Shirley Setia: బ్లూ సారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్‌! చీర ధర ఎంతంటే

Fashion: Actress Shirley Setia In Sonam Luthria 36k Trendy Saree - Sakshi

‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షిర్లీ సేథియా. న్యూజిలాండ్‌ సింగర్‌. తన పాటల్లోనే కాదు ఫ్యాషన్‌లోనూ వైవిధ్యం చూపిస్తోంది ఇలా... 

సంగీతా బూచ్రా
రాజస్థాన్‌  సంప్రదాయ నగల స్ఫూర్తితో ఏర్పడిన బ్రాండే సంగీతా బూచ్రా జ్యుయెల్స్‌. వెండి నగలకు ఈ బ్రాండ్‌ ప్రత్యేకం. నిజానికి ఈ వ్యాపారాన్ని 1897లో జైపూర్‌లో సేఠ్‌ కస్తూర్‌ చంద్‌ బూచ్రా ప్రారంభించాడు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ కారణంగా దాదాపు దశాబ్దాల పాటు దీన్ని విజయవంతంగా కొనసాగిస్తూ.. ‘ది సిల్వర్‌ కింగ్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రాచుర్యం పొందాడు.

తదనంతరం ఆ వ్యాపారాన్ని ఆయన కుటుంబీకులూ అంతే సమర్థంగా కొనసాగించారు. అయితే 1994లో ఆ కుటుంబ వారసురాలు  సంగీత.. ఆ వ్యాపారాన్ని  ‘సంగీత బూచ్రా’ పేరుతో బ్రాండ్‌గా మలచింది. వాల్యూను పెంచింది. ధరలు అందుబాటులోనే.. నగలు ఆన్‌లైన్‌లో!

సోనమ్‌ లూథ్రియా.....
ముంబైలోని ఎస్సెన్‌డీటీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్‌ డిజైన్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సోనమ్‌ లూథ్రియా.. 2012లో ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఫ్యాబ్రిక్స్, ప్రింట్లు, త్రెడ్‌ వర్క్‌లతో వైవిధ్యం చూపించడం ఆమె ప్రత్యేకత.

కస్టమర్‌ అభిరుచిని బట్టి సృజనాత్మకమైన ఆఫ్‌ బీట్‌ ఫ్యూజన్‌ వేర్, అందమైన డ్రెప్‌లు, సంప్రదాయేతర కట్‌లు, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్‌లతో ఇండియన్‌ వేర్‌ను డిజైన్‌ చేయడంలో ఆమె తర్వాతనే ఎవరైనా! పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇక్కడ దుస్తులు లభిస్తాయి. ఆర్డర్‌ ఇచ్చి కూడా డిజైన్‌ చేయించుకొనే వీలుంది. ఆన్‌లైన్‌లో లభ్యం. ధర కాస్త ఎక్కువే.

బ్రాండ్‌ వాల్యూ
చీర బ్రాండ్‌: సోనమ్‌ లూథ్రియా
ధర: రూ. 36,000

జ్యూయెలరీ
బ్రాండ్‌: సంగీతా బూచ్రా జ్యూయెల్స్‌
ధర: రూ. 15,000

ఆదరాభిమానాలను చూస్తుంటే సంతోషంగా ఉంది!
నటిని కావాలనే ఇష్టంతో న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీలో చేరాను. కానీ నేను సింగర్‌ను కావాలని విధి  నిర్ణయించింది.  నా పాటల పట్ల ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూస్తుంటే సంతోషంగా ఉంది! –  షిర్లీ సేథియా 
-దీపిక కొండి 
చదవండి: Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర 4 లక్షల 80 వేలు! ఆ బ్రాండ్‌ ప్రత్యేకత అదే!
ప్యాంట్‌ శారీ.. చెవులకు పెద్ద హ్యాంగింగ్స్‌, ఫిష్‌ టెయిల్‌.. మీరే హైలైట్‌!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top