breaking news
extreme weather
-
గంటకు 285 కి.మీ వేగం.. మెక్సికో వైపు ‘పోలో’!
మెక్సికో: సముద్రం వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి.. భారీగా ఎగసిపడుతున్న అలలు, వేగంగా వీస్తున్న గాలులు.. మరోవైపు భారీ వర్షాల హెచ్చరిక. పసిఫిక్ సముద్రంలో బలంగా ఏర్పడిన ‘పోలో’ హరికేన్ మెక్సికో తీర ప్రాంతాల వైపు కదులుతోంది. తుపాను తీవ్రత కొంత తగ్గినా.. ఇంకా చాలా బలంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుపాను నేరుగా తీరాన్ని తాకే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. దాని ప్రభావంతో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.‘పోలో’ తొలుత కేటగిరీ-5 తుపానుగా కొనసాగింది. ప్రస్తుతం కేటగిరీ-4కి బలహీనపడింది. అయినా గాలుల వేగంలో పెద్దగా తగ్గుదల కనిపించలేదని అధికారులు తెలిపారు. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA)కు చెందిన హరికేన్ హంటర్ విమానం తుపాను మధ్యలోకి వెళ్లి పరిశీలించింది. ఈ సమయంలో గంటకు సుమారు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు గుర్తించింది. ‘పోలో’ నెమ్మదిగా వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ అధికారులు తెలిపారు.తుపాను ప్రభావంతో మెక్సికో నైరుతి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జాలిస్కో, కొలిమా, మిచోవాకాన్ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడొచ్చని హెచ్చరించారు. సముద్రంలో భారీ అలలు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక ‘పోలో’ బలంగా ఉండటానికి సముద్రంలో పెరిగిన వేడి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో పసిఫిక్ సముద్ర జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కాయి. సెప్టెంబర్ 19న పసిఫిక్‌లోని కీలక ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.05 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. 2015లో నమోదైన 3.02 డిగ్రీల రికార్డును ఇది అధిగమించింది. సముద్ర జలాలు వేడిగా ఉన్నప్పుడు తుపానులకు ఎక్కువ శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా సముద్రం వేడిగా ఉండటంతో ‘పోలో’కు అదనపు శక్తి అందుతోందని.. దీంతో తుపాను ఇంకా బలంగానే కొనసాగుతోందని వారి అంచనా.ఇదీ చదవండి: నేపాల్ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది! -
మంచుకొండల్లో మృత్యుఘోష
శివాజీనగర: హిమాలయ పర్వతాల్లో విహారయాత్రకు వెళ్లిన కన్నడిగులకు చేదు అనుభవం ఎదురైంది. నిత్య జీవితంలో ఒత్తిళ్ల నుంచి దూరంగా పర్వతారోహణకు వెళ్తే పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీలో తెహరి జిల్లా సరిహద్దు భాగాల్లో మంచుకొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్నవారిలో కర్ణాటకకు చెందిన 18 మందితో పాటుగా 22 మంది వర్షం, మంచు, ప్రతికూల వాతావరణంలో చిక్కుకుపోయారు. వారిలో 5 మంది మృతి చెందగా, పలువురు మిస్సయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ముమ్మరంగా సహాయక చర్యలు మంగళవారం రాత్రి నుంచి అక్కడి ప్రభుత్వం సైన్యం, హెలికాప్టర్లతో సహాయక చర్యలను చేపట్టింది. కర్ణాటకకు చెందిన పలువురిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. సౌమ్య వివేక్ (37) వినయ్ కృష్ణమూర్తి (47) శివజ్యోతి, సుధాకర్, బీ.ఎన్.నాయుడు (64), సతి గురురాజ్ (40), సీనా (48)తో పాటుగా పలువురిని కాపాడినట్లు తెలిపారు. 