో జతగా ధరించవచ్చు. ఆధునిక– సంప్రదాయాల సమ్మేళనంతో డిజైన్ చేసిన ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఉన్న స్కార్లెట్ సిల్క్ లెహెంగా పలాజో సెట్ ధరిస్తే..కలల రూపం సొంతమవుతుంది.. సల్వార్ కమీజ్ అందంగానూ, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రకాశవంతమైన రంగులతో కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్నవి ఎంచుకోవచ్చు. వివాహాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో చనియా చోళీ ధరిస్తారు. వీటికి ఆధునిక ఉపకరణాలు, ఆభరణాలను జత చేస్తున్నారు. పిల్లల కోసమైతే తక్కువ బరువున్న ఆభరణాలను ఎంచుకోవాలి. పిల్లల దుస్తులను సొంతంగా లేదా ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవచ్చు. పిల్లలతో సరిపోలే దుస్తులను ధరించడం వల్ల యూనిక్ ఫ్యామిలీ అనిపించుకోవచ్చు. పిల్లల దుస్తులు సౌకర్యంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండుగ వేడుకల్లో డ్యాన్స్ చేసేటప్పుడు జారిపడకుండా ఉండేలా పొడవును, సౌకర్యాన్ని నిర్ధారించుకోవాలి. ప్రమాదాన్ని కలిగించేలా పదునైన ఉపకరణాలు, ఆభరణాలకు దూరంగా పెట్టాలి. పురుషుల కోసం.. ఎతి్నక్వేర్తో పండుగ లుక్‌ను మార్చుకోవాలని భావిస్తే.. కుర్తా కరెక్ట్. ఏ సందర్భానికైనా నప్పే కాలాతీత ఫ్యాషన్‌గా కుర్తాను ఎంచుకోవచ్చు. సరైన రీతిలో ఫిట్ అయ్యే కుర్తా–పైజామా ఎల్లప్పుడూ స్టైలిష్ లుక్‌ని అందిస్తాయి. ఇంకొంచెం కొత్తగా కనిపించాలంటే.. కుర్తాకి నెహ్రూ జాకెట్‌ని జత చేయవచ్చు. మొత్తంగా మెరిపించే సత్తా ఈ కాంబినేషన్‌కి ఉంది. అదే విధంగా షేర్వానీలు కూడా వేడుకలకు నప్పే ఎంపికలు. పండుగలకు ఇవి సరైన ఛాయిస్. అలాగే దీపావళి పారీ్టలకు కూడా కరెక్ట్‌గా నప్పుతాయి. ఎరుపు రంగు షేడ్.. సంప్రదాయ పండుగల్లో చాలా అర్థవంతమైన వర్ణంగా పేర్కొంటారు. నేవీబ్లూ, బ్లాక్, వైట్, ప్లమ్, ఆలివ్ గ్రీన్.. కూడా నప్పే ఎంపికలే. యాక్సెసరీస్... భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు (చెవిపోగులు), బిందీలు, హెయిర్‌పిన్ వంటి తక్కువ బరువున్న వాటిని యాక్సెసరీస్‌గా ఎంచుకోవాలి. -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
ఎన్నెన్నో వర్ణాలున్నా కానీ.. నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్..
ఎన్నెన్నో వర్ణాలు.. కానీ నలుపు, తెలుపు రంగులకున్నంత క్రేజ్ ఇంకే కలర్‌కూ ఉండదు! ఆ రెండిటినీ కలిపితే కనిపించే రిచ్‌నెస్‌ని చూస్తూండిపోవలసిందే! అదో క్లాసిక్ కాంబినేషన్! దాన్ని ఇంటికీ అద్దితే.. ఆ అభిరుచిని మెచ్చుకోని అతిథి ఉండరు! ఓనర్స్ ప్రైడ్.. నెయిబర్స్ ఎన్వీగా ఫీలయ్యేలా బ్లాక్ అండ్ వైట్‌ని ఇంటి అలంకరణలో మిళితం చేయాలంటే ఈ కింది చిట్కాలను ఫాలో అయితే సరి..!గోడలు, ఫర్నిచర్, ఆర్ట్.. ఎందులోనైనా తెలుపు రంగును డామినేట్ చేస్తూ ఒక వంతు నలుపు రంగు ఉండేలా చూసుకోవాలి. మన కళ్లు సహజంగా నల్లటి వస్తువులను ఆకర్షిస్తాయి. అందుకే వాటిని తక్కువగా ఉపయోగించాలి.ఏ స్థలానికి లేదా గదికి ఎంతమేర బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అవసరమో స్కేల్ సాయంతో సెలెక్ట్ చేసుకోవాలి. అంత కచ్చితత్వాన్ని పాటిస్తేనే ఈ డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.నలుపు– తెలుపు కాంబినేషన్లో చెక్స్ డిజైన్ని జోడించవచ్చు.అలంకరణలో తెల్లని గోడపైన నల్ల రంగులో సంగీత పరికరాలు, ప్యాటర్న్ ఫ్రేమ్‌లు, ఐరన్ లైట్స్ వంటివి వాడుకోవచ్చు.నలుపు– తెలుపు డిజైన్లలో కూడా ఇతర షేడ్స్ ఉంటాయి. కలర్స్‌ని న్యూట్రల్‌గా ఉపయోగించడం వలన డిజైన్లలో రిచ్‌లుక్ వస్తుంది.గది అంతా వైట్ పెయింట్ ఉండి మిగతా అలంకరణకు చాకోలెట్, నలుపు రంగులో ఉండే పెయింట్స్, వుడెన్ షో పీసెస్, కుండలు, కుండీలు, బుక్ ర్యాక్స్ వంటివీ అలంకరణకు ఉపయోగించవచ్చు.బ్లాక్ అండ్ వైట్ థీమ్‌ని ఎంచుకుంటే.. దాన్ని మనకు నచ్చినట్టు సులభంగా మార్చుకునే వీలుంటుంది. -
Kalpana Shah: 'The Whole 9 Yards' దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది..
చీర.. సంప్రదాయ కట్టే! కానీ ఆధునికంగానూ ఆకట్టుకుంటోంది! క్యాజువల్, కార్పొరేట్ నుంచి రెడ్ కార్పెట్ వాక్, స్పెషల్ సెలబ్రేషన్స్ దాకా సందర్భానికి తగ్గ కట్టుతో ‘శారీ’ వెరీ కన్వీనియెంట్ కట్టుగా మారింది! అలా ఆ ఆరు గజాల అంబరాన్ని పాపులర్ చేసిన క్రెడిట్ శారీ డ్రేపర్స్కే దక్కుతుంది! ఆ లిస్ట్‌లో కల్పన షాహ్.. ఫస్ట్ పర్సన్!కల్పనా షాహ్ ముంబై వాసి. ఆమెకిప్పుడు 75 ఏళ్లు. 1980ల్లో బ్యుటీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ సమయంలోనే ఒకసారి తన కమ్యూనిటీలో జరిగిన ఓ ఫంక్షన్‌కి ఆమె హాజరైంది. అప్పుడు ఆ హోస్ట్‌కి చీర కట్టడంలో సాయపడింది. ఆ కట్టు ఆ వేడుకకు హాజరైన ఆడవాళ్లందరికీ నచ్చి కల్పనను ప్రశంసల్లో ముంచెత్తింది. అప్పటి నుంచి ఆమె చీర కట్టునూ తన ప్రొఫైల్‌లో చేర్చింది. అలా 1980ల్లోనే ‘శారీ డ్రేపర్’ అనే ప్రొఫెషన్ని క్రియేట్ చేసింది కల్పన. అది మొదలు ఆమె పేరు సామాన్యుల నుంచి సెలబ్రిటీల స్థాయికి చేరింది. ముంబై ఫ్యాషన్ ప్రపంచమూ కల్పన గురించి విన్నది.ప్రముఖ డిజైనర్స్ అంతా తమ ఫ్యాషన్ షోలకు ఆమెను ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఘాఘ్రా నుంచి దుపట్టాతో డిజైన్ అయిన ప్రతి డిజైనర్ వేర్కి .. మోడల్స్‌ని ముస్తాబు చేయాల్సిందిగా కోరసాగారు. ఆ వర్క్ కల్పనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. చీర, చున్నీలను అందంగానే కాదు సౌకర్యంగానూ ఎన్నిరకాలుగా చుట్టొచ్చో.. ఇంట్లో ఎక్సర్సైజెస్ చేసి మరీ ఎక్స్పర్టీజ్ తెచ్చుకుంది. దాంతో ఆమె నైపుణ్యం ఫ్యాషన్ రంగంలోనే కాదు బాలీవుడ్లో, ఇండస్ట్రియలిస్ట్‌ల క్లోజ్ ఈవెంట్లలోనూ కనిపించి.. అతి తక్కువ కాలంలోనే ఆమెను సెలబ్రిటీ శారీ డ్రేపర్‌గా మార్చింది.ఒకప్పటి టాప్ మోడల్ మధు సప్రే నుంచి బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ వహీదా రహమాన్, అంట్రప్రెన్యూర్స్ నీతా అంబానీ, శోభనా కామినేని, నేటితరం బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోణ్, ఆలియా, కరీనా కపూర్, రశ్మికా మందన్నా, యామీ గౌతమ్, తమన్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా పెద్దది. వాళ్లందరికీ కల్పనా ఫేవరెట్ శారీ డ్రేపర్. అంతెందుకు మొన్న అంబానీ ఇంట జరిగిన అనంత్, రాధికల పెళ్లి వేడుకల్లో కూడా కల్పన పాల్గొంది.. రాధికా మర్చంట్ ఆత్మీయంగా పిలుచుకున్న శారీ డ్రేపర్‌గా. ఒకట్రెండు వేడుకల్లో రాధికా.. కల్పనచేతే చీర కట్టించుకుని మురిసిపోయింది.ఆథర్‌గా.. చీర కట్టును ప్రమోట్ చేయడానికి కల్పన 2012లో ’The Whole 9 Yards’ పేరుతో ఒక పుస్తకం రాసింది. చీర కట్టుకు సంబంధించి దేశంలోనే తొలి, ఏకైక కాఫీ టేబుల్ బుక్ ఇది. అంతేకాదు దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా కల్పన.. 24 గంటల మారథాన్ శారీ డ్రేపింగ్‌తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 226 రకాల చీర కట్టులను ప్రదర్శించింది. ఆమె మొత్తం 300 రకాలుగా చీరను కట్టగలదు. శారీ డ్రేపింగ్‌లో ‘కల్పన కట్టు’ అనే ప్రత్యేకతను సాధించి.. ఫ్యాషన్ వరల్డ్‌లో చీరకు సెలబ్రిటీ హోదా కల్పించిన కల్పన షాహ్.. నేటికీ శారీ డ్రేపింగ్ మీద శిక్షణా తరగతులు, వర్క్ షాప్స్ నిర్వహిస్తూ చురుగ్గా ఉంటోంది! -
మై వార్డ్రోబ్! టీనేజర్‌కు బెస్ట్ 5 ఇవే..!
‘అమ్మా!, ఈ డ్రెస్ సరిగా లేదు, ఈ డిజైన్ ఓల్డ్.. అందరిలోనూ డల్‌గా కనిపిస్తాను, అందుకే నేను ఫంక్షన్‌కు రాను’ అనే మాటలు టీనేజ్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో తరచూ వినిపిస్తుంటాయి. ఎంపిక చేసిన డ్రెస్ సరిగా లేదనో, మ్యాచింగ్ కుదరలేదనో ... చెప్పే మాటలు అమ్మలకు పెద్ద సవాల్‌గా ఉంటాయి. ‘‘మరో అకేషన్‌కి బెస్ట్ది సెలక్ట్ చేద్దాం. ఇప్పటికి ఇలా రెడీ అయి పో’’ అని కూతుళ్లకు సర్దిచెబుతూ ఉంటారు అమ్మలు. ‘ఇలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదురవకుండా సందర్భానికి తగినట్టు రెడీ అవడానికి మా అమ్మాయి విషయంలో సింపుల్‌గా అనిపించే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను’ అని చెబుతున్నారు సంయుక్తా మరపడగ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న సంయుక్త చెబుతున్న విశేషాలు.‘సాధారణంగా అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం తరచూ షాపింగ్ చేస్తుంటాం. బాగున్నవీ, బాగోలేనివీ వార్డ్‌రోబ్‌లో చాలా డ్రెస్సులు వచ్చి చేరుతుంటాయి. ప్రతీసారీ కొత్తగా అనిపించేలా డ్రెస్సింగ్ ఉండేలా చూసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ప్రతీ ఈవెంట్‌కి సందర్భానికి తగినట్టు డ్రెస్సింగ్ అవడం తప్పనిసరి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.బెస్ట్ ఆఫ్ 5..క్యాజువల్‌గా బయటకు, రోజూ కాలేజీకి, పండగలు, గెట్ టు గెదర్స్, పెళ్ళిళ్లు.. ఇలా సందర్భాలను బట్టి మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. వాటిలో బెస్ట్ 5 అనేవి ఎంపిక చేసుకోవాలి. 1. సాధారణంగా బయటకు వెళ్లినప్పడు ఫంకీ స్టైల్ ఉంటే బాగుంటుంది. అందుకు మోడర్న్ వేర్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనే స్ట్రీట్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెసింగ్ అయితే బాగుంటుంది. 2. పండగలకు, ఎంగేజ్మెంట్స్కి సంప్రదాయ లుక్‌లో కనిపించాలి. ఇందుకు ఫ్యాన్సీ టచ్ ను మిక్సప్ చేయచ్చు. ఇండోవెస్ట్రన్ డ్రెస్సింగ్ కూడా ఈ సందర్భాలలో బాగుంటుంది.3. కాలేజీలో ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉన్నా ఫంకీ లుక్‌తో ఉండే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. వీటిలోనే ముదురు, లేత రంగుల కాంబినేషన్స్ ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డార్క్ కలర్ టాప్స్, లైట్ షేడ్స్ స్కర్ట్స్‌ని వార్డ్‌రోబ్‌లోకి చేర్చుకోవచ్చు. పూర్తి వెస్ట్రన్ స్టైల్స్ కూడా కాలేజీ ఈవెంట్స్‌కు బాగుంటాయి. 4. వివాహ వేడుకలకు బెనారస్, పైథానీ, ఇకత్, పట్టుతో తయారైన ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా లెహంగా, శారీ, చుడీదార్ డిజైన్స్.. ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనూ జాకెట్స్, టాప్స్.. వెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేయించుకోవచ్చు. 5. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో స్టైల్లో కనిపించేలా కనీసం 5 నుంచి 6 డ్రెస్‌లు సిద్ధంగా ఉంటే వాటినే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. లెహంగా ప్లెయిన్ ఉంటే డార్క్ బ్లౌజ్ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్‌తో మిక్సప్ చేయచ్చు."మా అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఇలా సందర్భానికి తగినట్టు డ్రెస్సులు ఉండేలా చూసుకోవడం వల్ల ఎంత పెద్ద అకేషన్ వచ్చినా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. దీనివల్ల టైమ్ ఆదా అవుతుంది. అనవసర షాపింగ్కూడా తగ్గుతుంది.’’ – నిర్మలారెడ్డి"ఆభరణాల ఎంపిక కాలేజీ ఈవెంట్స్‌కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ముదురు రంగు డ్రెస్సుల మీదకు ముత్యాలు లేదా పెండెంట్ ఉండే సన్నని చెయిన్ ధరిస్తే చాలు. ఫ్యాన్సీ డ్రెస్సింగ్ అయితే ఇయర్ రింగ్స్‌తో మేనేజ్ చేయచ్చు. పూర్తి సంప్రదాయ లుక్ అయితే సందర్భాన్ని బట్టి టెంపుల్ జ్యువెలరీని ఎంపిక చేసుకుంటే చాలు." – సంయుక్త మరపడగఇవి చదవండి: Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో.. -
ఇండియా కోచర్ వీక్ 2024లో హొయలొలికించిన భామలు (ఫొటోలు)
-
ఫ్యాషన్ షోలో మెరిసిన ముద్దుగుమ్మ వామికా గబ్బి.. ఇండియా కౌచర్ వీక్ ఫ్యాషన్ షో (ఫొటోలు)
-
బ్రైడల్ కలెక్షన్స్ తో గ్రాండ్ గా ఎక్స్ ఫో...సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
-
సూత్ర ఎగ్జిబిషన్లో సందడి చేసిన మిస్ గ్రాండ్ ఇండియా ప్రాచీ నాగ్‌పాల్
-
వర్షంలోనూ ఫ్యాషన్ సాధ్యమే
వాన రాకడ ఫ్యాషన్ పోకడ.. రెండూ అనూహ్యమే. ఎప్పుడు కురుస్తుందో.. ఎప్పుడు మెరుస్తుందో.. తెలియని పరిస్థితుల్లో.. సిటీలోని ఫ్యాషన్ లవర్స్ ఎలాంటి ఫ్యాషన్ అనుసరించాలో తెలియక సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌ని అయోమయపు మబ్బులు కమ్మేస్తుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన హామ్స్టెక్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నగరవాసుల కోసం మాన్సూన్ ఫ్యాషన్ తొలకరి చినుకులు కురిపిస్తోంది.. ⇒ సీజన్‌కు అనుగుణంగా మార్పు చేర్పులు⇒ అందుబాటులో వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్⇒ తేమను విడగొట్టే పాలియెస్టర్ బ్లెండ్స్⇒ జాయ్‌ఫుల్‌గా ఉంచే బ్రైట్‌కలర్స్⇒ ఫుట్ వేర్ కూడా ఫ్యాషనబుల్‌గా మహిళలు వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. నైలాన్, పాలియెస్టర్ మేళవింపు ఫ్యాబ్రిక్స్, అలాగే ట్రీటెడ్ కాటన్..వంటివి బెస్ట్. అనుకోని వర్షం కలిగించే ఇబ్బందులను తగ్గిస్తూ మనల్ని పొడిగా ఉంచుతాయి. లైట్ వెయిట్‌తో, గాలి పీల్చుకోవడానికి అనువుగా ఉండే లినెన్ లేదా కాటన్ అయితే త్వరగా పొడిగా మారతాయి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను స్వీకరించేందుకు లేయరింగ్ స్టైల్ (ఒక దాని మీద మరొకటి ధరించడం) ఉపకరిస్తుంది. బ్రైట్కలర్స్తో ప్రయోగాలు చేయాలి. ఎల్లో, గ్రీన్, బ్లూ కలర్స్ మబ్బు పట్టిన వాతావరణంలో సైతం మూడ్స్‌ని జాయ్‌ఫుల్‌గా ఉంచుతాయి. అలాగే ట్రెంచ్ కోట్స్, పార్కాస్, స్టైలిష్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్. వంటి.స్టైలిష్ రెయిన్ వేర్ వినియోగించాలి. ఠిమగవాళ్లు బోర్ కొట్టించే రెయిన్ కోట్స్‌ను విడిచిపెట్టి లైట్ వెయిట్ వాటర్ ప్రూఫ్ జాకెట్స్, హుడీస్ – విండ్ బ్రేకర్స్ వినియోగించాలి. తేలికపాటి డిజైన్స్‌ను ఎంచుకోవాలి. తేమను విడగొట్టే పాలియెస్టర్ బ్లెండ్స్ లాంటి ఫ్యాబ్రిక్స్‌ను వినియోగించాలి. ఇవి త్వరగా పొడిగా మారతాయి. రోజంతా సౌకర్యవంతంగా ఉంచుతాయి. నేవీ, చార్కోల్, ఆలివ్ రంగులు వంటివి నప్పుతాయి. ఇవి మరకలి్న, బురద తుంపర్లని దాచే వీలు కలి్పస్తాయి. ట్రౌజర్స్, షర్ట్స్, అవుటర్ వేర్లో ఈ షేడ్స్ పాలిషి లుక్ అందిస్తాయి. చినోస్, జీన్స్ క్యాజువల్ ట్రౌజర్స్‌ను లైట్ వెయిట్ స్వెటర్స్, గాలి బాగా తగిలేలా చేసే షర్ట్స్‌తో కాంబినేషన్‌గా వాడవచ్చు. ఇవి అటు కంఫర్ట్ ను, ఇటు స్టైల్‌నూ అందిస్తాయి. పాదరక్షలిలా... మహిళలు పాదాలను పొడిగా ఉంచుతూనే ఫ్యాషనబుల్‌గా ఉండేలా ఫుట్ వేర్‌ను ఎంచుకోవాలి. రబ్బర్ బూట్స్, వాటర్ ప్రూఫ్ స్నీకర్స్, డ్యూరబుల్ ఫ్లాట్స్.. వంటివి బెస్ట్. మగవాళ్లు మంచి మెటీరియల్‌తో తయారైన వాటర్ ప్రూఫ్ బూట్స్, స్టర్డీ లోఫర్స్ ఫుట్‌వేర్‌గా ఎంచుకోవాలి. కాన్వాస్ షూస్, స్యూడ్లు వాడవద్దు.. యాక్సెసరీస్ ఇలా.. ఠిమహిళలు కనీసస్థాయికి జ్యుయలరీ తగ్గించి, వాటర్ ప్రూఫ్ యాక్సెసరీస్ వినియోగించాలి. వాటర్ ప్రూఫ్, స్లీక్గా ఉండే బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేస్తే మొబైల్స్ వంటి ముఖ్యమైనవి భధ్రపరచుకోవచ్చు. మగవాళ్లు.. వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ ఉన్న యాక్సెసరీస్ బెస్ట్. లెదర్, సింథటిక్ల కలయికతో రూపొందిన వాచ్‌లు, బ్యాగ్స్ వాడాలి. ⇒ తడిసిన పరిస్థితిలో సైతం మ్యానేజ్ చేయగలిగేలా హెయిర్‌స్టైల్ మార్చుకోవాలి. జుట్టు బిగుసుకుపోకుండా నియంత్రించే యాంటీ ఫ్రీజ్ ఉత్పత్తులు వాడాలి లేదా జుట్టును పూర్తిగా వెనక్కి సెట్ చేసి ఉంచాలి. ⇒ కలర్ఫుల్గా ఉండే నాణ్యమైన బ్రాండెడ్ గొడుగును వెంట తీసుకెళ్లాలి. వర్షాకాలంలో వాన నుంచి రక్షణగా మాత్రమే కాదు మన స్టైల్‌కి చిహ్నంగా కూడా కనిపించాలి. రెయిన్లోనూ ఫ్యాషైన్ సాధ్యమే.. వానలు పడుతున్నంత మాత్రాన ఫ్యాషన్స్‌ను విడిచిపెట్టనక్కర్లేదు. అయితే సీజన్‌కి అనుగుణంగా కొన్ని మార్పు చేర్పులు తప్పనిసరి. వాటర్ ప్రూఫ్ అనేది దుస్తులకైనా యాక్సెసరీస్కైనా ఒక రూల్‌గా పెట్టుకోవాలి. ఇదే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రెయినీ సీజన్‌ను స్టైల్‌గా ఎంజాయ్ చేయవచ్చు... –చారోల్, హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. -
Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్!
అమ్మాయిల సంప్రదాయ అలంకరణలో స్కర్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకేతరహా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్ సాదాసీదాగా కనిపించేది. దీనికి అదనపు హంగుగా కుచ్చులు జత చేసి, ఒకవైపు నుంచి మరోవైపుకు సెట్ చేస్తే.. వచ్చిన స్టైల్ డ్రేప్డ్ స్కర్ట్. షార్ట్ కుర్తీ, ట్యునిక్, ఖఫ్తాన్ వంటి టాప్స్ ఎంపిక ఏదైనా డ్రేప్డ్ స్కర్ట్‌కి జత చేస్తే ఆ స్టైల్ అదుర్సే మరి.ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌గా ఆకట్టుకునే డ్రేప్డ్ స్కర్ట్ వెస్ట్రన్ స్టైల్లోనూ యంగ్‌స్టర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్‌తో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.డ్రేప్డ్ స్కర్ట్ అంచులు ఎగుడు దిగుడుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందుకే ఎక్కువ భాగం ఈ స్కర్ట్‌కి ఎంబ్రాయిడరీ వంటి హంగులు అవసరం లేదు. టాప్‌గా ఎంచుకునే కుర్తీ, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఖఫ్తాన్, ట్యునిక్స్ని ఎంబ్రాయిడరీ లేదా ఫ్లోర ల్ వర్క్‌తో రిచ్లుక్ని తీసుకురావచ్చు.ప్లెయిన్ శాటిన్, సిల్క్ మెటీరియల్‌తో విరివిగా కనిపించే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఇండోవెస్ట్రన్ లుక్‌ని సొంతం చేస్తుంది. అందుకే ఈ స్టైల్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది.టాప్ టు బాటమ్ ఒకే రంగులో ప్లెయిన్‌గా ఉండే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ వేడుకలకు ప్రత్యేకంగా నిలిస్తే, పట్టు, ఫ్లోరల్, జరీ వర్క్‌తో డిజైన్ చేసినవి వివాహ వేడుకలలోనూ గ్రాండ్‌గా కనిపిస్తాయి.ఇవి చదవండి: Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న! -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ లుక్ ఓ రేంజ్లో ఉంది. ఆమె స్టైలిష్ లుక్ ఆహుతులని మైమరిచిపోయేలా చేసింది. ముఖ్యంగా ఆ డిజైనర్ దుస్తుల్లో నడిచి వచ్చే విధానం హాట్‌టాపిక్‌గా మారింది. పారిస్ హాట్ కోచర్ వీక్ 2024లో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రాకు మద్దతు ఇచ్చేందుకు జాన్వీ పారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది. ఆరా బ్రాండ్ హోలోగ్రాఫిక్ టోన్ డిజైనర్ వేర్‌తో పారిస్ ఫ్యాషన్ వేదికపైకి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది జాన్వీ. ఈడ్రెస్ ముదురు బ్లాక్క లర్‌లో అల్లికలతో డిజైన్ చేసిన మెర్మైడ్ స్కర్ట్‌లా ఉంది. అందుకు తగ్గట్లు స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో జత చేయడం ఆమె లుక్‌ని ఓ రేంజ్‌కి తీసుకుకెళ్లింది. దీనికి తగ్గట్టు ఆమె మేకప్, కేశాలంకరణ చాలా ఆకర్షణీయంగా ఉంది. చెప్పాలంటే అక్కడ ఉన్న వారందరీ చూపు అటెన్షన్‌తో జాన్వీపైనే దృష్టి సారించేలా ఆమె రూపు ఉంది. ఇక్కడ జాన్వీ వేదికపై ఓ మత్సకన్యా మాదిరిగా ఆమె స్టన్నింగ్ లుక్ ఉండటం విశేషం. నిజంగానే మత్స్య కన్యేనా అని భ్రమింప చేసేలా ఉంది జాన్వీ లుక్. ముఖ్యంగా ఆ వేదికపై నడిచి వచ్చిన విధానం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు జాన్వీ స్టైలిష్ లుక్‌కి ఫిదా అవ్వతూ ఆమె నడిచే వచ్చే తీరు హీరామండి మూవీలో ది డైమండ్ బజార్ నుంచి గజగామినిలా నటించిన అదితి రావ్ హైదరీ నడకలా ఉందని ఒకరూ, 'ధితామ్ ధితామ్ ధిన్'లా నాట్యం చేసేందుకు వెళ్తున్నట్లుగా ఉందని మెచ్చకుంటూ పోస్టులు పెట్టారు. ఇక ఫ్యాషన్ వీక్‌లో రాహుల్ మిశ్రాకు మద్దతుగా బాలీవుడ్ ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఇంతకు మునుపు రాహుల్ మిశ్రాకు సపోర్ట్ చేస్తూ..బాలీవుడ్ నటి అనన్ యపాండే రంగురంగుల సీక్వెన్ డ్రెస్‌తో సీతాకోక చిలుక మాదిరిగా ఈఫ్యాషన్ షోలో ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ రాహుల్ మిశ్రా.. రాహుల్ మిశ్రా ఢిల్లీకి చెందిన ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్. పారిస్‌లోని హాట్ కోచర్ వీక్‌లో ప్రదర్శనకు ఆహ్వానం దక్కించుకున్న తొలి భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా. ఆయన 2014లో మిలన్ ఫ్యాషన్ వీక్‌లో అంతర్జాతీయ వూల్మార్క్ బహుమతిని గెలుచుకున్నాడు. ఆయనకు మద్దతిచ్చేలా ఇలా బాలీవుడ్ ముద్దుగుమ్ములు అతడి డిజైనర్ కలెక్షన్లతో ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సందడి చేశారు. మరీ ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షోలో జాన్వీ తదుపరి ముద్దుగుమ్మ ఎవరో వేచి చూడాల్సిందే. ఇక ఈ అంతర్జాతీయ ఫ్యాషన్ షో జూన్ 24 నుంచి జూన్ 27 వరకు పారిస్‌లో ఘనంగా జరుగుతాయి. View this post on Instagram A post shared by DietSabya® (@dietsabya) (చదవండి: ఏడు పదుల వయసులో అందాల పోటీలో పాల్గొన్న మహిళగా రికార్డు!) -
ఆహా.. అనిపించేలా నేహా లుక్స్ (ఫొటోలు)
-
అవకాశాలను సృష్టించుకోవాలి!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆరుషి ఢిల్లీ వాసి. కాలేజీ రోజుల నుంచే ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారాఫ్యాషన్ డ్రెస్సులు, జ్యువెలరీ అమ్మకాలు చేపట్టింది. ఏడేళ్ల క్రితం 30 వేల రూపాయతో విష్’ పేరుతో సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసి, విదేశాలకూ తన ఉత్పత్తులను సర ఫరా చేస్తోంది. ;పాతికమందికి పైగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించింది. దేశంలో గ్రామీణ మహిళా కళాకారులను గుర్తించి, వారితో నెట్వర్కింగ్ ఏర్పాటుచేసి, ఉపాల్పిస్తోంది. ‘అవకాశాలను వెతకడం కాదు, మనమే సృష్టించుకోవాలి’ అంటున్న ఆరుషి నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ‘‘నేను ఫ్యాషన్ డ్రెస్సులు, కస్టమైజ్డ్ జ్యువెలరీ, డెకరేటివ్ వస్తువులు, పిల్లల బట్టలు, ఇతర ఉపకరణాలను ఎగుమతి చేస్తుంటాను. నాకు మొదటి నుంచి బిజినెస్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో అమ్మతో కలిసి అనేక ఈ–కామర్స్ సైట్లలో చీరలు, సూట్లు అమ్మేదానిని. కానీ, చాలా పోటీ అనిపించేది. ఏదైనా సరే భిన్నంగా చేయాలనే కోరిక ఉండేది. కానీ, సరైన మార్గం దొరికేది కాదు. కాలేజీలో చదువుతూనే ఓ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. కానీ, నాకు నేనుగా నిరూపించుకునే పనిచేయాలనుకునేదాన్ని. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని వ్యా΄ారానికి కేటాయించాలనుకున్నాను. ఉద్యోగం ద్వారా సంపాదించిన మొత్తంతో సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. 30 వేల రూ΄ాయలతో ‘లావిష్’ అనే పేరుతో కంపెనీని రిజిస్టర్ చేయించాను. అమెజాన్‌తో కలిసి చీరలు, ఫ్యాషన్ జ్యువెలరీ వంటివి అమ్మడం మొదలుపెట్టాను. రెండేళ్లు ఈ పనులు ఇలాగే కొనసాగాయి. అంతర్జాతీయంగా.. అమ్మే ఉత్పత్తులకు నా సొంత ఆలోచనను జోడించాను. సొంతంగా డిజైన్లు చేయడంతో ΄పాటు కొనుగోలుదార్లు అడిగే డిజైన్లపైనా పనిచేయడం మొదలుపెట్టాను. కస్టమైజ్డ్ డిజైన్లు అవడంతో ఆర్డర్లు విరివిగా రావడం మొదలయ్యాయి. దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ కొనుగోలుదార్లు పెరిగారు. పాతికలక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తున్నాను. మహిళలు మాత్రమే నా కంపెనీలో మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. దేశంలోని గ్రామాల నుండి కళాకారుల సమాచారం సేకరిస్తాను. వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తాను. అక్కడ ఉత్పత్తులను తయారు చేయించి, వాటిని విక్రయిస్తాను. మహిళలు మాతో కనెక్ట్ అవడానికి ప్రత్యేక ప్రయోజనం కూడా ఉంది. తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయనవసరం లేదు. అమ్ముకోవడం కోసం బయటికి వెళ్లనక్కరలేదు. ఇంట్లో కూర్చొని ఉపాధి ΄పోందవచ్చు. అంతేకాదు, వారి నైపుణ్యాలను ప్రపంచం గుర్తిస్తుంది. దీనిద్వారా ఎంతోమంది మహిళలకు ఉపాధి లభిస్తుంది. మన హస్తకళలకు ముఖ్యంగా ఆభరణాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. విదేశీ మహిళలకు రాజస్థానీ వస్త్రధారణ, బంజారా నగలు అంటే పిచ్చి. వారు భారతీయ సంస్కృతిని చాలా ఇష్టపడతారు. దీని కారణంగానే వారు భారతీయ డ్రెస్సులు, ఆభరణాలవైపు ఆకర్షితులవుతారు. ఒంటరి తల్లి నా సక్సెస్ వెనక మా అమ్మ మద్దతు చాలా ఉంది. నేను ముందడుగు వేయడంలో అమ్మ ఎప్పుడూ ్రపోత్సహిస్తుంటుంది. మా చెల్లినీ, నన్ను అమ్మ ఒంటరిగా చాలా కష్టపడి పెంచింది. ఆ కష్టంలో... నేను నా మార్గం కనుక్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు 12 దేశాలకు ఒంటరిగా వెళ్లి, సందర్శించగలిగాను. ఇంటి పేరుకు నో! నా పేరుకు ఇంటిపేరు జోడించకూడదని నా సొంత నిర్ణయం. అందుకే, నా పేరుకు ముందు సర్నేమ్ ఉండదు. ఒక వ్యక్తి చేసే పనే వారి గుర్తింపు అవుతుంది. అందుకే, ఇంటి పేరును జత చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావించాను. అందుకు మా అమ్మ కూడా మద్దతు తెలిపింది. కానీ, ముఖ్యమైన పేపర్లలో సర్నేమ్ లేకుండా ఇవ్వలేమనే నిబంధనలతో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్కూల్లో, కాలేజీలో ప్రతిచోటా ఈ సమస్య ఎదురైంది. కానీ, నా నిర్ణయాన్ని మార్చకోలేనని స్పష్టంగా చె΄్పాను. అందుకు, చట్టపరంగానూ, న్యాయసలహాలు తీసుకున్నాను. దీంతో నా సర్టిఫికెట్లన్నింటిలోనూ నా పేరు మాత్రమే ఉంటుంది. ఒంటరి యాత్రికురాలిని నాకు ప్రయాణాలు అంటే ఇష్టం. ప్రకృతి అందమైన ప్రపంచాన్ని మన ముందుంచింది. దానిని ఆస్వాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అనుకుంటాను. స్వదేశంలో లేదా విదేశంలో ఎక్కడ సందర్శనకు వెళ్లినా ప్రతిచోటా వారి సంస్కృతి, కళల గురించి తెలుసుకుంటాను. గ్రామాల్లో దాగి ఉన్న సాంస్కృతిక, కళాత్మక ప్రతిభను తెలుసుకొని, నైపుణ్యాలను మెరుగుపరిచి, ప్రపంచం ముందుకు తీసుకువస్తుంటాను’’ అని తన విజయపథాన్ని వివరించింది ఆరుషి. -
ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే
ఎండలు రోజు రోజూ తమ ప్రతాపాన్ని పెంచుతూనే ఉన్నాయి. రానున్న రోజులను ఎలా తట్టుకోవాలా అని ఆలోచించే వారు తమ డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. క్యాజువల్ వేర్‌గా రోజంతా సౌకర్యంగా ఉండేలా సరైన డ్రెస్ ఎంపికగా ఈ కో–ఆర్డ్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ సమ్మర్లో కూల్ అండ్ కంఫర్ట్‌తో పాటు ఎనీ టైమ్ ఎనీ వేర్ అనిపించే ఈ డ్రెస్సులు బాగా నప్పుతాయి. టాప్ డిజైన్స్‌లో మార్పులు ఈ డ్రెస్ సెట్లో టాప్–బాటమ్ రెండూ ఒకే ప్రింట్, ఒకే కలర్‌తో ఉంటాయి. అయితే, టాప్‌గా షార్ట్ కుర్తీ, పెప్లమ్, జాకెట్ స్టైల్.. ఇలా డిజైన్స్‌లో మార్పులు చేయించుకోవచ్చు. లేదా అలాంటివి మార్కెట్లో రెడీమేడ్‌గా ఉన్నవి ఎంచుకోవచ్చు. డిజైన్స్ కూడా సులువే! టాప్ అండ్ బాటమ్ ఒకే మెటీరియల్‌తో డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి, బడ్జెట్‌కు తగినవిధంగా మెటీరియల్‌ను ఎంచుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి కూల్‌గా.. కంఫర్ట్‌గా.. సొగసుగా రెడీ అయి పోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కో–ఆర్డ్ సెట్స్‌లో ఈ కాలం కాటన్ మెటీరియల్‌కే మొదటి ్రపాధాన్యత. వీటిలో ఖాదీ, ఇక్కత్, ప్రింటెడ్ కాటన్స్ని ఎంచుకోవచ్చు. ఆహ్లాదకరమైన రంగులు ముదురు, లేత రంగుల్లోనే కాదు డిజైన్స్‌లో ఆహ్లాదకరంగా అనిపించేవి ఎంచుకోవాలి. వేసవి వేడి నుంచి మన కంటికి హాయిగొలిపే డిజైన్స్, రంగులపై దృష్టి పెట్టడం మంచిది. -
టేప్ రోల్ మాదిరి బ్రాస్లెట్..ఖరీదు ఏకంగా..!
కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్‌లు చాలా లగ్జరియస్‌గా ఉంటాయి. వాటి ధరలు చూస్తే కళ్లు చెదిరిపోతాయి. అయితే ఒక్కోసారి అంత ప్రముఖ బ్రాండ్లు కూడా ఎంత విచిత్రాతి విచిత్రమైన ప్రొడక్ట్‌లను ఉత్పత్తి చేస్తాయో చూస్తే మాత్రం ఇదేంటీ? అనిపిస్తుంది. అలాంటి మాదిరి ప్రొడక్టనే మార్కెట్లోకి విడుదల చేసంది ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ. అయితే ప్రొడక్ట్‌ని చూసిన జనం మండిపడుతున్నారు. ఎందుకంటే.. హై ఎండ్ ఫ్యాషన్ బ్రాండ్లకు పేరుగాంచిన బాలెన్సీగా ఓ విచిత్రమైన ప్రొడక్టను విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో పారిస్ ఫ్యాషన్ వీక్ ఫాల్/వింటర్ 2024 సందర్భంగా సరికొత్త ఫ్యాషన్ బ్రాసెలెట్ని మార్కెట్లోకి విడుదల చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో బ్రాస్లెట్ చూడటానికి ఎలా ఉందంటే.. టేప్రోల్ మాదిరిగి ఉండటంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదేం బ్రాస్లెట్ అని సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఇంత లగ్జరియస్ బ్రాండ్ మరీ ఇంత చీఫ్‌గా ఇలాంటి ప్రొడక్ట్‌లను తీసుకొస్తుందా అని మండిపడ్డారు. పైగా ఆ బ్రాస్‌లెట్‌పై బ్రాండ్ లోగో క్లియర్‌గా ఉంది. కాబట్టి ఆ ఫ్యాషన్ కంపెనీ ప్రొడక్టే అని క్లియర్‌గా తెలుస్తుంది. ధర ఏకంగా రూ. 3 లక్షలకు పైగా పలకడం మరింత చర్చలకు దారితీసింది. నిజంగా ఈ బ్రాస్లెట్ స్పష్టమైన టేప్ రోల్‌ని పోలి ఉంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదేం ఫ్యాషన్ అంటూ తిట్టిపసోస్తున్నారు. మరీ ఇంత చెత్త ప్రొడక్ట్లనా ఆ బ్రాండ్ తీసుకొచ్చేది. ఇదేం బ్రాండ్ అంటూ విమర్శలు చేస్తూ కామెంట్లు పెట్టారు. ఇంతకు ముందు కూడా ఈ బాలెన్సీగా ఇలానే ఓ చెత్త బ్యాగ్‌లా కనిపించే లెదర్ పర్సుని తీసుకొచ్చింది. పైగా దాని ధర కూడా లక్షల్లోనే పలకడం విశేషం. ఏదీఏమైన ఒక్కొసారి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లు కూడా లేటెస్ట్ ఫ్యాషన్ తీసుకురావడంలో చతకిలపడతాయోమో కదూ..! This Balenciaga Tape bracelet costs an absurd $4400!!😂😂 pic.twitter.com/GUaMMJlL2S — Rosy (@rose_k01) March 25, 2024 (చదవండి: అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!) -
సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు
-
వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్
వివాహ వేడుకలలో కట్టే చీరలే దివ్యంగా వెలిగిపోతుంటాయి. ఇక వాటికి అదనంగా మరో స్టయిల్‌ను కూడా జోడిస్తే.. ఆ వెలుగులు రెట్టింపు అవుతాయి. పట్టు, వెల్వెట్, ఎంబ్రాయిడరీ దుపట్టా చీర మీదకు ధరించినా, డ్రేపింగ్‌లో జత చేసినా ఆ స్టైల్ హుందాగా కనిపిస్తుంది. ఈ వింటర్ సీజన్‌కి ప్రత్యేకంగా ఉండటమే కాదు చలి నుంచి రక్షణను కూడా ఇస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా ఉండే శారీ కట్టుకి మహారాణి కళను లె చ్చే దుపట్టా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. కాంట్రాస్ట్ శారీ కలర్, దుపట్టా కలరా పూర్తి కాంట్రాస్ట్ ఉన్నది ఎంచుకోవాలి. దీనివల్ల రెండూ భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. శాలువా స్టైల్ చీర మీదకు దుపట్టాను శాలువా మాదిరి కప్పుకున్నా ఈ సీజన్‌కి వెచ్చగా, బ్రైట్‌గా ఉంటుంది. అయితే, దుపట్టా గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకోవాలి. ఇందుకు పట్టు, బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ దుపట్టాలను చీరలను ఎంపికను బట్టి తీసుకోవాలి. డ్రేపింగ్ దుపట్టా చీరకట్టులో భాగంగా దుపట్టాను జత చేర్చి కట్టడం ఒక స్టైల్. ఈ కట్టును నిపుణుల ఆధ్యర్యంలో సెట్ చేయించుకోవాలి. ఈ కట్టుకు కూడా కాంట్రాస్ట్ కలర్స్ ఉండేలా చూసుకోవాలి. రంగు ఒకటే... డిజైన్ వేరు సేమ్ కలర్ శారీ దుపట్టాను ఎంచుకున్నా ఎంబ్రాయిడరీ డిజైన్‌లో కాంబినేషన్స్ చూసుకోవాలి. చీర డిజైన్ హెవీగా ఉంటే, దుపట్టా డిజైన్ బ్రైట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. పట్టు శారీ మీదకు డిజైనర్ దుపట్టాను ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. -
ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించిందని భార్యను బెల్టుతో చితకబాది..
ముంబయి: నవీ ముంబయిలో అమానవీయ ఘటన జరిగింది. ఫ్యాషన్ బ్యాంగిల్స్ ధరించినందుకు భార్యను చితకబాదాడో వ్యక్తి. అత్త, మరో బంధువు కూడా ఇందులో పాలుపంచుకున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భర్తతో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నవీ ముంబయిలో నివాసం ఉంటున్న ప్రదీప్ అర్కడే(30) భార్య, అతని అమ్మతో కలిసి నివసిస్తున్నాడు. ఫ్యాషన్ బ్యాంగిల్స్ వేసుకోకూడదని భార్యపై ఆంక్షలు విధించేవాడు. ఈ క్రమంలో నవంబర్ 13న ఆమె ఆ బ్యాంగిల్స్‌ను ధరించింది. దీనిపై ఇరువురు వాగ్వాదానికి దిగారు. అనంతరం ప్రదీప్ తన భార్యను విచక్షణా రహితంగా కొట్టాడు. భర్త తనను బెల్ట్‌తో విచక్షణా రహితంగా కొట్టాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. అత్త తన జుట్టు పట్టి పలుమార్లు చెంపపై కొట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో బంధువు కూడా తనను కిందపడేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తర్వాత బాధితురాలు తన తండ్రి ఉంటున్న పుణెకి వెళ్లింది. అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నవీ ముంబయికి బదిలీ చేశారు. ఇదీ చదవండి: హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేసిన హైకోర్టు -
చీరకట్టు.. ఇలా స్టైల్ చేసుకుంటే పార్టీలో హైలైట్ అవ్వాల్సిందే
ఎవర్గ్రీన్ డ్రెస్‌గా ఎప్పటికీ శారీ ముందు వరసలో ఉంటుందని తెలిసిందే. అయితే, చీరకట్టు అందం గురించి రొటీన్ మాటలు కాదు..ఇంకాస్త సృజనను జోడించి స్టైలిష్ లుక్ తీసుకురావాల్సిందే అనుకునేవారిని ఇట్టే ఆకట్టుకుంటోంది శారీ ఓవర్ కోట్. పట్టు చీరల మీదకు ఎంబ్రాయిడరీ లాంగ్ జాకెట్స్ ధరించడం తెలిసిందే. కానీ, అవి సంప్రదాయ వేడుకలకే పరిమితం. వెస్ట్రన్ పార్టీలకూ శారీ స్టైల్‌ను పరిచయం చేయాలనుకుంటే ఈ ఇండోవెస్ట్రన్ స్టైల్‌ని హ్యాపీగా ట్రై చేయచ్చు. శారీ మీదకు ఓవర్‌కోట్‌ను ధరించి కాన్ఫిడెంట్ లుక్స్‌తో కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. సేమ్ టు సేమ్ శారీ–ఓవర్ కోట్ ఒకే కలర్ ప్యాటర్న్‌లో ఉంటే ఆ స్టైల్ సూపర్బ్ అనిపించకుండా ఉండదు. ఆభరణాల జిలుగులు అవసరం లేని ఈ ప్యాటర్న్ స్టైల్ పార్టీలో ప్రత్యేకంగా వెలిగిపోతుంది. ధోతీ శారీ సాధారణంగానే ధోతీ శారీ ఓ ప్రత్యేకమైన లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇక దాని మీదకు ఫ్లోరల్ ఓవర్ కోట్ ధరిస్తే ఎక్కడ ఉన్నా మరింత స్పెషల్‌గా కనిపిస్తారు. ఎంబ్రాయిడరీ కోట్స్ సిల్క్ ప్లెయిన్ శారీస్‌కి ఎంబ్రాయిడరీ ఓవర్ కోట్ హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఈ స్టైల్ ధోతీ శారీస్‌కు కూడా వర్తిస్తుంది. నీ లెంగ్త్ కోట్స్ మోకాళ్ల దిగువ భాగం వరకు ఉండే ట్రాన్స్పరెంట్ ఓవర్ కోట్స్ లేదా కేప్స్ నేటి యువతరపు మదిని మరింత ఆత్మవిశ్వాసంగా మార్చేస్తుంది. -
స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..
దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఈ మధ్య హిందీ ఇండస్ట్రీ వైపే ఫోకస్ చేసింది. రకుల్ ప్రీత్ చాలా కూల్‌గా హిందీ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇక ఆమె ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.. తన అందాన్ని హైలైట్ చేసే ఫ్యాషన్‌కీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది రకుల్ ప్రీత్ సింగ్! తన ఫ్యాషన్ ప్రాధాన్యంలో ఆమె లిస్ట్ చేసుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. జ్యూలరీ బ్రాండ్: మియార ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మియార..1960 నుంచీ వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని.. నేడు ఇద్దరు సోరీమణులు కలసి అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలబెట్టారు ‘మియార’గా! విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కి మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ ఈ బ్రాండ్ అనీ పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. అభినవ్ మిశ్రా.. పేరుకు ఇది దేశీ బ్రాండ్ కానీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించింది. ఖరీదైనది కూడా! దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్ వేర్‌ను ధరించి ఉంటారు. ప్రతి కస్టమర్‌కి నచ్చేలా.. నప్పేలా ట్రెడిషనల్, ట్రెండీ, ఫ్యాషనబుల్ డిజైన్స్‌ను అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. దేశంలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రకుల్ ధరించిన అభినవ్ మిశ్రా..చీర బ్రాండ్ ధర రూ. 70,000. ఇక రకుల్ ఫ్యాషన్ పరంగా ..నా దృష్టిలో ఫ్యాషన్ అనేది ఒక సహజ పక్రియ. మనం ధరించే దుస్తులు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే నేను ఎప్పుడూ నా కంఫర్ట్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాను! అని అంటోంది. -దీపిక కొండె (చదవండి: ఈ ఫోటో కనిపిస్తున్నది రాయి మాత్రం కాదు! అది ఏంటంటే..) -
పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్!
ఫ్యాషన్ బ్రాండ్స్ అన్ని చాలా వరకు కాలుష్య కారకాలే అని చెప్పాలి. హ్యాండ్ బ్యాగ్ దగ్గర నుంచి వాడే ప్రతి వస్తువులో ఏదో రకంగా ప్లాస్టిక్, లెథర్ వంటి వస్తువులతోనే తయారు చేస్తారు. పర్యావరణానికి హాని లేకుండా చేసే వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో కొరతను భర్తీ చేస్తోంది ముంబైకి చెందిన సుప్రియ శిర్సత్ సతమ్. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్‌తో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఆయా ఫ్యాషన్ బ్రాండ్లను ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఆదరించారు. దీని ఫలితంగా గ్రామాల్లో ఉండే వేలమంది కళాకారులకు ఉపాధి లభించినట్లయ్యింది. సుప్రియ ఎలా ఈ రంగంలోకి వచ్చింది, ఆమె ఏవిధంగా వీటిని ఉత్పత్తి చేసిందంటే.. సుప్రియా ఇంతవరకు మార్కెట్లోకి రాని వేగన్‌కి సంబంధించిన ఫ్యాషన్ బ్రాండ్లు తీసుకురావాలని అనుకుంది. పర్యావవరణానికి హాని కలిగించనటువంటి మంచి ఉత్పత్తులు తీసుకుని రావాలనుకుంది. అందుకోసం సహజ ఫైబర్లతో చేసే ఉత్పత్తులను ప్రోత్సహించింది. అందులో భాగంగా అరటిచెట్టు బెరడు, వాటి పళ్ల తొక్కలతో తయారు చేసే ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. తొలుత ముందుగా స్మాల్ కీపింగ్ యూనిట్(ఎస్కేయూ)గా ప్రారంభించింది. అవే ఇప్పుడు ముంబైలో 200 ఎస్కేయూ యూనిట్లుగా విస్తరించాయి. ప్రారంభంలో కార్క్ హ్యాండ్ బ్యాగ్‌లు, వాలెట్లతో ప్రారంభమైంది. ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు సంబంధించిన వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలను కూడా అందిస్తోంది. తన ఉత్పత్తులకు "ఫోర్ట్" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో కూడా ఈ బ్రాండ్‌కి మంచి స్పందన వచ్చింద. ఈ బ్రాండ్ రాజస్తాన్, మహారాష్ట, తోసహా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మంది గ్రామీణ మహిళా కళాకారులకు చేయూతనిచ్చింది. బ్రాండ్ ప్రారంభంలో కార్క్ హ్యాండ్‌బ్యాగ్‌లు మరియు వాలెట్లతో ప్రారంభమైంది మరియు ఇప్పుడు పురుషులు, మహిళలు, పిల్లలకు వాలెట్లు, టోట్ బ్యాగ్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలను అందిస్తోంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్స్‌ని విక్కీ కౌశల్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ధరించారు. సతమ్ నేపథ్యం.. సతమ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసిన ఇంజనీర్. జెట్ ఎయిర్వేస్లో మొబైల్ కామర్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. సతమ్కి కళ, క్రాప్ట్ అంటే మంచి ఆసక్తి ఉంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా హస్తకళాకారులతో పనిచేసే టెక్స్టైల్ రంగం కావడంతో ఆమె అనూహ్యంగా ఇటువైపుకి మళ్లింది. ఫ్యాషన్ పరంగా సౌందర్య సాధానాలు సహజసిద్ధమైన వాటితో తయారు చేయని బ్రాండ్లు లేకపోవడాన్ని గమనించింది. తానే ఎందుకు వాటిని ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన నుంచి పుట్టింది ఈ "ఫోర్ట్ బ్రాండ్". 2019లో కేవలం లక్షరూపాయలతో ఈ ఫోర్ట్‌ని ప్రారంభించింది. తాను సహజసిద్ధ ప్రొడక్ట్‌లను తయారు చేసేందుకు చాలా సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది సతమ్. అరటిపండు వేసవికాలం, వానాకాలాల్లో అది జీర్ణమైనప్పడూ ఏర్పడే మచ్చల ఆధారంగా దీన్నే మెటీరియల్‌గా తీసుకోవాలని భావించానని చెప్పింది. హ్యాండ్ బ్యాగ్‌ల తయారీకి జంతువుల తోలుకి ప్రత్యామ్నాయం ఓక్ చెట్ల నారను ఉపయోగిస్తాం. ఇక అరటి చెట్టుని పండ్లను వినియోగించేసిన తర్వాత కొట్టేస్తారు కాబట్టి వాటి నారతో బ్యాగ్‌లు వ్యాలెట్లను తయారు చేస్తాం. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు. ఇక ఆభరణాల విషయానికి వస్తే..బెరడులతో పింగాణీ, 18-క్యారెట్ బంగారం లేదా మిశ్రమ లోహం వంటి ఇతర ప్రీమియం మెటీరియల్‌ల కలయికతో విలక్షణంగా రూపొందిస్తున్నాం అని సతమ్ వివరించింది. బ్రాండ్ ధరలు ఎలా ఉంటాయంటే.. ఈ బ్రాండ్‌కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్‌ల ధర రూ. 4500 నుంచి 14,000 వరకు ఉంటుంది. ఇక ఆభరణాల ధర రూ. 800 నుంచి రూ. 17,000 వరకు ఉంటుంది.ఈ ఫోర్ట్ బ్రాండ్‌తో సతమ్ మంచి సక్సెస్‌ని అందుకుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం ఆరుగురు సభ్యలుతో కూడిన బృందంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్ గడ్డి, జనపనారతో తయారు చేసే బ్రాండ్లతో పోటీపడుతుండటం గమనార్హం. ఈ ఫోర్ట్ బ్రాండ్ 2022లో ఉత్తమ వేగన్ వాలెట్ల పరంగా పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా అమలా ఎర్త్ వంటి సముచిత ఈకామర్స్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా కూడా విక్రయిస్తోంది. ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో విక్రయిస్తుంది. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
శంకర్ తనయ అతిధి ఫ్యాషన్ రేంజ్ మాములుగా ఉండదు!
అదితి శంకర్.. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయగానే పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెండిటీ ఆమెది. నటనపై నాకున్న ఆసక్తిని నాన్నకు చెప్పినప్పుడు, ఆయన నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు.. ఏడాదిలోపు అవకాశం వస్తే ఒకే.. లేదంటే ఇండస్ట్రీ పేరెత్తకూడదు అని చెప్పారు. ఆ కండిషన్‌కు ఎస్ చెప్పే ప్రయత్నించాను.. సాధించాను అంటోంది అదితి శంకర్. ఇక డాక్టర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్రత్యేకతతో మ్యాచ్ అవడానికి పోటీ పడుతోన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. రుబీనా రుబీనా అఫ్రోజ్.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి సొంతంగా తన పేరుమీద చెన్నైలో ‘రుబీనా వోగ్’ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా కొత్తతరం డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ బ్రాండ్ డిజైన్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే దీని బ్రాండ్ వాల్యూ. వివాహాది శుభకార్యాలకు ముందుగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకోవచ్చు కూడా. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలు ఉంది. అదితి ధరించిన రుబీనా వోగ్ చీర ధర రూ. 8,500 జేసీఎస్.. జ్యూయల్ క్రియేషన్స్.. పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన డిజైన్స్‌ను అందించే స్టోర్. 2013లో అరవింద్ కట్రేలా దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తోంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. సింపుల్ డిజైన్స్‌తో గ్రాండ్ లుక్‌నిచ్చే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. (చదవండి: ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది) -
అదిరేటి డ్రెస్సు.. యూనిక్ డ్రెస్సింగ్ స్టైల్
-
ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది
డ్రెస్సింగ్‌లో ఎప్పుడూ యునిక్‌గా ఉండాలనే ఆలోచన నేటి యూత్‌ది. వారి అభిరుచికి తగినట్టుగా అందుబాటులోకి వచ్చింది. వన్‌సైడ్ లాంగ్ స్టయిల్. టాప్ లేదా కుర్తీ ఒక వైపు పొడవుగా, మరోవైపు పొట్టిగా ఉండటం ఈ స్టయిల్ ప్రత్యేకత. రెండు రంగులు భిన్నం కావచ్చు. రెండు ఫ్యాబ్రిక్స్ కూడా వేర్వేరువి అయి ఉండవచ్చు. కుర్తా లేదా టాప్ డిజైన్‌లో ప్రత్యేకత కనిపించాలంటే ఓ చిన్న మార్పు తీసుకురావాలి. డిజైనర్స్ చేసిన ఓ చిన్న ఆలోచన యూత్‌ని మరింతగా ఆకట్టుకుంటుంది. వెస్ట్రన్ నుంచి ఇండియన్ వేర్‌లోకి ఈ డిజైన్ కొత్తగా ఆకట్టుకుంటోంది. వెస్ట్రన్ పార్టీలో ప్రత్యేకతను చాటడమే కాదు, స్ట్రీట్ స్టయిల్గానూ మార్కులు కొట్టేస్తోంది ఈ డిజైన్. -
FDCI ICW 2023 Photos: ర్యాంప్‌వాక్‌లో సినీ తారల హోయలు (ఫోటోలు)
-
చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..
'మజిలీ’ తో మొదలుపెట్టిన దివ్యాన్ష కౌశిక్.. అనతికాలంలోనే ఎంతోమంది మదిని దోచి అంతులేని అభివనాన్ని సొంతం చేసుకుంది. తాను అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని అని చెబుతోంది దివ్యాన్ష. మరి ఆమె మదిని దోచిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని. దిల్నాజ్.. ముంబైకి చెందిన దిల్నాజ్ కర్బరీ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ వద్ద దాదాపు పదిహేనేళ్ల పాటు కోచర్ డిజైన్ హెడ్‌గా పనిచేసింది. ఫ్యాషన్‌పై ప్రావీణ్యం, పట్టు రెండ ఉండటంతో 2009లో తన పేరు మీదనే ముంబైలో ‘దిల్నాజ్’ ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించింది. వైబ్రెంట్ కలర్స్.. డిజైన్స్‌కి ఈ బ్రాండ్ పెట్టింది పేరు. గ్రాండ్ లుక్‌నిచ్చే దిల్నాజ్ బ్రాండ్ దుస్తులు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక దివ్వాన్ష కౌశిక్ కోసం దిల్నాజ్ డిజైన్ చేసిన చీర బ్రాండ్ ధర రూ. 59,900/- దివ్యాన్ష కౌశిక్జ్యూలరీ బ్రాండ్: జతిన్ మోర్ జ్యూయల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. జతిన్ మోర్.. అతిప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఒకటి జతిన్ మోర్ జ్యూయల్స్. 1891లో ఆనంద్ మోర్ ప్రారంభింన వ్యాపారాన్ని.. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసుడు జతిన్ మోర్.. ‘జతిన్ మోర్ జ్యూయల్స్’ పేరుతో కొనసాగిస్తున్నాడు. సంస్కృతి, సంప్రదాయ, హస్తకళల సారాన్ని ఆధునిక డిజైన్స్‌లో వర్ణింనట్టుంటాయి ఈ ఆభరణాలు. అదే వీరి బ్రాండ్ వాల్య! ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతోపాటు ఆన్‌లైన్‌లోన లభ్యం. దివ్యాన్ష కౌశిక్ -దీపిక కొండి -
అమిగోస్ మూవీ హీరోయిన్ ఆశికా రంగనాథ్ ధరించిన చీర ధర ఎంతంటే..!
హాయ్..‘అమిగోస్’ అంటూ తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి ఆశికా రంగనాథ్.. డజన్‌కు పైగా కన్నడ సినిమాల్లో నటించి యూత్‌లో మంచి మార్కులే కొట్టేసింది. ఐతే తాను సినిమాల్లోకి రాకముందు నుంచే అందం పట్ల శ్రద్ధ తీసుకునేదాన్ని. ఓసారి కాలేజీలో అందాల పోటీలో ‘క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డుతో పాటు సినిమా చాన్స్ కూడా వచ్చింది అని చెబుతోంది ఆశికా రంగనాథ్. ఇక ఆ ఘనతలో తమకూ భాగస్వామ్యం ఉందంటున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ.. కవిత గుత్తా.. ఓ కుట్టు మెషిన్, ఒక వర్కర్‌తో ప్రారంభమైన ‘కవిత గుత్తా ’ ఫ్యాషన్ హౌస్.. నేడు టాప్ మోస్ట్ ట్రెడిషనల్ బ్రాండ్‌గా మారింది. అమ్మాయిల లాలిత్యానికి అద్భుతంగా మ్యాచ్ అయ్యే పరికిణీలు ఈ బ్రాండ్ ప్రత్యేకత. హైదరాబాద్‌కు చెందిన కవిత గుత్తా.. తన ఇద్దరి కూతుళ్లకు తానే స్వయంగా ఫ్యాబ్రిక్ తెచ్చి, డిజైన్ చేసి మురిసిపోయేది. అలా తన ఇంటి ఆడపిల్లలతో మొదలైన కవిత గుత్తా డిజైన్స్.. నేడు సెలబ్రిటీలను మురిపించే స్థాయికి చేరాయి. ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే ఈ అందమైన డిజైన్స్.. సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. జ్యూలరీ బ్రాండ్: వీఏజేఆర్ జ్యూలర్స్ :స్వచ్ఛమైన వజ్రాల ఆభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఇది క్రియేట్ చేసుకున్న వాల్యూ. ‘ది రాయల్టీ ఆఫ్ హైదరాబాద్’ అంటూ హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సంస్థ.. దేశంలోని ప్రముఖ నగరాలకూ విస్తరించి.. పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ధర ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. కవితా గుత్తా.. చీర బ్రాండ్: ఆశికా రంగనాథ్ ధరించిన కవితా గుత్తా డిజైనర్ చీర ధర.. రూ. 77,700 (చదవండి: ‘బుట్టబొమ్మ’ వేసుకున్న లంగావోణీ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!) -
ష్యాషన్ సెన్స్ ఉట్టిపడేలా..వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు వేసుకోవాలి?
ఈ సీజన్లో బయటకు వస్తే ఎప్పుడు చినుకు పడుతుందో తెలియదు. ఆ చినుకుల్లో ఏ డ్రెస్ ఉంటే బాగుంటుందో...ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు అందుకే ఈ సీజన్లో మీ వార్డ్రోబ్, బ్యూటీ రొటీన్లలో కూడా మార్పులు చేసుకోక తప్పదు. డల్‌గా ఉండే వానాకాలం వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చే ట్రెండ్స్ గురించి తెలుసుకుని ఆచరణలో పెడితే ఈ సీజన్‌ని కూడా చక్కగా ఎంజాయ్ చేయచ్చు. ఎండకాలం మాదిరిగా ఇప్పుడు డ్రెస్సింగ్ కుదరదు. అలాగని, వెచ్చగా ఉంచే దుస్తులు కూడా. ఎందుకంటే, వాతావరణంలో మార్పుల వల్ల వేడి– తేమ అధికమై చెమటకు దారి తీయవచ్చు. డల్‌గా ఉండే వాతావరణాన్ని బ్రైట్‌గా మార్చేయడంలోనే కాదు, వానల్లో తడవకుండానూ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ అవసరం అవుతుంది. వాటర్ ప్రూఫ్ షూస్ వర్షపు రోజులలో బురద గుంటలు సాధారణం. రోడ్లపై పారే నీటి నుంచి, వర్షపు ధారల నుంచి దాలను కాపాడుకోవాలంటే వాతావరణానికి అనువైనవి ఉండాలి. అందుకు వాటర్ ప్రూఫ్ బూట్లను ఎంచుకోవాలి. బ్లాక్ బూట్లు అయితే ఏ డ్రెస్సులకైనా బాగా నప్పుతాయి. రెయినీ హ్యాట్ వర్షపు రోజుల్లో టోపీ ని ధరించడం ద్వారా మీ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేయవచ్చు. కోటుకు హుడీ లేకపోతే ఒక ట్రెండీ హ్యాట్‌ను వాడచ్చు. అయితే, టోపీ ఉన్నప్పటికీ వెంట గొడుగు మాత్రం వాడాల్సిందే. రెయిన్ పోంచో ఇవి సాధారణంగా మొత్తం ఒంటిని కప్పేసే విధంగా ఉంటాయి అని అనుకుంటారు కానీ, ఇప్పుడు మార్కెట్లో విభిన్న మోడల్స్‌లో రెయిన్ పోంచోస్ వచ్చాయి. ఇవి చాలా సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఉంటాయి. అలాగే వేసుకున్న దుస్తులను వానకు తడవకుండా కాపాడుకోవచ్చు. గొడుగు కూడా వాడలేనంత వర్షం కురుస్తున్నప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అంతేకాదు, వర్షాకాలానికి తల తడిస్తే, జుట్టు చిట్లిపోతుంది. జుట్టుకు రక్షణగా కూడా రెయిన్ పోంచో హుడ్ ను కప్పుకోవచ్చు. స్టైలిష్‌గానూ కనిపిస్తారు. మీ రెయిన్ పోంచో వాటర్‌ప్రూఫ్ ఫాబ్రిక్ కింద పొడిగా ఉండగలుగుతారు. ట్రెంచ్ కోట్ వర్షం రోజుల్లో డ్రెస్సింగ్ గురించి ఆలోచించినప్పుడు ఖాకీ రంగు డబుల్ బ్రెస్ట్ ట్రెంచ్ కోట్ గుర్తుకు వస్తుంది. అయితే, వీటిలో ఇప్పుడు విభిన్నరకాల కలర్స్... ఫ్యాబ్రిక్‌లో మార్పులు చేసినవి మార్కెట్లోకి వచ్చాయి. నేటి కాలానికి తగినట్టుగా ఆకట్టుకుంటున్నాయి. గొడుగు ఎంపిక వర్షంలో గొడుగు తప్పని అవసరం. అయితే, అది ఎప్పుడూ బ్లాక్ కలర్లో రొటీన్‌గా ఉంటే బోర్‌గా అనిపిస్తుంది. మంచి బ్రైట్ కలర్స్ ఉన్నవి, స్టైలిష్‌గా ఉన్న గొడుగులను ఎంచుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మిగతా అన్నింటికన్నా పోల్కా డాట్స్, లైన్స్ ఎప్పుడూ స్పెషల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి. మిలిటరీ స్టైల్ కోట్లు జీన్స్, టీ షర్ట్ పైకి ఓ మిలిటరీ స్టైల్ కోటు ధరిస్తే చాలు మీ రూపం మరింత ఆధునికంగా మారిపోతుంది. మగవారికి అనువుగా రూపొందిన ఈ డ్రెస్ మగువలకు మరింత ప్రత్యేకమైన డ్రెస్సింగ్‌గా ఈ సీజన్ మార్చేసింది. -
ప్రత్యేకంగా కనిపించే ప్రింటెడ్ డ్రెస్సులు.. స్టైలింగ్ అదిరిపోద్ది
ఫ్లోరల్, మల్టీకలర్ ప్రింట్స్ ఏవైనా మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్నిస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా చూడముచ్చటగా ఉంటాయి. సీజన్‌తో పనిలేకుండా పార్టీ ఏదైనా ఇండోవెస్ట్రన్ లుక్‌తో టాప్ టు బాటమ్ ఎవర్గ్రీన్ లుక్‌తో ప్రింటెడ్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ వేర్‌గానూ కలర్‌ఫుల్ అనిపిస్తాయి.అందుకే, డిజైనర్లు ప్రింట్ కాన్సెప్ట్‌ను ఎప్పుడూ వినూత్నంగా మన ముందుకు తీసుకు వస్తుంటారు. వాటిలో కొన్ని డిజైన్స్ ఇవి. లెహంగా శారీ, లాంగ్ కోట్, ట్రౌజర్, శారీ గౌన్, కుర్తా పైజామా.. మల్టీ కలర్ ప్రింట్లతో టాప్ టు బాటమ్ ఒకే కలర్ కాంబినేషన్‌ను ఎంచుకుంటే ఈ థీమ్‌కు సరిగ్గా నప్పుతుంది. ఈ స్టయిల్‌కి ఇతర యాక్ససరీస్ కూడా అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కడ ఉన్నా అంతే ప్రత్యేకతను చాటుతాయి. -
పట్టెడ అంచు చీర.. ఈ పేరు విన్నారా?
