breaking news
erase
-
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ.. -
అసమానతలు రూపుమాపేందుకు కృషి
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గన్నవరం : దేశంలోని ఆర్థిక అసమానతలు, వివక్షతను రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ 66వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా మండలంలోని కేసరపల్లి శివారు జీసస్ గ్రేస్ లెప్రసీ కాలనీలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల సంక్షేమ కోసం శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వెంకయ్య నాయుడు పాల్గొని కాలనీవాసుల కోసం బహూకరించిన ఎల్ఈడీ టీవీని ప్రారంభించారు. అనంతరం 25 కుటుంబాలకు పండ్లు, దుప్పట్లు, నూతన వస్త్రాలు, 10 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘ కార్యదర్శి ఎ. చంద్రశేఖర్ స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకుండా అక్కున చేర్చుకోవాలని కోరారు. కాలనీలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నూజివీడు సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు. స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా కాలనీవాసులకు ఉపకరణాలు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, జిల్లా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, ఎంపీపీ పట్రా కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు మరీదు లక్ష్మీదుర్గ, సర్పంచ్ సాతులూరి శివనాగరాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహాయ అధికారి డీవీఎస్ఎన్ శాస్త్రి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల ఆంజిబాబు పాల్గొన్నారు. -
మాయదారి పెన్ను : రాసింది రాసినట్టే మాయం!!