breaking news
Dylan Farrow
-
అంతటి స్టార్ డైరెక్టర్ పనైపోయిందా?
ఎంతటి గొప్ప ఫిల్మ్మేకర్కైనా ఒక రోజు వస్తుంది. ఫేడ్ ఔట్ అయిపోయే రోజు అది. అయితే అది పరిస్థితులకు తగ్గట్టు సినిమాలు తీయలేకపోవడం వల్లనో, మేకింగ్‌లో పట్టు కోల్పోవడం వల్లనో కాకుండా, అప్పటివరకూ సంపాదించిన పేరును పోగొట్టే ఒక కారణం వల్ల అయితే? వినడానికే కష్టంగా ఉంది కదూ!? ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఊడీ అలెన్ పరిస్థితి అలాగే ఉందంటోంది హాలీవుడ్. అలెన్ హాలీవుడ్లో రొమాన్స్ జానర్లో పలు తిరుగులేని సినిమాలను అందించాడు. ఎప్పటికైనా చూసి తీరాల్సిందే అని చెప్పుకునే హాలీవుడ్ సినిమాల్లో ఎవ్వరు లిస్ట్ తీసినా అలెన్ సినిమాలు ఉంటాయి. అంతటి టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్. కొద్దికాలంగా ఆయన గొప్ప సినిమాలేవీ తీయలేదు. అయినా అలెన్ లాంటివాడు ఎప్పుడో ఒకప్పుడు అందరినీ కట్టిపడేసే సినిమా ఇస్తాడన్న నమ్మకం మాత్రం అందరికీ ఉంది. ఆ నమ్మకాన్ని ఇక కట్టకట్టేసి మూలన పడేసే పరిస్థితి కనిపిస్తోంది. అదేమంటే, అలెన్‌పై వచ్చిన ఆరోపణలు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అలెన్‌పై డైలన్ ఫారో చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. అది ఇప్పుడే అలెన్‌ను దెబ్బతీసే దగ్గరకు వచ్చేస్తోంది. చిత్రమేంటంటే ఫారో.. అలెన్ దత్తత తీసుకొని పెంచుకున్న కూతురు. అలెన్‌పై కూతురే ఆరోపణలు చేయడంతో ఆయనను హాలీవుడ్ మెల్లిగా పక్కన పెట్టేస్తోంది. కొద్దికాలంగా అలెన్ ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీయాలని స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడట. అయితే ఈ కేసు గొడవ చూసి, అలెన్‌ను కేర్ చేయడం మానేశారట హీరోయిన్స్. ఇక్కడే అలెన్ పతనం మొదలైందని హాలీవుడ్ భావిస్తోంది. 82 ఏళ్ల వయసున్న అలెన్, తనకున్న గొప్ప పేరును ఇలా పాడు చేసుకోవడం గొప్ప విషాదమే! -
'హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లైంగికంగా వేధించాడు'
పెంచుకున్న కూతురుపై ఓ హాలీవుడ్ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సభ్య వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన గోల్టెన్ గ్లోబ్ అవార్డుల్లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు దక్కించుకున్న వూడీ అలెన్ తనను ఏడేళ్ల వయసులోనే లైంగికంగా వేధించాడని పెంపుడు కూతురు డైలాన్ ఫారో వెల్లడించినట్టు ది న్యూయార్క్ టైమ్స్ ఆన్ ఎడిషన్ లో ఓపెన్ లెటర్ లో కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన 90 దశక ఆరంభంలో తనపై లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆన్ లైన్ ఎడిషన్ కు రాసిన ఓపెన్ లెటర్ లో పేర్కొంది. తాను ఏడేళ్ల వయస్సులో ఉండగా తనను అలెన్ లైంగికంగా వేధించారని, ఈ విషయాన్ని తన పెంపుడు తల్లి, నటి మియా ఫారోకు తెలిపానని, కాని అప్పటికే తన పెంపుడు తల్లి అలెన్ తో వైవాహిక సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారని లెటర్ లో ఫారో పేర్కోంది. 1993 లో ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన కేసు విచారణకు రాకుండా అడ్డుకోవడంలో సఫలమయ్యారని 28 ఏళ్ల ఫారో అన్నారు. అలెన్ తనపై లైంగిక దాడులకు పాల్పడటంతో తన ఆరోగ్యం క్షీణించిందని, జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తాయని..అంతేకాకుండా ఓ వ్యక్తితో రిలేషన్ కూడా దెబ్బతిందని తెలిపారు. ఆతర్వాత టెలివిజన్, పోస్టర్ లో అలెన్ ను చూస్తే భయమేస్తుందని ఆమె అన్నారు. అలెన్ వ్యవహారాన్ని హాలీవుడ్ నటులు కూడా పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.