breaking news
Extreme dissatisfaction
-
సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీజేఐ తొలిసారి అధికారిక పర్యటనకు వస్తే ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ లేదా నగర పోలీసు కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఈ నెల 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గవాయ్‌ని మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ సన్మానించింది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆయన ఆదివారం ముంబై చేరుకున్నారు. సీఎస్, డీజీపీ, పోలీసు కమిషనర్ స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ దీన్ని ఎత్తి చూపారు. ‘‘నేను మహారాష్ట్రలోనే పుట్టి పెరిగా. సీజేఐ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సీఎస్, డీజీపీ ఆలోచించుకోవాలి. నేనేమీ ప్రొటోకాల్ కోసం బలవంతం చేయడం లేదు. ఇలాంటి చిన్నచిన్న విషయాలు పట్టించుకోను. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రస్తావిస్తున్నా’’ అని వివరించారు. ‘‘ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142ను ప్రయోగించేవారు’’ అని జస్టిస్ గవాయ్ సరదాగా వ్యాఖ్యానించారు.రాజ్యాంగమే అత్యున్నతం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే అత్యున్నతమని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మాత్రం అది మార్చలేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం ఇదేనన్నారు. తాను వెలువరించిన 50 కీలక తీర్పులతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేరగాళ్ల ఇళ్లను కూల్చడం (బుల్డోజర్ న్యాయం) కూడదంటూ తానిచి్చన తీర్పు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
'మీకు దండం పెడతా..'
హైదరాబాద్: 'మీకు దండం పెడతా.. ప్రజల సమస్యల్ని వెంటనే పరిష్కరించండి.. లేకుంటే మీ కార్యాలయాల ఎదుట ప్రజలతో కలసి ధర్నాకు దిగాల్సి వస్తుంది..' అని అధికారులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్.11లో అక్కడి నివాసితులతో కలిసి గురువారం ఆయన సమావేశమయ్యారు. ఎన్నిసార్లు సమావేశాలు పెట్టి చెప్పినా సమస్యలు పరిష్కారం కావటం లేదని.. ఈ సందర్భంగా అధికారుల తీరుపై స్థానికులు మండిపడ్డారు. ముఖ్యంగా వాటర్ వర్క్స్ అధికారుల నిర్లక్ష్య ధోరణిని స్థానికులు ఎమ్మెల్యే చింతల ముందే ఎండగట్టారు. నీళ్లు రావడం లేదని, డ్రైనేజి పొంగిపొర్లుతోందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వీటన్నింటినీ విన్న ఎమ్మెల్యే.. ఎన్నిసార్లు మొత్తుకోవాలంటూ అధికారులను ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకపోతే వాటర్‌వర్క్స్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించారు. 'మీరుండీ ఏం ప్రయోజనం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్‌వర్క్స్ జీఎం రమణారావు, బంజారాహిల్స్ వాటర్‌వర్క్స్ డీజీఎం యోగానంద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. (బంజారాహిల్స్)