breaking news
Exeter University students
-
మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!
వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావడం సహజమే. అయితే తెలిసిన వ్యక్తులను గుర్తుపట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయలేకపోవడం వంటివి డిమెన్షియా (చిత్తవైకల్యం) లక్షణాలు కావచ్చు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, ముప్పును తగ్గించేందుకు బ్రిటన్లోని ఎక్సెటర్ యూనివర్సిటీ ‘బ్రెయినియాక్ హబ్’ పేరుతో పరిశోధన చేపట్టనుంది. ఆరేళ్ల పాటు సాగే ఈ ప్రాజెక్టుకు 20 మిలియన్ పౌండ్ల నిధులు కేటాయించారు.డిమెన్షియా అంటే.. మెదడు పనితీరు క్రమంగా క్షీణించే పరిస్థితి. దాంతో జ్ఞాపకశక్తి, ఆలోచించే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడటం, రోజువారీ పనులు చేసుకోవడం వంటి సామర్థ్యాలు దెబ్బతింటాయి. ఇది ఒకే వ్యాధి కాదు. మెదడును ప్రభావితం చేసే వివిధ వ్యాధుల వల్ల ఏర్పడే లక్షణాల సమూహమని వైద్యులు చెబుతున్నారు.ప్రధాన లక్షణాలు..డిమెన్షియా ఉన్నవారు ఇటీవల జరిగిన విషయాలను పదేపదే మర్చిపోతుంటారు. తెలిసిన వ్యక్తుల పేర్లు, ముఖాలను గుర్తుపట్టలేకపోతుంటారు.అలాగే వస్తువులను ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, ఒకే ప్రశ్నను పదేపదే అడగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, డబ్బుల లెక్కలు చూసుకోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.దాంతోపాటు తెలిసిన దారుల్లోనూ తికమక పడటం, ప్రవర్తన, స్వభావంలో మార్పులు రావడం వంటివి కనిపిస్తుంటాయి.డిమెన్షియా రావడానికి కారణాలు..మెదడులోని నాడీకణాలు దెబ్బతినడం లేదా క్రమంగా నశించడం వల్ల డిమెన్షియా రావచ్చు.అలాగే అల్జీమర్స్ వ్యాధి కూడా డిమెన్షియాకు ప్రధాన కారణాల్లో ఒకటి.మెదడుకు రక్తప్రసరణ దెబ్బతినడం వల్ల వచ్చే డిమెన్షియాను వాస్కులర్ డిమెన్షియా అంటారు.వయసు పెరగడం కూడా డిమెన్షియా ముప్పును పెంచే ముఖ్యమైన అంశమని వైద్యులు చెబుతున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ప్రతిరోజూ వ్యాయామం చేయడంతోపాటు పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.అలాగే తగినంత నిద్రపోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.పుస్తకాలు చదవడం, పజిల్స్ పరిష్కరించడం వంటి మెదడుకు వ్యాయామం కలిగించే పనులు చేయాలి.కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలి. దీనివల్ల ఒంటరితనం తగ్గుతుంది. అలాగే ధూమపానం, అధిక మద్యపానానికి దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.వినికిడి సమస్యలు ఉంటే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.అయితే, ఇప్పటికే మెదడు స్కానింగ్, జన్యు సమాచారం, రక్త పరీక్షలు, జ్ఞాపకశక్తి పరీక్షలు, ఆరోగ్య రికార్డులు వంటి వివరాలను ఏఐ సాయంతో విశ్లేషించి వ్యాధి తొలి సంకేతాలను గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ఎక్సెటర్ యూనివర్సిటీ ‘బ్రెయినియాక్ హబ్’ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బ్రిటన్ వ్యాప్తంగా 10 బ్రెయిన్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేయనున్నారు. డిమెన్షియాను ముందుగానే గుర్తించడమే అతిపెద్ద సవాలని ప్రాజెక్టు డైరెక్టర్, ప్రొఫెసర్ డేవిడ్ లెవెల్లిన్ తెలిపారు. ఈ సాంకేతికతతో లక్షణాలు బయటపడకముందే ముప్పును గుర్తించి, వ్యక్తిగత నివారణ ప్రణాళిక రూపొందించవచ్చని చెప్పారు.ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రతి మతిమరుపూ డిమెన్షియా కాదు. కొన్ని మతిమరుపు సమస్యలకు చికిత్సతో ఉపశమనం లభించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!? -
ఎక్కువసేపు కూర్చున్నా రిస్క్ లేదట!
లండన్: గంటల తరబడి కూర్చుని ఉంటే.. ఆరోగ్యానికి ముప్పనే అభిప్రాయం ఉండేది. అయితే.. తాజా పరిశోధనలు మాత్రం.. అతిగా కూర్చోవటం వల్ల ప్రాణానికొచ్చిన ప్రమాదమేమీ లేదంటున్నాయి. లండన్లోని ఎక్స్టర్ వర్సిటీ విద్యార్థులు కొందరు 16 ఏళ్లపాటు 5వేల మందిపై పరిశోధనలు చేశారు. నాలుగు భిన్నమైన పద్ధతుల్లో కూర్చునే(పనిచేస్తున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, టీవీ చూస్తూ, విశ్రాంతి సమయంలో టీవీ లేకుండా) వారిపై.. వ్యాయామం చేసే మరికొందరిపై పరిశోధన చేశారు. వయసు, ఆరోగ్యం, ఆహారం వంటి వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే.. 16 ఏళ్లపాటు పరిశోధించినా.. ఎక్కువగా కూర్చునే వారికి.. మిగిలిన వారితో పోలిస్తే.. ఆరోగ్యం విషయంలో ముప్పు ఉన్నట్లు బయటపడలేదని.. రిస్క్ ఇద్దరికీ సమానంగానే ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు చెప్పారు.


