breaking news
Elevated
-
ఎలివేటెడ్ కారిడార్లతో ట్రాఫిక్‌కు చెక్
స్కైవేస్, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్స్ అవశ్యం తెలంగాణ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేస్, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్స్ వంటివే పరిష్కారమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. వీటిని నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన పలు ప్రదేశాల ఎంపిక కోసం శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో పాతబస్తీ, కొత్తబస్తీ అనే తేడా లేకుండా ఎక్కడిపడితే అక్కడ... ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్ జామ్‌లు సర్వసాధారణమయ్యాయని, జంక్షన్ల వద్ద ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోందని సీఎం తెలిపారు. ప్రధాన రహదారులపై జిల్లాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు అవసరమైన నివేదికలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఇదివరకే ఆదేశించిన సంగతి విదితమే. కన్సల్టెంట్ల సాయంతో, బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను అధికారులు గుర్తించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు పెట్టారు. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ఎవరిదారిలో వారు పోవడానికి వీలయ్యేలా మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్స్ నిర్మించడంపై చర్చించారు. అధికారులు గుర్తించిన ట్రాఫిక్ ప్రాంతాలు... 1. హరిహరకళాభవన్ నుంచి ఉప్పల్.. 2. మాసాబ్‌ట్యాంక్ నుంచి హరిహర కళాభవన్ 3. నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ 4. తార్నాక నుంచి ఈసీఐఎల్ 5.చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ ఇలా నగరంలో మొత్తం దాదాపు 11 స్కైవేలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. స్కైవేల నుంచి రోడ్డు మారే ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటికి అనుగుణంగా అండర్‌వేలు నిర్మించాలని సూచించారు. నగరంలో దాదాపు 35-40 కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఒక్కసారి సిగ్నల్ పడితే వందలాది వాహనాలు ఆగిపోవాల్సి వస్తోందని, భవిష్యత్‌లో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నట్టు జంక్షన్ల వద్ద ఎత్తుగా సెపరేటర్స్ నిర్మించాలన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్ పార్క్ చుట్టూ, ఖైరతాబాద్, సచివాలయం, అంబేద్కర్ సెంటర్, నెక్లెస్‌రోడ్డు చౌరస్తా, ఆబిడ్స్, చాదర్‌ఘాట్, కోఠి, ఒవైసీ హాస్పిటల్, తిరుమలగిరి జంక్షన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సంగీత్, పారడైజ్, తదితర జంక్షన్ల వద్ద మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్స్ అవసరం ఉందన్నారు. ఎక్కడైనా మెట్రోరైలు లైను అడ్డుగా వస్తే.. దానిపై నుంచి మార్గం నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. వీటికి సంబంధించి డిజైన్స్, ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, సలహాదారు బీవీ పాపారావు, జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నరసింగరావు, రవాణారంగ నిపుణులు పాల్గొన్నారు. -
మలి పరుగు
సాక్షి, సిటీబ్యూరో/ ఉప్పల్: నగరవాసుల కలల మెట్రోరైలు వరుసగా రెండోరోజూ పరుగులు పెట్టింది. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాగోల్ మెట్రో డిపో నుంచి-సర్వేఆఫ్ ఇండియా వరకు రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గం లో సుమారు 20 కేఎంపీహెచ్ వేగంతో మొత్తం పదికిలోమీటర్లు(ఐదు ట్రిప్పులు) విజయవంతంగా రాకపోకలు సాగిం చినట్లు ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో మెట్రోరైలుకు ఆగి ఉన్నప్పుడు, ఎలివేటెడ్ మార్గంలో పయనిస్తున్నప్పుడు మొత్తం 18 పరీక్షలను నిర్వహించామని, ఆయా పరీక్షలను రైలు విజయవంతంగా పాసైందని వెల్లడించారు. మళ్లీ సోమవారం ప్రయోగపరీక్ష(టెస్ట్న్)ర ఉం టుందని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ యా విడిభాగాలను సరఫరా చేసిన సంస్థలుఅన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించన తర్వాతనే భద్రతా సర్టిఫికెట్లు జా రీ చేస్తాయని.. అప్పుడు ట్రయల్న్ ్రనిర్వహిస్తామన్నారు. 60 రోజులపాటు ట్రయల్న్. ప్రస్తుతం నాగోల్ మెట్రో డిపోలోని నాలుగు మెట్రోరైళ్లతోపాటు త్వరలో కొరియా నుంచి మెట్రోడిపోకు చేరనున్న మరో మూడు రైళ్లను అంటే మొత్తం ఏడు రైళ్లను ట్రయల్న్‌క్రోసం సన్నద్ధం చేస్తామని ఎల్అండ్టీ అధికారులు తెలిపారు. ట్రయల్న్‌న్రు నాగోల్-మెట్టుగూడా రూట్లో ఎనిమిదికిలోమీటర్ల మార్గంలో 60 రోజులపాటు నిర్వహిస్తామన్నారు. మెట్రోరైలుకు నిర్వహించిన సాంకేతిక పరీక్షలివే.. 1. పట్టాలపై రైలు నిలిపి ఉన్నపుడు నాగోల్ డిపోలో స్టాటిక్ టెస్ట్-1 2. ఎలివేటెడ్ మార్గంలో పరుగులతీస్తున్నపుడు స్టాటిక్ టెస్ట్స్-2,3,4 3. ఎలివేటెడ్ మార్గంలోని ప్రధాన మార్గం(పట్టాలమార్గం) సామర్థ్యాన్ని పరీక్షించడం 4. పరుగులు తీస్తున్నపుడు ప్రొపల్షన్ సిస్టం పనితీరు 5. మెట్రో రైలు బ్రేకుల పనితీరు 6. శబ్దం, కూత, కదుపుల తీరుతెన్నులు 7. రైలులో అంతర్గత సమాచార వ్యవస్థ పనితీరు 8. రైలు పరుగెడుతున్నపుడు మొత్తం గమనం తీరుతెన్నుల రికార్డింగ్ 9. {పయాణికులకు సమాచారం అందించే వ్యవస్థ, సీసీటీవీలు, రైలుకున్న హెడ్లైట్లు (10), కంప్రెసర్ (11), రైలు ఆగినప్పుడు, పరుగులు తీస్తున్నపుడు ఆటోమేటిక్‌గా మూసుకొని, తెరుచుకొనే డోర్ల (12) పనితీరు 13.రైలులో వెంటిలేషన్, ఎయిర్‌కండిషన్ వ్యవస్థ, విపత్తులు సంభవిస్తే రైలులో వివిధ వ్యవస్థ (14)ల పనితీరు. 15.రీసెర్చ్ డిజైన్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ప్రమాణాల ప్రకారం ఆసిలేషన్, అత్యవసర బ్రేకుల పనిచేసే విధానం. 16. సిగ్నలిగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు. 17.ఓవర్‌హెడ్ ట్రాక్షన్ సిస్టం(విద్యుత్ గ్రహించే తీరు) 18.రిలయబిలిటీ(విశ్వసనీయత), అవైల్యబిలిటీ(సానుకూలత), మెయిన్టేనబిలిటీ(నిర్వహణ సామర్థ్యం), భద్రతకు సంబంధించిన ఇతర పరీక్షలు.