breaking news
ex seviceman
-
కేంద్రం కీలక నిర్ణయం.. వారికి రూ.3వేల ఆర్థిక సాయం
Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా, సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.అయితే, అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. కాగా, రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అనాథ పిల్లలు(కుమార్తె, కుమారుడు)21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్ -
మాజీ సైనికుని కుటుంబం దారుణ హత్య
-అహ్మద్‌నగర్‌లో వెలుగుచూసిన ఘటన సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లాలోని శేవ్‌గావ్ తాలూకాలో మాజీ సైనికుని కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఇందులో మాజీ సైనికుడు అప్పాసాహెబ్ హరవణే (50), భార్య సునంద (45), కూతురు స్నేహల్ (21), కుమారుడు మకరంద్ (14) ఉన్నారు. అప్పాసాహెబ్ ఓ ప్రభుత్వ సంస్థలో చౌకీదార్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం పాలవాడు వచ్చి తలుపు తట్టినప్పటికీ ఎవరు తీయలేదు. దీంతో ఇరుగుపొరుగువారి సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి తొంగి చూడగా కుటుంబ సభ్యులంతా రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పదునైన కత్తులతో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కేసును పరిశీలిస్తున్నారు.