breaking news
dominar 400
-
బజాజ్ కొత్త బైక్‌లు.. నాలుగు రైడింగ్ మోడ్లతో..
బజాజ్ ఆటో డామినార్ 400, డామినార్ 250 అప్ డేటెడ్ వెర్షన్ బైకులను లాంచ్ చేసింది. రెండింటిలో డామినార్ 250 ప్రారంభ ధర రూ .1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్), డామినార్ 400 ప్రారంభ ధర రూ .2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). వీటికి సంబంధించిన వివరాలను బజాజ్ ఆటో ఇటీవల టీజ్ చేసింది. అప్డేట్లలో భాగంగా ఫీచర్లలో బజాబ్ సంస్థ మార్పులు చేసింది. మరిన్ని టూరింగ్ పరికరాలను జోడించింది. డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ లేకుండా రైడర్ సౌకర్యం కోసం కొన్ని స్వల్ప సర్దుబాట్లు మాత్రం చేసింది.కొత్త ఫీచర్లురెండు డామినార్ బైక్‌లూ ఇప్పుడు నాలుగు రైడింగ్ మోడ్లతో వస్తాయి. అవి రెయిన్, రోడ్, స్పోర్ట్, ఆఫ్-రోడ్. అవసరాన్ని బట్టి థ్రోటిల్ రెస్పాన్స్, ఏబీఎస్ ఇంటర్వెన్షన్ స్థాయిలను మార్చడం ద్వారా రైడర్‌కు ఈ మోడ్లు సహాయపడతాయి. ఇక డామినార్ 400 బైక్‌లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ ఫీచర్ ఇచ్చారు. డామినార్ 250లో మాత్రం మెకానికల్ థ్రోటిల్ సెటప్, నాలుగు ఏబీఎస్ మోడ్స్ ఉన్నాయి.మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్‌లో లాంటి డిజిటల్ డిస్ప్లేను ఈ రెండు డామినార్ బైక్‌లలో ఇచ్చారు. ఇది కొత్త స్విచ్ గేర్ తో పనిచేసే కలర్ ఎల్సీడీ బాండెడ్ గ్లాస్ స్పీడోమీటర్. ఎక్కువ దూరం బైక్ నడిపే రైడర్లకు మరింత సౌలభ్యం కోసం హ్యాండిల్ బార్లను కూడా మార్చినట్లు బజాజ్ పేర్కొంది. రైడర్లు తమ జీపీఎస్ పరికరాలు లేదా స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేసుకునేందుకు జీపీఎస్ మౌంట్‌ను చేర్చింది.ఇక మెకానిక్స్ పరంగా చూస్తే ఎటువంటి మార్పులు లేవు. డామినార్ 400 బైకులో 373 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,800 ఆర్పీఎం వద్ద 39 బీహెచ్నపీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 35 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. అదేవిధంగా డొమినార్ 250 విషయానికి వస్తే 248 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 26 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 23 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో జతై ఉంటుంది. -
డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే
భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ నుంచి బిఎస్6 2 ఉద్గార నిబంధలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ డామినర్ 400' మీద కంపెనీ ఇప్పుడు రూ. 25,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ ఆకర్షణీయమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీనితో పాటు తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. బజాజ్ కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల డామినార్ 400 రూ. 1,99,991 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడమే కాకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బజాజ్ డామినర్ 400 రూ. 1.36 లక్షల వద్ద 2016లో విడుదలైంది. బజాజ్ డామినార్ 400 మోటార్‌సైకిల్ 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్సి ఇంజన్ కలిగి 39.4 బిహెచ్పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ 43 మిమీ యుఎస్డి ఫోర్క్స్, 110 మిమీ ట్రావెల్‌తో మోనోశాక్ పొందుతుంది. బజాజ్ డామినార్ 400 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా సఫోర్ట్ చేస్తుంది. -
