breaking news
	
		
	
  Eluru DSP
- 
  
    
                
      ఏలూరులో పోలీసులు విస్తృత తనిఖీలు
 - 
      
                   
                               
                   
            ఏలూరులో పోలీసులు విస్తృత తనిఖీలు

 ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరంలోని పాముల దిబ్బ ప్రాంతంలో గత అర్థరాత్రి నుంచి పోలీసులు ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అలాగే అనుమానితుల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు నగర డీఎస్పీ సరిత నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. నగరంలో నేరాలను అదుపు చేసేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు నగర డీఎస్పీ సరిత వెల్లడించారు.
 పాముల దిబ్బ ప్రాంతంలో అనుమానితులు, పాత నేరస్తులకు చెందిన 41 ఇళ్లలో ఇప్పటి వరకు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. బుధవారం అర్థరాత్రి ప్రారంభమైన ఈ తనిఖీలు గురువారం ఉదయం కూడా కొనసాగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఈ తనిఖీలలో ఏలూరు నగరం, రూరల్ పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులు పాల్గొన్నారని డీఎస్పీ సరిత తెలిపారు. 


