breaking news
eye vision
-
మీకు స్మోకింగ్ అలవాటుందా?.. అయితే, ఈ సమస్యలు ఎక్కువే..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లేకుండా రోజు గడవటం కష్టమంటే అతిశయోక్తి కాదేమో! మన జీవన విధానంలో అవి అంతగా కలిసిపోయాయి మరి! అయితే దాని వెన్నంటే కంటి సమస్యలు కూడా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. కళ్లు పొడిబారడం, శుక్లాలు, దృష్టిలోపం తలెత్తడం వంటి సమస్యలెన్నో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. యేటా దాదాపుగా 1 బిలియన్ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేధికలో వెల్లడించింది. అయితే పోషకాహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. విటమిన్లు అధికంగా ఉండే అహారాన్ని తినాలి శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమన్లు అందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మీకు తెలుసా? అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం ‘ఎ, సి, ఇ’ విటమిన్లు శుక్లాలు, మాక్యులర్ డీజెనరేషన్ సహా కొన్ని కంటిసంబంధింత సమస్యలు నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అందువల్లనే నిపుణులు ఈ విటమిన్లు అధికంగ ఉండే సిట్రిక్ ఫలాలు, డ్రై నట్స్, విత్తనాలు, చేపలు.. వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఆకుకూరల్లో, కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. అకాడమీ ఆఫ్ నూట్రీషన్ అండ్ డైటిటిక్స్ అధ్యయనాల ప్రకారం మన ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే యూవీ రేస్, రేడియేషన్ నుంచి కంటిచూపును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందని తేలింది. మరింత నీరు తాగాలి నీటి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల కలిగే లాభాలు మనందరికీ తెలుసు. డీహైడ్రేషన్ నుంచి కాపాడటమేకాకుండా, కంటికి హానిచేసే ఇతర కారకాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. నియంత్రణలో శరీర బరువు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ చెందిన ఆప్తాల్మాలజీ విభాగంలో జరిపిన బీవర్ డ్యామ్ ఐ అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యంపై మాడిసన్, స్థూలకాయం ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించింది. అధిక బరువు కారణంగా కంటిలోపలి భాగం నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెల్పింది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచే ఆహారపు అలవాట్లవల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు. ధూమపానానికి దూరంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ అలవాటు కంటి చూపులో మార్పులకు కారణం అవుతుందని వెల్లడించింది. పొగతాగని వారితో పోల్చితే స్మోకింగ్ చేసేవారిలో కాంటరాక్ట్ వంటి కంటి సమస్యలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సూచలను పాటిస్తే మీ కంటి చూపు జీవితకాలంపాటు పదిలంగా ఉంచుకోవచ్చని ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచిస్తున్నారు. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
కరెంట్ షాక్‌తో మంచి చూపు!
వాషింగ్టన్: మెదడులోకి ఇరవై నిమిషాల పాటు స్వల్పంగా కరెంటు ప్రసరింపజేయడం రెండు గంటల పాటు మన చూపును మెరుగు పరుస్తుందని పరిశోధనలో తేలింది. దీని వల్ల మెదడులోని ఇతర ప్రాంతాల్లోనూ ఆలోచించే శక్తి పెరుగుతుందట. కళ్లద్దాలు, లెన్స్‌లు లేకుండా ఎలా చూపును మెరుగుపరచాలన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇరవై మంది ఆరోగ్యవంతులైన, కంటి చూపు బాగున్న యువకులపై వీరు ఈ పరిశోధన నిర్వహించారు. ముందుగా వీరికి పరస్పరం లంబంగా ఉన్న రెండు సరళ రేఖలను చూపించారు. అనంతరం వారి మెదడులోకి 20 నిమిషాల పాటు స్వల్పంగా కరెంటు పంపా రు. ఆ తర్వాత వీరిలో 75 శాతం మంది ఇంతకు ముందు చెప్పిన సమాధానం కంటే సరైన సమాధానం చెప్పారట. -
వయాగ్రా వాడితే కళ్లు పోతాయి!
శృంగార సమస్యలకు ఏకైక పరిష్కారంగా వచ్చిన అద్భుతమైన మందు వయాగ్రా. కానీ, ఇది ఎక్కువ కాలం వాడితే.. కంటి చూపు దెబ్బతింటుందట. ఈ విషయం తాజా పరిశోధనలలో వెల్లడైంది. అయితే ఇది అందరికీ కాదు. ఒక రకమైన మ్యుటేషన్ ఉన్నవాళ్లకు మాత్రమే ఇలా జరుగుతుందట. రెటీనా నుంచి మెదడుకు కాంతి సంకేతాలను పంపే ఒక ఎంజైమును సిల్డెనాఫిల్ అడ్డుకుంటుంది. వయాగ్రాను మరీ ఎక్కువ డోసుల్లో ఉపయోగించేవాళ్లకు కంటి పరమైన సమస్యలు రావచ్చన్న విషయం ఇంతకుముందు ఔషధ ప్రయోగాలలో కూడా తేలింది. బాగా ఎక్కువ కాంతిని చూడలేకపోవడం, చూపు మందగించడం, రంగులు కూడా వేరేగా కనపడటం లాంటి సమస్యలు వీళ్లకు రావచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన లీసా నివిజన్ స్మిత్ తెలిపారు. రెటినైటిస్ పిగ్మెంటోసా అనే కంటి వ్యాధికి సంబంధించి మ్యుటెంట్ జన్యువు కాపీ ఒక్కటే ఉన్నవాళ్ల విషయంలోనే తాము ఎక్కువగా ఆందోళన చెందుతున్నామన్నారు. ఇందుకోసం ముందుగా ఇలా జన్యువు ఒకే కాపీ ఉన్న ఎలుకలకు సిల్డెనాఫిల్ మందు ఇచ్చి చూశారు. ఆ ఎలుకకు చూపు మందగించడం స్పష్టంగా తేలింది. రెటినైటిస్ పిగ్మెంటోసా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. దీనివల్ల చివరకు అంధత్వం వస్తుంది.