breaking news
Elvish Yadav
-
బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై.. నిందితుడు అరెస్ట్
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. ఆ సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, తాజాగా ఆ కాల్పులకు తెగబడిన వారిలో ఒకరిపై పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు.గురుగ్రామ్‌లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులకు పాల్పడింది ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీ (19)గా పోలీసులు గుర్తించారు. ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీకి చెందిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతని సమాచారం అందడంతో అతని కదలికలపై నిఘా పెట్టారు. నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో అతనికి సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్‌లోని కొందరిని కలిసేందుకు ఇషాంత్ వెళ్తుండగా పోలీసులు వెంబడించారు. దీంతో పోలీసు బృందంపై ఆటోమేటిక్ పిస్టల్‌తో ఇషాంత్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో పోలీసుల టీమ్ కూడా అతని కాలిపై గన్‌తో కాల్చడంతో కిందపడిపోయాడు. గాయాలతో ఉన్న ఇషాంత్‌ను అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. -
బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు
హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు 24 బుల్లెట్లు ఆయన ఇంటిలోకి దూసుకెళ్లాయి. గురుగ్రామ్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చేరుకుని కాల్పులు జరిపారు.దాడి చేసిన వ్యక్తులు పరారీలో ఉన్నారు. కాల్పులు జరిగినప్పుడు ఎల్విష్ యాదవ్ తన నివాసంలో లేడు. వివాదాస్పద యూట్యూబర్‌గా ఆయన పేరుంది. బహుళ అంతస్తులతో నిర్మించిబడిని ఆయన ఇంటి కింది అంతస్తులలో బుల్లెట్లు దూసుకుపోయాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ఈ సంఘటన ఈరోజు ఉదయం 5.30 మరియు 6 గంటల మధ్య జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు సెక్టార్ 57లోని యాదవ్ ఇంటిపై 24 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. దాడి జరిగినప్పుడు అతని కేర్ టేకర్, కొంతమంది కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదు.' అని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన వారు విచారణ ప్రారంభించారు.2024లో నోయిడా పోలీసులు ఎల్విష్‌ను రేవ్ పార్టీలో పాము విషం సరఫరా కేసులో అరెస్టు చేశారు. అతడి దగ్గర 9 పాములతో పాటు 20ml పాము విషం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కాశీ విశ్వనాథ ఆలయ సముదాయంలో ఫోటోలు, వీడియోలు తీసినందుకు ఎల్విష్‌పై కేసు నమోదైంది. జైపూర్‌లోని ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తిని ఎల్విష్ యాదవ్ చెంపపగలగొట్టిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలు వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి. -
30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్‌బాస్ విన్నర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ ఒకరు. ఏప్రిల్ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్ కోసం ఏప్రిల్ 21న కశ్మీర్ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ నేలకొరిగారు.పెళ్లయిన ఆరు రోజులకే..కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్‌కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్మేట్ అని గుర్తు చేసుకున్నాడు. ఇంకా షాక్‌లోనే ఉన్నా..ఎల్విష్ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్‌కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్‌లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!31వ సారి ఫోన్ ఎత్తిందిఅందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ ఒకరు తనకు 30 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 31వ సారి ఫోన్ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్ యాదవ్.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ విజేతగా నిలిచాడు.చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే: నాని