breaking news
EMA
-
బయోకాన్‌కు భారీ షాక్
ముంబై: కొనుగోళ్లతో జోరుగా స్టాక్‌మార్కెట్ లో పార్మా కౌంటర్ నష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా దేశీ ఫార్మా సంస్థ బయోకాన్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. బయోకాన్ కేన్సర్ మందు ట్రస్టుజుమాబ్ పై యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఔషధం ఫైలింగ్‌ను ఉపసంహరించుకుందున్న వార్తలతో దాదాపు 8శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నమోదవుతోంది. యూరోపియన్ ఔషధ అథారిటీ(ఈఎంఏ) నుంచి ఇటీవల ట్రస్టుజుమాబ్కు ప్రమాణాలకు తగిన తయారీ(జీఎంపీ) గుర్తింపును పొందినప్పటికీ కంపెనీ అప్లికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు నిర్ణయించుకుంది. దీనిపై స్పందించిన బయోకాన్ఎండీ కిరణ మజుందార్ షా బయోకాన్ యూరోపియన్ రెగ్యులేటరి అధికారులు ట్రస్టుజుమాబ్, పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ఉత్పత్తులకు ఔషధాలపై పునర్ తనిఖీ కోసం సంస్థకు సమాచారం అందించారని చెప్పారు. అమెరికా రెగ్యులేటరీ యూఎఫ్డీఏకు ఈఎంఏకు చాలా తేడా వుందనీ దీన్ని గమనించాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
బయోకాన్ నికర లాభం 17 శాతం జంప్
న్యూఢిల్లీ: బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.147 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.126 కోట్లు)తో పోల్చితే 17 శాతం వృద్ధి సాధించామని బయోకాన్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.857 కోట్ల నుంచి రూ.952 కోట్లకు పెరిగిందని తెలిపింది. బయోలాజిక్స్, బ్రాండెడ్ ఫార్ములేషన్స్ తదితర అన్ని విభాగాల్లో మంచి వృద్ధి సాధించిన కారణంగా పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించామని బయోకాన్ చైర్పర్సన్, ఎండీ, కిరణ్ మజుందార్ షా చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బయోకాన్ షేర్ 1.2 శాతం నష్టపోయి రూ.702 వద్ద ముగిసింది. బయోకాన్, మైలాన్ దరఖాస్తు స్వీకరించిన ఈఎంఏ పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ప్రొడక్ట్‌కు చెందిన మైలాన్ మార్కెటింగ్ అథరైజేషన్ అప్లికేషన్ (దరఖాస్తు) సమీక్షకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఆమోదం తెలిపిందని బయోటెక్ దిగ్గజ కంపెనీ ‘బయోకాన్’ పేర్కొంది. ఈ అప్లికేషన్లో ప్రొడక్ట్‌కు సంబంధించిన క్లినికల్, ప్రి-క్లినికల్, అనలిటికల్, ఫంక్షనల్ వంటి తదితర అంశాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ ప్రొడక్ట్‌ను క్యాన్సర్ రోగుల కెమియోథెరపీ చికిత్సలోని న్యూట్రోపినియా కాలాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రొడక్ట్‌ను బయోకాన్, మైలాన్ కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.