9 మంది అదృశ్యం? బెంగళూరుకు చెందిన సుజాత (52), పదిని హెగ్డే (35), చైత్ర (48), సింధు (45) వెంకటేశ్ ప్రసాద్ (55), అనిత (61), ఆశా సుధాకర్ (72), పద్మనాభ్ కేపీఎస్ (50), వినాయక్ (52) అదృశ్యమైనట్లు ఉత్తరాఖండ్ అధికారులు ప్రకటించారు. 13 మంది ఆరోగ్యం విషమంగా ఉండగా వారిని సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెల 29 నుంచి ట్రెక్కింగ్ ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ ద్వారా వారు హిమాలయాల అధిరోహణకు మే 29వ తేదీన వెళ్లినట్లు తెలిసింది. వారు జూన్ 7వ తేదీన తిరిగి రావాలి. అయితే మార్గమధ్యలో సహస్రతాల్ అనే చోట విపరీతమైన మంచు తుపాను, చలిగాలుల్లో వారు చిక్కుకుపోయారు. ఆ బృందంలో 18 మంది బెంగళూరు వాసులు, ఒకరు పూణెవాసి, ముగ్గురు స్థానిక గైడ్లు ఉన్నారు. మంత్రి కృష్ణభైరేగౌడ బాధితులకు సహాయం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. #TrekkingTragedy 9 #Bengalureans, who were part of a 22-member trekking team, #died following bad weather at Sahastra Tal in #Uttarakhand.#Rescue operations launched 👇#Karnataka’s revenue minister @krishnabgowda rushes to rescue site. pic.twitter.com/dKDNufdjiw— TOI Bengaluru (@TOIBengaluru) June 5, 2024 -
ఉదయం ఉక్కపోత.. సాయంత్రం చినుకులు
రాష్ట్రంలో వింత వాతావరణం చోటు చేసుకుంటోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. సాధారణంగా ఉక్కపోత, చెమట లాంటివి మచ్చుకైనా కనపడని రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పరిస్థితి. పగలు ఎక్కడైనా బయటకు వెళ్లి కాసేపు ఉన్నారంటే చాలు.. విపరీతంగా చెమట పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం అయ్యేసరికి మబ్బులు కమ్మి వర్షం పడుతోంది. స్వల్ప విరామంగా రుతుపవనాలు పొరుగు ప్రాంతాలకు వెళ్లడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితి, ఉష్ణోగ్రతల నమోదు, ఉక్కపోత తదితర వివరాలతో కూడిన నివేదికను విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీ పంపించారు. సాధారణంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు నైరుతి సీజన్ ఉంటుంది. అయితే ఈసారి సెప్టెంబర్ ప్రారంభంలోనే రాష్ట్రం వేడెక్కింది. నైరుతి సీజన్లో 32 నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణం కాగా.. ప్రస్తుతం ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం, తుని, మచిలీపట్నం, విశాఖ తదితర ప్రాంతాల్లో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్నాళ్లు 37 డిగ్రీల ఉష్ణోగ్రత తప్పదని అధికారులు చెపుతున్నారు. కోస్తాంధ్రలోని ఉత్తర/దక్షిణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా పగలు ఎండ హడలెత్తిస్తున్నా.. సాయంత్రానికి వర్షం పడుతోంది. మధ్య భారతంలో కూడా తేమ శాతం పెరుగుతున్నందున వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, క్యూములో నింబస్ మేఘాలూ ఇందుకు సహకరిస్తుండడం వల్లే వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరుకు రుతుపవనాల తిరోగమనం ప్రారంభవుతుందని, అక్టోబర్ మధ్యలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఈ మధ్య కాలంలో ‘క్లియర్ స్కైస్’ (శరత్కాలం) ఉంటుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి అచ్యుతరావు స్పష్టం చేశారు. ఈ సీజన్లో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయని, వీటినే రుతుపవనాల విరామంగా చెప్పుకోవచ్చని, అయితే ఇది తాత్కాలికమేనని చెప్పారు. కాగా, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని వల్ల రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.


