breaking news
donor aid
-
మీ సాయం.. నిలుపుతుంది ప్రాణం
ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్తున్న ఆ బాలుడిపై విధి పగబట్టింది. తలకు క్రికెట్ బాలు తగలడంతో మెదడులో గడ్డకట్టి ఆరుచోట్ల ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. మూడేళ్లుగా మంచానికే పరిమితమై జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తున్నాడు. పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబ సభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. * మూడేళ్లుగా మంచానికే పరిమితమైన బాలుడు * పైప్‌ద్వారా ఆహారంగా ద్రవ పదార్థాలు * ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు కర్నూలు : కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామానికి చెందిన గడేకారి మహబూబ్‌బాషా, షేక్ ఉసేన్‌బీ దంపతులకు మౌలాలి, దస్తగిరి సంతానం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గడేకారి, కూలీపనికి వెళుతూ పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న దస్తగిరి స్నేహితులతో సరదాగా క్రికెట్ ఆడుతున్న సమయంలో 2013వ సంవత్సరంలో తలకు క్రికెట్ బాల్ తగిలింది. మొదట్లో దాని ప్రభావం కన్పించకపోగా కొంతకాలానికి అనారోగ్యం బారిన పడటంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు, నంద్యాల ఆసుపత్రులకు తీసుకెళ్లగా ఎక్స్‌రేలో మెదడులో గడ్డ ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ కార్డు, దాతల సాయం, దొరికిన చోటంతా రూ. 2 లక్షల వరకు అప్పు చేసి హైదరాబాదులోని నిమ్స్‌లో గడ్డను తొలగించేందుకు తల, మెడ, గొంతు, తదితర చోట్ల ఆరు ఆపరేషన్లు చేయించారు. ఆపరేషన్ అనంతరం దస్తగిరి యథావిధిగా కోలుకుంటారని భావించారు. ఎక్కువ చోట్ల ఆపరేషన్లు జరగడంతో అప్పటి నుంచి మంచానికి పరిమితం అయ్యాడు. ఆహారపదార్ధాలను ద్రవరూపంలో ముక్కుకు అమర్చిన పైప్‌ద్వారా అందజేయాల్సి వస్తోంది. ఆడుతూ, పాడుతూ జీవనం సాగిస్తున్న కుమారుడికి ఈ పరిస్థితి రావడంతో తండ్రి షాక్‌కు గురై.. మానసిక స్థితి సరిగా లేక ఇల్లు వదిలి వెళ్లాడు. కుమారుడి ఆలనాపాలన తల్లి చూస్తోంది. ఆమె ఇంటికే పరిమితం కావడంతో పోషణభారం పెద్దకుమారుడైన మౌలాలిపై పడింది. గడేకారి పనిచేస్తూ కుటుంబ పోషణ.. తమ్ముడు అనారోగ్యంతో మంచాన పడే సమయానికి పదో తరగతి పూర్తి చేసుకున్న మౌలాలి చ దువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఇల్లు లేక వీరు.. వనం ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకుంటూ ఉండడంతో గ్రామానికి చెందిన ఉసేనయ్య ఆదుకున్నాడు. ప్రస్తుతం హుసేనయ్య ఇంట్లో వీరు ఉంటున్నారు. మౌలాలి.. గడేకారి పనికి వెళుతూ వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ, తమ్ముడి వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాడు. మాత్రలు, మందుల కోసం నెలకు రూ. 5వేలకు పైగా వెచ్చించాల్సి వస్తోంది. దాతల సాయం కోసం ఎదురుచూపు మూడేళ్లుగా మంచానికే పరిమితమైన దస్తగిరికి మెరుగైన వైద్యం అందితే యథాస్థితికి వచ్చే అవకాశం ఉంది. అంతటి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఆ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. నెలకు కావాల్సిన మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. దాతలు ఆపన్న హస్తం అందించి కుమారుడికి పునర్జన్మను ప్రసాదించాలని తల్లి, కుమారుడు వేడుకుంటున్నారు. దాతలు సాయం చేసేందుకు 8186815860 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. -
బతకాలని ఉంది
♦ బీఎడ్ పట్టభద్రురాలి ఆక్రందన ♦ రెండు కిడ్నీలు పాడై దాతల కోసం ఎదురుచూపు ఒంగోలు సెంట్రల్: బీఎడ్ పూర్తి చేసింది. మంచి ఉపాధ్యాయురాలిగా జీవనం సాగించాలనుకుంది. తను ఒకటి తలిస్తే విధి ఇంకొకటి శాసించింది. రెండు కిడ్నీలు పాడైపోరుు చావుతో పోరాడుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినా మార్పిడి కోసం రూ.10 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అవుతాయని తెలియడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోందామె. ఒంగోలుకు చెందిన పి.రాజ్యం (36)కు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈమె ఓ ప్రరుువేటు పాఠశాలలో ఉపాధ్యారుునిగా, భర్త ఓ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఓ కుమార్తె పుట్టింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రరుువేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తుండగానే విపరీతమైన నీరసంతో పడిపోగా ఆసుపత్రిలో చేర్చారు. అప్పట్లో ఉన్నత చికిత్స కోసం నెల్లూరు వెళ్లమని సూచించడంతో రెండు కిడ్నీలు పాడైపోయాయని నిర్ధారించారు. ఏమీ చేయలేని నిస్సహాయత. పైగా వెంటనే డయూలసిస్ చేయాలని సూచించడంతో ఆ చికిత్స చేరుుంచుకుంటూ ఇతర మందులు వాడుతోంది. కోడలు బాధ చూడలేక తన అత్త కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు దాదాపు రూ.10 లక్షలకుపైగా ఖర్చవుతందని వైద్యులు చెప్పడంతో వీరి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చారుు. కిడ్నీ మార్పిడికి అవసరమైన నగదును మానవతా దృక్పధంతో దాతలు సమకూర్చితేగానీ ఆరోగ్యం కుదుట పడదు. త్వరితగతిన ఈ శస్త్ర చికిత్స చేపట్టకపోతే మిగిలిన అవయవాలు పాడైపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్పందించే హృదయూలు 88975-51930 అనే నెంబరుకు ఫోన్ చేసి సాయం చేయాలని ఆ కుటుంబం అర్థిస్తోంది.