breaking news
eloped with girl
-
భార్య తనతో రావడానికి నిరాకరించిందని.. మరదలితో కలిసి..
పాట్నా: భార్య తనతో రావడానికి నిరాకరించిందని ఓ వ్యక్తి తన మరదలితో కలిసి పారిపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛప్రా జిల్లాకు చెందిన కృష్ణ రామ్ అనే వ్యక్తికి 12 సంవత్సరాల కిత్రం సంకటి దేవితో వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వీరి కాపురంలో తరువాత గొడవలు తలెత్తాయి. దీంతో సకంటి దేవి తన తల్లిగారి ఇంటికి వెళ్లి నివసిస్తోంది. ఈ క్రమంలో తన భార్యను పుట్టింటి నుంచి తీసుకొచ్చేందుకు రామ్ అత్తవారింటికి వెళ్లాడు. అయితే భర్తతో పాటు వెళ్లడానికి ఆమె నిరాకరించంది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ రామ్.. మైనర్ అయిన తన మరదలికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకొని పారిపోయాడు. దీంతో మైనర్ తండ్రి తన కూతురిని కిడ్నాప్ చేశారంటూ రామ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరి ఆచూకీ వెతికి పట్టుకున్నారు. అయితే అప్పటికే మైనర్ తనకు బాల్యం వివాహం చేస్తున్నారని సొంత కుటుంబానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతలో పోలీసులు ఇద్దరి ఆచూకి కనుగొన్నారు. మైనర్ని కిడ్నాప్ చేసినందుకు రామ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల నుంచి తప్పించుకునేందుకే రామ్‌తో కలిసి పారిపోతున్నట్లు మైనర్ పోలీసులకు చెప్పింది. ఈ కేసుపై పూర్తి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. చదవండి👉 బంజారాహిల్స్: వివాహితతో రెండేళ్లుగా సహజీవనం..దూరం పెడుతోందని.. -
ప్రియురాలితో పారిపోతూ.. కాల్వలో పడి గల్లంతు!
ప్రియురాలితో కలిసి పారిపోయే ప్రయత్నంలో పంటకాలువలో పడి గల్లంతయ్యాడు ఓ యువకుడు. ఈ ఘటన పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో జరిగింది. హైదరాబాద్ అల్వాల్‌లో మెకానిక్‌గా పనిచేసే వినయ్‌కుమార్... భీమవరానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం పెద్దవాళ్లకు తెలిసి అమ్మాయిని వాళ్ల వాళ్లు తీసుకెళ్లిపోయారు. దీంతో వినయ్ అమ్మాయి ఊరెళ్లి, వాళ్ల బంధువులతో గొడవ పడ్డాడు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. అనుకున్న ప్రకారం ఇద్దరూ కలిసి పారిపోయే ప్రయత్నంలో వినయ్ తాడేరు పంటకాల్వలో దిగాడు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు గల్లంతయ్యాడు. ప్రియురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి వినయ్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.