Fashion: ఇక ఆలోచించనక్కర్లేదు.. కాస్త కాంట్రాస్ట్‌ కలర్‌తో కొత్తగా ఇలా! | Fashion: Plain Kurtas And Tops With Pockets Trendy Look | Sakshi
Sakshi News home page

Fashion Tips: ఇక ఆలోచించనక్కర్లేదు.. కాస్త కాంట్రాస్ట్‌ కలర్‌తో కొత్తగా ఇలా!

Mar 11 2022 1:19 PM | Updated on Mar 11 2022 2:22 PM

Fashion: Plain Kurtas And Tops With Pockets Trendy Look - Sakshi

మగవారి దుస్తులకే పాకెట్స్‌ ఉంటాయనేది నాటి మాట. మగువల డ్రెస్సులకూ ఉంటాయి.  అయితే, అవి సాదా సీదాగా ఉండవు.. ఎంబ్రాయిడరీ సొగసులు అద్ది ఉంటాయి. ప్యాచ్‌వర్క్‌తో మెరుగులు దిద్ది ఉంటాయి.

పెయింటింగ్‌తో ముస్తాబు చేసి ఉంటాయి. అద్దకం మెరుపులతో అందంగా ఉంటాయి. పువ్వులు, జంతువుల బొమ్మలతోనూ కొంగొత్తగా ఉంటాయి.

ప్లెయిన్‌ కుర్తాకు లేదా టాప్‌కు  పాకెట్‌ కావాలనుకుంటే ఇక ఆలోచించనక్కర్లేదు. కాస్త కాంట్రాస్ట్‌ కలర్‌తో కొత్తగా ఇలా మెరిపించవచ్చు. 

ఫోన్, మనీ, కార్డ్స్‌లాంటి విలువైన వస్తువులను బ్యాగ్‌ లేదా క్లచ్‌ అవసరం లేకుండానే వెంట తీసుకెళ్లడానికి పాకెట్‌ సరైన ఎంపిక అవుతుంది. అందుకు, టాప్‌కి కాంట్రాస్ట్‌ పాకెట్‌ను విడిగా డిజైన్‌ చేసుకొని, జత చేయచ్చు.

పాకెట్‌ డిజైన్‌ ఎలా ఉండాలనేది మీ ఎంపికే అవుతుంది. పార్టీలో హైలైట్‌గా నిలిచే పాకెట్‌ డ్రెస్‌ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎలాంటి భారం లేకుండా అందరిలోనూ హుందాగా నిలుపుతుంది.  

చదవండి: Fashion Blouse Trend: డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!  రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement