ప్రపంచంలోనే పర్ఫెక్ట్ ముఖాన్ని చూశారా!
ఈ ఫొటోలోని అమ్మాయిని చూడండి. చాలా అందంగా ఉంది కదా! ఇంతకు ఈమె ఎవరంటే ప్రపంచంలోనే పర్ఫెక్ట్ ముఖం కలిగిన అమ్మాయి. ఈమె ఎందుకు పర్ఫెక్ట్ అందగత్తెగా పేరొందిందంటే..
ఈ సుందరి కనుబొమ్మలు-జెన్నిఫర్ లోపేజ్వి
కళ్లు-కీరా నైట్లీవి
ముక్కు- బ్రిటన్ యువరాణి కేట్ విలియంది
పెదవులు-పెనలోప్ క్రూజ్వి
దవడ క్రమం (జాలైన్)- చేర్ది
చిన్-సెలెనా గోమెజ్ది
స్కిన్-రీసీ విథర్స్పూన్ది
బుగ్గలు: ఏంజెలినా జోలీవి
నుదురు-మిలీ సైరస్ది
మరీ ఇంతకు ఈమె ఎవరంటే.. ప్రముఖ ఫేషియల్ కాస్మటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా రూపొందించిన సుందరి మాత్రమే. నిజంగా ఈమె లేదు. ప్రపంచంలో పరిపూర్ణమైన అందమైన ముఖం ఎవరిదో చెప్పమంటూ బ్రిటన్కు చెందిన డాక్టర్ జూలియన్ను తరచూ ఆయన వినియోగదారులు అడిగేవారట. దీంతో వారి కోరిక నెరవేర్చేందుకు ఇలా ప్రపంచంలోని అందమైన మగువల సొబగులతో కూడిన అందమైన ముఖవర్చస్సును ఆయన రూపొందించారు.