మనింట్లో ఓ తొంభై ఏళ్ల నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉందా? ఉంటే ఆమెనడగండి ఓ మాట. వాళ్ల యువతరాన్ని ఆకట్టుకున్న చీరలేమిటి అని. ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు మనం వినని ఎన్నో పేర్లు చెబుతారు. ఓ పది రకాల పేర్లు చెప్పి ‘ఇప్పుడా నేత ఎక్కడ వస్తోంది. వచ్చినా ఈ తరంలో ఆ చీరలెవరు కట్టుకుంటారు. నేయడమే మానేసినట్లున్నారు’ అని నిరుత్సాహంగా ముగిస్తారు. సరిగ్గా అలాంటి చీరలకు పూర్వ వైభవం తెస్తున్నారు కర్నాటకకు చెందిన హేమలత. హ్యాండ్లూమ్ లవర్స్ వార్డ్రోబ్లు రెండు వందల ఏళ్ల నాటి చేనేతలతో అలరారుతున్నాయి. ఎటు కట్టినా ఓకే! హేమలత... యూఎస్‌లోని కన్సాస్ యూనివర్సిటీలో ఉన్నతవిద్య పూర్తి చేశారు. ఆమెకు మన చేనేత కళలో దాగిన సమున్నత జ్ఞానం మీద దృష్టి పడింది. ఒకదానికి ఒకటి విభిన్నంగా దేనికది ఒక శాస్త్రబద్ధమైన గ్రంథంలాంటి చేనేతల మీద అధ్యయనం మొదలు పెట్టారామె. నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో ఇదే అంశం మీద పీహెచ్డీ చేస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వారి నేత తీరును పరిశీలించారు. ఈ క్రమంలో హేమలతా జైన్ 85 ఏళ్ల దేవదాసిని కలిశారు. ఆమె దగ్గరున్న పట్టెడ అంచు చీర రెండు వందల ఏళ్ల నాటి చేనేత కళ. ఈ చీరకు రెండు కొంగులుంటాయి. చీరను రెండువైపులా కట్టుకోవచ్చు. రివర్సబుల్ శారీ అన్నమాట. పదవ శతాబ్దంలో గజేంద్రఘర్ జిల్లాలోని గ్రామాల్లోని చేనేతకారులు ఈ చీరలను నేసేవారు. అలాంటి చీరలిప్పుడు మార్కెట్లో లేవు. ఈ తరంలో ఎవరి దగ్గరా లేవు. ఆ చీరను చూపించి మరొక చీర తయారు చేయించాలంటే ఆ రకమైన నేత నేసే చేనేతకారులు కూడా లేరన్న మరో వాస్తవం తెలిసి వచ్చిందామెకు. అలాంటి అంతరించిపోతున్న డిజైన్లు 45 వరకు ఉన్నాయి. (చదవండి: ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు) -
మోడర్న్ డ్రెసెస్ కంటే.. చీరకట్టు అంటేనే ఇష్టం: హీరోయిన్
‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా’ అనే క్రేజీ డైలాగ్‌తో అంతే క్రేజ్ సంపాదించుకున్న ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి. అంతటి అందానికి మ్యాచ్ అయ్యే స్టయిల్‌ను క్రియేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. ఆర్ట్ బై సియా.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ప్రముఖ డిజైనర్స్ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కి ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్ అన్నింటిలోనూ న్యూ స్టయిల్ ప్రతిబింబిస్తోంది. అదే దీనికి యాడెడ్ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. మొదట ఆన్లైన్లోనే కొనే వీలుండేది. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో స్టోర్ ఓపెన్ చేశారు. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజన బ్రాండ్ వాల్యూగా సాగిపోతున్న ఆమె డిజైన్స్ అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. ప్రపంచ వ్యాప్త సెలబ్రిటీస్ ఆమె బ్రాండ్‌కు అభిమానులుగా మారారు. మసాబా ఎవరి కూతురో తెలుసు కదా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్‌ల తనయ. పేరెంట్స్ పేరు ప్రఖ్యాతులను తన కెరీర్‌కి పునాదిగా మలచుకోకుండా కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జించిన ఇండిపెండెంట్ డిజైనర్.. అంట్రపెన్యూర్ ఆమె! బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: మసాబా గుప్తా ధర: రూ. 18,000 జ్యూలరీ బ్రాండ్: ఆర్ట్ బై సియా ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మోడర్న్ డ్రెసెస్ కంటే, ట్రెడిషనల్ వేర్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులోనూ చీరకట్టు అంటే మరీనూ! – లావణ్య త్రిపాఠి -దీపిక కొండి -
అప్పుడు టామ్‌బాయ్ స్టయిలే.. ఇప్పుడిప్పుడే కాస్త ఇలా: హీరోయిన్
గ్లామర్ షో చేయకుండా కేవలం అభినయంతోనే పేరు తెచ్చుకున్న నటి మాళవిక నాయర్. అలా తెర మీదే కాదు.. తెర బయటా ఆమె సంప్రదాయ శైలిని ఎలివేట్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉంటాయి.. షెహరి బై సాహితి రెడ్డి హైదరాబాద్ హ్యామ్స్టెక్ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సాహితి రెడ్డి.. 2012లో ‘సహారా బై సాహితి రెడ్డి’ పేరుతో బొటిక్‌ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఎటువంటి ఫ్యాబ్రిక్ మీదైనా సరే.. ఫ్లవర్ డిజైన్ ఆర్ట్‌తో మెప్పించటం ఆమె ప్రత్యేకత. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. జ్యూలరీ.. ఇద్దరు స్నేహితులు శిల్ప, గీత ప్రారంభించిన ఆన్లైన్ జ్యూలరీ స్టోర్ ఇది. ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజే వారిని సెలిబ్రిటీలకు కూడా డిజైన్స్ అందిచే స్థాయికి చేర్చింది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేసే వీలు ఉంది. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: షెహరి బై సాహితి రెడ్డి ధర: రూ. 19,800 జ్యూలరీ బ్రాండ్: శిల్ప గీత స్టయిల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడిలా సంప్రదాయబద్ధంగా.. ఇన్నోసెంట్‌గా కనిపిస్తున్నా కానీ, చిన్నప్పుడు మాత్రం నాది టామ్‌బాయ్ స్టయిలే. ఇప్పుడిప్పుడే కాస్త ట్రెండ్‌కు తగ్గట్టు ఫ్యాషన్‌బుల్‌గా రెడీ అవుతున్నా. – మాళావిక నాయర్ ∙దీపిక కొండి -
Fashion: సౌకర్యమే స్టైల్
కలర్స్, కట్స్, ప్రింట్లు, డిజైన్లు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి డిజైనర్లు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ప్రాంతీయ డిజైన్ల నుంచి అంతర్జాతీయ బ్రాండ్స్ వరకు రీసెంట్ లుక్స్ కోసం శోధన ఉంటూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్ వీక్స్ వేటిని పరిచయం చేస్తుందో తెలుసుకుందాం. వారసత్వ డిజైన్లు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, సౌకర్యవంతమైన డిజైనింగ్ తర్వాత స్థానిక హస్తకళ డిజైన్స్‌కి అవకాశాలు బాగా పెరిగాయి. సంప్రదాయ కళలను బాగా ఇష్టపడుతున్నారు. దీంతో మరుగున పడిపోయిన వారసత్వ కళలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు కూడా తమ స్థానిక హస్తకళల డిజైన్స్‌ని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. మనదైన ప్రభావం ఫ్యాషన్ ప్రపంచంపై భారతదేశం ప్రభావం గురించి ఆలోచించినప్పుడు రితూకుమార్. సబ్యసాచి, మనీష్ మల్హోత్రా.. వంటి ప్రఖ్యాత డిజైనర్ల డిజైన్లు, తలపాగాలు కనిపిస్తుంటాయి. అలాగే, గ్లోబల్ టెక్స్టైల్ గురించి చూసినప్పుడు భారతదేశంలోని కుటుంబాలలో తల్లులు, బామ్మలు ధరించే చీరల థీమ్‌ను తమ డిజైన్స్‌లో తీసుకుంటున్నారు. ఆర్గానిక్, సస్టెయినబుల్ ఫ్యాబ్రిక్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల జరిగిన మిలన్, ప్యారిస్, మన లాక్మే ఫ్యాషన్ వీక్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పదిహేడవ శతాబ్దం నుండి నేటి వరకు పాశ్చాత్య ఫ్యాషన్ ట్రెండ్‌పై భారతదేశ ప్రభావం ఉందని తెలుస్తోంది. అలాగే, అంతర్జాతీయ డిజైనర్ల నుంచి మనవాళ్లు స్ఫూర్తి పొందే విషయాల్లో ఫ్యాబ్రిక్స్ ఎంపికలోనూ, సంప్రదాయ డిజైన్స్‌లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది వాస్తవం. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్కే అగ్రస్థానం దేశీయ, అంతర్జాతీయ డిజైన్స్ చూస్తే ఫ్యాషన్ రంగంలో ఎప్పుడైనా బ్రైట్ కలర్స్, కొత్త ప్రింట్స్, కొత్త కట్స్కి అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే, ఏ వయసు వాళ్లు వాటిని ఎలా ధరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఫ్యాషన్ రంగాన్ని మాత్రం కరోనా ముందు–కరోనా తర్వాత అని విభజించి చూడచ్చు. ప్రజల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు సౌకర్యంగా దుస్తులు ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్, కంఫర్ట్ డ్రెస్సింగ్, బ్రైట్ కలర్స్,.. ఇవి ప్రపంచం మొత్తం కరోనా ఫ్రీ టైమ్‌లో తీసుకున్న నిర్ణయాలు అనేది దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రసాయనాలు లేని సస్టేయినబుల్ ఫ్యాబ్రిక్కే అగ్రస్థానం. పార్టీలకు కూడా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్‌నే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఏ పెద్ద బ్రాండ్ తీసుకున్నా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ విరివిగా వచ్చేశాయి. కట్స్, ప్రింట్లు, కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఎంచుకుంటున్నారు. దీంతో మేం కూడా సౌకర్యవంతమైన డిజైన్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ చదవండి: Kidney Stones: మూత్రనాళంలో తట్టుకుంటే తీవ్రమైన నొప్పి.. కాల్షియమ్ ఆక్సలేట్ ఉండే గింజలు తింటే అంతే సంగతి! ఇలా చేస్తే.. -
లాంగ్ గౌన్‌లో మెరిసిపోతున్న హీరోయిన్! డ్రెస్ ధర తక్కువే.. అయితే..
Gouri G Kishan: ‘జాను’ సినిమాలో చిన్ననాటి జానకిగా సంప్రదాయంగా కనిపించి.. రెండో సినిమా ‘శ్రీదేవి–శోభన్‌బాబు’లో మోడర్న్ లుక్‌లో మెరిసి అభియనంలోనే కాదు అపియరెన్స్లోనూ వైవిధ్యాన్ని చాటుకుంది గౌరీ జి. కిషన్. ఈ వెర్సటాలిటీని తను అనుసరించే ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది. ప్రడే.. స్వచ్ఛమైన వెండి నగలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్. మెషిన్ మేడ్ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాల్యూ. ఆ క్రియేటర్ పేరు దీప్తి ముత్తుసామి. జ్యూలరీ డిజైనింగ్ మీదున్న ఆసక్తే ఆమెను ఈ రంగంలోకి దింపింది. ఫ్యాషన్ ఎంట్రపెన్యూర్‌గా మార్చింది. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా ‘ప్రడే’ను నిలిపేలా చేసింది. ఈ బ్రాండ్ జ్యూలరీ ఇటు సంప్రదాయ వస్త్రధారణకైనా.. అటు వెస్టర్న్ అవుట్ ఫిట్స్కైనా నప్పేలా ఉంటుంది. ధరలూ అంతే అటు సామాన్యులూ కొనేలా ఇటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. మాగ్జీహం.. పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆనందభరితంగా ఉంటాయి ఈ మాగ్జీహం కలెక్షన్స్. కాలేజీకెళ్లే యువతులే ఈ డిజైనర్ మెయిన్ టార్గెట్. క్యాజువల్ డ్రెసెస్‌కు కేరాఫ్‌గా ఉంటుంది ఈ బ్రాండ్. బడ్జెట్ ఫ్రెండ్లీ దుస్తులను అందిస్తూ చాలామంది యువతులకు ఫేవరేట్‌గా మారింది. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసుకోవచ్చు. చెన్నైలోని టీనగర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: మాగ్జీహం ధర: రూ. 4,500 జ్యూలరీ బ్రాండ్: ప్రడే కమ్మల ధర: రూ. 3,130 నెక్‌పీస్ ధర: రూ. 19,030 కొన్నిసార్లు పొగడ్తలు కూడా విమర్శల మాదిరి హాని చేస్తాయి. అందుకే, రెండింటినీ మనసుకు తీసుకోను. – గౌరీ జి.కిషన్ -దీపిక కొండి చదవండి: Deepika Padukone: ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్.. రణ్వీర్ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే.. -
చీరలో మెరిసిపోతున్న హనీ రోజ్..! ఈ బ్రాండ్ సామాన్యులకు కూడా..
హనీ రోజ్.. సార్థకనామధేయురాలు. పదిహేనేళ్లుగా వివిధ పాత్రల్లో అలరిస్తూ మలయాళంలో విశేష జనాదరణ పొందిన నటి. తన అభినయానికి ఆమె మెరుగులు దిద్దుకుంటోంది.. తన ఫ్యాషన్ స్టయిల్‌ను మేం క్రియేట్ చేస్తున్నాం అంటున్నాయి ఈ బ్రాండ్స్.. తానిత్ డిజైన్స్... శింజు క్రిష్.. ఈ మధ్యనే పాపులర్ అవుతున్న డిజైనర్. ఎక్కువగా వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరులో ‘తానిత్ డిజైన్స్’ పేరుతో ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించాడు. వీటి ధరలు సామాన్యులకూ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు. అనోఖీ.. ఓ గృహిణి ప్రారంభించిన వ్యాపారమే ఈ అనోఖీ! కొచ్చికి చెందిన ప్రియా కిషోర్.. భర్త సలహా మేరకు ఓ ఫ్యాన్సీస్టోర్ ఓపెన్ చేయాలనుకుంది. కానీ, కావల్సినంత పెట్టుబడి లేని కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే సేల్స్ ఓపెన్ చేసింది. అందమైన డిజైన్స్‌తో చాలామంది అతివలను తన డైలీ కస్టమర్లుగా మలచుకుంది. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలకూ తన డిజైన్స్‌ను అందిస్తోంది ప్రియా. చాలా తక్కువ ధరకే నాణ్యమైన, అందమైన డిజైన్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయి. బ్రాండ్ వాల్యూ జ్యూవెలరీ బ్రాండ్: అనోఖీ ధర: రూ. 2,999 చీర బ్రాండ్: తానిత్ డిజైన్స్ ధర: రూ. 7,999 చీరలో చాలా అందంగా ఉంటా. కానీ, నాకు చీర కట్టుకోవడం రాదు. అందుకే, చీరకట్టుకునే సన్నివేశాలు నేను నటించే సినిమాల్లో రాకూడదని కోరుకుంటుంటా.– హానీ రోజ్ -దీపిక కొండి -
ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్.. రణ్వీర్ డ్రెసెస్‌కి కూడా! ఈ చీర ధర తెలిస్తే..
దీపికా పదుకోణ్ పరిచయం అక్కర్లేని పేరు. ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ (ఫై)లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు. ఆ అందానికి చక్కటి అవుట్ ఫిట్స్‌ని డిజైన్ చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇది కూడా.. సబ్యసాచి... పేరుకే ఇండియన్ బ్రాండ్ కానీ, ఇంటర్నేషనల్ బ్రాండ్‌కున్నంత పేరు.. డిమాండ్ సబ్యసాచి సొంతం. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అన్నీ సబ్యసాచి కలెక్షన్స్‌తోనే జరుగుతాయి. వాటిల్లో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల పెళ్లి బట్టలు ఫేమస్. కనీసం ఒక్కసారైనా సబ్యసాచి డిజైన్ వేర్ ధరించాలని.. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఏంతోమంది ఆశపడుతుంటారు. ఆ బ్రాండ్‌కున్న వాల్యూ అలాంటిది. ఈ మధ్యనే మధ్యతరగతి మహిళల కోసం రూ. పదివేల చీరను డిజైన్ చేశారు. ఇదే ఈ బ్రాండ్ చీపెస్ట్ చీర. సుమారు లక్ష చీరలను సిద్ధం చేస్తే, రెండు రోజుల్లోనే మొత్తం కొనుగోలు చేశారు. పదివేల చీరైనా, పదినిమిషాల్లో అమ్ముడైపోతుంది. ఇదంతా సబ్యసాచి ముఖర్జీ డిజైన్ మహత్యం. బెంగాలీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సబ్యసాచి.. తన కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగారు. 1999లో తన పేరునే ఓ బ్రాండ్ హౌస్‌గా మార్చి, మరింత పాపులర్ అయ్యారు. అందమైన ఆభరణాలు కూడా ‘సబ్యసాచి’ స్టోర్స్‌లో లభిస్తాయి. ఇండియాలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్‌లోనూ ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: సబ్యసాచి.. ధర: రూ. 1,95,000 బెల్టు ధర: రూ. 29,900 కమ్మలు ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. నా బ్యాగులో సూది, దారం తప్పనిసరిగా ఉంటాయి. ఎప్పుడైనా వేసుకున్న డ్రెస్ కంఫర్ట్‌గా లేకపోతే ఒంటి మీదే క్షణాల్లో ఆల్టరేషన్ చేసేసుకుంటా. రణ్వీర్ డ్రెసెస్కూ ఆల్టరేషన్ చేస్తా.. – దీపిక పదుకోణ్. -దీపిక కొండి -
చీరకట్టులో మెరిసిపోతున్న అనసూయ! ఎప్పుడు ఒకేరకమైన ఆహారం తినలేం కదా!
అనసూయ భరద్వాజ్.. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరుస్తూ తన మీద తెలుగు ప్రేక్షకులకున్న అభిమానాన్ని రెట్టింపు చేసుకుంటోంది. ఫ్యాషన్‌లోనూ అంతే.. ట్రెండ్‌కు తగ్గ కట్టు, బొట్టు తీరుతో తన అభిమానుల ఆశ్చర్యాన్ని రెట్టింపు చేస్తుంటుంది. కౌశికి కల్చర్ హైదరాబాద్‌కు చెందిన కౌశికి.. సెలబ్రిటీస్‌కి ఫేవరెట్ డిజైనర్. తన పేరు మీదే ఫ్యాషన్ లేబుల్‌ను క్రియేట్ చేసుకుంది. పట్టు పావడాలకు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయ నేత కళను ఆధునిక డిజైన్స్‌తో పర్ఫెక్ట్గా మ్యాచ్ చేస్తుంది. మన్నికైన ఫాబ్రికే ఈ బ్రాండ్‌కి వాల్యూ. నాణ్యత, డిజైన్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో లభ్యం. హౌస్ ఆఫ్ క్యూసీ 2016లో ఒక వెబ్సైట్ ద్వారా ప్రారంభించిన వ్యాపారం, తమ అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా నోటెడ్ అయింది. ఎలాంటి వారికైనా నప్పే, ఎలాంటి వారైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్ ఆఫ్ క్యూసీ’ జ్యూయెల్స్ ప్రత్యేకత. హైదరాబాద్, బెంగళూరులలో ఈ మధ్యనే స్టోర్స్ ఓపెన్ చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: హౌస్ ఆఫ్ క్యూసీ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర బ్రాండ్: కౌశికి కల్చర్ ధర: రూ. 11,000 ఫ్యాషన్ అనేది మన తిండి అలవాటులా ఉండాలి. ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం. అలాగే ఎప్పుడు ఒకే రకం బట్టలనూ ధరించలేం. – అనసూయ భరద్వాజ్ -దీపిక కొండి చదవండి: పెళ్లికళకు పరిపూర్ణత Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
దేవనాగరి చీరలో సమంత! కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా..
సమంత.. వైవిధ్యమైన నటి అని ప్రత్యేకంగా కితాబివ్వక్కర్లేదు. ఆమె నటించిన సినిమాలు చూస్తే చాలు. అదే వైవిధ్యం ఆమె అనుసరించే ఫ్యాషన్‌లోనూ కనిపిస్తుంది. సాక్ష్యం ఇదిగో.. ఈ బ్రాండ్సే..! దేవనాగరి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. లిండ్బర్గ్.. టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో లిండ్ బర్గ్ ఐ వేర్ ఒకటి. డెన్మార్క్‌లో మెయిన్ ఆఫీస్ ఉంది. అత్యాధునిక డానిష్ డిజైన్ సూత్రాలపై తయారుచేసే వీరి అందమైన, నాణ్యమైన కళ్లజోళ్లకు ఇండియాలో మంచి గిరాకీ ఉంది. 112 అంతర్జాతీయ అవార్డులను ఈ బ్రాండ్ సొంతం చేసుకుంది. టైటానియం, ప్లాటినం, బంగారం, వెండి, వజ్రాలు పొదిగిన ఫ్రేమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. అయితే, ఈ బ్రాండ్ కేవలం సంపన్నులకు మాత్రమే. ఇక్కడి ప్రారంభ ధరే రూ. లక్షకు పైగా ఉంటుంది. కోటి రూపాయల విలువైన ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. నచ్చినట్లు ఉండు నీకు నచ్చినట్లు నువ్వుండు. ఈ భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతరులను సంతోష పెట్టడానికో కాదు. మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. – సమంత బ్రాండ్ వాల్యూ ఐ వేర్ బ్రాండ్: లిండ్బర్గ్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. చీర బ్రాండ్: దేవనాగరి ధర: రూ. 48,500 చదవండి: Sara Ali Khan: పండ్లే కాదు.. వాటి తొక్కలు కూడా వదలను! నా బ్యూటీ సీక్రెట్ ఇదే Sudha Ravi: రెండ్రోజుల్లో ఫంక్షన్.. మూడు రోజుల్లో పెళ్లి.. సుధా రవికి చెప్పారా? ఆమె స్పెషాలిటీ ఏంటి? -
శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో
Sreyashi Raka Das: పశ్చిమబెంగాల్ లోని చిన్న పట్టణానికి చెందిన శ్రేయసి రక దాస్ ఫ్యాషన్ డిజైనర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటోంది. శ్రేయసి ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకోలేదు. శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి ప్రకృతి నుంచే పాఠాలు, ‘వర్ణ’మాల నేర్చుకుంది. ఫ్యాషన్ బ్లాగర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రేయసి ఆ ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకుంది. తన ప్రతిభను మెరుగుపరుచుకుంది. శ్రేయసి క్రియేటివ్ ఐడియాలు పెద్ద బ్రాండ్లకు నచ్చి అవకాశం ఇచ్చాయి. ఇక వెనక్కి తిరిగిచూసుకోలేదు.‘ఎస్ఆర్డీ’ లేబుల్‌తో తానే ఒక బ్రాండ్‌గా ఎదిగింది. కొరియన్ యూట్యూబర్ లునా యోగినితో కలిసి చేసిన ప్రాజెక్ట్‌కు మంచి పేరు వచ్చింది. ‘ఎస్ఆర్డీ’ వింటర్ కలెక్షన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు తన దగ్గర ప్రతిభావంతులైన యువబృందం ఉంది. అందరూ కలిసి కొత్తరకం డిజైన్ల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తారు. ‘సమ్‌థింగ్ ఫర్ ఎవ్రీ వన్’ అనేది ఎన్ఆర్డీ అందమైన నినాదం. ‘మనల్ని మనం ప్రేమించుకోగలిగినప్పుడు, ఇతరులలోని ప్రతిభను అభినందించగలిగినప్పుడు అసలుసిసలైన అందం మన కంటికి కనిపిస్తుంది. అప్పుడే అందమైన ఐడియాలు వస్తాయి’ అంటున్న శ్రేయసికి వ్యాపార ప్రయోజనాలు మాత్రమే ప్రాధాన్యత కాదు. 26 సంవత్సరాల శ్రేయసికి సామాజిక స్పృహతో పాటు పర్యావరణ స్పృహ కూడా ఉంది. చదవండి: Sustainable Fashion: చమురుతో కంటే.. పాలిస్టర్‌తో తయారయ్యే ఫాస్ట్ ఫ్యాషన్ వల్లే ఎక్కువ కలుషితం! ఏం చేయాలి? -
పెళ్లి కూతురు చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చే బ్రేస్లెట్ రింగ్!
పెళ్లి కూతురు అలంకరణలో రకరకాల మోడల్స్‌లో ఉన్న బ్రేస్లెట్ రింగ్స్ మెహెందీ చేతులను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి. ఇక గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ వేడుకల్లో స్టైలిష్ డ్రెస్‌లకు మరింత స్టైలిష్ లుక్‌నిస్తున్నాయి ఈ బ్రేస్లెట్ రింగ్స్. అమ్మాయిల అలంకరణలో ప్రతిదీ ప్రత్యేకతను నింపుతుంది. అందమైన దుస్తులే కాదు ఆభరణాలూ అంతే ఘనంగా ఉండాలనుకుంటారు. ఏ వేడుక అయినా మెడలో హారాలు, కాళ్లకు పట్టీలు, చేతులకు గాజులు మ్యాచింగ్‌గా ఎంపిక చేసుకుంటుంటారు. బంగారు, వెండి లేదా ఫ్యాన్సీ ఆభరణాలను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. వీటిలో బ్రేస్లెట్ రింగ్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ముంజేతిని చుట్టేసే బ్రేస్లెట్... దాని నుంచి వేలి ఉంగరానికి జత చేస్తూ ఉన్నట్టుగా ఉండే ఈ మోడల్స్ చేతులను మరింతగా హైలైట్ చేస్తున్నాయి. పూసలు వరసలు... ఇవి సంప్రదాయ దుస్తుల మీదకు బాగా నప్పుతున్నాయి. అంటే, సంప్రదాయ వేడుకల సమయాల్లో వీటిని అలంకరించుకోవచ్చు. బ్లాక్బీడ్స్ వరసతో ఈ అల్లికను గమనించవచ్చు. రత్నాల రాశులు... నవరత్నాలు, డైమండ్స్ పొదిగిన బ్రేస్లెట్ రింగ్స్ పెద్ద పెద్ద వేడుకల్లో మరింత గ్రాండ్‌గా వెలిగిపోతున్నాయి. బంగారు హంగు... బంగారు తీగెలతో రూపుకట్టిన ఈ ఆభరణం. ఇటు సంప్రదాయ, అటు స్టైలిష్ వేర్లా కూడా పార్టీకి తగిన హంగును తీసుకువస్తుంది. వెండి జిలుగులు... వెండి జిలుగుకు పెద్ద పెద్ద స్టోన్స్ జత కలిసిన బ్రేస్లెట్ రింగ్స్ మోడర్న్ ఔట్‌ఫిట్స్‌కు స్టైలిష్ లుక్‌ని ఇస్తున్నాయి. ఇవి ఏ కాలమైనా యూత్‌ని మెప్పిస్తూనే ఉన్నాయి. -
తారలా తళుకులీనుతున్న మేఘా ఆకాశ్.. ఈ ట్రెండీ లుక్ వెనుక..
మేఘా ఆకాశ్... ‘లై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నటికి సోషల్ మీడియాలోనూ తెగ క్రేజ్ ఉంది. సందర్భానికి తగ్గట్టు ట్రెండీ, ట్రెడిషనల్ దుస్తుల్లో మెరుస్తూ ఫ్యాషన్ వరల్డ్‌లో తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ స్టయిల్‌కి సిగ్నేచర్ అయిన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. మ్యాడర్ మచ్ మ్యాడర్ మచ్ స్థాపకురాలు.. అనితా చంద్రమోహన్. ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లోని చేనేత కలెక్షన్స్‌లో ‘మ్యాడర్ మచ్’ డిజైన్స్ ఉండాలన్నది ఆమె లక్ష్యం. సహజ రంగులను ఉపయోగించి, స్థానిక అద్దకం, చేనేత కళాకారులతోనే ఇక్కడి ప్రతి డిజైన్ రూపుదిద్దుకుంటుంది. గులాబీ, ఎరుపు రంగు అద్దకం కోసం ఎక్కువగా ఉపయోగించే మంజిష్ఠ (చెక్క) ఈ బ్రాండ్ ప్రధాన వస్తువు. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఇండియన్ మ్యాడర్ అని పిలుస్తారు. అందుకే, ఈ బ్రాండ్‌కు ‘మ్యాడర్ మచ్’ అని పేరు పెట్టారు. ఇక వీటి డిజైన్, నాణ్యత ఫస్ట్‌క్లాస్. ధరలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. PC: Instagram వి విబితా ఎడ్వర్డ్, విజేతా ఎడ్వర్డ్.. ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. బటన్ మేకర్స్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే వారికి బటన్ మేకింగ్‌లోని సూక్ష్మ విషయాలు సహా అన్నీ తెలుసు. చెల్లెలు విబితా.. తయారీ లోపంతో తిరస్కరించిన బటన్స్‌తో ఫ్యాషన్ ఉపకరణాలను చేసేది. ఆమె ఆలోచనకు అక్క విజేతా తోడైంది. వెంటనే, 2018లో ‘వి’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. 85 శాతం రీసైక్లింగ్‌కు వచ్చిన బటన్స్నే వాడతారు. పర్యావరణానికి హాని కలిగించే సింథటిక్, పాలియస్టర్ బటన్స్‌ను ఉపయోగించరు. ఇక వీటి ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఈ జ్యూయెలరినీ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: మ్యాడర్ మచ్ ధర: రూ. 35,580 జ్యూయెలరీ బ్రాండ్: వి ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణాలు చేయటం చాలా ఇష్టం. అందుకే, నా దుస్తుల్లో ఎక్కువగా క్యాజువల్ వేర్స్ ఉంటాయి. నా స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటుంది. – మేఘా ఆకాశ్. ∙దీపిక కొండి -
పండగ ఆభరణాలు.. షుగర్ బాల్ జ్యువెలరీ గురించి తెలుసా?!
Sugarball Jewellery: జనవరి రాగానే చాలా మంది ఎదురుచూసే పండగ సంక్రాంతి. ఢిల్లీ వాసులు సక్రాత్ అని, గుజరాతీయులు ఉత్తరాయణం అని, తమిళనాడులో పొంగల్ అని, తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి అనీ అంటారు. పేరు భిన్నంగా ఉండవచ్చు. కానీ వేడుకలో ఉత్సాహం ప్రతి చోటా అధికంగానే ఉంటుంది. అందుకు తగినట్టుగానే మగువలు అలంకరణలోనూ వైవిధ్యం చూపుతుంటారు. సంక్రాంతి అంటేనే ప్రకృతి పండగ.. పతంగుల సంబరం.. ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చేవి సంప్రదాయ దుస్తులు మాత్రమే కాదు.. వాటిని మరింత మెరుపులీనేలా చేసే ఆభరణాలు కూడా! షుగర్ బాల్ జ్యువెలరీ సంక్రాంతికి సుగర్ బాల్స్‌తో చేసిన ఆభరణాలను ధరించడం కొన్ని చోట్ల ఆచారంగా ఉంది. పెళ్లయిన ఏడాదికి నవ వధువుకు చేసే ఈ అలంకరణ మరాఠాలోనూ ఇతర సంప్రదాయాల్లో కనిపిస్తుంది. గసగసాలు లేదా నువ్వులను పంచదార పాకంలో కలుపుతారు. వీటిని సన్నని మంటమీద మిశ్రమం బాగా చిక్కబడేవరకు కలుపుతూ ఉంటారు. ఈ మిశ్రమంతో పూసల్లాంటి చిన్న చిన్న బాల్స్‌ని తయారుచేస్తారు. ఈ చక్కెర బాల్స్‌ని అందమైన వివిధ రకాల ఆభరణాలుగా రూపుకడతారు. ఇవి వధువు భవిష్యత్తు జీవితాన్ని ఆనందకరంగా మార్చుతాయని వారి నమ్మకం. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా వీటి అలంకరణ చూడముచ్చటగా ఉంటుంది. పువ్వుల క్రాంతి ఆభరణం అంటే బంగారమే కానక్కర్లేదు. భారతదేశ వివాహ వేడుకల్లో మెహిందీ సమయాల్లో ధరించే ప్రత్యేకమైన పుష్ప హారాలు సంక్రాంతినీ సందడిచేస్తున్నాయి. అమ్మాయిల అందాన్ని పువ్వులతో రెట్టింపు చేస్తున్నాయి. వీటిలో పొడవు హారాలు, చోకర్స్, జూకాలు, గాజులు పువ్వుల అల్లికతో అందంగా అమర్చుకోవచ్చు. ధరించే దుస్తులతోనూ వీటిని మ్యాచ్ చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ పువ్వుల ఆభరణాలు అందుబాటులోకి వచ్చాయి. గోటా పట్టీ ధరించే దుస్తుల రంగులతో ఫ్యాబ్రిక్, గోటాపట్టీ జ్యువెలరీ కూడా పోటీపడుతుంటాయి. దీంతో ఇవి పండగ కళను మరింత పెంచుతాయి. -
Fashion: బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఈషా! ఆ బ్రాండ్ స్పెషాలిటీ?
తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది తెలుగు హీరోయిన్స్‌లో ఈషా రెబ్బా ఒకరు. సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఫ్యాషన్‌లోనూ అంతే సెలెక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్రాండ్స్ ఈషా వార్డ్రోబ్లోనివే.. షామీన్ హుస్సేన్ మిమ్మల్ని మీరు ఒక ప్రిన్సెస్‌లా చూడాలనుకుంటున్నారా? అయితే, డిజైనర్ షామీన్ హుస్సేన్ కలెక్షన్స్‌ను ఒకసారి ట్రై చేయండి. దేశీ వెర్షన్లో అందమైన ఫ్లీ లెహంగాలు, గౌన్లు తయారుచేయడంలో షామీన్ స్పెషలిస్ట్. స్టైలిష్ లుక్‌నిచ్చే ఈ డిజైన్స్‌ను సెలబ్రిటీలు సైతం ఇష్టపడతారు. చిన్న పిల్లలక్కూడా ఈ డిజైన్స్ లభిస్తాయి. స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకునే వీలూ ఉంది. ఆన్లైన్ స్టోర్‌లో మాత్రమే లభ్యం. ఛగన్‌లాల్ జ్యూయెల్స్ 1956లో ఛగన్‌లాల్ జ్యూయెల్స్ ప్రారంభమైంది. మొదట వీరు కేవలం రాజకుటుంబీకులకు మాత్రమే ఆభరణాలను తయారుచేసేవారట. తర్వాత సామాన్యులు కూడా వీరి ఆభరణాలను ధరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ లభించే ఆభరణాల డిజైన్స్ ఎక్కువగా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: ఛగన్‌లాల్ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ బ్రాండ్: షామీన్ హుస్సేన్ ధర: రూ. 35,018 నన్ను కొంతమంది ‘తెల్లగా ఉండుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేదానివి’ అన్నారు. అలాంటి అభిప్రాయలను నమ్మను.. ఆ మాటలను ఖాతరు చేయను. మేని ఛాయ.. ప్రతిభను కమ్మేయదు. – ఈషా రెబ్బా -దీపికా కొండి View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
Fashion: అలాంటి వారికి ఈ ఉలెన్ కుర్తీలు బెస్ట్ ఆప్షన్!
