breaking news
Dr Kiran Kumar
-
ఎత్తు మడులపై అల్లం నాటారో.. ఇక లాభాలే!
సాధారణ బోదెలపైన అల్లం విత్తుకోవటం కన్నా వెడల్పాటి ఎత్తు మడులపై రెండు సాళ్లుగా నాటుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు మడులపై అల్లం సాగు వల్ల వేరుకుళ్లు వంటి తగుళ్ల సమస్య తీరిపోతుందని, కనీసం 30–40% అల్లం దిగుబడి పెరుగుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన రైతులతో పనిచేస్తున్న వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎస్. కిరణ్ తెలిపారు.సాధారణంగా రైతులు బోదెలు తోలి అల్లం విత్తుకుంటూ ఉంటారు. వర్షాలకు కొద్ది రోజులకే బోదె, కాలువ కలిసిపోయి నీరు నిలబడటం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా వేరుకుళ్లు వంటి తెగుళ్లు వస్తుంటాయి. నీటి ముంపు పరిస్థితుల్లో పంట దిగుబడి భారీగా దెబ్బతిని ఖర్చులు కూడా రాని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.ఈ సమస్యల నుంచి బయటపడి పంట విషలం కాకుండా మంచి దిగుబడి పొందాలంటే ఎత్తుమడులపై విత్తుకోవటమే మేలని వికాస సంస్థ పాడేరు, అరకు ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ తోడ్పాటుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత ఖరీఫ్ నాటికి రెండేళ్లలోనే 543 మంది రైతులకు విస్తరించిందని డా. కిరణ్ వివరించారు. అడుగు ఎత్తున, రెండు నుంచి రెండున్న అడుగుల వెడల్పుతో ఎత్తు మడులను పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి.రెండు వరుసలుగా అల్లం లేదా పసుపు విత్తుకోవచ్చు. అల్లం సాగులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. ఎత్తుమడులపై విత్తుకోవటం, మురుగునీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయటంతో పాటు ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం, 25 కిలోల వేపపిండి వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం (ఏటా 600 లీటర్లు) మొక్కల మొదళ్లలో పోస్తున్నారు. ఎకరానికి కనీసం 14–15 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారని డా. కిరణ్ వివరించారు.బోదెలు తోలి సాగు చేసే సాధారణ పద్ధతిలో సగటున ఎకరానికి 9–11 టన్నుల దిగుబడి వస్తుంటుందని, ఎత్తుమడుల పద్ధతిలో సగటున ఎకరానికి 5–6 టన్నులు అదనపు దిగుబడి వస్తోందన్నారు. ఎత్తుమడుల వల్ల కలుపు తీయటం సులభం అవుతుంది. పంట విఫలమై రైతు నష్టపోయే ప్రమాదం తప్పుతుంది. మైదానప్రాంతాల రైతులు కూడా ఎత్తు మడుల పద్ధతిని నిశ్చింతగా అనుసరించవచ్చని డా. కిరణ్ (98661 18877) భరోసా ఇస్తున్నారు.– డాక్టర్ కిరణ్13 నుంచి తిరుపతిలో సేంద్రియ ఎఫ్పిఓల మేళా..కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నాబార్డ్ సహకారంతో ఈ నెల 13,14,15 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం (టౌన్‌క్లబ్)లో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, ఎఫ్పిఓల మేళాను నిర్వహించనుంది. కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నెలకో సేంద్రియ సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.13 ఉ. 11 గంటలకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ సీజీఎం గో΄ాల్ మేళాను ప్రారంభిస్తారు. ΄ాత విత్తనాల ప్రదర్శన ఉంటుంది. 14న ఉదయం అమేయ కృషి వికాస కేంద్రం (భువనగిరి) వ్యవస్థాపకులు, ప్రముఖ రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి ఉద్యాన పంటల్లో గ్రాఫ్టింగ్‌పై శిక్షణ ఇస్తారు.15న ప్రకృతి చికిత్సా పద్ధతులపై నేలకొండపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా. కె. రామచంద్ర, ప్రకృతి సేద్యంపై గ్రామభారతి అధ్యక్షులు సూర్యకళ గుప్త, ప్రసిద్ధ అమృతాహార ప్రచారకులు ప్రకృతివనం ప్రసాద్, ఆరుతడి వరి సాగుపై ఆదర్శ రైతు శ్రీనివాస్ (గద్వాల్) వివరిస్తారు. ఇతర వివరాలకు 63036 06326. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ఇవి చదవండి: బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే! -
సోరియాసిస్‌కు మెరుగైన ఫలితం హోమియోపతి
