
హైకోర్టులకు సూచించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సాధారణ, ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణను దీర్ఘకాలంపాటు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటువంటి చర్య న్యాయాన్ని నిరాకరించడమే కాదు, రాజ్యాంగ హక్కులను నిరాకరించడం కూడా అవుతుందని పేర్కొంది. బెయిల్ పిటిషన్లు దాఖలైన తేదీ నుంచి రెండు నెలల్లోగా వాటిపై నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన దరఖాస్తులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచలేమని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం తెలిపింది.
తమ పరిధిలోని దిగువ కోర్టుల్లోనూ బెయిల్ పిటిషన్లపై సత్వర నిర్ణయాలు తీసుకునేలా పర్యవేక్షించాలని హైకోర్టులకు సూచించింది. దీనిపై తగు మార్గదర్శకాలను జిల్లా కోర్టులకు పంపించాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థలు కేసుల దర్యాప్తును త్వరితగతిన ముగించాలని ధర్మాసనం కోరింది. మోసం కేసులో తన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం పైవిధంగా స్పష్టతనిచి్చంది.