కొంచెం కూల్.. కొంచెం హాట్.. అన్నట్టుగా ఉంటోంది ఈ వెదర్. దీంతో సందర్భాన్ని బట్టి స్పెషల్‌గా రెడీ అవడం కుదరడం లేదు అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి ఈ ఉలెన్ కుర్తీలు. పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి . చలికి స్వెట్టర్ అవసరం లేకుండా కాజువల్ వేర్ గానూ ఆకట్టుకుంటున్నాయి. ఎనీ వేర్ ఎనీ టైం అన్నట్టుగా కుర్తీ అన్ని వయసుల వారి తప్పనిసరి డ్రెస్‌గా నిలిచిపోయింది. సీజన్‌కి తగిన విధంగా, స్టైలిష్ వేర్‌గా పేరొందిన కుర్తీ మరింత స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది. చదవండి: Meenakshi Chaudhary: ఆరెంజ్ కలర్ శారీలో మీనాక్షి తళుకులు! చీర, నగల ధర ఎంతంటే! -
ఆరెంజ్ కలర్ శారీలో మీనాక్షి తళుకులు! చీర, నగల ధర ఎంతంటే!
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో పలకరించిన హీరోయిన్ మీనాక్షీ చౌదరి. హిట్- 2తో హిట్ కొట్టిన ఆమె.. తెలుగు సినీ రంగంలో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సృష్టించుకున్నట్టే... ఫ్యాషన్ వరల్డ్‌లోనూ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. ఆమెకు నచ్చిన బ్రాండ్స్‌లో ఇవి కొన్ని.. లేబుల్ సోనమ్ లుథ్రియా.. ముంబై ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సోనమ్ లుథ్రియా.. 2012లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఫ్యాబ్రిక్‌పై సోనమ్కున్న పట్టు.. ఆమెను టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో ఒకరిగా చేర్చింది. ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. కర్ణిక జ్యూయెల్స్.. ఫ్యాషన్‌కు తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్ ఫౌండర్ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్‌ను రూపొందిస్తూ కర్ణిక జ్యూయెల్స్ను వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సెలిబ్రిటీ బ్రాండ్స్‌గా నిలిపింది. అన్ని రకాల గోల్డ్, సిల్వర్, గోల్డ్ ప్లేటేడ్ నగలతో పాటు, ఫ్యూజన్, నక్షీ, నవరతన్, స్వరోవ్స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: లేబుల్ సోనమ్ లూథ్రియా. ధర: రూ. 25,500 జ్యూయెలరీ బ్రాండ్: కర్ణిక జ్యూయెల్స్ ధర: రూ. 33,000 నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఎవరూ నిన్ను ఆపలేరు. అలాగే ముందు మనకు మనం అందంగా ఉన్నామని నమ్మాలి. అప్పుడే మన అందం మరింత అందంగా కనపడుతుంది. – మీనాక్షీ చౌదరి -దీపికా కొండి -
Fashion: క్రిస్మస్ వేడుకలో మరింత వెలిగిపోయేలా..
కొన్ని రంగులు కొన్ని సందర్భాలలో ప్రత్యేకత నింపుకుంటాయి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ కాంబినేషన్లో చేసే హంగామా క్రిస్మస్ వేడుకలో మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు కాంబినేషన్ల డ్రెస్‌లు మాత్రమే కాదు ఇతర అలంకార వస్తువుల్లోనూ ప్రత్యేకత చూపవచ్చు. వాటిలో చేతికి ధరించే బ్రేస్లెట్స్, మెడలో ధరించే నెక్‌పీస్, క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్, చెవులకు హ్యాంగింగ్స్ వేడుక ప్రతిఫలించేలా ఎంపిక చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్‌లో భాగంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్, స్టార్స్ డిజైన్స్‌తో మరింతగా మెరిసిపోవచ్చు. క్రిస్మస్ ట్రీలా నిండైన పచ్చదనాన్ని, ఆత్మీయ ఆప్యాయతలను పంచుకునే కానుకలా, స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలుస్తూ భూమిపైన నక్షత్రాల్లా మెరవాలని ఈ రంగులు సూచిస్తుంటాయి. అందుకే ఈ పండగ పూట అలంకరణలో ఈ రంగులు ప్రధాన భూమికను పోషిస్తుంటాయి. ఆధునికంగానూ ఉంటూనే అంతే హంగునూ పరిచయం చేసే ఈ కలెక్షన్ పండగ వేళ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. చదవండి: Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే -
అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర?
Malavika Sharma- Fashion Brands: ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది మాళవిక శర్మ. చేసిన కొద్ది సినిమాల్లోనే వైవిధ్యమైన పాత్రలు పోషించి నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకుంది. ఫ్యాషన్ పట్లా తన టేస్ట్ భిన్నమైనదేనని తెలుస్తోంది ఆమె ఫాలో అవుతున్న ఈ బ్రాండ్స్‌ను చూస్తుంటే! స్తోత్రం సంప్రదాయ కట్టుకు పాశ్చాత్య సౌందర్యాన్ని తీసుకు రావడంలో ‘స్తోత్రం’ పెట్టింది పేరు. అంతేకాకుండా అల్లికలు, కుందన్ వర్క్స్‌తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్‌ది ప్రత్యేక ముద్ర. దీని డిజైన్స్‌కు విదేశాల్లోనూ మంచి డిమాండే ఉంది. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. PC: Malavika Sharma Instagram ఫైన్ షైన్ జ్యూయెలరీ చెన్నైకి చెందిన అనిల్ కొఠారి .. తొలుత తన కెరీర్‌ను ‘బ్రౌన్ ట్రీ – యువర్ హెల్త్ ఫుడ్ స్టోర్ ’ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా మొదలుపెట్టాడు. కొద్ది నెలల్లోనే అదే కంపెనీకి సీఈఓగా ఎదిగి సక్సెస్ఫుల్ బిజినెస్‌మన్‌గా నిలిచాడు. తర్వాత అతని దృష్టి ఫ్యాషన్ రంగం మీదకు మళ్లింది. అప్పుడే ఈ ‘ఫైన్ షైన్ జ్యూయెలరీ’ని ప్రారంభించాడు. అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు తన బ్రాండ్ నగలను స్పాన్సర్ చేశాడు. ప్రధాన కస్టమర్లు సెలబ్రిటీలే. అందుకే వీటి ధరలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. PC: Malavika Sharma Instagram బ్రాండ్ వాల్యూ చీరబ్రాండ్: స్తోత్రం ధర: రూ. 68,500 జ్యూయెలరీ బ్రాండ్: ఫైన్ షైన్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అందుకే లాయర్ కావాలనుకున్నా.. నల్లరంగు అంటే చాలా ఇష్టం. అందుకే లాయర్ కావాలనుకున్నా.. – మాళవిక శర్మ -దీపిక కొండి చదవండి: Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్ -
Fashion: అందానికే అందంలా అల్లు స్నేహారెడ్డి! ఆ చీర ధర ఎంతంటే!
Allu Arjun Wife Allu Sneha Reddy- Fashion Brands: ట్రెండ్‌ను ఫాలో అవుతూ స్టైల్ మెయింటైన్ చేయడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి స్టైలిష్ స్టార్‌కు సరిజోడు అనిపించుకుంటోంది అల్లు స్నేహారెడ్డి. ఫంక్షన్ అయినా.. పార్టీ అయినా.. ఔటింగ్ అయినా.. తనకు నప్పే అవుట్ ఫిట్‌తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలా తనను ఎలివేట్ చేసే లుక్ కోసం స్నేహారెడ్డి డిపెండ్ అయ్యే ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. లేబుల్ క్షితిజ్ జలోరీ క్షితిజ్.. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో టెక్స్టైల్ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత కొంత కాలం వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేశ సంస్కృతీసంప్రదాయాలను ప్రేరణగా తీసుకొని 2018లో ‘లేబుల్ క్షితిజ్ జలోరీ’ని ప్రారంభించాడు. దేశీ సంప్రదాయ నేత కళ, వరల్డ్ ట్రెండ్స్ అండ్ స్టయిల్స్‌ను పడుగుపేకలుగా పేర్చి డిజైన్స్‌ను క్రియేట్ చేస్తున్నాడు. అతివలు నచ్చే.. మెచ్చే చీరలు, దుపట్టాలు, లెహంగాలను డిజైన్ చేయడంలో ఈ బ్రాండ్‌కి సాటి లేదు. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఖన్నా జ్యూయెలర్స్ నగల వ్యాపారంలో డెబ్భై ఏళ్లకు పైగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఈ ఖన్నా జ్యూయెలర్స్ను స్వర్గీయ శ్రీ వజీర్ చంద్ ఖన్నా ప్రారంభించారు. చిక్, లష్ పోల్కిస్ – ఫ్యూజన్ స్టైల్స్ బంగారు ఆభరణాలు ఈ బ్రాండ్ ప్రత్యేకత. ప్రస్తుతం ఢిల్లీతోపాటు చెన్నై, కోయంబత్తూర్లలో ఈ జ్యూయెలర్స్కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: లేబుల్ క్షితిజ్ జలోరీ ధర: రూ. 59,800 జ్యూయెలరీ బ్రాండ్: ఖన్నా జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అలా ఏం లేదు.. నాకు సపరేట్ స్టైల్ అంటూ లేదు. అకేషన్‌కి తగ్గట్టు రెడీ అవడమే! – అల్లు స్నేహా రెడ్డి. -దీపికా కొండి చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్ అదే! Varsha Bollamma: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 9500! జైరా బ్రాండ్ ప్రత్యేకత అదే! సామాన్యులకు కూడా View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 9500! జైరా బ్రాండ్.. సామాన్యులకు కూడా!
‘మిడిల్ క్లాస్ మెలోడిస్’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తార.. వర్ష బొల్లమ్మ. సాదాసీదా పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. తన సహజమైన నటనతో మురిపించిన ఆమె ఫ్యాషన్ అభిరుచిని తెలిపే బ్రాండ్స్ ఏంటో చూద్దాం... జైరా ‘ఎవరి అందం వారిదే. ఆ అందాన్ని రెట్టింపు చేయడమే నా బ్రాండ్ లక్ష్యం’ అంటోంది కేరళకు చెందిన జైరా. ఫ్యాషన్ పై ఉన్న ప్యాషన్‌తో చదువు పూర్తయిన వెంటనే తన పేరు మీదే ఓ బోటిక్ ప్రారంభించింది. అందమైన డిజైన్స్‌తో అనతికాలంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె డిజైన్స్‌కు సెలబ్రిటీలు కూడా వీరాభిమానులయ్యారు. అయినా సామాన్యులూ కొనగొలిగే స్థాయిలోనే జైరా బ్రాండ్ ధరలు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.. అడోర్.. ఇదొక ఆన్లైన్ స్టోర్. ఢిల్లీకి చెందిన ప్రియాంక, సుధీర్ కుమార్ అనే ఇద్దరు స్నేహితులు స్థాపించిన ఈ బ్రాండ్.. అతి తక్కువ సమయంలోనే కస్టమర్–సెంట్రిక్ కంపెనీగా నిలిచింది. తక్కువ ధరలకే చక్కటి డిజైన్లలో సహజమైన రాతి ఆభరణాలను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. కేవలం ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. లైట్ అప్ సోల్.. సంప్రదాయ అల్లికలు, కుందన్ వర్క్స్‌తో ఫుట్‌వేర్ అందించడం ‘లైట్ అప్ సోల్’ స్పెషాలిటీ. అంతేకాకుండా అందమైన హ్యాండ్ మేడ్ బ్యాగులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇవన్నీ సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. కానీ ఆన్లైన్ స్టోర్‌లో మాత్రమే! బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: జైరా ధర: రూ. 9,500 జ్యూయెలరీ బ్రాండ్: అడోర్ ధర: రూ. 395 ఫుట్‌వేర్ బ్రాండ్: లైట్ అప్ సోల్ ధర: రూ. 999 -దీపిక కొండి చదవండి: పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ‘వింక్ బ్యూటీ’! డ్రెస్ ధర ఎంతంటే! Floral Designer Wear: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా! -
Fashion: పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ‘వింక్ బ్యూటీ’! డ్రెస్ ధర ఎంతంటే!
తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ లోని కన్ను కొట్టే సీన్‌తో ‘వింక్ బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్! సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. అలా ఆమె అభిమానాన్ని చూరగొన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి తను పెద్ద ఫ్యాషన్ డిజైనర్‌ని కావాలని కలలు కన్నారు. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించించారు. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర డిజైన్‌ను బట్టే. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఆమె డిజైన్స్ లభ్యం. కాగా ఈ ఏడాది జూన్‌లో ప్రత్యూష గరిమెళ్ల బలవన్మరణానికి పాల్పడి తన వాళ్లను విషాదంలోకి నెట్టారు. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. కానీ ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర: రూ. 40,800 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అదో సరదా వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. ట్రాన్స్పెరెంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. - ప్రియా ప్రకాశ్ వారియర్ -దీపిక కొండి చదవండి: Floral Designer Wear: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా! -
Fashion: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా!
Winter Fashion: వింటర్ సీజన్ ఈవెనింగ్ పార్టీలతో బ్రైట్‌గా వెలిగిపోతుంది. గెట్ టు గెదర్ కాన్సెప్ట్స్ గెట్ రెడీ అంటుంటాయి. ఇలాంటప్పుడు నలుగురు కలిసే చోట న్యూ లుక్‌తో కనిపించాలని కోరుకుంటుంది నవతరం. ఇండో–వెస్టర్న్ లుక్‌తో అట్రాక్ట్ చేయాలనుకుంటుంది. వారి అభిరుచులకు తగినట్టు డిజైన్ చేసిన డ్రెస్సులు ఇవి... ఈ డ్రెస్సులన్నీ దాదాపుగా ఫ్లోరల్ కాన్సెప్ట్‌గా డిజైన్ చేశాం. ప్లెయిన్ శాటిన్, రా సిల్క్, జార్జెట్, ఆర్గంజా మెటీరియల్‌ని డ్రెస్ డిజైనింగ్‌లో వాడాం. ఫ్లోరల్ డిజైన్ కోసం హ్యాండ్ ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశాం. ఇండోవెస్ట్రన్ లుక్‌కి పలాజో, ధోతీ, లాంగ్ ఫ్రాక్స్, లెహంగా మోడల్స్ తీసుకున్నాం. – తరుణి శ్రీగిరి , ఫ్యాషన్ డిజైనర్ చదవండి: Aishwarya Lekshmi: పెళ్లి కూతురి కలెక్షన్స్‌కు పెట్టింది పేరు ఈ బ్రాండ్! ఐశ్వర్య ధరించిన డ్రెస్ ధర ఎంతంటే! Winter Sweater Trendy Designs: శీతాకాలం.. ఆధునికతకు అద్దం పట్టేలా ఊలుదారాల అల్లికలు -
Fashion: డి బెల్లె బ్రాండ్ సారీలో లక్ష్మీ మంచు! చీర ధర ఎంతంటే!
నటిగా, నిర్మాతగా, టాక్ షో హోస్ట్‌గా.. ఏ రోల్ అయినా పర్ఫెక్ట్గా పోషిస్తారు లక్ష్మీ మంచు. ఫ్యాషన్‌లోనూ అదే పర్ఫెక్షన్ను చూపిస్తున్నారు. ఆ ఠీవికి కారణమైన బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. డి బెల్లె..... సూరత్‌కు చెందిన నాన్సీ లుహరువాలాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ప్రయాణమే వివిధ ప్రాంతాల్లో ధరించే దుస్తులపై ఆమెకు ఆసక్తి కలిగేలా చేసింది. ఆ ఆసక్తితోనే నాన్సీ 2014లో లేబుల్ ‘డి బెల్లె’ను ప్రారంభించి డిజైనర్‌గా మారింది. ఆధునిక మహిళలను ఆకట్టుకునేలా పలురకాల దుస్తులను రూపొందించడం ఆమె డిజైనింగ్‌లోని విశిష్టత. విదేశాల్లోనూ నాన్సీ కలెక్షన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. డిజైన్ బట్టే ధరలు. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. రోజ్ జ్యూయెల్స్.. దేశంలోని ప్రముఖ జ్యూయెలరీ బ్రాండ్స్‌లో ఇది ఒకటి. 1981లో మొదలైందీ సంస్థ. ‘రోజ్ ’ అనే పేరు అందం, శక్తి, రాయల్టీని సూచిస్తుంది. భారతీయ హస్తకళల నైపుణ్యాన్ని, విలువను సంరక్షించడం ఈ బ్రాండ్ లక్ష్యం. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతి, అభిరుచుల సమ్మేళనంగా ఉంటాయి ఈ ఆభరణాలు. ధర లక్షల్లోనే.. ఆన్ లైన్లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: డి బెల్లె ఈ ఆనియన్ పింక్ చీర ధర: రూ. 1,44,000 జ్యూయెలరీ బ్రాండ్: రోజ్ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అనుభవాన్ని మించిన గురువు ఉండరు. జీవన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తులు, సంఘటనలకు మించిన పాఠాలు ఉండవు. – లక్ష్మీ మంచు -దీపిక కొండి చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! Retro Style: రెట్రో స్టైల్.. నాటి మహారాణీ చీరకట్టు హుందాతనం.. మళ్లీ ఇలా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
Fashion: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్! చీర ధర ఎంతంటే
‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షిర్లీ సేథియా. న్యూజిలాండ్ సింగర్. తన పాటల్లోనే కాదు ఫ్యాషన్‌లోనూ వైవిధ్యం చూపిస్తోంది ఇలా... సంగీతా బూచ్రా రాజస్థాన్ సంప్రదాయ నగల స్ఫూర్తితో ఏర్పడిన బ్రాండే సంగీతా బూచ్రా జ్యుయెల్స్. వెండి నగలకు ఈ బ్రాండ్ ప్రత్యేకం. నిజానికి ఈ వ్యాపారాన్ని 1897లో జైపూర్‌లో సేఠ్ కస్తూర్ చంద్ బూచ్రా ప్రారంభించాడు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్ కారణంగా దాదాపు దశాబ్దాల పాటు దీన్ని విజయవంతంగా కొనసాగిస్తూ.. ‘ది సిల్వర్ కింగ్ ఆఫ్ ఇండియా’గా ప్రాచుర్యం పొందాడు. తదనంతరం ఆ వ్యాపారాన్ని ఆయన కుటుంబీకులూ అంతే సమర్థంగా కొనసాగించారు. అయితే 1994లో ఆ కుటుంబ వారసురాలు సంగీత.. ఆ వ్యాపారాన్ని ‘సంగీత బూచ్రా’ పేరుతో బ్రాండ్‌గా మలచింది. వాల్యూను పెంచింది. ధరలు అందుబాటులోనే.. నగలు ఆన్లైన్లో! సోనమ్ లూథ్రియా..... ముంబైలోని ఎస్సెన్డీటీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైన్ గ్రాడ్యుయేట్ అయిన సోనమ్ లూథ్రియా.. 2012లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఫ్యాబ్రిక్స్, ప్రింట్లు, త్రెడ్ వర్క్‌లతో వైవిధ్యం చూపించడం ఆమె ప్రత్యేకత. కస్టమర్ అభిరుచిని బట్టి సృజనాత్మకమైన ఆఫ్ బీట్ ఫ్యూజన్ వేర్, అందమైన డ్రెప్లు, సంప్రదాయేతర కట్లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లతో ఇండియన్ వేర్‌ను డిజైన్ చేయడంలో ఆమె తర్వాతనే ఎవరైనా! పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇక్కడ దుస్తులు లభిస్తాయి. ఆర్డర్ ఇచ్చి కూడా డిజైన్ చేయించుకొనే వీలుంది. ఆన్లైన్లో లభ్యం. ధర కాస్త ఎక్కువే. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: సోనమ్ లూథ్రియా ధర: రూ. 36,000 జ్యూయెలరీ బ్రాండ్: సంగీతా బూచ్రా జ్యూయెల్స్ ధర: రూ. 15,000 ఆదరాభిమానాలను చూస్తుంటే సంతోషంగా ఉంది! నటిని కావాలనే ఇష్టంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరాను. కానీ నేను సింగర్‌ను కావాలని విధి నిర్ణయించింది. నా పాటల పట్ల ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూస్తుంటే సంతోషంగా ఉంది! – షిర్లీ సేథియా -దీపిక కొండి చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ ప్రత్యేకత అదే! ప్యాంట్ శారీ.. చెవులకు పెద్ద హ్యాంగింగ్స్, ఫిష్ టెయిల్.. మీరే హైలైట్! -
Fashion: ప్యాంట్ శారీ.. చెవులకు పెద్ద హ్యాంగింగ్స్, ఫిష్ టెయిల్.. మీరే హైలైట్!
సంప్రదాయ వేడుకల్లో చీరకట్టు, లంగా ఓణీ అమ్మాయిల ఎవర్గ్రీన్ డ్రెస్‌గా ఉంటుంది. కానీ, ఆ‘కట్టు’కోవడంలో పెద్ద ఇబ్బందిగా ఫీలవుతుంటారు. పెద్దవారిలా చీరకట్టు ఎందుకు అని ప్రశ్నించే నవతరం పెద్దవారు సైతం మెచ్చేలా డ్రెస్సింగ్ ఉండాలంటే ప్యాంట్ శారీ సరైన ఎంపిక అవుతుంది. స్టైలిష్ జాబితాలో ముందు వరసలో ఉంటుంది. వేడుకలలో హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ దీపావళి మరింత శోభాయమానం అవుతుంది. కుర్తీస్‌కి పలాజో ప్యాంట్ ధరించడం మనకు తెలిసిందే. పలాజో టాప్ విత్ దుపట్టాతో లుక్‌లో మార్పు తీసుకురావచ్చు. అలాగే, పలాజో స్కర్ట్, షరారా ప్యాంట్, స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ కూడా ఈ స్టైల్‌కు బాగా నప్పుతాయి. కాంట్రాస్ట్ ప్యాంట్–టాప్ సేమ్ ప్లెయిన్ కలర్లో ఉండి, దీనికి కాంట్రాస్ట్ లేదా ఫ్లోరల్ దుపట్టాతో అలంకరిస్తే చాలు. ‘స్టైలిష్ లుక్ అంతా మీలోనే కనిపిస్తుంది’ అన్న కితాబులు అందుకుంటారు. ప్లెయిన్ ఒకే రంగులో ఉండే ప్లెయిన్ శారీ ప్యాంట్లు ఈవెనింగ్ గెట్b టు గెదర్ పార్టీలకు బాగా నప్పుతాయి. ఇవి శారీ గౌన్ స్టైల్లో కనిపించడంతో ఇండోవెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకుంటాయి. ఆభరణాలు.. డ్రెస్‌తోనే స్టైలిష్‌గా కనిపిస్తారు కాబట్టి ఇతరత్రా అలంకరణలు పెద్దగా అవసరం లేదు. అయితే నడుముకు మాత్రం ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ బెల్ట్ ధరిస్తే లుక్ బాగుంటుంది. చెవులకు పెద్ద హ్యాంగింగ్స్ పెట్టేస్తే చాలు. కేశాలంకరణలో ఫిష్ టెయిల్ లేదా లూజ్‌గా వదిలేస్తే ముస్తాబు పూర్తయినట్టే. చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ ప్రత్యేకత అదే! Gota Work: గోటా పట్టి.. దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు! -
శోభిత ధూళిపాళ కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్ రేంజ్ అలాంటిది మరి!
ఎప్పుడో గానీ తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించరు. ‘గూఢచారి’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాదు హాలీవుడ్ సినిమా ‘మంకీ మ్యాన్’లోనూ నటిస్తూ బిజీగా ఉంది. శోభిత హాలీవుడ్ స్క్రీన్ పరిచయానికి ఆమె యూనిక్ స్టయిలే కారణం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆ స్టయిల్ ఏంటో చూద్దాం... తరుణ్ తహిలియానీ.... తరుణ్ తహిలియానీ .. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్. భార్య శైలజా సాల్ తహిలియానీతో కలసి 1987లో మల్టీ–డిజైనర్ బోటిక్ స్థాపించాడు. తర్వాత 1990లో తహిలియానీ డిజైన్ స్టూడియో కూడా ప్రారంభించాడు. భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి అతని డిజైన్స్! ముఖ్యంగా సంప్రదాయ సౌందర్యాన్ని ఆధునిక డిజైన్స్‌తో సమ్మిళితం చేయడం అతని సిగ్నేచర్ స్టయిల్. పెళ్లి దుస్తులకు పెట్టింది పేరు. ఈ మధ్యనే ఈవెంట్ డిజైనింగ్నూ ప్రారంభించాడు. అయితే తహిలియానీ డిజైన్స్‌ను సామాన్యులు అందుకోవడం అసాధ్యమే. ఆన్ లైన్లో లభ్యం. ఆమ్రపాలి జ్యూయెలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. ధర మాత్రం లక్షల్లో ఉంటుంది. అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రెప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు ఈ ఇద్దరూ. ఆమ్రపాలి.. ట్రైబల్ డిజైన్స్‌కు ప్రసిద్ధి. చాలా మంది సెలబ్రిటీస్‌కి ఇది ఫేవరేట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: తరుణ్ తహిలియానీ ధర: రూ. 4,79,900 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ దుస్తులను వెస్టర్న్ లుక్‌లో.. అంటే సౌకర్యంగా ఉండేలా వేసుకోవడమే నాకు నచ్చే.. నేను మెచ్చే స్టయిల్. నిజానికి దుస్తులకంటే ఆభరణాల ఫ్యాషన్ పైనే నాకు ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా కమర్బంధ్(వడ్డాణం) అన్నా డైమండ్స్ అన్నా చాలా ఇష్టం. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నానో దాన్నిబట్టి ఉంటుంది నా ఫ్యాషన్ స్టయిల్! – శోభిత ధూళిపాళ -దీపిక కొండి చదవండి: Gota Work: గోటా పట్టి.. దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు! Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! -
గోటా వర్క్ డిజైన్స్.. దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు!
రాబోయే దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు చోటుచేసుకోవాలనుకునేవారికి సరైన ఎంపికగా నిలుస్తుంది గోటా వర్క్ డిజైన్స్. డ్రెస్, శారీ, లెహంగా.. ఏ డ్రెస్‌నైనా అందంగా మార్చే ఈ కళారూపం అతివలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆభరణాలలోనూ అందంగా ఇమిడిపోతుంది. రాజస్థాన్‌లో పుట్టి, దేశమంతా మెచ్చిన గోటా పట్టి లేదా గోటా వర్క్ మనదైన ఎంబ్రాయిడరీ శైలి. ఇది ఆప్లిక్ వర్క్ నైపుణ్యాలతో ఉంటుందని చెప్పవచ్చు. వెండి, జరీ రిబ్బన్ చిన్న చిన్న ముక్కలను వివిధ నమూనాలుగా రూపొందించి, ఫ్యాబ్రిక్‌పైన డిజైన్ చేస్తారు. గ్రాండ్ లుక్ కోసం ధరించే ఈ ఎంబ్రాయిడరీ దుస్తులు వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. గోటా అనేది లక్నో నుంచి వచ్చిన జరీ రిబ్బన్ లేదా లేస్ అని చెప్పవచ్చు. దీనిని ట్విల్ నేతలతో వివిధ రంగు రిబ్బన్లను ఉపయోగించి డిజైన్ చేస్తారు. వెండి, బంగారు, రాగి లోహాలతో డిజైన్ చేసిన గోటా కాలానుగుణంగా మార్పులు చెంది ప్లాస్టిక్‌తోనూ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఫ్యాబ్రిక్‌పై ఈ డిజైన్‌ను గుర్తించడం కూడా చాలా సులువు. అలాగే, డిజైన్ చేయడం కూడా సులువుగానే ఉంటుంది. డిజైన్ బట్టి, గోటాను వివిధ ఆకారాలలో కత్తిరించి, మడత పెట్టి, చేత్తో కుడతారు. ప్రకృతి ప్రేరణ పువ్వులు, లతలు, నెమళ్లు, చిలుకలతో పాటు ఏనుగుల వంటి జంతు బొమ్మలను ఈ వర్క్‌లో ఎక్కువ చూస్తుంటాం. గ్రాండ్‌గా ఉండే ఈ వర్క్ డ్రెస్సులను శుభకార్యాలలో ధరించడం కూడా మన దేశంలో సంప్రదాయంగా వస్తుంది. ఆభరణాల జిలుగులు గోటా వర్క్ లేదా లేస్లలో ఉండే డిజైన్స్ ఆభరణాల నిపుణులనూ ఆకర్షించింది. అందుకే వీటిని ఫ్యాషన్ జ్యువెలరీలో భాగంగా వివిధ రూపాలలో తీర్చిదిద్దుతున్నారు. క్యాజువల్ వేర్‌గానూ, మెహిందీ ఫంక్షన్ల వంటి వేడుకలలోనూ వీటిని ధరించిన అమ్మాయిలు కలర్ఫుల్గా వెలిగిపోతుంటారు. చదవండి: Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే! Wrap Drape Dress: ర్యాప్.. డ్రేప్.. టాప్ టు బాటమ్ ఒకే రంగుతో! -
Fashion: శ్రీలీల ధరించిన ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్! మరీ అంత ఖరీదు ఎందుకంటే!
నటన.. తను అలవోకగా అభినయించే కళ అని నిరూపించింది నటి శ్రీలీల! ఫ్యాషన్ విషయంలోనూ ఎలాంటి ట్రెండ్‌ను అయినా అంతే అవలీలగా తన స్టయిల్‌గా మార్చుకోగలదు అనీ అర్థమవుతోంది ఆమె అనుసరించే బ్రాండ్స్‌ను చూస్తుంటే.. గీతిక కానుమిల్లి.. హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కన్నది. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించింది. అనతికాలంలోనే ఆమె డిజైన్స్ పాపులరై, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేస్తుంటుంది. ధర కూడా డిజైన్‌ను బట్టే వేల నుంచి లక్షల్లో పలుకుతుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ ఈ డిజైన్స్ లభిస్తాయి. ద ట్రింక్ హాలిక్.. ఇదొక ఇన్స్టాగ్రామ్ షాపింగ్ సైట్. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్.. తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్ వాల్యూ. అందుకే, సామాన్యులూ.. సెలబ్రిటీలకూ ఇది ఫేవరెట్ బ్రాండ్. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: గీతిక కానుమిల్లి ధర: రూ. 68,000 జ్యూయెలరీ బ్రాండ్: ద ట్రింక్ హాలిక్ ధర:రూ. 850 మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం అనే ప్రక్రియ ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు.– శ్రీలీల - దీపిక కొండి చదవండి: Evening Sandals: ఈవెనింగ్ శాండల్స్.. నడకలో రాజసం.. పార్టీవేర్ ఫుట్‌వేర్! Ketika Sharma: కేతిక శర్మ ధరించిన చీర ధరెంతో తెలుసా? -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన చీర ధరెంతో తెలుసా?
‘రొమాంటిక్’ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ.. ‘రంగరంగ వైభవంగా’ అంటూ సందడి చేస్తోంది. స్క్రీన్ మీదే కాదు బయట కూడా ఫ్యాషన్ పట్ల ఆమెకు స్పృహ ఎక్కువే. అందుకే ఈ బ్రాండ్స్‌ను ఎంచుకుంటుంది! అపేక్ష ద లేబుల్... హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ఆపేక్ష.. 2018లో తన పేరు మీదే ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించి తన చిన్నప్పటి కలను నిజం చేసుకుంది. మొదట కాస్త ఇబ్బందిపడినా కొద్ది కాలంలోనే తన బ్రైడల్ కలెక్షన్స్‌తో పాపులర్ అయింది. ఇండోవెస్టర్న్ డిజైన్స్కూ ఆమె బ్రాండ్ పెట్టింది పేరు. ఎంతోమంది అమ్మాయిలు తమ పెళ్లి పీటలపై ఆకాంక్ష డిజైన్స్ ధరించాలని కోరుకుంటారు. సామాన్యులకు కూడా వీటి ధరలు అందుబాటులో ఉంటాయి. చీర బ్రాండ్: ఆపేక్ష ద లేబుల్ ధర: రూ. 14,000 హౌస్ ఆఫ్ క్యూ సీ... 2016లో ఒక వెబ్సైట్ ద్వారా ప్రారంభించిన వ్యాపారం, తమ అందమైన డిజై¯Œ ్సతో ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా నోటెడ్ అయింది. ఎలాంటి వారికైనా నప్పే, ఎలాంటి వారైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్ ఆఫ్ క్యూ సీ’ జ్యూయెలర్స్ ప్రత్యేకత.. హైదరాబాద్, బెంగళూరులలో ఈ మధ్యనే స్టోర్స్ ఓపెన్ చేశారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. జ్యూయెలరీ బ్రాండ్: హౌస్ ఆఫ్ క్యూ సీ జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మనసుకు నచ్చినట్లుండే అమ్మాయిని నేను. కచ్చితంగా ఇవే కావాలి, ఇలాగే ఉండాలి అని అనుకోను. నచ్చినవి నచ్చినట్లుగా ధరిస్తుంటాను.– కేతిక శర్మ -దీపిక కొండి చదవండి: Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు! -
అనన్యా పాండే వేసుకునే దుస్తుల ధర ఎంతో తెలుసా..?
స్టార్ కిడ్స్ అయినా స్పార్క్ లేకపోతే ఇండస్ట్రీలో ఫేడౌట్ అయిపోతారు. ఆ స్పార్క్ ఉంది కాబట్టే అనన్య తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. ఆ మార్క్ నటనలోనే కాదు ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్‌లోనూ కనబడుతోంది ఇలా... కెరీర్ మొదట్లో ఇతరులు మెచ్చే డ్రెసెస్ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నచ్చే..నప్పే డ్రెస్సులే వేసుకుంటున్నా. నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాటిని పట్టించుకోవడం మానేశా. నాకు నచ్చిన బట్టలు వేసుకున్నానా, ఫొటోలు బాగొస్తున్నాయా? హ్యాపీగా ఉన్నానా.. లేదా అని మాత్రమే చూసుకుంటున్నా.. అదే నాకు ముఖ్యం కూడా. – అనన్యా పాండే దేవనాగరి.. ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే (రూ. 85,500) ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఆమ్రపాలి జ్యూయెలరీ.. నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, వాటి నకలును రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, వాటి ఇమిటేషన్ పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు!
