breaking news
Doubles Squash Tournament
-
భారత్ ‘తీన్మార్’
కౌలాలంపూర్: తుది పోరులో అదరగొట్టిన భారత స్క్వాష్ క్రీడాకారులు ఆసియా డబుల్స్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో క్లీన్‌స్వీప్ చేశారు. ఫైనల్ చేరిన మూడు విభాగాల్లోనూ విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల డబుల్స్‌లో అభయ్ సింగ్–వెలవన్ సెంథిల్ కుమార్ జోడీ... మహిళల డబుల్స్‌లో అనాహత్ సింగ్–జోష్నా చినప్ప ద్వయం... మిక్స్డ్ డబుల్స్ లో అభయ్ సింగ్–అనాహత్ సింగ్ జంట పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అభయ్–సెంథిల్ జోడీ 9–11, 11–5, 11–5తో నూర్ జమాన్–నాసిర్ ఇక్బాల్ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్ తుది పోరులో అనాహత్–జోష్నా ద్వయం 8–11, 11–9, 11–10తో ఐనా అమాని–జిన్ యింగ్ యీ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సమరంలో అభయ్–అనాహత్ జంట 11–9, 11–7తో రాచెల్ అర్నాల్డ్–అమీòÙన్‌రాజ్ చందరన్ (మలేసియా) ద్వయంపై గెలుపొందింది. -
దీపిక-జోష్న జోడికి టైటిల్
కౌలాలంపూర్: మూడు దేశాల స్క్వాష్ డబుల్స్ టోర్నమెంట్లో భారత్ రెండో టైటిల్‌ను సాధించింది. గురువారం ఇక్కడి నేషనల్ స్క్వాష్ సెంటర్లో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన దీపికా పల్లికాల్, జోష్న చినప్ప జోడి గెలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన జోయెల్ కింగ్, అమందా లాండర్స్‌పై 8-11, 11-5, 11-1 తేడాతో నెగ్గారు. మలేసియా మూడో జట్టుగా పాల్గొన్న ఈ టోర్నీ కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహకంగా జరిగింది. గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్కు ఈ విజయంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని పల్లికాల్ తెలిపింది.