breaking news
dress row
-
నాది ఎక్స్పోజింగ్ అయితే! మరి ఆమె చేసిందో?
సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సోషల్ మీడియా సాక్షిగా చర్చలు నడవడం సహజం. మిస్ యూనివర్స్-2012 ఒలీవియా కల్పో తాజాగా తనకు ఎదురైన ఓ అనుభవం గురించి పోస్ట్ చేయగా.. అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రకారం.. మెక్సికోలోని కాబో శాన్ లుకాస్ అనే రిసార్ట్‌కి తన సోదరి, బాయ్‌ఫ్రెండ్‌తో పాటు బయలుదేరింది. ఆ సమయంలో ఆమె పైన టాప్‌తో డ్రెస్ వేసుకుని ఉంది. అయితే క్లీవేజ్ కనిపించేలా ఆ డ్రెస్సు ఉండడంతో సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. దీంతో తన బాయ్‌ఫ్రెండ్ క్రిస్టియన్ మెక్కాఫెరే హూడీని తగిలించుకుని ఆమె ఫ్లైట్ ఎక్కింది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన ఆమెకు షాక్ తగిలింది. తనకంటే దారుణమైన దుస్తులతో ఉన్న మహిళను విమానంలోకి సిబ్బంది అనుమతించారు. దీంతో అక్కడి ఘటనతంతా వరుసగా ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఒలీవియా సోదరి అరోరా. తనకు ఎదురైన అమానం గురించి అందరికీ తెలియాలనే తాను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఓ మీడియా హౌజ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది ఒలీవియా. Come on! Who dresses like that to go on a plane. I’m glad @AmericanAir made her cover up. People today think they can just walk around scantily clad and we’re just supposed to accept it. @oliviaculpo dress like an adult. #teamamericanairlines — Missy (@melissa_U25) January 15, 2022 PR stunt, it's the simplest explanation. It worked too, BTW. — 🍊💊Jorj X McKie🍊💊 (@Jorj_X_McKie) January 15, 2022 Funny how the sister who thinks Olivia looks cute and appropriate is covered from head to toe. You look like you’re wearing a bra and spanks. Try adulting and put some actual clothes on. You’d think a former Miss Universe would have some standards. 🤷🏻♀️ — Angela (@hotstuffmedic) January 15, 2022 -
'స్వామి'కి వైట్ షర్ట్.. ఖాకీ నిక్కర్!
దేవుడి విగ్రహానికి ఆరెస్సెస్ డ్రెస్ తొడగడంపై వివాదం తలెత్తింది. సూరత్ లోని ఓ దేవాలయంలో స్మామి నారాయణ్ విగ్రహానికి ఆలయ అధికారులు ఖాకీ కలర్ నిక్కర్, వైట్ షర్ట్ తొడిగించారు. ఆరెస్సెస్ డ్రెస్ ఆ విగ్రహానికి అలంకరించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్వామి నారాయణ్ విగ్రహాన్ని గమనించినట్లయితే.. ఆరెస్సెస్ డ్రెస్ కోడ్ తో పాటు తలపై నలుపు రంగు టోపీ, కాళ్లకు షూస్, చేతిలో జాతీయ పతాకంతో అలంకరించారు. నేడు ఆరెస్సెస్ డ్రెస్స్ తొడిగారు.. రేపు బీజేపీ యూనిఫాం తొడుగుతారంటూ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సూరత్ లోని లస్కానాలో స్వామి విశ్వప్రకాశ్జి ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు ఈ దుస్తులు కానుకగా సమర్పించాడు. సాధారణంగా దేవుడి విగ్రహాన్ని పలు రకాల డ్రెస్సులతో అలంకిరిస్తుంటాం.. అందులో భాగంగానే కానుకగా వచ్చిన ఆరెస్సెస్ యూనిఫాంను ఉపయోగించామని చెప్పారు. ఈ విషయం ఇంత వివాదానికి దారి తీస్తుందని తాము భావించలేదని ఆలయ అధికారులు వివరణ ఇచ్చారు. దేవుడు కూడా రైటిస్ట్ అనే భావనలు వ్యక్తం చేయడానికి ఇలా చేశారని, డ్రెస్సును వెంటనే తీసేసి రెగ్యూలర్ పద్ధతిలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ నేత శంకర్ సిన్హ్ వాగేలా డిమాండ్ చేశారు. దేవుడికి ఖాకీ కలర్ షార్ట్ తొడిగి ఏం నిరూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ రుపానీని సంప్రదించగా.. తనకు ఈ విషయం తెలియదని, నిజంగానే ఆరెస్సెస్ డ్రెస్ వాడినట్లయితే ఆశ్చర్యానికి లోనవుతానని, ఇలాంటివి తాను నమ్మనని పేర్కొన్నారు