breaking news
D.K.Siva Kumar
-
ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు!
2026 ఐపీఎల్ సీజన్ (BCCI-IPL 2026) శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శాసనసభలో ఒక కీలక ప్రతిపాదన చేశారు. తమ లాంటి వీఐపీలు క్యూలో నిలబడలేరు కాబట్టి ప్రతీ మ్మెల్యేకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఐదు టిక్కెట్లను అందించాలని కోరారు. హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.హుంగుండ్ ఎమ్మెల్యే విజయానంద్ కశపనవర్ ప్రతీ ఎమ్మెల్యేకు ఐదు టికెట్లతోపాటు, శాసనసభ్యులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కూడా క్రికెట్ సంఘాన్ని కోరడం విశేషం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘంవారు ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు పొందుతున్నారు. వారికి అన్ని భద్రతలూ లభిస్తున్నాయి. ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు. కానీ వారు ఎమ్మెల్యేలను గౌరవించడం లేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వారి కుటుంబాలకు ఐపీఎల్ టిక్కెట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు విఐపీలు కాబట్టి వారు క్యూలో నిలబడలేరు వారి 5 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోయినసారి ప్రజలతోపాటు క్యూలోనే నిలబడి ఇబ్బందులు పడ్డాం. ఈసారి మాత్రం అలా జరగనివ్వమని వ్యాఖ్యానించారు.ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకంలో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందని కూడా కశపనవర్ ఆరోపించారు. అందుకే తాము ప్రభుత్వాన్ని అభ్యర్థించాము. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తిన ఈ విషయానికి తాము మద్దు తెలిపామనిఅవసరమైన చర్యలు తీసుకుని ఎమ్మెల్యేలకు కనీసం 5 టిక్కెట్లు జారీ చేయాలని స్పీకర్‌ను కోరామన్నారు. వాళ్లు ఎవరి మాట వినరు. అంత పెద్దవాళ్లైపోయారు. డబ్బులు వసూలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంటూ కశపనవర్ కేఎస్‌సీఏపై విమర్శలు గుప్పించారు.అంతకుముందు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీకి చెందిన ఆర్.అశోక, కేఎస్‌సీఏపై ధ్వజమెత్తారు. నెలకు కేవలం రూ. 1,600 నామమాత్రపు ధరకు వారికి 16.32 ఎకరాలిచ్చాము. వారి దగ్గర కోట్ల రూపాయలున్నాయి కానీ వారు మ్యాచ్ టిక్కెట్ల కోసం తమ నుండి వేల రూపాయలు వసూలు చేసి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం మరో స్టేడియం నిర్మించాలను కుంటోంది. వారికి గుణపాఠం నేర్పాలి అంటూ అసెంబ్లీలో మండిపడ్డారు.దీనిపై స్పందిస్తూ అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ సంస్థాగత జోక్యం చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తప్పక KSCAతో చర్చలు జరపాలన్నారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలకు కేవలం ఒక టికెట్ మాత్రమే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి కుటుంబ సభ్యులకు కనీసం నాలుగు టికెట్లైనా ఇవ్వాలని వారికి స్పష్టం చేయాలని ఖాదర్ అన్నారు. ఇదీ చదవండి: క్లాస్‌రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ డీకే హామీఈ విషయాన్ని KSCA అధికారుల దృష్టికి తీసుకువెళతామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సభకు హామీ ఇచ్చారు. అధ్యక్షుడితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాను. అడిగే హక్కు ఎమ్మెల్యేలకు పూర్తిగా ఉంది, వారికి ఆ ప్రయోజనం దక్కాల్సిందనని డీకే అన్నారు. అంతేకాదు "ఇది 'సమ్రాట్' అశోక్ నుండి వచ్చిన అభ్యర్థన అని తాను వారికి కచ్చితంగా చెబుతానంటూ సరదాకా కామెంట చేయడంతో సభలోనవ్వులు పూసాయి. కాగా 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28వ తేదీ శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపు -
తమిళనాడు సహకరిస్తే హైడ్రో పవర్ ప్రాజెక్ట్
సిప్కాట్, న్యూస్‌లైన్ : తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే హొగేనకల్ వద్ద హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు కర్ణాటక సిద్ధంగా ఉందని కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి డి.కే.శివకుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన హొసూరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏళ్ల తరబడి నానుతున్న రాజకీయ కారణాల వల్ల తెరమరుగైన హొగేనకల్ సమీపంలో కావేరి నదిపై ఏర్పాటు చేయాల్సి ఉన్న హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు విద్యుత్ కొరత ఉండదని అన్నారు. బెంగళూరుకు అతిచేరువలో ఉన్న హొసూరు పట్టణం ఎంతో అభివద్ధి చెందిందని ఆయన అన్నారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయడం వ ల్ల కృష్ణగిరి జిల్లా ప్రజలకు ఉపాధి పెరిగిందని ఆయన అన్నారు. కృష్ణగిరి జిల్లా ప్రజలు విద్య, వైద్యం తదితర వాటికి సమీపంలోని బెంగళూరు వస్తున్నారని, కర్ణాటకతో కృష్ణగిరి జిల్లా ప్రజలకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లుగా పేదల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 20 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు పాలిస్తున్నప్పటికీ హొసూరు ప్రాంత ప్రజలు ఈ రెండు పార్టీలను కాదని ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. దేశంలో సుపరిపాలన అందించేకాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సెల్లకుమార్ను గెలిపించాలని ఆయన కోరారు. బెంగళూరు నుంచి హొసూరు గ్రామీణ ప్రాంతాలకు అదనంగా బస్సులు ఏర్పాటుకు సంబంధించి శివకుమార్ మాట్లాడుతూ రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి చొరవతో బెంగళూరు, హొసూరుకు ఇప్పటికే 60 బస్సులు అదనంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.