మనవైన సంప్రదాయ దుస్తులు ఎప్పుడూ అన్నింటా బెస్ట్‌గా ఉంటాయి. కానీ, వీటికే కొంత వెస్ట్రన్ టచ్ ఇవ్వడం అనేది ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంటుంది. వెస్ట్రన్ లుక్స్‌ని కూడా మన వైపు కదిలించేలా కేప్స్‌ను డిజైన్ చేస్తున్నారు. డిజైనర్లు ఇవి అటు పాశ్చాత్య దుస్తులకు, ఇటు సంప్రదాయ దుస్తులకూ బాగా నప్పుతాయి. ఏ డ్రెస్‌లోనైనా స్టైల్‌గా కనిపించవచ్చు. వేడుక ఏదైనా బెస్ట్‌గా వెలిగిపోవచ్చు. వెస్ట్రన్ స్టైల్ మరింత అదనం స్కర్ట్ మీదకే కాదు జీన్స్ మీదకూ కేప్ ధరించవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే జాకెట్‌కు మరో రూపం కేప్. సేమ్ కలర్ లేదా కాంట్రాస్ట్ కలర్ కేప్స్తో డ్రెస్సింగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ప్రింటెడ్ ప్రింట్ చేసిన కేప్ క్లాత్కి రంగు రంగుల టాజిల్స్ జత చేసి కొత్త కళ తీసుకువస్తే, వేడుకలో ఎక్కడున్నా స్పెషల్‌గా కనిపిస్తారు. మిర్రర్ మెరుపులు సంప్రదాయ దుస్తులకు అద్దాల మెరుపులు తెలిసిందే. కానీ, వెస్ట్రన్ స్టైల్ కేప్‌కు అద్దాలను జతచేస్తే పెళ్లి కూతురి కళ్లలోని మెరుపులా మరింత అందంగా కనిపిస్తుంది. ఎంబ్రాయిడరీ హంగులు నెటెడ్, క్రేప్, జార్జెట్ ఫ్యాబ్రిక్‌లతో డిజైన్ చేసే కేప్ కి జరీ జిలుగులు తోడైతే ఆ అందమే వేరు. అందుకే బ్లౌజ్ నుంచి ఎంబ్రాయిడరీ కేప్‌కు కూడా మారింది. చదవండి: Pranitha Subhash: ఈ హీరోయిన్ కట్టిన గ్రీన్ సిల్క్ చీర ధర రూ. 44 వేలు! ప్రత్యేకత ఏమిటి? -
Fashion: గ్రీన్ సిల్క్ సారీలో మెరిసిపోతున్న ప్రణీత! చీర ధర రూ. 44 వేలు!
ప్రణీత సుభాష్.. తన హావభావాలతో స్క్రీన్ మీద మంచి నటిగా.. పలు సేవా కార్యక్రమాలతో ఆఫ్ ది స్క్రీన్ మంచి వ్యక్తిగా ముద్ర వేసుకుంది. ఆమె తన మనసులో ముద్రించుకున్న విషయాలూ ఉన్నాయి. అందులో ఫ్యాషన్ ఒకటి. ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్ కొన్ని... అనావిల చీరలు అంటే అమితంగా ఇష్టపడే అనావిల మిశ్రా.. 2011లో ప్రారంభించిందే ఈ బ్రాండ్. సొగసును పెంచే సరికొత్త డిజైన్లకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. అందుకే విదేశాల్లోనూ అనావిలకు మంచిపేరు ఉంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అందుబాటులో ధరలు. ఆర్ని బై శ్రావణి ఎలాంటి వధువుకైనా నప్పే, నచ్చే ఆభరణాలను అందించడం ఆర్నిబై శ్రావణి జ్యూయెలర్స్ ప్రత్యేకత. విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన అద్భుతమైన డిజైన్లలో ఆకట్టుకుంటాయి ఈ బ్రాండ్ ఆభరణాలు. ఆర్డర్ ఇచ్చి మాత్రమే కొనుగోలు చేయొచ్చు. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర. చీర బ్రాండ్ : అనావిల ధర : రూ. 44,000 జ్యూయెలరీ బ్రాండ్ : ఆర్ని బై శ్రావణి ధర : ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ‘మాది డాక్టర్ల కుటుంబం. అమ్మా,నాన్నలకు బెంగళూరులో హాస్పిటల్ ఉంది. చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్డే అలవాటు. నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే అయ్యుంటుంది! –ప్రణీత సుభాష్ చదవండి: Actress Poorna: ‘పర్ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! -
Fashion: పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు..! ప్రత్యేకత ఏమిటంటే!
Fashion Collection- Actress Poorna Styling: చిన్న రోల్ ఇచ్చినా సరే తన నటనతో పరిపూర్ణం చేసే నటి పూర్ణ. ఆ పర్ఫెక్షన్ నటనలోనే కాదు అనుసరించే ఫ్యాషన్‌లోనూ ఉండాలనుకుంటుంది. అందుకే ఈ పర్ఫెక్ట్ బ్రాండ్లను ఇష్టపడుతుంది! పెటల్స్బై స్వాతి.. హైదరాబాద్‌కు చెందిన స్వాతి అవసరాల అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2019లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. తొలుత హాబీగానే మొదలుపెట్టినా తర్వాత జ్యూయెలరీ డిజైన్‌ను సీరియస్‌గానే తీసుకుంది. కుందన్ , జాదూ, జిర్కాన్ జ్యూయెలరీ, గోల్డ్ ఇమిటేషన్ జ్యూయెలరీని తయారు చేయడంలో స్వాతి సిద్ధహస్తురాలు. సంప్రదాయ లుక్‌ను ఇచ్చే నగలే కాకుండా ఇండో వెస్ట్రన్ పద్ధతిలోనూ అభరణాలను డిజైన్ చేస్తోంది. భార్గవి కూనమ్.. .. అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కలబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేస్తోంది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్లైన్ లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ చీర బ్రాండ్: భార్గవి కూనమ్ ధర: రూ. 54,000 జ్యూయెలరీ (కమ్మలు) బ్రాండ్: పెటల్స్ బై స్వాతి ధర: రూ. 2,400 నాకు సంప్రదాయ దుస్తులే ఇష్టం. చీరలు, చుడీదార్లలో సౌకర్యంగా ఫీలవుతాను. పండగలు, ఫంక్షన్స్‌కు వీటినే ప్రిఫర్ చేస్తా. మోడర్న్ దుస్తులు నాకు అంతగా నప్పవు. – పూర్ణ -దీపిక కొండి చదవండి: Handloom Every Day Challenge: చేనేతకు ‘ఐఏఎస్ బ్రాండ్’.. Temple Jewellery: ఆభరణ మోహనం.. రాధాకృష్ణుల రూపు, నెమలి పింఛం అందం! -
Fashion: జెట్ బ్లాక్ చీరలో మృణాల్! సారీ ధర ఎంతంటే..!
‘లవ్ సోనియా’తో బాలీవుడ్లో మెరిసిన తార మృణాల్ ఠాకూర్. తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. స్క్రీన్ మీద తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నట్టే ఫ్యాషన్‌లోనూ తనకంటూ ఓ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది మృణాల్. ఆ స్టయిల్ క్రియేషన్‌లో ఈ బ్రాండ్స్ కూడా భాగమే! పిచ్చిక నెమలి పింఛంలోని ఈకలను తలపించేంత మృదువైన ఫాబ్రిక్స్, ప్రకృతిని మరపించేన్ని రంగులు, డిజైన్లు పిచ్చిక లేబుల్ ప్రత్యేకతలు. ఆ డిజైన్స్ అన్నీ కూడా జైపూర్ హ్యాండ్ పెయింటింగ్స్, హ్యాండ్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీలే. తన కళాత్మక దృష్టితో ఈ లేబుల్‌కు వన్నెలు అద్దిన డిజైనర్ ఊర్వశి సేథీ. ఈ బ్రాండ్ దుస్తులు ఆన్లైన్లో లభ్యం. ధరలు ఓ మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఓలియో ఆష్నా సింగ్, స్నేహా సక్సేనా అనే ఇద్దరు స్నేహితులు కలసి ఏర్పాటుచేసిన బ్రాండ్ ‘ఓలియో’. ఈ జ్యూవెలరీ బ్రాండ్‌ను స్థాపించక ముందు ఆష్నా మీమ్స్ క్రియేటర్‌గా పాపులర్. స్నేహా.. నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిగ్రీ చేసింది. దుస్తులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ డిజైనింగ్‌లో దిట్ట. ఈ ఇద్దరూ కలసి సొంతంగా ఓ ఫ్యాషన్ బ్రాండ్‌ను స్టార్ట్ చేయాలనుకుని 2015లో ‘ఓలియో’కు రూపమిచ్చారు. స్నేహ.. డిజైనింగ్ చూసుకుంటే, ఆష్నా.. బ్రాండ్ వ్యవహార బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఓలియో జ్యూవెలరీ ఆన్లైన్లో లభ్యం. ధరలూ అందుబాటులోనే. బ్రాండ్ వాల్యూ జెట్ బ్లాక్ చీర బ్రాండ్: పిచ్చిక ధర: రూ. 21,500 ఇయర్ రింగ్స్ బ్రాండ్: ఓలియో ధర: రూ. 8,050 ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు నటిగా కొనసాగాలంటే ఫిట్నెస్ అవసరమని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు అక్కడ నన్నంతా ఇండియన్ కర్దాషియాన్ అని పిలిచారు. నాలాంటి శరీరాకృతి తెచ్చుకోవడానికి వాళ్లు లక్షల్లో డబ్బు ఖర్చు పెడతారట. ఆ మాట విన్నాక నా మీద నాకు ఎక్కడలేని కాన్ఫిడెన్స్ పెరిగింది – మృణాల్ ఠాకూర్. -దీపికా కొండి చదవండి: Fashion-Velvet Long Jacket: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్! Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
Fashion: సింపుల్ లుక్‌ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్!
వేడుకలో గ్రాండ్‌గా వెలిగిపోవాలన్నా సింపుల్ డ్రెస్‌ను రిచ్‌గా మార్చేయాలన్నా ఒకే ఒక టెక్నిక్... వెల్వెట్ లాంగ్ జాకెట్! ఎంబ్రాయిడరీ జిలుగులతో మెరిసే కళను సొంతం చేసుకున్న వెల్వెట్ జాకెట్ శారీ, సల్వార్, లెహంగాలకు కాంబినేషన్‌గా ఇట్టే అమరిపోతుంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రిసెప్షన్, బర్త్‌డే, గెట్ టు గెదర్ వేడుకలలో ఎప్పుడూ ఒకే తరహా సంప్రదాయ లుక్‌లో కనిపించాలన్నా బోర్ అనిపిస్తుంటుంది. రొటీన్‌కు బ్రేక్ వేయాలంటే ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ లాంగ్ జాకెట్ లేదా కోటును ఎంచుకుంటే చాలు. ముఖ్యంగా సాయంకాలాలు జరిగే పార్టీలో వెల్వెట్ మెరుపు మరింత అందాన్ని ఇస్తుంది. బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ వెల్వెట్ కోట్లు విలాసానికి అసలు సిసలు చిరునామాగా నిలుస్తాయి. విడిగా వెల్వెట్ క్లాత్ తీసుకొని, ఎవరికి వారు సొంతంగా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే, మార్కెట్లో రెడీమేడ్‌గా లభించే లాంగ్ వెల్వెట్ జాకెట్స్‌ను ఎంచుకోవచ్చు. రాజరికపు హంగులను తీసుకురావడానికి వెల్వెట్ జాకెట్ సరైన ఎంపిక అవుతుంది. సేమ్ లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్స్ కూడా ధరించవచ్చు. ఈ లాంగ్ జాకెట్స్ ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి కనుక ఆభరణాల విషయంలో అంతగా హంగామా అవసరం ఉండదు. చెవులకు వెడల్పాటి, లాంగ్ హ్యాంగింగ్స్ ఎంచుకుంటే చాలు. ఫ్యాషన్ జ్యువెల్రీ కన్నా స్టోన్ జ్యువెలరీ ఈ డ్రెసింగ్‌కి సరైన ఎంపిక. సంప్రదాయ కేశాలంకరణ కూడా ఈ తరహా డ్రెస్సింగ్‌కి అనువైనదిగా ఉండదు. ఇండోవెస్ట్రన్ స్టైల్లో శిరోజాల అలంకరణ బాగుంటుంది. చదవండి: Rini Mehta- Pitara: అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ.. Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్! -
అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ..
ఇంట్లో పెద్దపిల్లలు వాడిన ఆట వస్తువులు, పొట్టి అయిన, బిగుతైన బట్టలు, పై తరగతికి వెళ్లిన అక్క లేదా అన్నయ్య పుస్తకాలను తమ్ముడు, చెల్లెళ్లకు ఇవ్వడమనేది మన దేశంలో ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తోన్న పద్ధతి. చిన్నవాళ్లకు కూడా ఆ బట్టలు పొట్టి అయినప్పుడు ఇల్లు తుడిచే మాప్గానో, మసిబట్టగానో ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు ఈ పద్దతికి టెక్స్టైల్స్ పరిశ్రమలు మరికొన్ని కొత్త హంగులు జోడించి రీసైక్లింగ్ పేరిట ఆకర్షణీయమైన ఉత్పత్తులను ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రవేశపెడుతున్నాయి. రీసైక్లింగ్ చేసిన ఫ్యాషన్ ఉత్పత్తుల క్రేజ్‌ను గుర్తించిన రిని మెహత.. పాత చీరలతో అందమైన బ్యాగ్‌లను రూపొందించి పిటారా పేరుతో విక్రయిస్తోంది. సంప్రదాయ బ్యాగ్‌లతోపాటు, లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫ్యాషన్ ఉత్పత్తులు అందించడం పిటారా ప్రత్యేకత. పాత చీరలకు ప్లాస్టిక్ వ్యర్థాలను జోడించి లగ్జరీ ఉత్పత్తులు తయారు చేస్తోన్న పిటారా గురించి రిని మెహతా మాటల్లో... ‘మాది జైపూర్. చిన్నప్పటి నుంచి సృజనాత్మకంగా ఉండడం ఇష్టం. నా మనసులో వచ్చే అనేక క్రియేటివ్ ఆలోచనలు బ్లాక్‌బోర్డు మీద రాస్తుండేదాన్ని. అలా రాస్తూ కాస్త పెద్దయ్యాక సొంతంగా తయారు చేసిన కార్డులను ఎగ్జిబిషన్స్‌లో ప్రదర్శనకు ఉంచే దాన్ని. నా ఆలోచనలు, అభిరుచులను పట్టించుకోని అమ్మానాన్నలు నన్ను ఎమ్బీఏ చేయమని పట్టుబట్టారు. వారికోసం ఎమ్బీఏలో చేరాను కానీ, పూర్తిచేయలేదు. ఆ తరువాత క్రియేటివ్ రంగంలో పనిచేయాలన్న దృఢసంకల్పంతో.. టెక్స్టైల్ డిజైనర్‌గా పనిచేయడం ప్రారంభించాను. కొన్నాళ్లు డిజైనర్‌గా పనిచేశాక నేనే సొంతంగా సరికొత్తగా ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనకు ప్రతిరూపమే ‘పిటారా’. తమ్ముడు లా వదిలేశాడు.. కట్టుకోవడానికి పనికిరాని పాతచీరలతో బ్యాగ్‌లు తయారు చేసి విక్రయించవచ్చు అని తమ్ముడు రోహన్ మెహతాకు చెప్పాను. నా ఐడియా వాడికి బాగా నచ్చింది. దీంతో రోహన్ లా ప్రాక్టీస్‌ను వదిలేసి నాతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరం కలిసి పిటారాను ప్రారంభించాము. పిటారా అంటే ‘ట్రెజరీ బాక్స్’ అని అర్థం. ప్రారంభంలో ఇంట్లో మూలుగుతోన్న పాత చీరలతో బ్యాగ్‌లు తయారు చేసే వాళ్లం. క్రమంగా ఇంట్లో పాత చీరలన్నీ అయిపోయాయి. తరువాత మేము తయారు చేస్తోన్న ఉత్పత్తుల గురించి మా కాలనీలో వాళ్లకు, సోషల్ మీడియాలోనూ వివరించడంతో చాలామంది తమ ఇళ్లలో ఉన్న పాత చీరలను తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా చీరలు ఇచ్చిన వారికి కూపన్లు ఇచ్చే వాళ్లం. ఆ కూపన్లను మా స్టోర్‌లో ఏదైనా కొనుక్కున్నప్పుడు వాడుకునే విధంగా ఏర్పాటు చేశాం. అన్నీ హ్యాండ్మేడే.. మా పిటారా ఉత్పత్తులన్నీ చేతితో తయారు చేసినవే. వాటిలో రాజస్థానీ కళ, సంస్కృతీ సంప్రదాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. మా బ్యాగ్‌లలో బగ్రు, జర్దోసి ప్రింట్లు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రతిదీ యంత్రాలతో తయారు చేస్తున్నారు. మేము మన సంస్కృతిని వెనక్కి తీసుకు రావడంతోపాటు, కళాకారులకు ఉపాధి కల్పించాలనుకున్నాము. అందుకే మా బామ్మ వాలెట్‌ను ప్రేరణగా తీసుకుని అప్పట్లో వాడిన బ్లాక్, ఇక్కత్ ప్రింట్ వస్త్రంతో వివిధ రకాల టెక్నిక్లను వాడి డిజైన్లు రూపొందించి ఇప్పటి ట్రెండ్‌కు నప్పేవిధంగా ఉత్పత్తులు తయారు చేస్తున్నాము. రీసైక్లింగ్ చేసిన చీరలకు న్యూస్ పేపర్లు, మ్యాగజీన్లు, పాత టైర్లు, ఉన్ని, ఈకలు జోడించి రోజువారి వాడుకునే వస్తువులను రూపొందిస్తున్నాం’ అని వివరిస్తోంది రిని మెహతా. సృజనాత్మక ఆలోచనా విధానం ఉండాలే గానీ అద్భుతాలు సృష్టించే అవకాశాలు తన్నుకుంటూ వస్తాయనడానికి రిని మెహతా పిటారా ఉదాహరణగా నిలుస్తోంది. సవాలుగా అనిపించినప్పటికీ.. వ్యాపారం ఏదైనా ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభంలో మా వద్దకు వచ్చిన వ్యర్థాలను లగ్జరీ ఉత్పత్తులుగా తీర్చిదిద్దడం సవాలుగా అనిపించింది. తరువాత మొత్తం వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం వేరుచేయడం మొదలు పెట్టాం. లెదర్, జూట్, జరీలను విడివిడిగా తీసి వాటిని అవసరమున్న వాటి దగ్గర వాడేవాళ్లం. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బ్యాగ్‌లు తయారు చేయడంతో మా ఉత్పత్తులకు మంచి స్పందన లభించింది. ఈ స్పందనతో రంగురంగుల హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, టాట్స్, క్రాస్బాడీ బ్యాగ్స్, పాస్‌పోర్టు కవర్స్, సన్‌గ్లాస్ కేసెస్, టిష్యూ బాక్సెస్, హ్యాంగర్స్, ట్రావెల్ పౌచ్‌లు వంటివి అనేకం తయారు చేసి విక్రయిస్తున్నాం. మనం బతకడానికి పర్యావరణం ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి పర్యావరణాన్ని ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌తో కాలుష్యమయం చేసేకంటే వాటిని మరో విధంగా వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని నమ్ముతున్నాము. చదవండి: చుక్కల్లో చంద్రిక.. ఎన్నో రకాల బుక్స్ చదివాను.. కానీ, ఆ ఒక్కటీ.. -
Fashion Tips: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్!
Comfortable Wardrobe Ideas For Monsoon: అసలే ముసురు. అలాగని వెచ్చగా ఇంట్లో మునగదీసుకుని పడుకుందామంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. అలాకాకుండా ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్ ఏవి బాగుంటాయి... చూద్దాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి ముదురు రంగు దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగని భారీగా ఉండకూడదు. తేలికపా వి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం ఇవి బాగుంటాయి! ►కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. ►సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. ►స్కిన్ టైట్, లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి. ►అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. ►హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు! ►మరో విషయం ఏమిటంటే... వర్షాకాలం లో పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. ►బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. ►తెలుపు రంగు బట్టలకు మురికి పట్టిందంటే తొందరగా వదలదు. ►ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ►ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు. ►శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. ►శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ. ►వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్ వెంట వుండాలి. ►వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది. జీన్స్ అసలే వద్దు! ►ఈ కాలంలో జీన్స్ జోలికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ అసలు వద్దు. ►అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్ కంటే షూ వాడడం బెటర్. లేదంటే శాండిల్స్ అయినా ఫరవాలేదు. ►స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. ►అంతేకాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉంది. చదవండి: Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
Fashion: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
నజ్రియా నాజిమ్.. తెలుగు తెర ఆమె కోసం ఎన్నాళ్లుగానో వేచి చూసింది. ఆ ఎదురు చూపులకు చక్కటి ఫలితమే ‘అంటే సుందరానికి’. ఆ సినిమాలో ‘లీల’గా నజ్రియా నటనను మెచ్చుకుని టాలీవుడ్లోకి ఆమెను ఘనంగా స్వాగతించారు. మరి తన స్టయిల్ సిగ్నేచర్‌గా ఏ ఫ్యాషన్ బ్రాండ్స్‌ను ఆమె గ్రాండ్‌గా ధరిస్తుందో చూద్దాం... బ్రాండ్ వాల్యూ తొరానీ ఈ బ్రాండ్ స్థాపకుడు కరణ్ తొరానీ. స్ఫూర్తి అతని నానమ్మ. స్వస్థలం భోపాల్‌లో నానమ్మ చుట్టూ అల్లుకున్న అతని బాల్యమే చేనేత కళల పట్ల ఆసక్తిని రేకెత్తించింది. నానమ్మ ఎప్పుడూ కట్టుకునే చందేరీ కాటన్ చీరలు.. ఆ నేత.. అతన్ని డ్రెస్ డిజైన్ వైపు మళ్లించాయి. దేశంలోని నలుమూలలూ తిరిగి ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన చేనేత కళల గురించి అధ్యయనం చేశాడు. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత తన బ్రాండ్ ‘తొరానీ’కి రూపమిచ్చాడు. నజ్రియా చీర: బ్రాండ్: తొరానీ ధర: రూ. 64,000 ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో లభ్యం. నజ్రియా జ్యూయెలరీ: ముత్యాల కమ్మలు బ్రాండ్: అమ్రపాలి జ్యూయెలర్స్ ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది. కథ, అందులో నా పాత్ర నచ్చితే చాలు.. భాషతో సంబంధం లేకుండా సినిమా చేస్తా. అలా మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే తెలుగులో సినిమా చేయడానికి నేను రెడీ. – నజ్రియా నాజిమ్ -దీపిక కొండి చదవండి: Fashion Jewellery: చెవులకు పెయింటింగ్! ధర రూ.300 నుంచి.. -
ర్యాంప్ వాక్‌లో రష్మిక హోయలు (ఫొటోలు)
-
Fashion: శ్రద్ధ శ్రీనాథ్ ధరించిన ఈ డ్రెస్ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ?
పింక్ సల్వార్... ముత్యాల లోలాకులు.. గాజులతో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టే ఉంటారు. ‘మేమూ జెర్సీ సినిమా చూశాం లెండి’ అంటారా! అవునవును.. ఆ చిత్ర కథానాయికే ఈమె.. శ్రద్ధ శ్రీనాథ్. తెలుగుతోపాటు తన మాతృ భాష కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాల్లో తాను మెచ్చిన పాత్రలకే ఓకే చెప్తుంది. వాసికే ఆమె ప్రాధాన్యం. సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టించుకునేది కాదుట. సినిమాల్లోకి వచ్చాకే ఫ్యాషన్ మీద శ్రద్ధ పెరిగింది అని చెప్పే శ్రద్ధ శ్రీనాథ్ ఫాలో అయ్యే బ్రాండ్స్ ఏంటో చూద్దాం... రా మ్యాంగో చేనేతకు ప్రాధాన్యమిచ్చే బ్రాండ్ ఇది. ఫ్యాషన్ ప్రపంచంలో దీని ప్రయాణం 2008లో మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, వారణాసి మొదలైన ప్రాంతాల్లోని చేనేత కళతో అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రకాల వేడుకలకు సరిపోయే దుస్తులను డిజైన్చేయడం రా మ్యాంగో ప్రత్యేకత. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: రా మ్యాంగో ధర: రూ. 32,800 BCOS ఇట్స్ సిల్వర్ బి అంటే బ్రాస్.. సీఓ అంటే కాపర్.. ఎస్ అంటే సిల్వర్... మొత్తంగా బికాజ్ ఇట్స్ సిల్వర్ బ్రాండ్. 2010లో.. ఇంట్లో మొదలై ఈ రోజు బెంగళూరులోని అతి పెద్ద జ్యూయెలరీ షో రూమ్ స్థాయికి ఎదిగిందీ బ్రాండ్. ఫ్లారెన్స్ ఎస్తర్, ప్రిసిల్లా పాల్, సిండ్రెల్లా రెంజి.. ఈ ముగ్గురు దీని వ్యవస్థాపకులు. ఆధునిక మహిళల అవసరాలు.. ఆలోచనలు.. అభిరుచులకు నాణ్యత, కళను మేళవించి రూపుదిద్దుకునేవే ఆఇౖ ఇట్స్ సిల్వర్ డిజైన్స్. ఆన్లైన్లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. జ్యూయెలరీ బ్రాండ్: BCOS ఇట్స్ సిల్వర్ ధర: రూ. 14,430 అందం, ఆరోగ్యం రెండూ వేర్వేరు కాదు. ఆరోగ్యంగా ఉంటే మొహంలో కళ ఉట్టిపడుతుంది. అందుకే నా దృష్టిలో ఆరోగ్యమే అందం! – శ్రద్ధ శ్రీనాథ్ చదవండి: Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ! -
Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!
రాబోయేది పండగల సీజన్. సంప్రదాయ చీర కట్టులో భాగంగా వేడుకలో పట్టుకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. సౌత్ ఇండియన్ కాటన్స్తో సౌకర్యంగానూ, పండగ కళ పెంచేలా డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. మనవైన కాటన్స్ తలపునకు రాగానే ప్రముఖంగా మంగళగిరి, నారాయణ్ పేట్, పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, కలంకారీ.. వంటివి కళ్ల ముందు నిలుస్తాయి. అయితే, కాటన్ అనగానే చాలామంది ఈ సీజన్‌కి సరైనవి కావు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా మనవైన కాటన్స్ జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ ఉంటాయి. వాటిలో పండగల కాలంలో పట్టు కట్టకపోయినా ఏ మాత్రం వన్నె తగ్గని జరీ అంచు కాటన్ వినూత్నమైన కళను తీసుకువస్తాయి. వాటిలో చీరకట్టు మాత్రమే కాదు సౌకర్యంగా ఉండే కుర్తా సెట్, లాంగ్ అండ్ షార్ట్ గౌన్స్ కూడా ధరించవచ్చు. క్యాజువల్‌గానూ అదే విధంగా పార్టీవేర్‌గానూ ఎంపిక చేసుకోవచ్చు. అయితే, వీటిని రెడీమేడ్‌గా కాకుండా ఎవరికి తగినట్టుగా వారు డిజైన్ చేసుకోవచ్చు. సరైన డ్రెస్ అందుబాటులో లేదనుకుంటే మనదైన సంప్రదాయ జరీ అంచు కాటన్ దుపట్టా ధరించినా చాలు పండగ కళ వచ్చేస్తుంది. వీటికి సంప్రదాయ ఆభరణాలు లేదా టెర్రకోట, ఫ్యాబ్రిక్, సిల్వర్ జ్యువెల్రీ కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఆభరణాల ఊసు లేకపోయినా అందంగానూ ఉంటాయి. చదవండి: Bindu Madhavi: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే! -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్‌తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్ స్టయిల్‌తో ఫ్యాషన్ వరల్డ్‌లోనూ మెరిసిపోతోంది ఇలా.. నైనా జైన్ తరాల నాటి విభిన్న చేనేత కళలను ఒక్కచోట చేర్చి.. వాటికి ఆధునిక రూపమిచ్చే బ్రాండే నైనా జైన్. క్లాసిక్ లుక్స్‌నే కాదు.. ధరించడంలోని సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ అవుతుంది ఈ బ్రాండ్ వేర్. పెళ్లికూతురి దుస్తులకు ప్రసిద్ధి ఈ లేబుల్. గుజరాత్‌లోని కచ్ ప్రాంతపు బందినీ వర్క్ నైనా జైన్ యూఎస్పీ. ధరలు కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ ►డ్రెస్ : రెండ్ – యెల్లో లెహెంగా ►బ్రాండ్: నైనా జైన్ ►ధర: రూ. 45,500 ఇషారా నగల డిజైన్ల పట్ల ఆసక్తి, అభిరుచి ఉన్న కొంతమంది ఉత్సాహవంతులు కలసి 2014లో ఏర్పాటు చేసిన బ్రాండే ‘ఇషారా’. తరాల నాటి సంప్రదాయక నగలు, కుందన్, టెంపుల్ జ్యూయెలరీ ఇలా ఏ వెరైటీ డిజైన్లయినా.. ఆయా వేడుకలు.. సందర్భాలకనుగుణంగా.. కొనుగోలుదారులకు నప్పే.. నచ్చే విధంగా తయారు చేసివ్వడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. ధరలూ అందుబాటులోనే. నగలు ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ‘నన్ను చాలామంది సిల్క్ స్మితతో పోలుస్తుంటారు. నా కళ్లు ఆమె కళ్లలాగే ఉంటాయని.. నేనూ ఆమెలాగా కళ్లతోనే హావభావాలు పలికిస్తానని మెచ్చుకుంటుంటారు. అంతకన్నా గొప్ప ప్రశంసేం ఉంటుంది! ఆవిడ వండర్ ఫుల్ ఆర్టిస్ట్.. నా అభిమాన తార!’ – బిందు మాధవి బ్రాండ్ వాల్యూ ►జ్యూయెలరీ: పోల్కీ చోకర్, చాంద్‌బాలీలు ►బ్రాండ్: ఇషారా ►ధర: రూ. 3,000 --దీపిక కొండి -
Fashion: ‘హౌస్ ఆఫ్ మసాబా’ గ్రీన్ ఫ్లోరల్ సారీలో నిత్య.. చీర ధర ఎంతంటే!
ఈతరం సహజ నటి.. నిత్యా మీనన్. తెర మీద ఆమె కళ్లు.. నవ్వు.. నడక.. అన్నీ అభినయాన్ని ఒలకబోస్తాయి. ఏ భూమికను తీసుకుంటే ఆ భూమికే కనిపించేలా చేయడం ఆమె ప్రత్యేకత. అలాంటి స్పెషల్ స్టయిలే ఆమె అనుసరించే ఫ్యాషన్ విషయంలోనూ ఉందా? అంటే ఉంది మరి. సాక్ష్యం ఇదిగో.. మసాబా గుప్తా ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్‌లో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్‌ను ప్రారంభించింది. నాణ్యత, సృజనే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీస్‌ను ఆమె డిజైన్స్‌కు అభిమానులుగా మారుస్తోంది. మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్‌ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్‌కు పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియెటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్ -మసాబా గుప్తా ధర: రూ. 10,500 మంగత్రాయ్ జ్యూయెలరీ ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ మంగత్రాయ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ బ్రాంచ్‌లను నెలకొల్పింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. సామాన్యులకూ, సెలబ్రిటీలకూ అందుబాటులోనే ధరలు. జ్యూయెలరీ: పర్ల్ నెక్లెస్ ధర: రూ. 14,100 బ్రాండ్: మంగత్రాయ్ జ్యూయెలరీ బ్రేస్లెట్ ధర: రూ. 1,890 నిత్యం కొత్తగా ఉండాలనుకుంటాను. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. సినిమా కెరీర్ నాకు బెస్ట్ టీచర్ అనే చెప్పాలి. చాలా నేర్పింది.. నేర్పిస్తూనే ఉంది. – నిత్యా మీనన్ -దీపిక కొండి చదవండి: Femina Miss India 2022: ఫెమినా మిస్ ఇండియాగా సినీ శెట్టి.. -
Fashion: ట్రైబల్ హార్ట్.. ‘పోర్గై’ కళ.. ఎంబ్రాయిడరీతో మంచి ఆదాయం!
అడవి బిడ్డల మనసు ఎంత స్వచ్ఛమైనదో వారి కళారూపాలు మన కళ్లకు కడతాయి. వాటిలో గిరి తరుణుల చేత రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైంది.ఇంటి అలంకరణలో అద్దమై వెలుగుతోంది. ఆధునిక దుస్తుల మీద అందంగా అమరిపోతోంది. అంతరించిపోతున్న సంప్రదాయ లంబాడీ ఎంబ్రాయిడరీని పునరుద్ధరించి సమకాలీన శైలులకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు ‘పోర్గై’ కళాకారులు. మోడర్న్ డ్రెస్సులు, సంప్రదాయ చీరలు.. ఏవైనా ట్రైబల్ ఆర్ట్ ఫామ్ ఒక్కటైనా ఉండాలనుకుంటున్నారు నాగరీకులు. దీంట్లో భాగంగా ఇటీవల తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ‘పోర్గై’ కళ ఆకట్టుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీలో ఈ గిరిజనుల సంప్రదాయ ఎంబ్రాయిడరీ వినూత్నంగా మెరుస్తోంది. ∙∙ అంతరించిపోతున్న లంబాడీ ఎంబ్రాయిడరీని మహిళల బృందం పునరుద్ధరించింది. ‘మా కళ మాకు ఎంతో గర్వం’ అని చాటేలా దాదాపు 60 మంది లంబాడీ మహిళలు ఒక సంస్థగా ఏర్పడి దుస్తులు, గృహాలంకరణలో ప్రత్యేకతను చూపుతున్నారు. డిజైన్, నైపుణ్యం, కొత్తకళాకారులకు శిక్షణ, మార్కెటింగ్–ఆన్లైన్ సపోర్ట్, ఎగ్జిబిషన్లలో పాల్గొనడం వంటివి విస్తృతంగా జరుగుతున్నాయి. ∙∙ దాదాపు రెండు దశాబ్దాల క్రితం అక్కడి గ్రామంలోకి వచ్చిన వైద్యులు డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళ ద్వారా గిరి పుత్రికలకు ఉపాధి లభించాలని కోరుకున్నారు. ఆరోగ్యసంరక్షణతో పాటు కళను బతికించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా ‘పోర్గై’ అనే స్వచ్ఛంధ సంస్థను నెలకొల్పి కళాకారులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేశారు. గతంలో వ్యవసాయ కూలీలుగా ఉండే మహిళలు ఈ ఎంబ్రాయిడరీ కళ ద్వారా ఒక్కటై మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. విదేశాలకు కూడా ఈ కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు ఎగుమతి చేస్తున్నారు. ∙∙ బెంగళూరు, ఢిల్లీ, ముంబై నుండి ఫ్యాషన్ డిజైనింగ్ పాఠశాలల కొంతమంది విద్యార్థులు ‘పోర్గై’ కళను తెలుసుకోవడానికి, డిజైన్లను మెరుగు పరచడానికి గిరిజన మహిళలతో కలిసి పనిచేస్తున్నారు. చదవండి: మోదీకి యాదమ్మ మెనూ -
అబ్బాయి గెటప్‌లో పాపులర్.. తనకిష్టమైన స్టైలే ఆర్థికంగా నిలబెట్టింది!