బైకర్స్‌కి శుభవార్త ! మార్కెట్లో బజాజ్ డొమినార్ 400 అప్డేట్ వెర్షన్
ముంబై: లాంగ్‌రైడ్‌కి వెళ్లే బైకర్లకి, మోటోవ్లాగర్లకి శుభవార్త ! దేశీయంగా స్పోర్ట్స్ బైక్‌లలో ప్రత్యేక ఫ్యాన్ బేస్ కలిగిన డోమినార్ నుంచి మరో కొత్త వెర్షన్ వచ్చింది. బజాజ్ ఆటో తన ‘‘బజాజ్ డొమినార్ 400’’ మోడల్ అప్డేట్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.2.16 లక్షలుగా ఉంది. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ టూరింగ్ యాక్ససరీసులతో పాటు టూరింగ్ రైడర్లకు కావల్సిన కనీస భద్రతా ఫీచర్లులున్నాయి. బీఎస్ 6 ప్రమాణాలతో బీఎస్ 6 ప్రమాణాలు కలిగిన 373.3 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 40 పీఎస్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయగలదు. ‘‘ద్వి చక్ర వాహన విభాగంలో డొమినార్ 400 తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. సుధీర్ఘ ప్రయాణాలను చేసే రైడర్లకి ఇప్పుడిది మొదటి ఎంపికగా మారింది’’ బజాజ్ ఆటో మార్కెటింగ్ హెడ్ నారాయణన్ తెలిపారు. -
బజాజ్ డొమినర్పై బంపర్ ఆఫర్
ముంబై: బైక్ లవర్లకు శుభవార్త. స్పోర్ట్స్ బైక్స్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న బజాన్ డొమినర్ ధరలు తగ్గాయి. బజాజ్ ఆటో తన డొమినర్ 250 మోడళ్ల ధరలపై రూ.16,800 తగ్గిస్తున్నట్లు తెలిపింది. ధర తగ్గింపుతో ఈ మోడల్ ధర రూ.1.54 లక్షలకు దిగిరానుంది. ‘‘ఆటో కంపెలన్నీ వాహన ధరలను పెంచుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో డొమినార్ మోడళ్ల ధరలను తగ్గిస్తున్నాము. కస్టమర్లకు స్పోర్ట్స్, టూరింగ్ సదుపాయాలను మరింత చేరువ చేసేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. గతేడాది మార్చిలో విడుదలైన డొమినర్ 248.8 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. స్పోర్ట్స్ బైక్ కేటగిరిలో డోమినర్ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ధర తగ్గింపుతో డొమినర్ అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది. -
మార్కెట్లోకి బజాజ్ స్పోర్ట్స్ బైక్.. ‘డామినర్ 400’
ప్రారంభ ధర రూ.1.3 లక్షలు న్యూఢిల్లీ: మార్కెట్‌ను ఊరిస్తున్న బజాజ్ 400సీసీ బైక్ రంగప్రవేశం చేసింది. ‘డామినర్ 400’ పేరిట బజాజ్ ఆటో ఈ కొత్త స్పోర్ట్స్ బైక్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.1.36 లక్షలు నుంచి రూ.1.5 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ నుంచి వస్తోన్న అత్యంత శక్తివంతమైన బైక్ ఇదే. ‘డామినర్ 400’లో 373.2 సీసీ డీటీఎస్–ఐ, సింగిల్–సిలిండర్, లిక్విడ్–కూల్డ్, 4–వాల్వ్ ఇంజిన్‌ను అమర్చినట్లుకంపెనీ పేర్కొంది. బైక్‌లో స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6–స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపరిచామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని 8.23 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. బైక్ గరిష్ట వేగం గంటకు 148 కిలోమీటర్లు. నాన్–ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.36 లక్షలుగా, ఏబీఎస్ వేరియంట్ ధర రూ.1.5 లక్షలుగా ఉందని తెలిపింది. జనవరిలో డెలివరీ..: రూ.9,000తో బైక్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని, జనవరి నుంచి డెలివరీ ఉంటుందని వివరించింది. నెలకు 15,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ⇔ ప్రత్యేక ఫీచర్లివీ... ⇔ ఆల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ⇔ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) ⇔ ఫుల్ డిజిటల్ 2 స్టెప్ ఇన్స్ట్రుమెంటేషన్ట ళీ శక్తివంతమైన ఇంజిన్ ళీ స్లిప్పర్ క్లచ్.