breaking news
errbelli mother adilakshmi dead
-
ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ పరామర్శ
-
ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ పరామర్శ
వరంగల్ : మతృవియోగం విషాదంలో ఉన్న పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం పర్వతగిరి చేరుకున్న ఆయన ఎర్రబెల్లి మాతృమూర్తి ఆదిలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె భౌతికకాయాన్ని వరంగల్ జిల్లా పర్వతగిరి తరలించారు. ఇవాళ ఆదిలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎర్రబెల్లిని పరామర్శించిన వారిలో స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.