Latest Fashion Trends: సౌకర్యమే స్టైల్‌

Latest Fashion Trends From Local To Global What To Choose - Sakshi

సౌకర్యమే స్టైల్‌

కలర్స్, కట్స్, ప్రింట్లు, డిజైన్లు ఫ్యాషన్‌ ప్రపంచంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి డిజైనర్లు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ప్రాంతీయ డిజైన్ల నుంచి అంతర్జాతీయ బ్రాండ్స్‌ వరకు రీసెంట్‌ లుక్స్‌ కోసం శోధన ఉంటూనే ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద ఇటీవల జరుగుతున్న ఫ్యాషన్‌ వీక్స్‌  వేటిని పరిచయం చేస్తుందో తెలుసుకుందాం.

వారసత్వ డిజైన్లు 
ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్, సౌకర్యవంతమైన డిజైనింగ్‌ తర్వాత స్థానిక హస్తకళ డిజైన్స్‌కి అవకాశాలు బాగా పెరిగాయి. సంప్రదాయ కళలను బాగా ఇష్టపడుతున్నారు. దీంతో మరుగున పడిపోయిన వారసత్వ కళలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ డిజైనర్లు కూడా తమ స్థానిక హస్తకళల డిజైన్స్‌ని విస్తృతంగా మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.

మనదైన ప్రభావం
ఫ్యాషన్‌ ప్రపంచంపై భారతదేశం ప్రభావం గురించి ఆలోచించినప్పుడు రితూకుమార్‌. సబ్యసాచి, మనీష్‌ మల్హోత్రా.. వంటి ప్రఖ్యాత డిజైనర్ల డిజైన్లు, తలపాగాలు కనిపిస్తుంటాయి. అలాగే, గ్లోబల్‌ టెక్స్‌టైల్‌ గురించి చూసినప్పుడు భారతదేశంలోని కుటుంబాలలో తల్లులు, బామ్మలు ధరించే చీరల థీమ్‌ను తమ డిజైన్స్‌లో తీసుకుంటున్నారు.

ఆర్గానిక్, సస్టెయినబుల్‌ ఫ్యాబ్రిక్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇటీవల జరిగిన మిలన్, ప్యారిస్, మన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పదిహేడవ శతాబ్దం నుండి నేటి వరకు పాశ్చాత్య ఫ్యాషన్‌ ట్రెండ్‌పై భారతదేశ ప్రభావం ఉందని తెలుస్తోంది. అలాగే, అంతర్జాతీయ డిజైనర్ల నుంచి మనవాళ్లు స్ఫూర్తి పొందే విషయాల్లో ఫ్యాబ్రిక్స్‌ ఎంపికలోనూ, సంప్రదాయ డిజైన్స్‌లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనేది వాస్తవం. 

ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్‌కే అగ్రస్థానం
దేశీయ, అంతర్జాతీయ డిజైన్స్‌ చూస్తే ఫ్యాషన్‌ రంగంలో ఎప్పుడైనా బ్రైట్‌ కలర్స్, కొత్త ప్రింట్స్, కొత్త కట్స్‌కి అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే, ఏ వయసు వాళ్లు వాటిని ఎలా ధరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఫ్యాషన్‌ రంగాన్ని మాత్రం కరోనా ముందు–కరోనా తర్వాత అని విభజించి చూడచ్చు.

ప్రజల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు సౌకర్యంగా దుస్తులు ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్స్, కంఫర్ట్‌ డ్రెస్సింగ్, బ్రైట్‌ కలర్స్,.. ఇవి ప్రపంచం మొత్తం కరోనా ఫ్రీ టైమ్‌లో తీసుకున్న నిర్ణయాలు అనేది దేశీయ, అంతర్జాతీయ ఫ్యాషన్‌ వీక్‌ల ద్వారా తెలుస్తోంది.

ముఖ్యంగా రసాయనాలు లేని సస్టేయినబుల్‌ ఫ్యాబ్రిక్‌కే అగ్రస్థానం. పార్టీలకు కూడా ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్‌నే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఏ పెద్ద బ్రాండ్‌ తీసుకున్నా ఆర్గానిక్‌ ఫ్యాబ్రిక్‌ డిజైన్స్‌ విరివిగా వచ్చేశాయి.  కట్స్, ప్రింట్లు, కలర్‌ కాంబినేషన్స్‌ కూడా అలాగే ఎంచుకుంటున్నారు. దీంతో మేం కూడా సౌకర్యవంతమైన డిజైన్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం.   


– హేమంత్‌ సిరి, ఫ్యాషన్‌ డిజైనర్, హైదరాబాద్‌

చదవండి: Kidney Stones: మూత్రనాళంలో తట్టుకుంటే తీవ్రమైన నొప్పి.. కాల్షియమ్‌ ఆక్సలేట్‌ ఉండే గింజలు తింటే అంతే సంగతి! ఇలా చేస్తే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top