పుట్టుకతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదుగుతారు చాలామంది. కొంతమంది మాత్రం జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశాలు ఏవీలేనప్పటికీ.. తమలోని ప్రతిభానైపుణ్యాలతో వారంతటవారే అవకాశాలను సృష్టించుకుని నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ కోవకు చెందిన అమ్మాయే రతన్ చౌహాన్. అమ్మాయిగా పుట్టినప్పటికీ, అబ్బాయిలా పెరిగింది. అబ్బాయి గెటప్‌లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇంటి బాధ్యతలను చేపట్టి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది రతన్. రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల రతన్ చౌహాన్ ఝుంఝనులోని మాండ్వా గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. రతన్ అమ్మకడుపులో ఉండగానే తల్లిదండ్రులు అమ్మాయి లేదా అబ్బాయి ఎవరు పుట్టినా పేరు ‘నవరతన్’ అని పెట్టాలనుకున్నారు. రతన్ పుట్టిన తరువాత కూడా అదే పేరు కొనసాగించారు. స్కూలుకెళ్లాక అమ్మాయికి ఈ పేరు నప్పదని చెప్పి టీచర్ రతన్‌గా మార్చింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండే రతన్‌కు అమ్మాయిలంతా ఎంతో ఇష్టపడే పొడవైన జడ ఉండేది. కానీ ఆమెకు మాత్రం అబ్బాయిల్లా చిన్న జుట్టునే ఇష్టపడేది. ఇంట్లో జుట్టు కత్తిరించుకుంటానని అడిగితే ఒప్పుకునేవారు కాదు. చివరికి ఇంటర్మీడియట్లో ధైర్యం చేసి జుట్టు కత్తిరించేసింది. అబ్బాయిల హెయిర్‌స్టైల్, చేతులు, మెడమీద టాటూలతో అబ్బాయిల్లా డ్రెస్‌లు వేసుకోవడం ప్రారంభించింది. నడకను, ఆహార్యాన్ని పూర్తిగా మగపిల్లాడిలా మార్చేసింది. నాన్నకు ఇష్టం లేకపోయినప్పటికీ.. అబ్బాయిలా హావభావాలు, ఆహార్యంతో స్టైల్‌గా ఉంటూనే జైపూర్‌లో బీకామ్ పూర్తిచేసింది రతన్. బ్యాంక్ ఉద్యోగం చేయాలని ఆమె తండ్రి కోరుకునేవారు. కానీ రతన్‌కు సింగింగ్, డ్యాన్సింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. స్కూలు, కాలేజీలలో ప్రతి కార్యక్రమంలో ఎంతో యాక్టివ్‌గా పాల్గొనేది. ఈ అలవాటుతోనే సింగింగ్, డ్యాన్సింగ్ వీడియోలను రూపొందించేది. నాన్నకు ఇష్టం లేదని తెలిసినా పట్టించుకోకుండా వీడియోలు తీసేది. టిక్‌టాక్ ఉన్న సమయంలో రతన్ తన వీడియోలను పోస్టు చేసేది. వ్యూవర్స్ నుంచి మంచి స్పందన వుండడంతో సొంతంగా పాటలు, మాటలు రాసుకుని వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెట్టేది. ఇలా పెడుతూ ఒకసారి పోస్టుచేసిన వీడియో షేర్లో ఆల్బమ్‌లోని మహ్రో రాజస్థాన్ పాటకు ఆరులక్షమందికి పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో రతన్ బాగా పాపులర్ అయ్యింది. టిక్‌టాక్ ఉన్నంత కాలంలో టిక్టాక్స్టార్గా ఓ వెలుగు వెలిగింది. టిక్‌టాక్‌ను ఇండియాలో నిషేధించాక, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో తన వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలమంది అభిమానులు, మంచి ఆదాయంతో రాణించేది. ఒకపక్క కరోనా.. మరోపక్క నాన్న అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ రతన్ జీవితాన్ని కుదుపునకు గురిచేసింది. అప్పటిదాకా వీడియోలు పోస్టుచేస్తూ అంతో యింతో ఆదాయం ఆర్జిస్తోన్న రతన్‌కి... లాక్‌డౌన్‌తో వీడియోలు రూపొందించడం కుదరక ఆదాయం కాస్తా అడుగంటిపోయింది. దీనికితోడు తండ్రి ఆరోగ్యం బాగా పాడవడంతో ఏడాదిపాటు ఆక్సిజన్ సిలిండర్ మీదే ఉండాల్సిన పరిస్థితి. దీంతో కుటుంబ పోషణకు ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. తండ్రికి మందులు, ఆక్సిజన్ సిలిండర్ ఎలా కొనాలో తెలియలేదు. అప్పుడే రతన్ మనసులో ‘కర్ని ఫ్యాషన్’ ఆలోచన వచ్చింది. రతన్ ఏ డ్రెస్ వేసుకున్నా ‘‘నీ డ్రెస్, డ్రెస్సింగ్ స్టైల్ బావుందని అంతా పొగిడేవారు. ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు’’ అని అడిగేవారు. ఆ విషయం గుర్తుకొచ్చి తను వాడే జైపూర్ ప్రింట్స్ షర్ట్స్‌ను విక్రయించాలనుకుంది. ఈ క్రమంలోనే కర్నిఫ్యాషన్ స్టార్టప్‌ను ప్రారంభించింది. జైపూర్‌లో ఓ షాపు పెట్టి తను వేసుకునే జైపూర్ ప్రింట్ షర్ట్స్‌ను విక్రయించి కుటుంబాన్ని పోషిస్తోంది. తనకిష్టమైన స్టైలే ఈ రోజు రతన్ జీవితంతోపాటు, కుటుంబాన్నీ ఆర్థికంగా నిలబెట్టింది. అందుకే ఎవరెన్ని చెప్పినా మనమీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అనుకున్న పనిని మనసుపెట్టి వందశాతం కష్టపడి చేస్తే విజయం సాధించవచ్చని రతన్ జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. చదవండి: Hoovu Fresh: విరులై.. కురిసిన సిరులు.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు! -
Fashion: లేబుల్ అర్తెన్ ప్రత్యేకత అదే.. ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర ఎంతంటే
పసుపు రంగు దుస్తుల్లో పచ్చగా మెరిసిపోతున్న ఈ నటిని గుర్తు పట్టారు కదా! ప్రేమమ్ ఫేమ్..మడోన్నా సెబాస్టియన్. గాయని కూడా. ఆమె మెచ్చే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే... లేబుల్ అర్తెన్ అర్తెన్.. అంటే సింపుల్‌గా సహజత్వం.. సహజసిద్ధమైన అని చెప్పుకోవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ బ్రాండ్ రంగుల్లో కానీ.. ఫ్యాబ్రిక్‌లో కానీ.. డిజైన్స్‌లో కానీ.. సహజత్వాన్నే అద్దుతుంది. సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే ఈ బ్రాండ్ వాల్యూ. ధరలు మోస్తరు రేంజ్లో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ : త్రీ పీస్ సెట్ బ్రాండ్: లేబుల్ అర్తెన్ ధర: రూ. 22,900 కుశాల్స్ జ్యూయెలరీ ఇది బెంగళూరుకు సంబంధించిన జ్యూయెలరీ బ్రాండ్. దీనికి దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో స్టోర్స్ ఉన్నాయి. సరసమైన ధరలు.. చక్కటి డిజైన్లలో సిల్వర్ జ్యూయెలరీ ఈ బ్రాండ్ వాల్యూ. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ బ్రాండ్: కుశాల్స్ జ్యూయెలరీ ధర:రూ. 1,980 నాకు ఎల్లో కలర్, హెవీ ప్రింట్స్ అంటే చాలా ఇష్టం. మాక్సీ స్కర్ట్స్, ఒంటికి హత్తుకునేట్టుండే బ్లౌజెస్ నా ఆల్ టైమ్ ఫెవరెట్ కాస్ట్యూమ్స్. – మడోన్నా సెబాస్టియన్ -దీపిక కొండి చదవండి: Surbhi Puranik: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? -
'ట్రెండ్స్' ఫెస్టివల్ సేల్,దుస్తులపై భారీ డిస్కౌంట్!
ఇండియా లార్జెస్ట్ ఫ్యాషన్ రీటైలర్ 'ట్రెండ్' ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్‌పై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ట్రెండ్ షాపింగ్ పెస్టివల్ పేరిట నిర్వహించనున్న ఈ సేల్‌లో 10వేల రకాలైన మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్లు ఉన్నాయని ట్రెండ్ ప్రతినిధులు చెప్పారు. అంతేకాదు ఈ సేల్‌లో దుస్తులపై 50శాతం డిస్కౌంట్ అందిస్తామని వెల్లడించారు. సేల్‌లో దుస్తుల ధరల్ని తగ్గించడమే కాదు గిఫ్ట్, రివార్డ్, పాయింట్స్ సైతం పొందవచ్చని..ప్రత్యేకంగా మెన్ అండ్ ఉమెన్ దుస్తులు, యాక్ససరీస్ కొనుగోలు దారులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ట్రెండ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఇలియానాను నిత్యనూతనంగా చూపించే బ్రాండ్స్ ఇవే..!
ఇలియానా... ఈ మధ్య సినిమాల్లో కన్నా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోంది.. అదే గ్లామర్‌తో ఇలా! ఆమెను అలా నిత్యనూతనంగా చూపించే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. గోపి వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి భిన్న ఆలోచనల ఫ్యూజనే ‘గోపి వేద్’ లేబుల్. ఆ ఇద్దరిలోని ఒకరే గోపి వేద్. ఇంకో ఫ్రెండ్ అర్నాజ్ సూనావాలా. ముంబై వాసులు. గోపి వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. అర్నాజ్ ఈఎన్టీ (డాక్టర్) గోల్డ్ మెడలిస్ట్. చదువు ఈ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ను దూరం చేసినా డ్రెస్ డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంటరెస్ట్ ఇద్దరినీ కలిపింది మళ్లీ. అలా కలిసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. నిజానికి గోపి వేద్ కుటుంబ నేపథ్యం కూడా వస్త్ర ప్రపంచమే. గోపి వాళ్లమ్మ డ్రెస్ డిజైనర్. వాళ్లింటి కింది అంతస్తులో వర్క్ షాప్ ఉండేది. అది చూసీ చూసీ గోపి వేద్‌లో డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి మొదలైంది. అందుకే చదువయ్యాక ఈ రంగంలోకి వచ్చింది. ఆమెకు అండగా నిలిచింది అర్నాజ్. గోపి వేద్ డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే.. అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, ధోరణుల మిశ్రమ ఫలితంగా ‘గోపి వేద్’ అనే కళాత్మాకమైన లేబుల్ ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. పూజా డైమండ్స్ 1989లో మొదలైంది ఈ బ్రాండ్ ప్రస్థానం. వ్యవస్థాపకులు.. ముఖేశ్ మెహతా, పప్పు భాయ్. అహ్మదాబాద్ వాసులు. తొలుత ఈ ఇద్దరూ డైమండ్ హోల్‌సేల్ వ్యాపారం చేసేవాళ్లు. నగల తయారీ పట్ల ఈ ఇద్దరికీ ఉన్న ఇష్టం, సృజనే వీళ్లు పూజా డైమండ్స్‌ను స్థాపించేలా చేసింది. అలా పూజా డైమండ్స్ ఫస్ట్ షోరూమ్‌ను 2001లో అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తమ బ్రాండ్‌కున్న డిమాండ్‌ను చూసి రెండో షోరూమ్‌ను 2016లో ముంబైలో స్టార్ట్ చేశారు. కొనుగోలుదారుల నమ్మకమే బ్రాండ్ వాల్యూగా వీళ్ల వ్యాపారం వృద్ధిచెందుతోంది. నా ఫిట్నెస్ రహస్యం వ్యాయామం. దిగులుగా ఉన్నా.. నిరుత్సాహంగా ఉన్నా వ్యాయామం మొదలుపెడతా. అంతే.. మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.. కొత్త శక్తి ఆవహిస్తుంది. – ఇలియానా జ్యూయెలరీ: డైమండ్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: పూజా డైమండ్స్ ధర: నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ షరారా సెట్ బ్రాండ్: గోపి వేద్ ధర: 28,500 -
Fashion Tips: ఈ హీరోయిన్ ధరించిన అంగ్రఖా కుర్తా ధర 32వేలు! ప్రత్యేకత?
కేథరీన్ త్రెస్సా.. అవును .. సరైనోడు కథానాయిక. సంఖ్యాపరంగా టాలీవుడ్లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. తెచ్చుకున్న పేరు.. సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. ఇటీవల ‘భళా తందనానా’ తో తెలుగు స్క్రీన్ మీద ఆమె మళ్లీ కనిపించింది. ఆమెను సెలబ్రిటీని చేసిన నటన సరే.. ఆమెను యూనిక్‌గా నిలిపిన ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.. దీప్ థీ.. బ్రాండ్ సృష్టికర్త.. దీప్తి పోతినేని. తనదైన డిజైన్స్‌తో సినిమా స్టార్స్ ఫ్యాషన్ సిగ్నేచర్‌ను మార్చేసింది దీప్తి. ఫ్యాషన్ ప్రేమికుల అభిరుచి, ఫ్యాషన్‌తో వాళ్లు చేయాలనుకున్న ప్రయోగాలను గమనించి.. వాళ్లు నచ్చే.. మెచ్చేలా తన దీప్ థీని తీసుకొచ్చింది. దాన్నే తన బ్రాండ్ వాల్యూగా స్థిరపర్చుకుంది. ఆ వాల్యూ వల్లే దీప్తీ నేడు సినిమా స్టార్స్‌కు ఫేవరెట్ డిజైనర్‌గా మారింది. ఆ క్రేజ్ ఆమెనూ ఓ సెలబ్రిటీగా మార్చింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ అంగ్రఖా కుర్తా బ్రాండ్: దీప్థీ ధర: రూ. 32,800 జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ అండ్ ఉంగరం బ్రాండ్: అమ్రపాలి ధర: డిజైన్, నాణ్యతను బట్టి ఉంటుంది. జీవితంలో జరిగే పరిణామాలను మంచి, చెడులుగా చూడను. అలాగే నా కెరీర్‌ను కూడా అలా విభజించలేను. వచ్చిన.. నచ్చిన అవకాశాన్ని స్వీకరిస్తా. నా వంతు కృషి చేస్తా.. సినిమా అయినా.. జీవితమైనా! – కేథరీన్ త్రెస్సా -దీపిక కొండి -
Fashion: పలాజో, స్కర్ట్స్, ఓవర్‌కోట్స్, లాంగ్గౌన్స్.. రితు ప్రత్యేకత అదే!
Fashion: వేసవిలో ఎక్కువగా వినిపించే పదం కాటన్. వేడిని తట్టుకొని, మేనికి హాయినిచ్చే సుగుణం ఉన్న ఫ్యాబ్రిక్. సింపుల్‌గా ఉండే కాటన్ని పార్టీవేర్‌గా మార్చుకోలేం. అనుకునేవారికి రితుబెరి కాటన్ కలెక్షన్ సరైన సమాధానం. లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందిన రితుబెరి ఇక్కత్, ఖాదీలతో చేసిన రంగుల హంగామా చూడాల్సిందే! సంప్రదాయ డిజైన్స్లోనే ఆధునికతను చూపడం ఈ డిజైనర్ ప్రత్యేకత. పలాజో, స్కర్ట్స్, ఓవర్‌కోట్స్, లాంగ్గౌన్స్కి రెండు మూడు రంగుల హంగులు అమర్చి చేసే మ్యాజిక్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. చేనేతలతో ఎన్ని హంగుల అమరికతో వినూత్నమైన డిజైన్స్ తీసుకురావచ్చో రితుబెరి కలెక్షన్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. క్రింకిల్డ్ ఖాదీ స్కర్ట్స్, ట్రౌజర్స్, ఎంబ్రాయిడీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్.. కాంబినేషన్స్ చూపులను ఇట్టే కట్టిపడేస్తాయి. ఇకత్ రూపాలు ఇన్నన్ని కావు అని కళ్లకు కడతాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. విదేశాలలోనూ మన దేశీయ డిజైన్స్ ప్రత్యేకతను చాటే ఈ డిజైనర్ ఢిల్లీ వాసి. భారతదేశంలోని ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లాభాపేక్షలేని ‘ది లగ్జరీ లీగ్’ని ప్రారంభించింది. -రితుబెరి, ఫ్యాషన్ డిజైనర్ చదవండి👉🏾Aparna Balamurali: ఈ హీరోయిన్ కట్టిన చీర ధర 95 వేలు.. స్పెషాలిటీ ఏమిటంటే! చదవండి👉🏾Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే! -
Fashion: ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర రూ. 79,500! స్పెషాలిటీ?
లైట్ పర్పుల్ కలర్ లెహెంగాలో .. అంతకన్నా లైట్ మేకప్‌తో .. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మెరిసిపోతున్న ఆ సెలబ్రిటీని గుర్తుపట్టారా? రుక్సర్ థిల్లాన్ అంటున్నారు కదా యూత్ అంతా ముక్త కంఠంతో. కరెక్ట్! గతేడాది ఆమె సోదరి పెళ్లి వేడుకలోని ఆ దృశ్యం. రుక్సర్ను పరిచయం చేయడానికి ఆమె నటించిన తెలుగు సినిమాల పేర్లు .. ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం! తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం! ఈ ఫంక్షన్లో ఆమె అటైర్గా మారిన బ్రాండ్స్ వివరాల మీదకూ చూపు మరల్చండి.. వివాణి ‘మనం వేసుకునే దుస్తులు మన అభిరుచినే కాదు మన ఐడెంటినీ వ్యక్తపరుస్తాయి’ అంటారు వాణి వాట్స్. అనడమే కాదు నమ్ముతారు కూడా. ఆ నమ్మకంలోంచి వచ్చిందే మహిళల డ్రెస్ డిజైన్ బ్రాండ్ వివాణి. 2015లో ప్రారంభించింది. ప్రాచీన భారతీయ ఎంబ్రాయిడరీ కళకు మోడర్న్ ఫ్యాషన్ జోడించి సరికొత్త డిజైన్స్‌ను రూపొందించడమే వివాణి వాల్యూ. కాబట్టే ఆ బ్రాండ్ ఇప్పుడు భారతీయ హస్తకళా రాజసానికి పర్యాయంగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్నప్పటి నుంచి ఆమెకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, హస్తకళలు, ఆర్కిటెక్చర్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తే కొద్దే పర్ల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. వివాణిని సృష్టించింది. ది చాంద్ స్టూడియో ఏమ్‌బీఏ చదివిన అన్న దేవేశ్, ఎమ్మే సైకాలజీ చేసిన చెల్లి రిమ్ఝిమ్ల కలల ప్రాజెక్టే ‘ది చాంది స్టూడియో’ జ్యూయెలరీ. 1990లో రత్నాలు, వెండి నగల ఎగుమతితో ప్రారంభమైంది ఆ అన్నాచెల్లెళ్ల ఈ ప్రయాణం. వెండి నగల పట్ల ఈ ఇద్దరికీ ఉన్న అభిరుచి.. ఆ నగలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఈ వ్యాపారంలో వాళ్లు గడించిన అనుభవం.. ఈ మూడు ‘ది చాంద్ స్టూడియో’ ఏర్పాటుకు ప్రేరణనిచ్చాయి. ఆకట్టుకునే డిజైన్స్, అందుబాటు ధరలు ఈ బ్రాండ్ యూఎస్పీ. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ : లెహెంగా బ్రాండ్: వివాణి ధర: రూ. 79,500 జ్యూయెలరీ: ఇయర్ రింగ్స్ ధర: రూ.2,800 మాంగ్ టీకా బ్రాండ్: ది చాంది స్టూడియో ధర: రూ.4,800 సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించాలనుంది. అంతేకాదు ప్రతిభావంతులైన ఎంతోమంది డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్లందరితోనూ పనిచేయాలనుంది. – రుక్సర్ థిల్లాన్ చదవండి👉🏾Varsha Mahendra: అక్కడ కేవలం బ్లవుజులే! ఒక్కో దాని ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు.. -
Fashion: ఒక్కో బ్లవుజు ధర రెండున్నర వేల నుంచి 20 వేల వరకు..!
ఏ ఇద్దరు మనుషులూ ఒక్కలా ఉండరు. ఏ ఇద్దరి అభిరుచులూ ఒక్కలా ఉండవు. మరి ధరించే దుస్తులు మాత్రం ఒకేలా ఎందుకుండాలి? దేనికది ప్రత్యేకంగా ఎందుకు ఉండకూడదు? ఇది ఓ సందేహం. చీరల కోసం వందలాది షోరూమ్‌లున్నాయి. బ్లవుజుకు ఒక్క షో రూమ్ కూడా ఉండదెందుకు? మరో సందేహం. అది లేదు... ఇది లేదు... అనుకోవడం కాదు, ఆ ఖాళీని నేనే ఎందుకు భర్తీ చేయకూడదు? ఇన్ని సందేహాలు, సమాధానాల మధ్య రూపుదిద్దుకున్న ఐడియా ‘డిజైనింగ్ ఐడియాస్, జస్ బ్లవుజ్’. హైదరాబాదీ డిజైనర్ వర్షామహేంద్ర ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఓ కొత్త ఆలోచన ఆ తర్వాత వందలాది మందికి ఉపాధి మార్గంగా మారింది. వర్షామహేంద్రది హైదరాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ నుంచి బి.ఎ ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ‘‘మా నాన్న వ్యాపారి. అమ్మ స్కూల్ టీచర్. నాకు డెస్క్ జాబ్ నచ్చేది కాదు. నాన్నలాగ బిజినెస్‌నే కెరీర్‌గా ఎంచుకోవాలని ఉండేది. అదే సమయంలో కెరీర్ సృజనాత్మకంగా, నాకంటూ ప్రత్యేకమైనదిగా ఉండాలనే కోరిక కూడా ఉండేది. దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబై, జేడీ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఏడాది డిప్లమో కోర్సు చేశాను. పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్లడం నా లక్ష్యాన్ని సులువు చేసింది. అక్కడ నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. నా పెళ్లి చీరలు, బ్లవుజ్‌ల అనుభవంతో కోర్సులో చేరినప్పటి నుంచి ప్రత్యేకమైన దృష్టితో ఫ్యాషన్ ప్రపంచాన్ని గమనించగలిగాను. ఆంధ్రప్రదేశ్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీహెచ్డీసీ) కోసం పని చేయడం నాకు మంచి అవకాశం. వర్షామహేంద్ర క్లోతింగ్‌లో అనేక ప్రయోగాలు చేశాం. కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ నా బలం. అలాగే సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన వడపోతలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరువందల మందిలో ముగ్గురిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఉండడంతో నాకు సొంతంగా నా బ్రాండ్‌ను విజయవంతం చేయగలననే నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంతోనే 2010లో హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత సొంత స్టార్టప్ ప్రారంభించాను. ఇండియన్ బిజినెస్ స్కూల్– గోల్డ్మాన్సాచె ఫెలో పదివేల మంది మహిళల్లో స్థానం లభించడం నాకు మంచి సోపానం అయింది. ఇంటర్న్‌షిప్ కోసం న్యూయార్క్‌కి వెళ్లే అవకాశం వచ్చింది. క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆహ్వానం అందింది. దాదాపుగా రెండు నెలలు అక్కడ క్రాఫ్ట్మెన్ను, విద్యార్థులను సమన్వయం చేస్తూ వాళ్లతో కలిసి పని చేసే అవకాశం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 2014లో యునైటెడ్ నేషన్స్ కార్యక్రమానికి హాజరయ్యాను. అది నా ఫస్ట్ ఫ్యాషన్ షో. న్యూయార్క్ ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొన్నాను. ఇన్ని వేదికల మీద విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ... కేవలం బ్లవుజ్‌ల కోసమే ఒక వేదికకు రూపకల్పన చేస్తూ నేను స్టార్టప్ ప్రారంభించడం తెలివైన నిర్ణయమే అని అనిపించింది. మార్కెట్ స్టడీ చేయలేదు మామూలుగా స్టార్టప్ ప్రారంభించే ముందు మార్కెట్ స్టడీ చేయాలి. కానీ నేను మార్కెట్లో ఉన్న గ్యాప్‌ని గుర్తించగలిగాను. అదే నా విజయ రహస్యం. నాతోపాటు ఇద్దరు ఉద్యోగులతో మొదలైన స్టార్టప్ ఇప్పుడు డెబ్బై మందితో పని చేస్తోంది. వెయ్యి నుంచి పన్నెండు వందల బ్లవుజ్‌లు ఒక చోట దేనికది ప్రత్యేకంగా ఉంటే ఇంకేం కావాలి. ఒక్కో బ్లవుజ్ ధర రెండున్నర వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది. ఒకప్పుడు చీర కొనుక్కుని బ్లవుజ్ కోసం మ్యాచింగ్ సెంటర్లకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు నచ్చిన డిజైనర్ బ్లవుజ్ కొని ఆ తర్వాత దానికి సరిపడే సింపుల్ చీరను సెలెక్ట్ చేస్తున్నారు. బ్లవుజ్ హైలైట్ కావడమే ఫ్యాషన్ ట్రెండ్‌గా చేయగలిగాను. ఇది ఫ్యాషన్ రంగానికి నా కంట్రిబ్యూషన్ అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రెండు దశాబ్దాలుగా నేను ఫ్యాషన్ రంగంలో ఉన్నాను. దేశవిదేశాల ఫ్యాషన్ వేదికలను చూశాను. మన భారతీయ వస్త్రధారణలోనే ప్రయోగాలు చేయడానికి అవకాశం ఎక్కువ. ఇక నా స్వీయ అనుభవంలోకి వస్తే... నా పెళ్లికి హెవీ చీర కొనేశాను. బ్లవుజ్ కుట్టించుకోవడానికి పెద్ద–చిన్న టైలర్ల చుట్టూ తిరిగాను. ఏ మాత్రం సంతృప్తిగా అనిపించలేదు. నా అసంతృప్తి నుంచి నేను డిజైన్ చేసుకున్న ఫ్యాషన్ ఇది. నేను సృష్టించుకున్న కెరీర్ ఇది. అప్పుడు నేను సృష్టించిన ట్రెండ్ వందలాది మందికి ఉపాధి మార్గం అయిందంటే ఎంతో సంతోషంగా కూడా ఉంది’’ అన్నారు వర్షామహేంద్ర. ఎల్లలు దాటిన మన నేత మన సంప్రదాయ నేతకు ఆదరణ తగ్గి నేతకారుల ఇంటి కొత్త తరం ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతున్న రోజుల్లో వర్ష వీవింగ్ ఫ్యూజన్‌కు తెర తీశారు. నేతకారుల జీవిక కోసం సహాయం చేస్తున్న యూకేలోని ఎన్జీవోతో కలిసి పోచంపల్లి నేతకారుల కోసం పని చేశారామె. అలాగే ఇప్పుడు పైథానీ, కంచిపట్టు, నారాయణపేట, చీరాల, లక్నో నేతకారులు, ఉదయ్‌పూర్–జైపూర్ బ్లాక్ ప్రింటింగ్ కళాకారులు, కోల్‌కతా రేషమ్ కళాకారులతో కలిసి ఒక చీరలో రెండు – మూడు రకాల సమ్మేళనానికి రూపమిస్తున్నారు. ‘‘ఒక చీరను విదేశీ వేదిక మీద ప్రదర్శించినప్పుడు దాని గురించి వివరించడానికి బోలెడంత సమాచారం ఉంటుంది. మన వస్త్ర విశేషం అదే’’ అన్నారామె. చీరకు చక్కటి కట్టు అందాన్ని తెస్తుంది, బ్లవుజ్‌కి చక్కటి కుట్టు అందాన్ని తెస్తుంది. ఈ రెండింటినీ మేళవించడంలో సక్సెస్ అయ్యారు వర్ష. – వాకా మంజులారెడ్డి చదవండి👉🏾Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
Fashion: ‘కేజీఎఫ్’ హీరోయిన్ ధరించిన ఈ లెహంగా ధర రూ. 61,900!
Fashion And Lifestyle: ‘కేజీఎఫ్’తో అఖిల భారత ప్రేక్షకులకు అభిమాన నటి అయింది శ్రీనిధి శెట్టి. ఫ్యాషన్ విషయంలో కూడా పేరున్న బ్రాండ్స్‌కు ఫేవరెట్. ఈ విషయం కేజీఎఫ్ 2 ప్రమోషన్స్‌లో ఆమె ఆహార్యాన్ని గమనించిన ఎవరైనా చెప్పగలరు. అలా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు శ్రీనిధిని మెరిపించిన బ్రాండ్స్ గురించి ఇక్కడ.. పౌలమి అండ్ హర్ష్ అతివల అందంతో పోటీపడే దుస్తుల డిజైన్ ఈ బ్రాండ్ సొంతం. ప్రకృతిలోని రకరకాల మొక్కలు.. రంగురంగుల పూలే ఈ బ్రాండ్ డిజైన్స్‌కు స్ఫూర్తి, ప్రేరణ. నేటి మహిళల సౌకర్యానికి 1950ల నాటి ఫ్యాషన్‌ను జోడించి డిజైన్ చేయడమే ఈ బ్రాండ్‌కున్న వాల్యూ. వీళ్లు రూపొందించే ప్రతి పీస్‌ను హ్యాండ్ పెయింట్ చేస్తారు. దాని మీద నాజూకైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి చిన్న డీటైల్ కూడా డిజైన్‌లో ప్రస్ఫుటిస్తుంది. ఈ ప్రత్యేకత ఈ బ్రాండ్ డిమాండ్‌ను మరింత పెంచుతోంది. ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. మోర్తంత్ర భవిష్యత్ జీవితపు కలలు సరే.. అందులోని ముఖ్యమైన ఘట్టాలు అంటే పెళ్లీపేరంటాలకు సంబంధించీ కలలుంటాయి. ఆయా సందర్భాల్లో ఏ చీర కట్టుకోవాలి.. దానికి తగినట్టుగా ఎలాంటి నగలు పెట్టుకోవాలి వగైరా వగైరా. అమ్మాయిల ఆ కలలను నిజం చేసే జ్యూయెలరీ బ్రాండే మోర్తంత్ర (అహ్మదాబాద్). రత్నాల జిలుగులే ఈ బ్రాండ్ ఐడెంటిటీ. పెళ్లి కూతురి కోసం డిజైన్ చేసే నగలే మోర్తంత్ర బ్రాండ్ వాల్యూ. ఈ ఆభరణాలతో ఆ ఆనంద ఘట్టాలను సెలబ్రేట్ చేస్తుంది.. మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలుగా పదిలపరస్తుందీ బ్రాండ్. డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ : లెహెంగా బ్రాండ్: పౌలమి అండ్ హర్ష్ ధర:రూ. 61,900 జ్యూయెలరీ బ్రాండ్: మోర్తంత్ర ఇయర్ రింగ్స్ ధర: రూ. 5,500 ఉంగరం ధర: రూ. 3,500 ‘మనసు పెడితే రోజూ కొత్తగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండొచ్చు! సినిమా నా డ్రీమ్. కాకపోతే అది ఇంత త్వరగా .. ఇంత ఈజీగా నెరవేరుతుందని అనుకోలేదు’– శ్రీనిధి శెట్టి. ∙దీపిక కొండి చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత.. -
Fashion: అప్పుడప్పుడైనా ప్రయోగాలు చేయాలి: కళ్యాణి
కళ్యాణీ ప్రియదర్శన్.. లిజీ, ప్రియదర్శన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించినా నిలబడింది మాత్రం తన కళతోనే. అభినయ కౌశలం, గ్లామర్ మెరుపు.. దేన్నయినా పోషిస్తున్న పాత్రకనుగుణంగా తెర మీద సాక్షాత్కరింప చేస్తుంది. సినిమా స్క్రీన్కు అతీతంగా ఆమెను అందంగా చూపిస్తున్న.. అంతే క్యాజువల్‌గా, సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ఫాబియానా తూర్పు (ఇండియా), పశ్చిమ (యూరప్)ల ఫ్యాషన్ కలయిక ఈ బ్రాండ్. పెళ్లిళ్లు, పండగలు వంటి వేడుకలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. దీని సృష్టికర్త, డిజైనర్ కరిష్మా. నిజానికి ఈ బ్రాండ్ ఆవిష్కరణకు ఆద్యురాలు కరిష్మా వాళ్లమ్మ కుసుమ్. యురోపియన్ ఫ్యాబ్రిక్స్, రాజస్థాన్ సంప్రదాయపు అద్దకం బాంధనీ ప్రింట్, లక్నో సంప్రదాయపు ఎంబ్రాయిడరీ చికన్కారీల సమ్మేళనమే ఈ బ్రాండ్ ప్రత్యేకత... ఈ బ్రాండ్‌కు వాల్యూ కూడా. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చదివిన కరిష్మా ఈ మధ్యే పురుషుల కోసమూ డిజైనర్ వేర్‌ను మొదలుపెట్టింది. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ అయిన ఈ బ్రాండ్.. నచ్చిన ఫ్యాబ్రిక్ మీద, నచ్చిన తీరులో డిజైన్ చేయించుకునే సౌలభ్యాన్నీ కల్పిస్తుంది. ధరలూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అయితే తన బ్రాండ్‌ను సామాన్యులకూ అందుబాటులో ఉంచేందుకు ఆర్గంజా, హ్యాండ్ ప్రింట్స్‌తో డిజైన్ చేసిన దుస్తులను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది కరిష్మా. రాధికా అగ్రవాల్ స్టూడియో ఆధునిక మహిళకు భారతీయ కళల భూషణం ఈ బ్రాండ్. చిత్రలేఖనం, సంగీతం, ఇక్కడి ప్రజలు, ప్రాంతాలు .. అన్నిటినీ చూసి, విని, పర్యటించి స్ఫూర్తి పొంది .. సృష్టించిన బ్రాండే ఇది. సృష్టికర్త రాధికా అగ్రవాల్. దేశంలోని విభిన్నత, వైవిధ్యాలను ఓ కళగా ఆస్వాదిస్తూ.. ఆభరణాలుగా తీర్చిదిద్దుతూ భారతీయ మహిళల జ్యూయెలరీ బాక్స్‌కు రిచ్‌నెస్‌ను ఇస్తోంది. ఇదే ఈ బ్రాండ్‌కు యాడెడ్ వాల్యూ. కొనుగోలుదారుల అభిరుచి, సృజనకూ విలువనిస్తూ వాళ్లు కోరుకున్నవిధంగా నగలను తయారుచేసి ఇస్తోంది. ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలి అప్పుడప్పుడైనా ఫ్యాషన్‌తో ప్రయోగాలు చేయాలి. లేకపోతే ఒత్తయిన జుట్టూ, మేకప్ కిట్టూ ఉండి ఏం లాభం? – కళ్యాణీ ప్రియదర్శిని జ్యూయెలరీ ఇయర్ రింగ్స్ బ్రాండ్: రాధిక అగ్రవాల్ స్టూడియో ధర: రూ. 7,725 చీర పోల్కా డాట్ బ్లష్ పింక్ శారీ బ్రాండ్: ఫాబియానా ధర: రూ. 45,000 -∙దీపిక కొండి చదవండి: గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్ -
ఈ హీరోయిన్ ధరించిన ఐవరీ ఫ్లోరల్ సారీ ధర ఎంతంటే!
