breaking news
EC voter card
-
15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు..
న్యూఢిల్లీ: ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు(ఎపిక్)ను ఓటర్లకు చేరవేసే విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లోగానే ఈ కార్డులు సంబంధిత ఓటర్లకు చేరేలా చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఈ కార్డుల డెలివరీకి నెల రోజులకుపైగా సమయం పడుతోంది. ఇప్పుడు ఈ సమయం సగానికి తగ్గిపోనుంది. ఇందుకోసం నూతన ప్రామాణిక నియమావళిని ఎన్నికల సంఘం రూపొందించింది. కొత్తగా ఓటర్గా పేరు నమోదు చేసుకున్న తర్వాత లేదా ప్రస్తుతం ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత 15 రోజుల్లోగా నూతన ఫొటో గుర్తింపు కార్డు ఓటర్లకు అందనుంది. ఓటరు గుర్తింపు కార్డు కోసం ఆన్లైన్లో ఇలా దరఖాస్తు చేసుకోండి.1. ముందుగా voters.eci.gov.in వైబ్సైట్ ఓపెన్ చేయాలి.2. న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్లో 'ఫిల్ ఫామ్ 6'పై క్లిక్ చేయండి.3. ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది.4. కొత్త యూజర్లు మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.5. తర్వాత మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. 6. మీ పేరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి OTPని నమోదు చేయండి.7. ఇప్పుడు ఫిల్ ఫామ్ 6పై క్లిక్ చేస్తే.. లింక్ ఓపెన్ అవుటుంది.8. ఫామ్ 6లో మీ రాష్ట్రం, జిల్లా, నియోజవర్గం వివరాలు నమోదు చేయాలి. 9. మీ పూర్తి పేరు వివరాలతో పాటు పాస్పోర్ట్ ఫొటో అప్లోడ్ చేయాలి.10. ఫోన్, ఆధార్ నంబరు, జెండర్, పెట్టినతేదీ, చిరునామాలతో పాటు సంబంధిత పత్రాలు అప్లోడ్ చేయాలి.ఈ వివరాలు అన్ని నమోదు చేసిన తర్వాత దరఖాస్తును ప్రివ్యూలో చూసుకోవాలి. అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ చేయాలి. 15 రోజుల్లోగానే ఎలక్టర్ ఫొటో ఐడెంటిటీ కార్డు మీరు పొందుతారు. చదవండి: ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు? -
అల్లు అర్జున్ పేరిట ఓటుకు దరఖాస్తు
సైబర్ క్రైం పోలీసులకుకలెక్టర్ సమాచారం ‘ఆన్లైన్’ దరఖాస్తుపై కేసు నమోదు వరంగల్ (పోచమ్మ మైదాన్) : ఇటీవల విడుదలైన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించిన విషయం విదితమే. ఈ మేరకు చరిత్రతో పాటు సినిమాలోనూ రాణి రుద్రమదేవికి అండగా నిలిచే ఆయనకు కాకతీయుల రాజధాని అయిన వరంగల్లో ఓటు హక్కు ఉండాలని అనుకున్నారో ఏమో కానీ... గుర్తు తెలియని వ్యక్తులు ఆ దిశగా ముందడుగు వేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం సినీ హీరో అల్లు అర్జున్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ‘అల్లు అర్జున్, తండ్రి అరవింద్, ఇంటి నంబర్ 16-10-1452. ఖిలా వరంగల్’ చిరునామాపై దరఖాస్తు రాగా.. వరంగల్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది గురువారం చేపట్టిన పరిశీలనలో ఈ దరఖాస్తును చూసి ఖంగుతిన్నారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించగా.. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.