breaking news
false tests
-
సుజుకీ సీఈవో రాజీనామా!
తప్పుడు మైలేజీ టెస్టింగ్ బయటపడిన కారణంగా సుజుకీ మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చైర్మన్ ఒసాము సుజుకీ, సీఈవో పదవికి రాజీనామా చేయబోతున్నారట. జపనీస్ ఆటోమొబైల్ సంస్థ సుజుకీ మోటార్స్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే సుజుకీ చైర్మన్ పదవిలో మాత్రం కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒసాము హోండా రిటైర్ కాబోతున్నట్టు వెల్లడించింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్స్ నుంచి అనుమతి లభించాక జూన్ 29 నుంచి సుజుకీ చైర్మన్ పాత్రలో మార్పు, వైస్ ప్రెసిడెంట్ పదవీవిరమణ అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. మైలేజ్ టెస్టింగ్ సిస్టమ్ ను మెరుగుపరచడం, ఇంజనీర్లకు మంచి శిక్షణ ఇవ్వడం వంటి మెరుగుదలలను చేపడతామని సుజుకీ చెప్పింది. జపాన్లోని కార్లకు ఇంధన సామర్ధ్యం, ఉద్గార పరీక్షలను నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించలేదని ప్రముఖ వాహన తయారీ కంపెనీ సుజుకీ మే నెలల్లో అంగీకరించింది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పాటించనందుకు సంజాయిషీ కూడా చెప్పింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టంచేసింది. 2010 నుంచి ఉన్న పరీక్షా పద్ధతులనే పాటిస్తూ వచ్చామని పేర్కొంది. 16 మోడళ్లు.. 20 లక్షల కార్లపైనే ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ మోసపూరిత చర్య వెల్లడవడంతో, గతవారం కంపెనీ ప్రధాన కార్యాలయంపై జపనీస్ ఇన్వెస్టిగేటర్స్ దాడులు కూడా చేశారు. -
మారుతి కార్యాలయంపై దాడులు
టోక్యో: మైలేజ్ పరీక్ష కుంభకోణంలో మారుతి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జపాన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామంటూ మారుతి తప్పు ఒప్పుకున్న నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. వ్యక్తిగత భాగాల్లో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డామన్న సుజుకి వాదనల నిర్ధారణ కోసం ఈ దాడులు నిర్వహించినట్టు రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అక్రమ ఇంధన మైలేజీ ఆరోపణలపై విచారణలో భాగంగా మినీ కార్ మేకర్ సుజుకి ఆఫీసుపై దాడి చేసినట్టు చెప్పారు. కాగా మైలేజీ గణంకాలు తప్పుగా పేర్కొన్నామని, తాము కూడా తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్లో మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్ పై రవాణా మంత్రిత్వశాఖ దాడి తర్వాత ఇది రెండవది. అక్రమ మైలేజీ గణంకాలతో 4 బ్రాండెడ్ మోడల్స్, 12 ఇతర బ్రాండ్లను సుజుకి విక్రయాలు జరిపింది