Dimple Hayathi In Bhargavi Kunam Ivory Floral Saree: సినిమా చాన్స్ ఇమ్మని తొక్కిన ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్ గడపలో ‘ఒంటి రంగు చూసుకున్నావా?’ అన్నట్టు వ్యక్తీకరించిన తిరస్కారపు చూపులను ఎదుర్కొంది డింపుల్ హయాతి. బాధపడింది. కానీ కుంగిపోలేదు. నిరుత్సాహపడింది కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ విశ్వాసమే ఇప్పుడు ఆమె తెర మీద కనిపిస్తే చప్పట్లు కొట్టేలా చేస్తోంది. అవకాశాల వెల్లువను ఆమె ఇంటి ముందుకు మళ్లించింది. ఆ ఆత్మవిశ్వాసం అంత స్ట్రాంగ్‌గా ఉండడానికి ఒక కారణం డింపుల్లోని ప్రతిభ అయితే ఇంకో కారణం.. ఆమెను మెరిపించే ఫ్యాషన్ బ్రాండ్స్. అవేంటో చూద్దాం.. భార్గవి కూనమ్ భార్గవి కూనమ్ అంటేనే సంప్రదాయ చేనేత.. చక్కటి రంగుల కళబోత. పరికిణీ – ఓణీ, బ్రైడల్ కలెక్షన్స్, దుపట్టాలకు ఈ బ్రాండ్ పెట్టింది పేరు. డిజైన్, కలర్, నేతే కాదు మృదువైన ఫ్యాబ్రిక్ కూడా ఈ బ్రాండ్‌కు వాల్యూను యాడ్ చేసింది. అదే ప్రత్యేకతగా నిలిపింది. అందుకే ఆ ధరలను అందుకోగలిగిన వారి దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ భార్గవి కూనమ్ ఫెవరేట్ డిజైనర్. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్‌లో మాస్టర్స్ చేసినా ప్రకృతిలోని రంగులు ఆమెను పడుగు – పేకల వైపు నడిపించాయి. ఆ ప్యాషన్ ఆమెను అందరు మెచ్చే.. అందరికీ నచ్చే డిజైనర్‌గా నిలిపింది. డిజైన్, ఫాబ్రిక్ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. చీర : ఐవరీ ఫ్లోరల్ (భార్గవి కూనమ్) ధర: రూ. 34,800 థియా జ్యూయెలరీ థియా అంటే వెలుగు, మెరుపులకు ప్రతిరూపమైన గ్రీకు దేవత. ఈ బ్రాండ్‌ను స్థాపించింది అమెరికాలో స్థిరపడిన దక్షిణ కొరియా వనిత ఇరేన్. దాదాపు 20 ఏళ్లు కార్పోరెట్ ఉద్యోగం చేసి.. విసిగి వేసారి ఆ ఉద్యోగాన్ని వదిలి తనకు నచ్చిన స్పా, సెలూన్, బొటిక్ ప్రపంచంలోకి వచ్చింది. అప్పుడే జ్యూయెలరీ మీద ఆమె దృష్టి పడింది. ముందు తన కోసం తాను నగలను డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టింది. అవి తన బోటిక్స్‌కు వచ్చే ఆడవాళ్లను ఆకర్షించడం గమనించి జ్యూయెలరీ డిజైన్లోనూ మెలకువలను నేర్చుకుంది. తక్కువ కాలంలో ఆమె సృజన బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో 2012లో ‘థియా జ్యూయెలరీ’ని స్థాపించింది. తూర్పు, పశ్చిమ దేశాల సంస్కృతీసంప్రదాయాలు, అభిరుచుల కలయికే ఈ బ్రాండ్ ప్రత్యేకత. నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధరలు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. జ్యూయెలరీ: పర్ల్స్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: థియా జ్యూయెలరీ మైండ్‌లో భయాన్ని పెట్టుకొని కాదు మది నిండా కలలు నింపుకొని సాగాలి. నీమీద నీకున్న నమ్మకమే నీ లక్ష్యాన్ని చేరుస్తుంది.– డింపుల్ హయాతి ∙దీపిక కొండి -
Fashion: మనల్ని ప్రపంచానికి అందంగా చూపించేది అదే: అవికా గోర్
‘బాలికా వధు’ అనగానే గుర్తొచ్చే పేరు అవికా గోర్. ఆ టీవీ సీరియల్ ఆమెను అంత పాపులర్ చేసింది. స్క్రిప్ట్ మీదే తప్ప ఫ్యాషన్ గురించి అంతగా పట్టదు ఆమెకు. తెర మీద తన పాత్రను చూసుకోవడమే కానీ అద్దంలో తన ప్రతిబింబం చూసుకోవాలనే మోజు లేదు. అలాంటి అవికాను ఫ్యాషనబుల్‌గా చూపించాలనే సవాలును తీసుకున్న బ్రాండ్ ఇదే.. హౌస్ ఆఫ్ పింక్ ఆధునిక మహిళ అభిరుచి, అవసరాలను గమనించి వాటికనుగుణమైన డిజైనర్ వేర్‌ను రూపొందించేందుకు ఏర్పడిన బ్రాండే ‘హౌస్ ఆఫ్ పింక్’. స్టయిల్ అండ్ సౌకర్యమే ప్రత్యేకతగా దశాబ్దానికి పైగా కొనసాగుతోందీ ఫ్యాషన్ హౌస్. కేవలం కాటన్, చందేరీ ఫాబ్రిక్నే ఉపయోగిస్తుందీ బ్రాండ్. సంప్రదాయ కుట్టు కళే దీని ప్రధాన డిజైన్. అందుకే దేశం నలుమూలలో ఉన్న హస్తకళా కళాకారుల నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటోంది హౌస్ ఆఫ్ పింక్. డ్రెస్ గోల్డ్ జరీ బూటా, చేతులకు జర్దోసీ వర్క్‌తో డిజైన్ చేసిన ఈ గ్రీన్ కలర్ చందేరీ లాంగ్ కుర్తాకు జతగా ప్లెయిన్ పలాజో ప్యాంట్, సిల్క్ దుపట్టా కూడా రావడంతో సింప్లీ గ్రాండ్ లుక్‌తో అవికాను మెరిపిస్తోంది. డ్రెస్ బ్రాండ్: హౌస్ ఆఫ్ పింక్ ధర: రూ. 18,500 అదే మన అందాన్ని పెంచుతుంది! ‘ఎలా కనిపిస్తున్నాను అనేదాని మీద నేనెప్పుడూ శ్రద్ధ పెట్టలేదు. ఆ మాటకొస్తే అందంగా కనిపించడమనేదాన్ని ఇష్టపడను. శ్రద్ధాసక్తులతో మనం చేసిన పనే మన సౌందర్యాన్ని పెంచుతుంది. అదే మనల్ని బయటి ప్రపంచానికి అందంగా చూపిస్తుందని నమ్ముతాను. నిజానికి నేను ప్రేక్షకుల నుంచి అందుకున్నది కూడా అదే. వాళ్లెప్పుడూ నా నటననే ప్రశంసించారు కానీ నా గ్లామర్ లుక్స్‌ను కాదు. సో.. నా పనే నా ఫ్యాషన్.. గ్లామర్.. ఫ్యాషన్.. అన్నీ!’ – అవికా గోర్ -దీపిక కొండి చదవండి: Fashion- Mouni Roy: ‘డెమె బై గాబ్రియేలా’.. మౌనీ రాయ్ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా? -
Fashion: ఇక ఆలోచించనక్కర్లేదు.. కాస్త కాంట్రాస్ట్ కలర్‌తో కొత్తగా ఇలా!
మగవారి దుస్తులకే పాకెట్స్ ఉంటాయనేది నాటి మాట. మగువల డ్రెస్సులకూ ఉంటాయి. అయితే, అవి సాదా సీదాగా ఉండవు.. ఎంబ్రాయిడరీ సొగసులు అద్ది ఉంటాయి. ప్యాచ్‌వర్క్‌తో మెరుగులు దిద్ది ఉంటాయి. పెయింటింగ్‌తో ముస్తాబు చేసి ఉంటాయి. అద్దకం మెరుపులతో అందంగా ఉంటాయి. పువ్వులు, జంతువుల బొమ్మలతోనూ కొంగొత్తగా ఉంటాయి. ప్లెయిన్ కుర్తాకు లేదా టాప్కు పాకెట్ కావాలనుకుంటే ఇక ఆలోచించనక్కర్లేదు. కాస్త కాంట్రాస్ట్ కలర్‌తో కొత్తగా ఇలా మెరిపించవచ్చు. ఫోన్, మనీ, కార్డ్స్లాంటి విలువైన వస్తువులను బ్యాగ్ లేదా క్లచ్ అవసరం లేకుండానే వెంట తీసుకెళ్లడానికి పాకెట్ సరైన ఎంపిక అవుతుంది. అందుకు, టాప్‌కి కాంట్రాస్ట్ పాకెట్‌ను విడిగా డిజైన్ చేసుకొని, జత చేయచ్చు. పాకెట్ డిజైన్ ఎలా ఉండాలనేది మీ ఎంపికే అవుతుంది. పార్టీలో హైలైట్‌గా నిలిచే పాకెట్ డ్రెస్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎలాంటి భారం లేకుండా అందరిలోనూ హుందాగా నిలుపుతుంది. చదవండి: Fashion Blouse Trend: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! -
Kareena Kapoor: ఏంటీ ఆ పీలికల డ్రెస్ ధర 70 వేలా? ఎందుకిలా?
లక్ష్మీ లెహర్.. బాలీవుడ్ సెలబ్రిటీలకు అత్యంత ఇష్టమైన స్టైలిస్ట్. టాప్ హీరోలు, హీరోయిన్లు ఆమె కస్టమర్ల జాబితాలో ఉంటారు. కరీనా కపూర్, సారా అలీ ఖాన్, అలియా భట్, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, కియారా అద్వానీ, అనన్య పాండే సహా హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ వంటి స్టార్లు లక్ష్మీతో స్టైలింగ్ చేయించుకున్న వాళ్లే!. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ కరీనా కపూర్ న్యూ లుక్ కోసం రంగంలోకి దిగిందామె! ఎల్లో కలర్ కో- ఆర్డ్(పై నుంచి కింది దాకా ఒకే రకమైన ఫ్యాబ్రిక్, కలర్‌తో ఉండే కో ఆర్డినేట్ డ్రెస్) సెట్లో మెరిసేలా చేసింది!. ఫ్లోరల్ ప్రింట్‌తో ఉండే ఈ బీచ్ వేర్‌కు చిక్ బెల్ట్ జత చేసింది. సింపుల్ ఇయర్ రింగ్స్, చైన్‌తో సరిపెట్టేసింది. అన్నట్లు కరీనా ధరించిన ఈ బస్టియర్ టాప్ ధర 30, 599 రూపాయలు కాగా.. నడుము పై భాగం వరకు ఉన్న షార్ట్స్ ధర రూ. 39,599. ఈ డ్రెస్ ధరించిన బెబో ఫొటోను లక్ష్మి తన ఇన్‌స్టా అకౌంట్లో సమ్మర్ రెడీ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసింది. అయితే, నెటిజన్లు ఈ ఫొటోపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది డ్రెస్ బాగుందంటూ పొగడగా.. మరికొందరు మాత్రం.. 70 వేలు పోసి ఈ పీలికల డ్రెస్ కొనాలా? అయినా కరీనా అంటే ఈ మాత్రం ఉంటుందిలే! ఏదేమైనా ఆమె టేస్టుకు సరిగ్గా సరిపోయిందంటూ సెటైరికల్ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) View this post on Instagram A post shared by Lakshmi Lehr (@lakshmilehr) -
ప్లానెట్ 3 ఆర్: పాలిథిన్ ఫ్యాషన్
మనం పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిసరాలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నైజిరియాకు చెందిన అడెజోక్ లసిసి జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. చిన్నప్పటినుంచి లసిసికి చుట్టూ ఉన్న పరిసరాలను ఆసక్తిగా, నిశితంగా పరిశీలించే అలవాటు. తరచూ ప్లాస్టిక్, గుడ్డ ముక్కల వ్యర్థాలను రోడ్లపక్కన పడేయడం, దాని ఫలితంగా డ్రైనేజీలు పూడిపోయి నీళ్లుపోవడానికి వీలు లేక ఎక్కడికక్కడ మురుగు నీరంతా నిలిచిపోవడం... అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకునేది. క్రమేణా వయసుతోపాటు ఆలోచనలు కూడా పెరిగి పెద్దయ్యాయి. దాని ఫలితమే డిగ్రీ పూర్తయ్యాక ఏకంగా రీసైక్లింగ్ కంపెనీ పెట్టి ప్లాస్టిక్‌తో ఫ్యాషనబుల్ ఉత్పత్తుల డిజైనింగ్! ప్లాస్టిక్ వ్యర్థాలను చూస్తూ పెరిగిన లసిసికి ఎలాగైనా దానికి పరిష్కారం కనుగొనాలన్న కుతూహలం పెరిగింది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క ఆలోచిస్తుండేది. డిగ్రీ పూర్తయిన తరువాత ఇంటికి వచ్చింది. అప్పటికీ ఇంటి పరిసరాల్లో ఎటువంటి మార్పులూ కనిపించలేదు. కాలుష్య సమస్య మరింత ఎక్కువైంది. ఇలా అనుకుంటుండగానే వాటర్ ప్యాకెట్ల వ్యర్థాలు టన్నులకొద్ది పేరుకు పోవడం గమనించింది. వీటితో ఏం చేయాలి అనుకున్న సమయంలో లసిసి తల్లి దగ్గర నేత పని నైపుణ్యాలు నేర్చుకుని వాటర్ ప్యాకెట్లతో వస్త్రాన్ని రూపొందించింది. దీంతో ఏదైనా తయారు చేయవచ్చన్న ఆలోచన వచ్చింది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ నైజీరియాలో వాటర్ ప్యాకెట్స్ తయారీలో నైలాన్ ను వాడుతారు. ఈ ప్లాస్టిక్‌ను రీ సైకిల్ చేయడం కంటే కొత్తగా తయారు చేయడానికి ఖర్చు తక్కువ. అందువల్ల పారిశ్రామిక వర్గాలు కొత్త వాటర్ ప్యాకెట్స్‌ను తయారు చేస్తాయి. అవి టన్నుల కొద్దీ చెత్తలో పేరుకు పోతుంటాయి. వీటిని రీసైకిల్ చేయడమే లక్ష్యంగా ‘ప్లానెట్ 3ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) కంపెనీని ప్రారంభించింది లసిసి. ప్లానెట్ 3 ఆర్ వాడిపడేసిన వాటర్ ప్యాకెట్లను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తుంది. దీనికోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డస్ట్‌బిన్ లను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కల వారంతా దానిలో ప్లాస్టిక్‌ను పడేయడం వల్ల సేకరణ సులభం అయింది. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను శుభ్రం చేసి ఎండబెట్టి, తరవాత దారాలుగా కత్తిరించి మగ్గం మీద వస్త్రంగా నేస్తుంది. దీని తయారీలో తొంబై శాతం ప్లాస్టిక్, పదిశాతం గుడ్డముక్కలను వినియోగిస్తుంది. ఇలా తయారైన బట్టతో చెప్పులు, బూట్లు, స్కూలు బ్యాగ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంటి అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డ్రెస్‌లుగా తీర్చిదిద్దుతుంది. అంతేగాక మహిళలు, పిల్లలకు ప్లాస్టిక్ రీసైక్లింగ్‌పై అవగాహన కూడా కల్పిస్తుంది. కొన్ని వందలమంది వికలాంగ యువతీ యువకులకు రీసైక్లింగ్‌పై శిక్షణ ఇచ్చింది. నైజీరియా, ఆఫ్రికా దేశాల్లో ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహిస్తోంది. లసిసి చేస్తోన్న పర్యావరణ కృషికి గాను ఆమెను అనేక అవార్డులు కూడా వరించాయి. రోజుకి అరవై మిలియన్ల వాటర్ ప్యాకెట్లు! ‘‘నైజిరియాలో రోజుకి యాభై నుంచి అరవై మిలియన్ల నీటిప్యాకెట్లు అవసరమవుతాయి. అరలీటరు వాటర్ ప్యాకెట్లను వీధుల్లోని షాపులు, సూపర్ మార్కెట్లలో విక్రయిస్తారు. ఇప్పటికీ కూడా 39 శాతం మందికి సరైన మంచి నీటి సదుపాయం లేదు. అందువల్ల వాటర్ ప్యాకెట్లపై ఎక్కువమంది ఆధారపడుతున్నారు. వాటర్ ప్యాకెట్లు దాహం తీరుస్తున్నప్పటికీ వాడి పడేసిన తరువాత అవి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నాయి. ఏడాదికి లక్షా ముప్పైవేల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ ఒక్క వాటర్ విభాగం నుంచి వస్తోంది. దీన్ని తన చిన్నతనం నుంచి నిశితంగా గమనించిన లసిసి కాలుష్యానికి పరిష్కారం వెతుకుతూ ప్లానెట్ 3 ఆర్ ను నెలకొల్పింది. -
Bappi Lahiri: ఆ కళ్లద్దాలు 1.5 లక్షలు, గోల్డ్ టీ సెట్, ముల్లెట్ హెయిర్ స్టైల్.. ఇంకా
ఆడి పాడి ఆనందించడానికే ఈ జీవితం అన్నట్టుగా పాటను పంచిన బప్పీ లహిరి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నారు. లక్షలాది మంది అభిమానులను శోక సంద్రంలో ముంచారు. కేవలం తన పాటలతోనే కాదు.. ఆహార్యంతోనూ అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచిన బప్పీ ఇక సెలవు అంటూ దివికేగారు. ఫ్యాన్సీ కాలర్.. బప్పీ ఎక్కువగా కోట్లు ధరించడానికి ఇష్టపడేవారు. టీ–షర్ట్ పైన జాకెట్ ధరించేవారు. అలాగే తాను ధరించే కోట్ లేదా జాకెట్స్‌ని ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించుకునేవారు. ఫ్యాన్సీ కాలర్స్, ఆర్నమెంట్స్‌తో జాకెట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉండేవి. ముల్లెట్ హెయిర్ స్టయిల్ 1970లలో బాగా పాపులర్ అయిన హెయిర్ స్టైలే ముల్లెట్. కొంత పొడవుగా, పొట్టిగా ఉన్న వెంట్రుకల కలయికే ఈ హెయిర్ స్టైల్ ప్రత్యేకత. ఈ హెయిర్ స్టైల్‌నే బప్పీ చనిపోయేవరకు ఫాలో అయ్యారు. అదృష్ట అద్దాలు పగలేగాక, రాత్రి సమయాల్లో జరిగే ఈవెంట్లకు సైతం కళ్లద్దాలను తప్పనిసరిగా పెట్టుకునేవారు బప్పీ. 51 రకాల సన్ గ్లాసెస్ తన దగ్గర ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. రూ.1.5 లక్షల ఖరీదైన లూయిస్ వ్యూటన్ గ్లేర్ కళ్లద్దాలు కూడా బప్సీ కలెక్షన్స్‌లో ఉండడం విశేషం. ఇక 51 సన్ గ్లాసెస్‌లో నాలుగైదు అద్దాలు తనకు అదృష్టం తెచ్చిపెట్టాయని ఓ సందర్భంలో బప్పీ తపేర్కొన్నారు. అలాగే మెడలో ఉన్న గొలుసుల్లో ఒక గొలుసులో వినాయకుడి లాకెట్ కనబడుతుంది. ఎన్ని గొలుసులు మార్చినా బప్పీ ఇది మార్చేవారు కాదు. బయటికొచ్చేటప్పుడు ఆభరణాలు, సన్ గ్లాస్లు, ఆడంబరమైన దుస్తులు ధరించే బప్పీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా సింపుల్. మామూలు దుస్తులు ధరించడం ఆయన అలవాటు. అలాగే ఒంటి మీద ఆభరణాలు కూడా ఉంచుకునేవారు కాదు. గోల్డ్ టీ సెట్ బంగారు ఆభరణాలను ఇష్టంగా కొనుక్కున్న బప్పీ ఆ మధ్య ధన్తేరాస్కి వెరైటీ గోల్డ్ టీ–సెట్ కొన్నారు. ధన్తేరాస్కి ఏం కొందామని భార్య అడిగితే, ఒక మంచి గోల్డ్ టీ సెట్ కొని తెమ్మని అన్నారట. భర్త ఊహకు దగ్గరగా ఉన్న గోల్డ్ టీ సెట్ కొని, ఆయనకు బహుమతిగా ఇచ్చారు చిత్రాణి. ఫిష్ లవర్ బెంగాలీ ఫుడ్ అంటే బప్పీకి చాలా ఇష్టం. ముఖ్యంగా చేపలను ఇష్టంగా తినేవారు. వారానికి ఒక్కరోజు మాత్రమే శాకాహారం తీసుకునేవారు. మాంసాన్ని బాగా ఇష్టపడే బప్పీ అనారోగ్య కారణాలతో రెడ్ మీట్ మానేసారు. సాయంత్రం సమయంలో చికెన్ శాండ్విచ్ తినడానికి ఇష్టపడేవారు. సముద్ర చేపలకంటే నదిలో పెరిగే చేపలను బాగా ఇష్టపడేవారు. ఆవనూనెతో వండిన చేపల కూరను ఎక్కువగా తీసుకునేవారు. -కె చదవండి: Bappi Lahiri: మరణానికి రెండు రోజుల ముందు కూడా 'బంగారు' బప్పి.. పోస్ట్ వైరల్ -
Viranica Manchu: ఆరాధ్య బచ్చన్ వేసుకున్న డ్రెస్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా?!
Viranica Manchu Maison AVA Creative Revolution In Kids Fashion: ఎంటర్‌ప్రెన్యూర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరానిక మంచు. యెడుగూరి సందింటి వారి ఆడపడుచు.. మంచు వారి కోడలు అయిన ఆమెకు ఫ్యాషన్ రంగంలో మంచి ఫాలోయింగ్ ఉంది. భిన్న రకాల డిజైన్లతో ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. విరానికను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేడుక ఏదైనా సరే... భర్త విష్ణుతో పాటు పిల్లలు అరియానా, వివియానా, అవ్రమ్ భక్త, ఐరాతో కలిసి అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌లో తళుక్కుమనాల్సిందే. పిల్లల కోసం పిల్లల పేరు మీదుగా.. విరానిక మంచు గతేడాది ఆగష్టులో మైసన్ అవా పేరు మీదుగా క్లాతింగ్ లేబుల్‌ను ప్రారంభించారు. తన కూతుళ్లు అరియానా, వివియానా, ఐరా పేర్లు కలిసి వచ్చేలా అవా(AVA) బ్రాండ్‌తో పిల్లలకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయిస్తున్నారు. చేనేతతో రూపుదిద్దుకుంటున్న ఈ వస్త్రాలు.. సెలబ్రిటీల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా విరానికా క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్న అవా బ్రాండ్ సినీ ప్రముఖుల మనసు దోచుకుంటోంది. ఇప్పటికే అనేక మంది ప్రశంసలు అందుకున్న ఈ క్లాతింగ్ లేబుల్.. ఇటీవల ఆరాధ్య ధరించిన డ్రెస్‌తో మరోసారి చర్చనీయాంశమైంది. అవును.. మేము చెబుతుంది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముద్దుల మనుమరాలు, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్- హీరో అభిషేక్ బచ్చన్ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించే! ఆరాధ్య ఇటీవలే పదో వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భగా ఐశ్ దంపతులు మైసన్ అవా బ్రాండ్ తయారు చేసిన ‘ఫ్లోరెంటీనా’ డ్రెస్‌ను ఆరాధ్య కోసం ఎంపిక చేశారు. పుట్టినరోజు వేడుకలో ఈ స్టార్ కిడ్ అద్భుతమైన గౌన్‌లో మెరిసిపోయింది. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్ ఆర్గంజా పూలు, బీడ్స్ మేళవింపుతో ఈ డ్రెస్‌ను డిజైన్ చేశారు. అమెరికన్ మీడియా పర్సనాలిటీ పారిస్ హిల్టన్ సైతం తన వివాహనంతరం నిర్వహించిన నియాన్ కార్నివాల్లో మైసన్ అవా బ్రాండ్ రూపొందించిన వీల్(తలపై ధరించే వస్త్రం) ధరించడం విశేషం. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకకు హిల్టన్ అవా నుంచి వీల్‌ను ఆర్డర్ చేయడం గమనార్హం. నా భర్త, పిల్లల నుంచి స్ఫూర్తి పొంది ఈ విషయాల గురించి విరానిక మంచు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ...‘‘నా నలుగురు పిల్లలను దృష్టిలో పెట్టుకుని అందరిలోనూ చిన్నారులు మరింత ప్రత్యేకంగా కనబడాలనే తపనతో దుస్తులను డిజైన్ చేశాను. ఒక్కో డ్రెస్ తయారు చేయడానికి వందల గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. ప్రతీ డ్రెస్ దేనికదే ప్రత్యేకం’’ అని బ్రాండ్ నెలకొల్పాన్న ఆలోచన రావడానికి గల కారణాలు వెల్లడించారు. అదే విధంగా... తన భర్త, సినీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్త మంచు విష్ణు నుంచి స్ఫూర్తి పొందానన్న విరానిక.. సరికొత్త డిజైన్లు రూపొందిస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. కాగా విరానిక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి(కజిన్) అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ మార్కెటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. చదవండి: Thangka Print: మగువల మనసు దోచుకుంటున్న ‘తంగ్కా’ డిజైన్ -
Pocket Dress: ఆమె ధరించే దుస్తులకు.. ప్రయోగాల పాకెట్!
‘మీరు బయటకు వెళ్లే సమయం లో వెంట ఓ ఫోన్, కొంత డబ్బు, కార్డుల్లాంటివి తీసుకెళ్లడం తప్పనిసరి. మీ డ్రెస్‌కి జేబులు ఉంటే చేతులను ఫ్రీగా వదిలేసి, సౌకర్యంగా ప్రయాణించే వీలుంటుంద’నే లక్ష్యంతో దుస్తులను రూపొందించి, దానినే వ్యాపారంగా మార్చుకుంది కేరళవాసి జయలక్ష్మి. ‘మహిళల దుస్తులను నేటి కాలానికి తగిన విధంగా రూపొందించాలి. ఆమె ధరించే దుస్తులకు పాకెట్స్ ఉండటం వల్ల ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని గుర్తించాలి’ అంటారు త్రిసూరులో ఉంటున్న జయలక్ష్మీ రంజిత్. పాకెట్స్.13 పేరుతో ప్రస్తుత స్థితిని మార్చడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తున్నానంటోంది. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! లాక్డౌన్ టైమ్‌లో రూపకల్పన పాకెట్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినిదే అయినా 20 వ శతాబ్దం వరకు మహిళ లు ఉపయోగించే దుస్తులకు జేబులు ఉండటం అరుదైన విషయమే. ‘అవి కూడా చాలా సన్నగా ఉన్న మహిళలు ధరించే ప్యాంట్స్‌కు అంతే నాజూకుగా, శృంగారపు మూలాలకు సూచికగా ఉండేవి’ అంటారు జయలక్ష్మి. అగ్రికల్చర్ ఇంజినీర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అయిన జయలక్ష్మి కరోనా సమయంలో పరిస్థితుల కారణంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఖాళీగా ఉన్న ఆ సమయం తన ఆలోచన రూపుకట్టడానికి బాగా ఉపయోగపడిందనే జయలక్ష్మి, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ పాకెట్ డ్రెస్ వ్యాపారాన్ని మొదలుపెట్టింది. చిన్నప్పుడే అనుకున్నాను మహిళల కోసం రూపొందించిన జీన్స్, ప్యాంట్లను జయలక్ష్మి తరచి తరచి చూస్తుంటుంది. ‘ఎందుకంటే, నేను పురుషులకు రూపొందించిన నా సైజు జీన్స్ కొన్నాను. వాటిని ధరించి, నా ఫోన్ వెనుక జేబులో ఉంచినప్పుడు, అది జారి కిందపడిపోయింది. పైగా నాకు అలా వెనుక వైపు పాకెట్‌ను ఉపయోగించే అలవాటు లేదు. చిన్న చిన్న పాకెట్స్ కేవలం కొన్ని నాణేలు ఉంచడానికి సరిపోతాయి. అందుకే, పురుషులందరికీ ఒకే విధంగా ఉండేలాంటి ఫంక్షనల్ పాకెట్స్ మహిళల దుస్తుల్లో ఉండకూడదనుకున్నాను’ అని తన పాకెట్ రూపకల్పన గురించి వివరిస్తుంది. ‘నాకు ఆరేడేళ్ల్ల వయసున్నప్పుడు డ్రెస్‌కు పాకెట్స్ పెట్టించమని మా అమ్మను అడిగేదాన్ని. దానికి మా అమ్మ పెద్ద శిక్షగా భావించేది. నేనే టైలర్ ఆంటీతో పరిచయం పెంచుకొని, నచ్చిన పాకెట్స్‌తో డ్రెస్ కుట్టించుకునేదాన్ని’ అని తన చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. జేబును బట్టి డ్రెస్ చదువు, ఉద్యోగం కోసం నగరానికి వెళ్లినప్పుడు కూడా ‘పాకెట్స్’అనే విషయం జయలక్ష్మి నుంచి దూరం కాలేదు. తన డ్రెస్సులను తనే సొంతంగా డిజైన్ చేసుకునేది. స్నేహితులు, సహోద్యోగులు ఆమె పాకెట్ దుస్తులను చూసి, తమకు కూడా డిజైన్ చేసిమ్మని అడిగేవారు. ‘అప్పుడు సమయం కుదరలేదు. మహమ్మారి మొదట్లో తగినంత సమయం ఉండేది. దీంతో కొన్ని డిజైన్లు పాకెట్ ఆధారంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించాను. చిన్న, మధ్యస్థ, లార్జ్ డ్రెస్సుల్లోనూ వాటికి తగిన విధంగా పాకెట్స్ రూపొందించాను. కొన్ని డిజైన్లు అందంగా ఉన్నాయని, కొన్ని డిజైన్లు అంతగా నప్పలేదని నా స్నేహితులే చెప్పారు. చాలా బాధపడ్డాను కూడా. దీంతో కొంతమంది టైలర్లను కలిసి, వారితో నా డిజైన్ల గురించి చర్చించాను. కొన్ని డిజైన్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ఆర్డర్ చేసుకున్నవారు మీ శరీర కొలతలను పంపిస్తే, దానిని బట్టి రెండు వారాల్లో పాకెట్ డ్రెస్ డిజైన్ చేసి, పంపిస్తాను’ అని చెప్పాను. అలా ఒక రోజులో రూ.70 వేలు సంపాదించాను’ అంటారు జయలక్ష్మి. మార్కెట్లో పాకెట్ డ్రెస్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాకెట్స్.13ను వివిధ వాణిజ్య బ్రాండ్లకు దీటుగా రంగంలోకి దింపుతోంది జయలక్ష్మి. చదవండి: అవును..!! డబ్బులు చెట్లకు కూడా కాస్తాయి.. మా పెరట్లో.. -
Trending Style: పెయింటింగ్ లెహంగా.. కొంచెం వెస్ట్రన్ స్టైల్లో..!
ఏ వేడుక అయినా అమ్మాయిలకు వెంటనే గుర్తుకు వచ్చేది లెహంగా! పూర్తి సంప్రదాయంగా కాకుండా... కొంచెం వెస్ట్రన్ స్టైల్ కూడా మిక్స్ అవాలని కోరుకుంటారు. అందుకు సరైన ఎంపిక ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌తో ముస్తాబు చేసిన ముచ్చటైన లెహంగా!! దినచర్యలో భాగంగా ఉదయాన్నే పూలను సేకరించే చేతులు, అందంగా అలంకరించుకుంటున్న అతివలు, ఆనంద నృత్యకేళీ, అంబారీ యాత్ర... బొమ్మలా కనిపించే అమ్మాయిల లెహంగా పైన రూపుదిద్దుకున్న అందమైన ఈ బొమ్మలు మరింత ఆకర్షణీయంగా చూపులను కొల్లగొడుతున్నాయి. సంప్రదాయ వేడుకలకు, వెస్ట్రన్ గెట్ టు గెదర్‌లకు మరిన్ని వన్నెలను అద్దుతున్నాయి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లో వచ్చిన కొత్త నైపుణ్యాలు, మరిన్ని డిజైన్లు లెహంగాలను మరింత వైభవంగా అలంకరిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ–పెయింటింగ్ కాంబినేషన్లోనూ వచ్చే డిజైన్లు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. చదవండి: మందారం- ఉసిరి: ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు! -
నిషా అగర్వాల్ న్యూ స్టైలిష్ లుక్.. వీటి ధర తెలుసా..
