
హనీ రోజ్.. సార్థకనామధేయురాలు. పదిహేనేళ్లుగా వివిధ పాత్రల్లో అలరిస్తూ మలయాళంలో విశేష జనాదరణ పొందిన నటి. తన అభినయానికి ఆమె మెరుగులు దిద్దుకుంటోంది.. తన ఫ్యాషన్ స్టయిల్‌ను మేం క్రియేట్ చేస్తున్నాం అంటున్నాయి ఈ బ్రాండ్స్..
తానిత్ డిజైన్స్...
శింజు క్రిష్.. ఈ మధ్యనే పాపులర్ అవుతున్న డిజైనర్. ఎక్కువగా వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరులో ‘తానిత్ డిజైన్స్’ పేరుతో ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించాడు. వీటి ధరలు సామాన్యులకూ అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు.
అనోఖీ..
ఓ గృహిణి ప్రారంభించిన వ్యాపారమే ఈ అనోఖీ! కొచ్చికి చెందిన ప్రియా కిషోర్.. భర్త సలహా మేరకు ఓ ఫ్యాన్సీస్టోర్ ఓపెన్ చేయాలనుకుంది. కానీ, కావల్సినంత పెట్టుబడి లేని కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే సేల్స్ ఓపెన్ చేసింది.
అందమైన డిజైన్స్‌తో చాలామంది అతివలను తన డైలీ కస్టమర్లుగా మలచుకుంది. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలకూ తన డిజైన్స్‌ను అందిస్తోంది ప్రియా. చాలా తక్కువ ధరకే నాణ్యమైన, అందమైన డిజైన్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయి.
బ్రాండ్ వాల్యూ
జ్యూవెలరీ
బ్రాండ్: అనోఖీ
ధర: రూ. 2,999
చీర బ్రాండ్:
తానిత్ డిజైన్స్
ధర: రూ. 7,999
చీరలో చాలా అందంగా ఉంటా. కానీ, నాకు చీర కట్టుకోవడం రాదు. అందుకే, చీరకట్టుకునే సన్నివేశాలు నేను నటించే సినిమాల్లో రాకూడదని కోరుకుంటుంటా.– హానీ రోజ్
-దీపిక కొండి