చలికాలం రాగానే ఎంతోమంది అనేకరకాల చర్మ సంబంధిత వ్యాధుల తో బాధపడుతూ ఉంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య సోరియాసిస్. ప్రపంచ జనాభాలో సుమారుగా మూడు శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీనిని కేవలం సాధారణ చర్మవ్యాధిగా పరిగణించడానికి వీలు లేదు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మవ్యాధి. సోరియాసిస్ వ్యాధిగ్రస్థులలో చర్మంపై దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ వ్యాధి ప్రభావం చర్మం మీద మాత్రమే కాకుండా గోళ్ళు, తల తదితర శరీర భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనవవచ్చు. ఎందుకు వస్తుంది? వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయంప్రేరితంగా మారడం వలన సోరియాసిస్ వస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి వ్యాధినిరోధకశక్తి గురించి కొంత తెలుసుకుందాం. వైరస్, బ్యాక్టీరియా వంటివి శరీరం మీద దాడి చేసినప్పుడు వాటి నుండి రక్షణ పొందటానికి మనశరీరంలో డబ్ల్యూబీసీ (తెల్ల రక్తకణాలు) అనే ప్రత్యేకమైన రక్తకణాలు పని చేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలకు వెళ్ళి ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా గాయాలు మానేలా చేస్తాయి. సోరియాసిన్ - వంశపారంపర్యత: కొన్నికుటుంబాలలో సోరియాసిన్ అనువంశికంగా నడుస్తుంది. తల్లిదండ్రులలో ఇద్దరికీ సోరియాసిస్ ఉంటే సంతానానికి వచ్చే అవకాశం 30 శాతం ఉంటుంది. ఒకవేళ ఒకరికే ఉంటే 15 శాతం వచ్చే అవకాశం ఉంటుంది. సోరియాసిస్ ప్రభావం : సోరియాసిస్ ఒక చర్మవ్యాధిగా మాత్రమే గుర్తిస్తే అది తప్పు. దీనివలన సాధారణంగా ప్రాణాపాయం జరగదు. కాని వ్యాధితీవ్రత వలన, దీర్ఘకాలం బాధించడం వలన బాధితులు డిప్రెషన్‌కు లోనవుతారు. ఇది వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. సోరియాసిస్‌లో అలా వికటించిన వ్యాధినిరోధక శక్తి వలన సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి అనుబంధ అంశంగా గల ఇన్ఫ్లమేషన్ వలన సోరియాసిస్‌తో బాధపడేవారికి హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవేకాక ఈ వ్యాధిగ్రస్థులు డయాబెటిస్, రక్తపోటులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. సోరియాసిస్‌ను తీవ్రం చేసే అంశాలు: చల్లని పొడి వాతావరణం మానసిక ఒత్తిడి కొన్నిరకాల మందులు (మలేరియా మందులు, లితేలయా, బీటా, బ్లాకర్స్, మాంటి) ఇన్ఫెక్షన్స్, ఇతర వ్యాధులు అలవాట్లు హార్మోన్ తేడాలు ఆహార పదార్థాలు -ఉదా: గ్లూటన్ ఎక్కువగా ఉండే ఆహారం. నిర్థారణ పరీక్షలు: సీబీపీ ఈఎస్ఆర్ స్కిన్ బ్లాప్సీ కీళ్ళను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు. సోరియాసిస్‌లో రకాలు సోరియాసిస్‌ను అది వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి ఐదు రకాలుగా వర్గీకరించారు. ప్లేగు సోరియాసిస్: ఇది సోరియాసిస్‌లో ఎక్కువగా కనిపించే రకం. ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొడగా మారడం దీని ప్రధాన లక్షణం. Guttata సోరియాసిస్: ఇది ఎర్రని పొక్కులు, పొలుసులతో వాన చినుకులుగా కనిపిస్తుంది. వ్యాధి హఠాత్తుగా మొదలవుతుంది. పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పస్టులర్ సోరియాసిన్: దీనిలో చీముతో కూడిన పొక్కులు తయారవుతాయి. ఇన్వర్సివ్ సోరియాసిస్: దీనిలో పలుచగా పొట్టు లేకుండా ఎర్రగా కనిపించే మచ్చలు చర్మపు ముడతలలో వస్తాయి. Exythrodermic సోరియాసిస్: దీనిలో ఎర్రటి వాపుతో కూడిన మచ్చలు పెద్ద ఆకారంలో తయారవుతాయి. కాన్స్టిట్యూషన్ పద్ధతిలో సోరియాసిస్ నివారణ... కాన్స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా ఎమోషనల్ పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలనేది ముఖ్యం. సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి పూర్తిగా నివారించబడుతుంది. సాధారణంగా వాడే మందుల వలన ఈ సోరియాసిస్ తాత్కాలికంగా తగ్గినట్లు లేదా కొన్నిసార్లు అసలు ఫలితమే లేకపోవడం జరుగుతుంది. అదే హోమియోపతి మందుల ద్వారా అయితే వ్యాధి తీవ్రతను బట్టి నియంత్రించి పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సోరియాసిస్‌ను అరికట్టవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స కాలం నిర్థారించబడుతుంది. -పాజిటివ్ హోమియోపతి. డా॥టి. కిరణ్‌కుమార్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 92461 99922 www.positivehomeopathy.com