‘ ఏమైంది ఈ వేళ ’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి నిషా అగర్వాల్. ఆమెకు నప్పే ఆహార్యాన్ని అందించి ఆమె అందాన్ని మరింత ఇనుమడింప చేసిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే.. జయంతి రెడ్డి.. హైదరాబాద్‌కు చెందిన జయంతి.. బిజినెస్ కోర్సు చేసింది, కానీ ఆమె ప్యాషన్ మొత్తం ఫ్యాషన్‌పైనే. ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, 2011లో తన పేరు మీదే ఓ ప్యాషన్ హౌస్ ప్రారంభించింది. చేతితో చేసే అల్లికలకే ప్రాధాన్యం. అందుకే, లేట్‌గా వచ్చినా లేటేస్ట్‌గా ఉంటాయి ఆమె డిజైన్స్. శుభకార్యాల కోసం, ముందుగానే డిజైన్స్ బుక్ చేసుకోవాలి. 2015 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ‘హల్దీ కుంకుమ్’ కలెక్షన్స్‌తో సెలబ్రిటీ డిజైనర్‌గా ఎదిగింది. చాలామంది సెలబ్రిటీస్‌కు తన డిజైన్స్ అందించింది. డిజైనర్ పీస్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లో ఈ బ్రాండ్ డిజైన్స్ లభిస్తాయి. డ్రెస్ డిజైనర్: జయంతి రెడ్డి ధర:రూ. 2,89,900 డ్యూయెట్ లగ్జరీ.. లెదర్–వుడ్ స్పెషలిస్ట్ ఈ బ్రాండ్. నాణ్యమైన టేకు కలపకు ప్యూర్ లెదర్ జోడించి వివిధ అలంకరణ సామాగ్రిని తయారు చేస్తారు. వీటిల్లో బ్యాగులు, బెల్టులు చాలా ఫేమస్. ఇక లెదర్ ఐటమ్స్‌పై అందించే యూనిక్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, ఈ బ్రాండ్ వాల్యూను అమాంతం పెంచేశాయి. మెటల్ ఐటమ్స్ డిజైన్స్‌లోనూ దీనికి మంచి పేరుంది. ఆ ఫేమ్‌కు తగ్గట్టు వీటి ఖరీదూ ఎక్కువే. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. ఫుట్‌వేర్ బ్రాండ్: డ్యూయెట్ లగ్జరీ ధర: రూ. 13,000 జైపూర్ జ్యూయెల్స్.. ఏడుతరాల చరిత్ర కలిగిన జైపూర్ జ్యూయెల్స్.. సుమారు 150 సంవత్సరాల కిందటిది. అప్పట్లో ఇది రాజకుటుంబీకులకు బంగారు ఆభరణాలను అందించేది. అయితే, అధికారికంగా మిలాప్‌చంద్ నహతా 1966లో ‘జైపూర్ జ్యూయెల్స్’ పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అతని కుమారుడు సుభాష్ నహతా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. రాయల్ జ్యూయెలరీ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. అందుకే, ఎక్కువగా సెలబ్రిటీస్ పెళ్లిళ్లలో ఈ జైపూర్ జ్యూయెల్స్ మెరుస్తాయి. కేవలం డిజైన్ అధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. జైపూర్, ముంబై, ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో వీరి బ్రాంచీలు ఉన్నాయి. అన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. చిన్నప్పుడు మొత్తం అక్కే నన్ను రెడీ చేసేది. జ్యూయెలరీ బ్రాండ్: జైపూర్ జ్యూయెల్స్ ధర: డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. - దీపిక కొండి చదవండి: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే.. -
Dancing Dolls: ఈ అందమైన ‘బుట్టబొమ్మ’లు మీ దగ్గర ఉన్నాయా?!
అలంకరణలో ఆభరణాలు అందులోనూ ప్రత్యేకమైన వాటినే అతివలు ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే నాట్య బొమ్మలు ఆభరణాలుగా మగువల మెడలోనూ, చెవులకు ఇంపుగా మెరిసిపోతున్నాయి. బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. అంటూ చూపరులను పాడుకునేలా చేస్తున్నాయి. కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నృత్య రూపాలే కాదు వెస్టర్న్ స్టైల్లో బాలే డ్యాన్స్ భంగిమలు ఆభరణాల్లో కనువిందు చేస్తుంటే చూపు తిప్పుకోలేం. రత్నాలు పొదిగిన బంగారు బుట్టలు, లాకెట్లు.. వెండితో మురిసిన నాట్యమయూరాలు చెవులకు లోలాకులు అయితే ఎంత అందంగా ఉంటాయో కళ్లారా చూడాల్సిందే. పచ్చలు, కెంపులు, వజ్రాలు, కుందన్స్ తో మెరిపించిన ఈ ఆభరణాల జిలుగులు ఎంత చూసినా తనివి తీరవు. సంప్రదాయ వేడుకల సందర్భాలలోనే కాదు క్యాజువల్‌గా, ప్రత్యేక వెస్ట్రన్ పార్టీలకూ ధరించడానికి నాట్యాభరణాలను మన ఇంటి బుట్టబొమ్మల కోసం ఎంపిక చేసుకోవాల్సిందే అనిపిస్తున్నాయి. బంగారు, వెండి మాత్రమే కాకుండా ఇమిటేషన్, ఫ్యాషన్ జువెల్రీలోనూ ఈ ఆభరణాలు అందమైన నృత్య భంగిమల్లో కనువిందు చేస్తున్నాయి. -
రష్మిక ధరించిన చీర, ఉంగరం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ అని అర్థమవుతోందా? ఈ నేషనల్ క్రష్ మనసు దోచి ఆమె వార్డ్‌రోబ్‌లోకి చేరిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. త్యానీ బై కరణ్ జోహార్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత కరణ్ జోహార్ నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన ఆలోచనతో సూపర్ హిట్ సినిమాలనే కాదు, అందమైన ఆభరణాలకూ రూపకల్పన చేయగలడని నిరూపించాడు. నిదర్శనం 2017లో ప్రారంభించిన ‘త్యానీ బై కరణ్ జోహార్ జ్యూయెలరీ’. బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఈ ఆభరణాలు ఎంతోమంది సెలబ్రిటీల ఫేవరెట్. చూడటానికి ఈ ఆభరణాల మెరుపు రాత్రివేళ ఆకాశంలో మెరిసే నక్షత్రాలను తలపిస్తే, వీటి ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: త్యానీ బై కరణ్ జోహార్ నెక్‌పీస్ ధర : రూ. 2,86,300 ఉంగరం ధర: రూ. 97,610 అశ్విని రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. టాప్‌మోస్ట్ ఫ్యాషన్‌గా డిజైనర్‌గా ఎదిగింది. బీటెక్ తర్వాత ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తయ్యాక, ఇటలీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో స్పెషలైజేషన్ చేసింది అశ్విని రెడ్డి. 2009లో తన పేరు మీదే హైదరాబాద్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. వెస్టర్న్ లుక్కు సంప్రదాయ శైలితో కూడిన ఎంబ్రాయిడరీ జోడిస్తూ ఎన్నో కలెక్షన్స్‌ను రూపొందించింది. కొద్దిరోజుల్లోనే ఆమె డిజైన్స్ పాపులర్ కావడంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. 2018 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన ‘తిలోత్తమ కలెక్షన్స్’తో ఆమె ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ డిజైనర్ అంటే ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అనుకోకండి. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్ : అశ్విని రెడ్డి ధర: రూ. 48,000 ►షాప్‌కి వెళ్లి, సెలక్ట్ చేసుకుని, ట్రై చేయడం.. నాకు చాలా కష్టం. కన్ఫ్యూజ్ అయిపోతా. అందుకే, ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను – రష్మిక మందన్నా. -దీపిక కొండి చదవండి: Pooja Hegde: ‘బుట్టబొమ్మ’ డ్రెస్ మరీ అంత ఖరీదా?! -
నచ్చితే రూ.100ల టీషర్ట్ అయినా వేసుకుంటా : నటి
రెజీనా.. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా సహజంగా కనిపించడానికే ఇష్టపడుతుంది. అదే ఆమె స్టయిల్ అయింది. ఆ శైలిని ట్రెండ్‌గా మార్చేసిన బ్రాండ్స్ ఏవంటే.. ఫారిన్ ఫ్యాషన్స్‌కు స్వదేశీ టచ్ అనుశ్రీ బ్రహ్మభట్.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచంలోనే పెరిగింది. తల్లి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కాకపోయినా చక్కటి టైలర్. అందమైన డిజైన్స్‌తో దుస్తులు కుట్టేది. దీంతో అనుశ్రీకి ఫ్యాషన్‌పై మక్కువ పెరిగింది. లండన్ ఎస్ఎస్డీటీ యూనివర్సిటీలో చదివి, ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. 2015లో ముంబైలో ‘లేబుల్ అనుశ్రీ’ పేరుతో సంస్థ స్థాపించింది. ఫారిన్ ఫ్యాషన్స్‌ను ఆనుసరించి స్వదేశీ డిజైన్స్ చేయడం ఈమె ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తుంది. కస్టమర్ అభిరుచి, బడ్జెట్‌కు తగ్గట్టుగా రూ. వేల నుంచి లక్షల వరకు డిజైన్ చేయగలదు. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ అనుశ్రీ కలెక్షన్స్ లభిస్తాయి. నియతి డిజైన్స్.. నియతి అంటే సంస్కృతంలో విధి. పేరుకు తగ్గట్టుగానే స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఆ బ్రాండ్ రాత మారిపోయింది.. ఆకర్షణీయమైన డిజైన్స్ వల్ల. ఇక్కడ లభించే ప్రతి ఆభరణాన్నీ చేత్తోనే తయారు చేస్తారు. అదీ ప్రత్యేకమైన పాత పద్ధతులను అవలంబించి. అదే నియతి బ్రాండ్ వాల్యూ. దీనిద్వారా అంతరించి పోతున్న గిరిజనకళా నైపుణ్యాన్ని కాపాడుతున్నారు. సాధారణంగా ఈ ఆభరణాల కోసం రాగి, వెండి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈ బ్రాండ్ జ్యూయెలరీలో వాడే మెటల్ కన్నా వాటి కళాత్మకమైన డిజైన్స్‌కే విలువ ఎక్కువ. కొన్ని ఆభరణాలు రూ. లక్షల్లో కూడా ఉంటాయి. కేవలం నియతి ఒరిజిన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, స్టోర్స్‌లో మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: నియతి హారం: పరమ కలెక్షన్స్ ట్రైబల్ నెక్‌పీస్ ధర: రూ. 29,000 డ్రెస్.. మస్డడ్ లెహంగా అండ్ ఆర్గంజా నాటెడ్ షర్ట్ బ్రాండ్: లేబుల్ అనుశ్రీ ధర: రూ. 22,000 కమ్మలు అద్వితీయ కలెక్షన్స్ ఇయరింగ్స్ ధర: రూ. 5,290 ఫలానా బ్రాండ్ నుంచి ఇది లాంచ్ చేశారు. వెంటనే దానిని కొనాలి, వేసుకోవాలి అని నాకు ఎప్పుడూ ఉండదు. వంద రుపాయల టీషర్ట్ అయినా సరే.. నాకు నచ్చితే వేసుకుంటా– రెజీనా ∙దీపిక కొండి -
దేశంలోనే తొలిసారి, 2 గంటల్లో ‘ఫ్యాషన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్, ఎఫ్‌బీబీ.. రెండు గంటల హోమ్ డెలివరీ సేవలను ఫ్యాషన్‌కూ విస్తరించాయి. ఇప్పటి వరకు బిగ్ బజార్ ఈ సేవల కింద నిత్యావసరాలను తన కస్టమర్లకు అందించింది. ఫ్యాషన్ కలెక్షన్‌ను ఇలా రెండు గంటల్లో వినియోగదార్లకు చేర్చడం దేశంలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా 144 నగరాలు, పట్టణాల్లో 352 స్టోర్ల ద్వారా ఉత్పత్తులను సరఫరా చేస్తారు. షాప్.బిగ్‌బజార్.కామ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. -
రకుల్ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా?
తను నటించే పాత్రల ఎంపిక పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటుందో ధరించే దుస్తుల విషయంలోనూ అంతే శ్రద్ధ పెడుతుంది రకుల్‌ప్రీత్ సింగ్. అందుకే ఫ్యాషనే ఆమెను ఫాలో అవుతుంది. ఆ ట్రెండీ గర్ల్ ఫ్యాషన్ టేస్ట్ .. ఆమె ఫేవరెట్ బ్రాండ్ ఏంటో చూద్దాం.. లిమరిక్.. ఇద్దరు డిజైనర్స్ అబిర్, నాన్కీ కలసి స్థాపించిన సంస్థే లిమరిక్. లేత రంగులతో అందమైన డిజైన్స్‌ను రూపొందించడం వీరి ప్రత్యేకత. హ్యాండ్ పెయింటింగ్, సింపుల్ అల్లికలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇందుకోసం జైపూర్, సూరత్, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది కళాకారులను ప్రత్యేకంగా నియమించారు కూడా. అనతికాలంలోనే ఆ డిజైన్స్ గుర్తింపు పొంది అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ప్రస్తుతం అమెరికా, లండన్‌లోనూ దీనికి బ్రాంచీలున్నాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లలో లిమరిక్ డిజైన్స్ లభిస్తాయి. ఆమ్రపాలి జ్యూయెలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియం ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. అయితే ధర మాత్రం లక్షల్లోఉంటుంది. అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రిప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు. ఆమ్రపాలి ట్రైబల్ డిజైన్ ఆభరణాలకు పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీస్ వీటిని ఇష్టపడతారు. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీరబ్రాండ్: లిమరిక్ బై అబిర్ అండ్ నాన్కీ ధర : రూ. 9,900 జ్యూయెలరీ.. బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఎంత విలువైనది ధరించినా, అది మనకు ఇబ్బంది కలిగిస్తుంటే అందంగా కనిపించలేం. అందుకే నేను ఖరీదైన వాటికంటే కంఫర్ట్‌నిచ్చే దుస్తులు, ఆభరణాలనే ధరిస్తా. కంఫర్ట్ కాన్ఫిడెన్స్‌ను ఇస్తుంది- రకుల్ - దీపిక కొండి -
అజియో బిగ్ బోల్డ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్
ట్రెండ్స్, సరికొత్త స్టైల్స్‌కు ఖ్యాతిగాంచిన భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఫ్యాషన్ ఈ-రిటెయిలర్ అజియో జూలై 1, 2021 నుంచి జూలై 5, 2021 వరకు ఫ్యాషన్ శ్రేణి అమ్మకం బిగ్ బోల్డ్ సేల్ నిర్వహిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే ఈ అజియో బిగ్ బోల్డ్ సేల్ ఫ్యాషన్‌కు సంబంధించి ఇప్పటి వరకు లేని భారీ, బోల్డెస్ట్ సేల్. 2500పైగా బ్రాండ్లకు చెందిన 6,00,000 స్టైల్స్‌పై 50 శాతం నుంచి 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దేశంలోని ప్రతీ కస్టమర్ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటి వరకు చూడని ధరలు, ప్రతీ గంటకు స్పెషల్ డీల్స్, రివార్డులు, పాయింట్లను అజియో బిగ్ బోల్డ్ సేల్ అందిస్తోంది. ప్రపంచ ఖ్యాతిగాంచిన బ్రాండ్లు నైకీ, ప్యూమా, అడిడాస్, లివైస్, యూనైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్కు చెందిన స్టైల్స్ అతి తక్కువ ధరలో పొందవచ్చు. ఈ మెగా ఈవెంట్ ద్వారా ఫ్యాషన్ ప్రపంచపు సుందరి సోనమ్ కపూర్, ఫ్యాషన్ ఐకాన్స్ గురు రణధావ, శృతి హాసన్, కాజల్ అగర్వాల్, మౌనీ రాయ్ అమ్మకాలను ఉత్తేజితం చేస్తారు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందించేలా పాపులర్ శ్రేణులైన టీ-షర్ట్స్, జీన్స్, కుర్తాలు, స్నీకర్స్పై 50 నుంచి 90 శాతం వరకు ఆఫ్ సహ అన్ని స్టైల్స్‌పై తగ్గింపు ధరలను చూడవచ్చు. ధరల తగ్గింపు మాత్రమే కాదు ఈ సేల్ సందర్భంగా అనేక ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను అజియో ప్రారంభిస్తోంది. దేశంలోని ఫ్యాషన్ ప్రియులకు సరైన వేదికగా నిలుస్తున్న అజియో, స్త్రీలు, పురుషుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దుస్తులు, యాక్సెసరీ కలెక్షన్స్ అందిస్తోంది. చదవండి: జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే! -
ఫ్యాషన్ మార్కెట్ ఢమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 సెకండ్ వేవ్ అన్ని రంగాలనూ దెబ్బ తీసింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదటి వేవ్ నుంచి పరిశ్రమ కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ ఒక్కసారిగా ముంచెత్తడంతో విక్రయాలు ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దుస్తులు, పాదరక్షలు, సుగంధ పరిమళాలు, చేతి గడియారాలు, లెదర్ వస్తువులు, యాక్సెసరీస్.. వస్తువు ఏదైనా గతంలో వీటి కోసం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిన కస్టమర్లు ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. విక్రయాలు తగ్గడంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రభావమూ ఉంది. అత్యవసరాలకే ప్రాధాన్యత.. మహమ్మారి లక్షలాది కుటుంబాలను ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. దీంతో ప్రజలు అత్యవసరాలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఫ్యాషన్ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సెకండ్ వేవ్ దెబ్బకు దాదాపు 49 శాతం మంది ఆర్థిక కష్టాలతో సావాసం చేస్తున్నట్లు వే2న్యూస్ ఇటీవలి సర్వేలో తేలింది. విపరీతంగా పెరిగిన ఆస్పత్రి ఖర్చులు, ఉద్యోగాలు కోల్పోవడం, సరైన వేతనాలు లేక, జీతాల్లో కోత పడటంతో కొనుగోలు శక్తి తగ్గిందని కస్టమర్లు తెలిపారు. పౌష్టికాహారం, ఇంటి అవసరాలు, పరిశుభ్రత ఖర్చులు పెరిగినట్లు వారు చెప్పారు. ఫ్యాషన్ రంగంలోని రిటైలర్లకు కోవిడ్–19 ముందస్తు స్థాయి రికవరీకి రెండేళ్లు పడుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవలి తన నివేదికలో వెల్లడించింది. డిసెంబర్ త్రైమాసికంలో 70 శాతం అమ్మకాలు నమోదు చేసిన పరిశ్రమ.. మార్చి నుంచి ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో కుప్పకూలిందని తెలిపింది. రద్దు అవుతున్న ఆర్డర్లు.. సాధారణ విక్రయాలతో పోలిస్తే ఏప్రిల్‌లో అమ్మకాలు 25 శాతం లోపే నమోదయ్యాయని క్లాతింగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. 50 శాతంపైగా ఆర్డర్లు రద్దు అయ్యాయని, బాకీలు 25 శాతంలోపే వసూలు అవుతున్నాయని వెల్లడించింది. దీనినిబట్టి రిటైల్ మార్కెట్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లెనిన్ దుస్తులు, పర్ఫ్యూమ్స్, లెదర్ వస్తువులు, యాక్సెసరీస్ అమ్మకాలు దాదాపు లేనట్టేనని విక్రేతలు అంటున్నారు. దుస్తుల అమ్మకాలు 10–15 శాతం మించట్లేదని వారు అంటున్నారు. రెండేళ్ల వరకు పరిశ్రమకు ఇబ్బంది తప్పదని సీఎంఆర్ షాపింగ్ మాల్స్ చైర్మన్ మావూరి వెంకటరమణ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యయాలను నియంత్రించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. చిన్న బ్రాండ్స్ కనుమరుగు.. దేశంలో ఫ్యాషన్ మార్కెట్లో తయారీతోపాటు విక్రయంలో 10 శాతం కంపెనీలు ఉన్నట్టు సమాచారం. 90 శాతం కంపెనీలు మార్కెటింగ్‌కే పరిమితమయ్యాయి. ఇక బ్రాండ్ ఔట్లెట్ల విషయంలో కంపెనీల నిర్వహణలో 35 శాతం దుకాణాలు ఉన్నాయి. మిగిలినవి ఫ్రాంచైజీలు నిర్వహిస్తున్నారు. బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఈక్విటీ, ప్రకటనల వాటా, ప్రమోషన్స్ పేరుతో లక్షలాది రూపాయలు ఫ్రాంచైజీలు చెల్లించుకోవాలి. ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసి ఔట్లెట్లను తెరిచిన ఫ్రాంచైజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నగదు చెల్లించి కొనుగోలు చేసిన స్టాక్ అమ్ముడుపోకుండా పేరుకుపోయాయి. కస్టమర్లు ఆన్‌లైన్‌కు మళ్లడం, ఆఫ్‌లైన్ సేల్స్ లేకపోవడం, అద్దెల భారంతో వర్తకులు నష్టాలను మూటగట్టుకుంటున్నారని రిటైల్ రంగ నిపుణులు కలిశెట్టి నాయుడు తెలిపారు. సెకండ్ వేవ్ ప్రభావంతో చిన్న బ్రాండ్స్ కనుమరుగు అవుతాయని అన్నారు. నష్టాలను భరించగలిగే విక్రేతలు మాత్రమే నిలదొక్కుకుంటారని చెప్పారు. -
ఈ విమానం మీరు ఎక్కడికే వెళ్తే అక్కడికి వస్తుంది..!
మగువల అందానికి అదనపు ఆకర్షణగా నిలిచేవి హ్యాండ్ బ్యాగ్స్. విదేశీ ప్రయాణాల్లో, పార్టీల్లోను, గెట్ టూ గెదర్ ఫంక్షన్లలో ఇతరులను ఆకట్టుకునేందుకు యువతులు రకరకాల డిజైన్లతో చేసిన హ్యాండ్ బ్యాగ్స్‌ని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వారి ఇష్టాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలు రకరకాల ఆకారాల్లో బ్యాగులను మార్కెట్లలో విడుదల చేస్తుంటాయి. వాటిలో ఎక్కువ శాతం బ్యాగులు ఆకట్టుకుంటే మరికొన్ని బ్యాగులు సహజత్వాన్ని కోల్పోయి నెటిజన్లకు మంచి ఎంటర్టైన్మెంట్ ను మిగుల్చుతాయి. ఇటీవల ప్రముఖ అమెరికన్ డిజైనర్ వర్జిల్ అబ్లో ఫాల్ వింటర్ 2021తో విమానం ఆకారంలో ఉండే ఓ బ్యాగ్‌ను డిజైన్ చేశాడు. ఆ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 28 లక్షలు(రూ.28,61,235) ఈ బ్యాగులను లూయిస్ విట్టన్ అనే ఫ్యాషన్ సంస్థ మార్కెట్ లో విడుదల చేసింది. మోనోగ్రామ్ లోగోతో డిజైన్ చేసిన ఈ బ్యాగ్ ను లూయిస్ విట్టన్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విమానం ఆకారంలో ఉన్న బ్యాగ్‌ను చూసి నెటిజన్లు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. విమానం ఆకారంలో ఉండే బ్యాగ్‌ను డిజైన్ చేసే కంటే నువ్వే ఓ నిజమైన విమానం కొనుగోలు చేయోచ్చు కదా అని ఓ నెటిజన్ అంటుంటే.. మరో నెటిజన్ ఈ విమానాన్ని దొంగ తనం చేసి వీధుల్లో తిప్పుకుంటా! అందం లేదు, స్టైల్‌గానూ లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. Louis Vuitton Fall/Winter 2021 Airplane Bag by Virgil Abloh 💰$39,000 pic.twitter.com/GEUmoylYqD — SAINT (@saint) April 2, 2021 -
దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ!
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా చూడని వారు ఎవరూ ఉండరు. సోషల్ మీడియా వేదికను కొందరు కొత్త విషయాలను చెప్పడానికి వాడితే, మరికొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శించే వేదికగా వినియోగిస్తున్నారు. దేశాయ్ తల్లీ కూతుళ్లు మాత్రం.. వాళ్ల సృజనాత్మకతను వీడియోల రూపంలో పోస్టుచేసి ఎంచక్కా వ్యాపారం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతో బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తూ పోతున్నారు. అది 2016. ముంబైలో ఉంటోన్న హీతల్ దేశాయ్ (తల్లి), లేఖినీ దేశాయ్ (కూతురు)లు ఇద్దరు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌కు షాపింగ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ చేనేత వస్త్రాలను చూసిన వాళ్లకు ‘ చేనేత వస్త్రంతో వివిధ రకాల డిజైన్లతో డ్రెస్సులు అమ్మితే ఎలా ఉంటుంది? అనే బిజినెస్ ఐడియా వచ్చింది. అలా ఆలోచన రాగానే వెంటనే ఎగ్జిబిషన్లో సహజసిద్ధ రంగులతో తయారయ్యే అజ్రాఖ్ ప్రింట్ ఉన్న 50 మీటర్ల ఫ్యాబ్రిక్‌ను కొన్నారు. ఇంటికి వచ్చిన తరువాత ఆ వస్త్రాన్ని వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఒక టైలర్‌కు ఇచ్చి వివిధ రకాల సైజుల్లో కుర్తీ్తలను కుట్టించారు. వీటిని ఎలా విక్రయించాలా... అని ఆలోచించినప్పుడు లేఖినికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఫేస్బుక్ పేజీ ఒకటి క్రియేట్ చేసి ఆ కుర్తీల ఫోటోలను అందులో పోస్టు చేసింది. ఆ ఫోటోలు ఫేస్బుక్ ఫ్రెండ్స్‌కు నచ్చడంతో తమకు కావాలని అడిగారు. అలా రెండేళ్లపాటు సాగిన వ్యాపారం లో మంచి లాభాలు వస్తుండడంతో ‘ద ఇండియన్ ఎథినిక్ కోడాట్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో ఏడాదికి పాతిక లక్షల బిజినెస్ నడిచేది. ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతున్నారు. బిజినెస్ ప్రారంభంలో లేఖిని ఎంబీఏ చదువుతూ మరోపక్క సోషల్ మీడియాలో మార్కెటింగ్‌ను నిర్వహించేది. ఎంబీఏ పూర్తయిన తరువాత కోల్‌కతాలోని ఐటీసీలో లేఖినీకి ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఫ్యామిలీ బిజినెస్‌లో కొనసాగాలా? కార్పొరేట్ కెరీర్‌ను ఎంచుకోవాలా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ఉద్యోగానికే ఓటేసింది. ఆ సమయంలో హీతల్ దేశాయ్.. కంప్యూటర్ నేర్చుకుని వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేసేవారు. వ్యాపారం మంచిగా సాగుతుండడంతో.. లేఖిని ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయిలో వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనేది. ప్రస్తుతం ద ఇండియన్ ఎథినిక్ డాట్‌కు మూడు కార్యాలయాలతోపాటు, ఒక స్టూడియో ఉన్నాయి. మొదట్లో కుర్తీలతో ప్రారంభమైన దేశాయ్ వ్యాపారం క్రమంగా చేనేత చీరలను సరికొత్త డిజైన్లతో రూపొందించి, వాటిని వీడియోల రూపంలో మార్కెట్లో వదలడంతో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ చేనేత వస్త్రాల బ్రాండ్లలో ఇండియన్ ఎథినిక్ ఒకటిగా నిలవడం విశేషం. లేఖినీ దేశాయ్ మాట్లాడుతూ...‘‘నా చిన్నప్పటినుంచి నాకు మా చెల్లికి ఏ డ్రెస్ అయినా అమ్మ మార్కెట్లో మెటిరియల్ కొని మాకు నప్పే విధంగా వివిధ రకాల డిజైన్లలో కుట్టేది. చిన్నప్పటి నుంచి అలా పెరిగిన నేను.. అమ్మ కుట్టే డ్రస్సులు మాకే కాదు అందరికి నచ్చుతాయి. వీటిని ఎవరైనా కొంటారు అనిపించేది. అలా అమ్మ కుట్టినవి కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి స్పందన వచ్చేది. ఈ రోజు పెట్టిన ఫోటోలు, వీడియోలలో ఉన్న చీరలు డ్రెస్‌లు మరుసటి రోజుకు అమ్ముడయ్యేవి. వేరే బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు మోడల్స్‌తో మోడలింగ్ చేయిస్తుంటారు. కానీ మేము అలాకాదు. మానాన్న గారి ప్రోత్సహంతో మేము డిజైన్ చేసిన బట్టలను వేసుకుని డ్యాన్స్ వేస్తూ మార్కెటింగ్ చేసేవారం. దీనికోసం గతేడాది ఒక స్టూడియో తీసుకున్నాం. దాన్లో నా ఫ్రెండ్స్ కొంతమందితో రూపొందించినlవస్త్రాలు కుట్టి పదినుంచి పదిహేను నిమిషాల వీడియోను షూట్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కస్టమర్ల నుంచి లైక్‌లతోపాటు వేలాది ఆర్డర్లు వచ్చేవి. దీంతో ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందనిపించింది. ఇక అప్పటి నుంచి అలా కొనసాగిస్తున్నాము’’ అంటూ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పింది లేఖిని. -
ట్రెండ్ సృష్టిస్తున్న ‘రివాల్వ్’ బ్రాండ్
ట్రెండ్‌ను ఫాలో అయ్యేవాళ్లు కొందరుంటారు.. మరికొందరు ట్రెండ్‌ను సృష్టిస్తారు..ఇదిగో ఇలాగన్నమాట.. ఇవేంటో మీకు తెలుసా? వ్యాక్సిన్ రెడీ డ్రస్సులు.. మీరు విన్నది నిజమే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోంది కదా.. దీన్ని కూడా క్యాష్ చేసుకునేందుకు ‘రివాల్వ్’ అనే బ్రాండ్ వ్యాక్సిన్ రెడీ పేరిట ఈ దుస్తులను మార్కెట్లోకి తెచ్చింది. ఇవి టీకా వేసుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. స్టైలిష్‌గా కూడా ఉంటాయని సదరు కంపెనీ చెబుతోంది. ఎలాగుంది ఈ ఐడియా.. సూపర్ కదూ.. చదవండి: సల్లూ భాయ్‌తో భాగస్వామ్యం వర్కౌట్ అవుతోందా...! -
నయా ఫ్యాషన్..
-
డిజైన్స్ కొత్త.. ఫ్యాషన్ సూత్ర..
-
‘సూత్ర’ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్లో నిధి అగర్వాల్
-
మోడల్స్ క్యాట్‌వాక్‌తో విరిసిన అందం
-
మెరిసిన లావణ్యం
-
సగం ధరకే ఫ్యాషన్ దుస్తులు
సాక్షి, ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు తన భాగస్వామ్య సంస్థకు ధీటుగా తన సొంత వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకునేందుకు సమాయత్తమవుతోంది. అదీ అతి చౌక ధరలకే ఫ్యాషన్ దుస్తులను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. పదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా అపారెల్ సంస్థ ‘జారా’తో జట్టుకట్టిన టాటా సంస్థ..ఇప్పుడు సొంతంగానే దేశీయంగా వస్త్ర దుకాణాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుకాణాల సముదాయం జారాలో దొరికే దుస్తుల కంటే సగం ధరకే కస్టమర్లను ఆకట్టుకోనుంది. వినియోగదారులకు జారా అందించే దానికంటే సగం ధరలకే దుస్తులను అందించనున్నట్లు టాటాకు చెందిన రీటెయిల్ సంస్థ ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్ నోయల్ టాటా చెప్పారు. ఏడాదికి దేశవ్యాప్తంగా 40 వెస్ట్‌సైడ్ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు నోయల్ తెలిపారు. 12 రోజుల్లో "ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఫ్యాషన్’’ దుస్తులను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది. వారు దుస్తుల విషయంలో ట్రెండీ గా మారుతున్నారు. కానీ వారికి జారా లాంటి చోట్ల తక్కువ ఆదాయ వర్గాలైన వీరికి తక్కువ ధరల్లో ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరకే ట్రెండీ దుస్తులను వారికి అందుబాటులోకి తేన్నామని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లను ఆకట్టుకుని మార్కెట్లో త్వరగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని నోయల్ చెప్పారు. దేశీయ వస్త్ర దుకాణాల నుంచి వచ్చే మోడల్స్ ధీటుగా ట్రెంట్ సప్లై చైన్‌ను వేగవంతంగా వృద్ది చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. -
గ్లామర్స్
ప్రముఖ డిజైనర్ అర్చిత నారాయణం ఫ్యాషన్ కలెక్షన్ ప్రదర్శన ‘లెగసీ ఆఫ్ ప్రెస్టేజ్’ కర్టెన్‌రైజర్‌లో తారలు మెరిశారు. జూబ్లీహిల్స్ క్లబ్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అందాల భామలు పాయల్‌ఘోష్, సిమర్ మోతియాని, ముంబై మోడల్స్ వయ్యారాలు ఒలకబోశారు. శుక్రవారం నిర్వహించే ఫ్యాషన్ షోలో అర్చిత రూపొందించిన వెరైటీ శారీలు, డ్రెస్సులు ధరించి మోడల్స్ క్యాట్ వాక్ చేస్తారు. -సాక్షి, సిటీప్లస్ -
కామినీ షరాఫ్ ఫ్యాషన్‌యాత్ర
దేశంలోని ప్రముఖ డిజైనర్ల ఫ్యాషన్ కలెక్షన్‌ను కామినీ షరాఫ్ నగరానికి తీసుకొస్తున్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో అక్టోబర్ 9న ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. మ్యోహో, ఆర్తీ విజయ్ గుప్తా, ప్రియా థోలియా, జూలీ, ఏక్ కార్ఖానా, ఓసా, ఎరుమ్, అలోక్ బైద్, సిల్క్‌వార్మ్, ప్రియంవద, లీలా, హీనా కొచ్చర్, ఆయేషా మన్మీరా, ఆరిషి, జేబైష్, నవ్య, మోనికా భయానా, ప్రీతి ఝవార్, ఆయినా వంటి డిజైనర్లు రూపొందించిన ఫ్యాషన్ దుస్తులు, జ్యువెలరీ కలెక్షన్‌ను ఈ ప్రదర్శనలో నగరవాసులకు అందుబాటులో ఉంచనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఛోటీ, లిటిల్ వార్డ్రోబ్, మిమోసా, ఓన్స్ బ్రాండ్స్, షీర్ కిడ్స్‌వేర్, మి డల్సె, అన్యా ఆర్గానిక్ చిక్, శ్రుతి జలాన్ ఎన్ లిటిల్ ప్లెజర్స్ వంటి ఫ్యాషన్ దుస్తులను కూడా ప్రదర్శించనుండటం విశేషం. వీటితో పాటు బ్యాగులు, శాలువలు, పాదరక్షలు, హోమ్ డెకర్స్ కూడా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి.