breaking news
Earths atmosphere
-
ఈ బుల్లిరాయి భూమికే పెద్దన్న
ఇంటికి అతిథిగా చిన్ననాటి స్నేహితులు, ఆప్తులు వస్తే ఎంతో ఆత్మీయంగా, సాదరంగా ఆహ్వానిస్తాం. మళ్లీ ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తాం. అలాంటి ఎదురుచూపులకు తావివ్వకుండా ఒక అతిథి ఒక అమెరికన్ ఇంట్లోకి ప్రవేశించింది. తలుపు గడియ కొట్టి సింహద్వారం గుండా రాకుండా నేరుగా ఇంటి పైకప్పుకు కన్నం వేసి ఇంట్లోకి దూరింది. మెరుపువేగంతో దూసుకొచ్చిన ఆ అతిథిని చూసి ఆ ఇంటాయన అవాక్కయ్యారు. ఎందుకంటే అది చిన్న రాయి. అది కూడా నిన్న మొన్న నేల తవ్వి తీసిన రాయి కాదు. గట్టిగా మాట్లాడితే అది అసలు భూమి మీది రాయే కాదు. ఆ రాయి ఉద్భవించినప్పుడు మన పుడమి కూడా పుట్టలేదు. మరి ఆ రాయి ఎక్కడిది? అంటే అంతరిక్షంలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలోని గ్రహశకలాల కూటమి నుంచి భూమి వైపు ఇలా దూసుకొచ్చింది. భూమి ఏర్పడకముందు ఆస్ట్రరాయిడ్ బెల్ట్‌లోనే చక్కర్లు కొట్టిన ఈ రాయి జూన్ 26వ తేదీన భూవాతావరణంలోకి చొరబడి చివరకు అమెరికాలో నేలను తాకింది. ఈ బుల్లి గ్రహశకలానికి ‘ది మెక్డోనా’ అని పేరు పెట్టారు. జార్జియా రాష్ట్రంలోని ఒక ఇంటి పైకప్పుకు రంధ్రం చేసి మరీ లోపల పడిన ఈ రాయిని జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంతరిక్ష వస్తువుగా గుర్తించారు. అట్లాంటా ఆకాశంలో తోకచుక్కలా..భూమి మీద పడటానికి కొద్దిసేపటి ముందు పట్టపగలే ఇది తోకచుక్కలా అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ దూసుకొచ్చింది. చిన్నపాటి అగ్నిగోళంగా మండుతున్న దీనిని అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వీక్షించి తమ కెమెరాల్లో బంధించారు. ఎట్టకేలకు ఇది హెన్రీ కౌంటీనిలోని మెక్డోనా ప్రాంతంలోని ఇంట్లో ఇది పడింది. ఇది పడినప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్‌తో షూట్చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అచ్చం అలాంటి శబ్దం వచ్చిందని ఇంటి యజమాని చెప్పారు. విషయం తెల్సుకున్న జార్జియా వర్సిటీలోని భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్కాట్ హారిస్ వెంటనే రంగంలోకి దిగి ఆ ఇంట్లోని చెల్లాచెదురుగా పడిన 50 గ్రాముల ఖగోళదూళిని సేకరించారు. అందులో 23 గ్రాముల నాణ్యమైన ధూళిని అత్యంత శక్తివంతమైన ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌లతో పరిశీలించారు. అది ఏకంగా 456 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లో మెటల్(ఎల్) ఆర్డినరీ ఖోన్డ్రైట్ మూలకంతో ఏర్పడిందని తేల్చారు. ఈ లెక్కన ఈ రాయి భూమి కంటే ముందే ఏర్పడింది. ఇన్నాళ్లూ ఇది తన భారీ గ్రహశకలాలలో భాగంగా ఉండేది. అయితే దాదాపు 47 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలం మరింత చిన్నపాటి ముక్కలుగా ఛిద్రమైంది. అలా ఏర్పడిన చిన్నపాటి రాళ్లలో అమెరికాలో పడిన రాయి కూడా ఒకటి అని జార్జియా వర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. ‘‘ ఈ బుల్లి రాయి 0.50 క్యాలిబర్ బుల్లెట్ కంటే రెట్టింపు పెద్దదిగా ఉంది. కాంతి వేగంతో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించింది. భూ వాతావరణంలోకి వచ్చాక అధిక గాఢత ఉన్న గాలి దీని వేగాన్ని ఒక్కసారిగా తగ్గించింది. దీంతో ఘర్షణ ఏర్పడి మండింది. వేగం సెకన్‌కు కిలోమీటర్‌కు తగ్గి చివరకు పైకప్పును చీల్చుకుంటూ నేలపై పడింది. దీనికి అధికారికంగా పేరు పెట్టేందుకు గ్రహశకలాల సంఘం కమిటీకి పంపించారు. పేరు పెట్టాక గ్రహశకలాల సంబంధ బులె టిన్‌లో ముద్రి స్తారు. పురాతన ఖగోళ ఖజా నాగా దీనిని అభి వర్ణిస్తున్నారు. దీని నిర్మాణం ద్వారా ఆనాటి అంతరిక్ష వాతావరణ పరిస్థితులను అంచనావే సేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్ని స్తున్నారు. విశ్వం ఇప్పటికీ తన రహస్యాలను ఒక్కొక్క టిగా మనకు తెలియ జేప్పేందుకు ఇలా ఖగోళ దూతలను భూమి మీదకు పంపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంగిలి
భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి. మన వాతావరణంలో విడి పదార్థంగా హైడ్రోజన్ అణువులు మిగిలేవుంటే బహుశా ఇప్పుడు కూడా అలాగే జరిగుండేదో ఏమో! కానీ భూగోళం మీద ఇప్పట్లో దొరుకుతున్నది కేవలం ఇతర పదార్థాలతో సంయోగంలో ఉన్న హైడ్రోజన్ మాత్రమే. మన అదృష్టం కొద్దీ అది విడిపదార్థంగా మన వాతావరణంలో మిగల్లేదు. ‘అదృష్టం’ అని ఎందుకు అనుకోవాలంటే - రసాయనిక ప్రక్రియలో సాటిలేని చురుకుదనముండే ఆ ధాతువు మూలంగా విడుదలయ్యే వేడినిగానీ, వెలుతురునుగానీ భరించడం మనకు సాధ్యపడదు గనక. హైడ్రోజన్ విడిపదార్థంగా మిగిలుండేది సూర్యుడూ నక్షత్రాలవంటి మండుతున్న గోళాల్లో మాత్రమే. ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మనకు సూర్యుడినుండి ప్రసరించే వేడిగానీ వెలుతురుగానీ హైడ్రోజన్ అణువుల విచ్ఛిత్తి మూలంగా ఏర్పడుతున్నదేనని తెలుసుకున్నప్పుడుగానీ దాని తీవ్రత ఏమోతాదులో ఉంటుందో అంచనా దొరకదు. మొదట్లో, ఆవిరి రూపంలో ఉన్న నీరు ద్రవంగా మారేందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సూర్యునికి ఎడంగా జరుగుతున్న భూమికి వేడి మందగించి, వేగం మందగించి, సానుకూల వాతావరణం ఏర్పడేవరకు అది ఆవిరిగానే ఉండిపోయింది. బుధ, శుక్ర గ్రహాలు సూర్యుని చుట్టూ ఇప్పుడు తిరుగుతున్న వేగంతో పోలిస్తే భూమి తన వేగాన్ని ఏ మోతాదులో కోల్పోయిందో మనకు అవగాహన కలుగుతుంది. సూర్యుణ్ణి బుధగ్రహం 88 రోజుల్లోనూ, శుక్రగ్రహం 225 రోజుల్లోనూ ఒక చుట్టు తిరిగొస్తుండగా భూమికి 366 రోజులు పడుతూ వుంది. చురుకుదనం తగ్గిన భూమి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో నీటియావిరి అప్పుడప్పుడు ద్రవరూపం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ద్రవంగా మారిన తరువాత నీరు భూమిమీద రాలేందుకు ప్రయత్నించిందేగానీ, మాడుతున్న పెనంలా సెగలను ఎగజిమ్మే ఉపరితలాన్ని తాకక ముందే అది తిరిగి ఆవిరిగా మారిపోయేది. ఇలా కురవడం ఆవిరి కావడం పదేపదే జరుగుతూబోయిన క్రమంలో భూమి ఉపరితలం మరింత తొందరగా చల్లబడడానికి దోహదం కలిగింది. అలా కోట్లాది సంవత్సరాల ప్రయత్నంతో ఎట్టకేలకు భూమిని బుజ్జగించుకొని నీరు వర్షంగా కురవడం మొదలెట్టింది. ఇదంతా 450 కోట్ల సంవత్సరాలకు ముందుమాట. చదువుతూంటే, ‘అనుకునేందుకే దుర్లభంగా తోచే ఈ దూరాలూ, కొలతలూ, పరిమాణాలూ, పరిణామాలూ ఇంత కచ్చితంగా చెప్పేందుకు ఎలా కుదిరింది?’ అనే సందేహం తలెత్తడం సహజం. ఆ విధానాలు వివరిస్తూ పోతే ఇందులో ఉద్దేశించిన పాఠానికి మనంగూడా కోటిమైళ్ళు దూరంగా వెళ్ళిపోతాం. టూకీగా చెప్పాలంటే- ఎడతెరపి లేకుండా జరిగిన పరిశీలన, అంకితభావంతో జరిపిన పరిశోధన, టెలిస్కోపు స్పెక్ట్రామీటర్ వంటి పరికరాల అందుబాటు, భౌతిక రసాయనిక గణిత శాస్త్రాల ముందంజ, కొత్త కొత్త సాంకేతిక పరికరాల సహకారం ఫలితంగా ఈ సమాచార సేకరణ సాధ్యపడింది. సెకండులో నూరోవంతుకు సమానమైనంత నిశితంగా కొలతలూ తూకాలూ తెలుసుగనకనే ఈనాడు మానవుడు అంతరిక్షంలో విహరిస్తున్నాడూ, చంద్రుని మీద పాదం మోపగలుగుతున్నాడు. ఇంతదాకా అనుకున్న విషయాలు వాస్తవాలని నమ్మేందుకు ఇంతకు మించిన దృష్టాంతం అవసరం లేదనుకుంటా. భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి. నష్టమైనవి కాగా, మిగతావన్నీ ఇప్పుడుగూడా మనకు అందుబాటులో ఉన్నాయి. పంచభూతాల కలయికతో ఈ చరాచర జగత్తు ఏర్పడిందని మన ముందుతరాలవారి నమ్మకం. ‘పంచభూతాలు’ అంటే గాలి, నీరు, నిప్పు, మన్ను, మిన్ను. స్థూలదృష్టికి అలాగే కనిపించినా, వేరువేరు అణువుల సంయోగంతో పదార్థాలు ఏర్పడతాయని ఆ తరువాత గానీ తెలిసిరాలేదు. ఏదైనా పదార్థాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తూపోతే, చివరకు విభజించేందుకు ఇక ఏమాత్రం వీలుపడనంత సూక్ష్మాతి సూక్ష్మమైన ముక్కను ‘అణువు’ అంటారు. 18వ శతాబ్దం వాడైన జాన్ డాల్టన్ అనే రసాయనిక శాస్త్రజ్ఞుని పరిశోధనల ఫలితంగా అణుసిద్ధాంతం స్థిరపడింది. ఈ రంగంలో ఆ తరువాత చెప్పుకోవలసినవాడు మెండెలీవ్ అనే రష్యన్ శాస్త్రజ్ఞుడు. అతడు అణువుల నిర్మాణం ఆధారంగా మూలకాల (ఎలిమెంట్స్) జాబితాను తయారుజేశాడు. ప్రపంచంలో ఏ పదార్థం తీసుకున్నా ఈ మూలకాల వేరువేరు తరహా సంయోగాల వల్ల ఏర్పడినదే తప్ప మరొకటి కనిపించదు. మెండలీవ్ కాలానికి గుర్తించిన మూలకాల సంఖ్య 73 మాత్రమే. ఆ తరువాత ఇంకా ఇంకా మూలకాలు వెలుగులోకొచ్చి, ప్రస్తుతానికి 118 దగ్గర ఆ సంఖ్య నిలబడి వుంది. మెండలీవ్ తయారుజేసిన జాబితాకు పునాది అణుసంఖ్య. అదేమిటో తెలియాలంటే అణునిర్మాణం గురించి మనకు కొద్దిగా తెలిసుండాలి. ప్రతి అణువుకూ ఒక న్యూక్లియస్ (కేంద్రం) ఉంటుంది. ఆ కేంద్రంలోని రేణువు ‘ప్రొటాన్’. ఆ ప్రొటాన్ చుట్టూ కొద్ది ఖాలీజాగా తరువాత ‘ఎలెక్ట్రాన్’ అనే మరో రేణువు వృత్తాకార పరిధిలో పరిభ్రమిస్తూ ఉంటుంది. కరెంటు భాషలో చెప్పాలంటే ప్రొటాన్ ధనధ్రువం, ఎలక్ట్రాన్ రుణధ్రువం. ఏ కొంచెం ఏమారినా రుణధ్రువాన్ని ధనధ్రువం తనలోకి లాక్కుని మింగేస్తుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు, సూర్యునిచుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, ధనధ్రువం చుట్టూ రుణధ్రువం విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి