breaking news
farmes suicides
-
వ్యవసాయంలో నష్టం... పేకాటలో సంపాదించాలని
దొడ్డబళ్లాపురం: వ్యవసాయంలో లాభాలు రావడంలేదని భావించిన ఒక రైతు కనీసం పేకాటలో సంపాదించాలని పీకలదాకా అప్పులు చేసి చివరకు అక్కడా గెలవలేక బలవన్మరణం చెందిన సంఘటన మంగళవారం దొడ్డ తాలూకా తపసీహళ్లిలో చోటు చేసుకుంది. రైతు సుభాష్‌చంద్ర (42) సుభాష్‌చంద్ర మొదటి నుండి వ్యవసాయం చేస్తున్నా, నష్టాలపాలవుతుండడంతో కష్టాలు గట్టెక్కాలనే తపనతో కొందరు జూదరుల స్నేహం చేసి పేకాట ఆడి గెలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా వారానికి రూ.10లు చొప్పున వడ్డీకి రూ.2,20,000 తీసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే మొత్తం సొమ్ము ఖాళీ అయింది. దీంతో అటు వడ్డీ కూడా కట్టలేని స్థితికి వచ్చాడు. వడ్డీ ఇవ్వాలని అప్పు ఇచ్చిన వారు వేధిస్తుండడంతో మనస్తాపంతో మంగళవారం తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక మగ, ఒక ఆడ పిల్ల ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిలింసిటీ నిర్మిస్తే ఆత్మహత్యలు ఆగవు: స్వామి అగ్నివేశ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్వామి అగ్నివేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలింసిటీ నిర్మిస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగవని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి అగ్నివేశ్‌తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.


