breaking news
Double chin problem
-
నటడు రవి కిషన్ డబుల్ చిన్ తగ్గించే చిట్కా..!
చాలామంది డబుల్ చిన్తో ఇబ్బంది పడుతుంటారు. కొందరికి చేతులు, కాళ్లు లావుగా ఉన్నట్లే ముఖం ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోయి లావుగా కనిపిస్తుంటుంది. అందులోనూ ఈ డబుల్ చిన్ పైకి కనిపించే సమస్య. అయితే దీనికి మద్దాలి శివారెడ్డిగా విలన్ పాత్రలో అలరించిన నటుడు రవి కిషన్ ఓ చక్కటి సలహా ఇచ్చారు. అందుకోసం ఏం చేయాలో కొన్ని టిప్స్ కూడా పంచుకున్నారు. మరి ఇవి ఎంత వరకు పనిచేస్తాయో సవివరంగా చూద్దామా..!.57 ఏళ్ల నటుడు రవికిషన్ మనం తినే ఆహారం పట్ల వహించే శ్రద్ధే బరువు పెరగడాన్ని, డబుల్ చిన్ కనిపించడాన్ని నివారిస్తుందని అన్నారు. ఈ మేరకు ఓ ఫిట్నెస్ కార్యక్రమ్యానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. అతిగా తినడం డబుల్ చిన్ వంటి శరీర ఆకృతి మార్పులకు దారితీస్తుందని అన్నారు. తాను పప్పు, కూర, రోటీల తోపాటు నానబెట్టిన శెనగలు, నానబెట్టిన బాదంపప్పులు వంటి సరళమైన ఆహారాన్ని తీసుకుంటానని అన్నారు. తాను తాజా జ్యూస్‌లు, ఎంత మేర తింటున్నాను అనేదానిపై అటెన్షన్ ఉంచుతానని చెప్పారు. అంతేగాదు పొట్ట పరిమాణం తక్కువుగా ఉంటుందని, దానికి ఎంత మేర ఆహారం ఇస్తే..అంత ఎక్కువుగా బరువు పెరుగుతారని చెప్పారు. మనం తినేదే మన ఆహార్యం అని అన్నారు. కాబట్టి ఏం తింటున్నాం అనేదానిపై జాగ్రత్తగా ఉండమని అన్నారు. అలాగే ఉదయం పూట తాను పాటించే అలవాటు గురించి కూడా చెప్పారు. తులసీ ఆకులు నమలడం, చాలామంచి అలవాటని, ఇది డబుల్ చిన్ రాకుండా కాపాడుతుందని అన్నారు. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..గడ్డం కింద కొవ్వు అనేది శరీరంలో అధిక కొవ్వు వల్ల జరుగుతుంది. ఇది జన్యువులు, వయసు పైబడటం, వదులైన చర్మం తదితర కారణాల వచ్చే సమస్యగా పేర్కొన్నారు. అందుకోస ప్రధానంగా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఉంటే శరీరంలో కొవ్వు తగ్గి ఆ ప్రాంతం సన్నగా మారుతుందని అంటున్నారు. అలాగని చాలా కఠినమైన ఆహార నియమాలను పాటించడానికి బదులుగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, కొవ్వు తక్కువుగా ఉండే మాంసం, నట్స్ తక్కువగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసకోవడంపై దృష్టి పెడితే చాలని చెబుతున్నారు. అన్నింటికంటే ఆహార పరిమాణం నియంత్రించడం అత్యంత ముఖ్యం అని హెచ్చరిస్తున్నారు. అలాగే శారీరక శ్రమ, ముఖ్యంగా మెడకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ ఉంటే ఈ డబుల్ చిన్ సమస్య రాదని చెబుతున్నారు. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకున్నా.. వైద్యులును సంప్రదించమని సూచిస్తున్నారు. ఏదీఏమైనా.. ఆలోచనాత్మకంగా తింటూ పరిమిత మోతాదులో తీసుకుంటే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ఇదీ చదవండి: బడిలో ఎవరైనా ఏడిపిస్తున్నారా..? ఈ పాప చెప్పే టిప్స్ ఫాలో అయిపోండి..) -
డబుల్ చిన్ సమస్యకు ఇంజెక్షన్లతోనే సరి!
కొత్త పరిశోధన చాలామందికి గదమ కింద చర్మం వేలాడుతూ చూడ్డానికి కాస్త అసహ్యం కనిపిస్తుంటుంది. వయసు పైబడుతున్న కొద్దీ గదమ వెనక మరొక గదమలా చర్మం వేలాడుతూ కనిపించడం చాలా సాధారణం. దీన్నే ఇంగ్లిష్‌లో డబుల్ చిన్ అంటుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి డబుల్చిన్ను సరిచేయడానికి లైపోసక్షన్ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ అక్కడ పేరుకున్న కొవ్వును కరిగించే ఇంజెక్షన్లకు ఇటీవలే యూస్‌కు చెందిన ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఈ ఇంజెక్షన్లో డీఆక్సికోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది స్వాభావికంగా మన శరీరంలో ఉండే ఒక జీవరసాయనమే. ఇది కొవ్వును పూర్తిగా కరిగించి, అక్కడి నుంచి తొలగిస్తుంది. ఇలాంటి ఇంజెక్షన్లలో ఉండే మందుల వల్ల డబుల్ చిన్‌లో ఉండే కొవ్వు పూర్తిగా తొలగిపోవడమే గాక మళ్లీ రాకుండా ఉంటుందని దీని తయారీదార్లు పేర్కొంటున్నారు. పందొమ్మిది క్లినికల్ ట్రయల్స్‌లో దాదాపు 2,600 మందిపై దీన్ని ప్రయోగించి, అది ప్రభావవంతమని గుర్తించాక ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించిందని పేర్కొంటున్నారు.


