breaking news
Diwali shopping
-
దీపావళికి ఆన్లైన్లో ఎక్కువగా కొన్నది ఏంటో తెలుసా?
దీపావళి పండుగ సందర్భంగా ఆన్లైన్ షాపింగ్‌కు భారీ డిమాండ్ కనిపించింది. ముఖ్యంగా.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్‌లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈసారి దీపావళికి ప్రజలు ఎక్కువగా ఆర్డర్ చేసినవి ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.దీపావళి సందర్భంగా ప్రజలు కేవలం స్వీట్లు, చిరుతిళ్లు మాత్రమే కాకుండా.. పూలు, దీపాలు, గిఫ్ట్ హ్యాంపర్ల, బంగారం, వెండి నాణేల వరకు అన్నింటినీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేశారు. ఒకప్పుడు పండుగ వస్తువుల కోసం షాపులకు వెళ్లి గంటల తరబడి కొనుగోళ్లు చేసేవారు. ఇప్పుడు మాత్రం చేతిలో మొబైల్ ఉంటే చాలు.. నచ్చిన వస్తువులను నిమిషాల్లో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఈ మార్పు ఈసారి దీపావళి అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది.జెప్టోలో వీటికే డిమాండ్జెప్టోలో ఈసారి గిఫ్ట్ హ్యాంపర్లకు మంచి డిమాండ్ కనిపించింది. గత ఏడాది దీపావళితో పోలిస్తే.. వీటి ఆర్డర్లు ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. అంతే కాకుండా.. 4.68 లక్షల మట్టి దీపాలను కస్టమర్లు ఆర్డర్ చేసినట్లు సమాచారం. పూలు, పూలదండల కొనుగోళ్లు కూడా రెండున్నర రెట్లు పెరిగాయి.ఇక స్వీట్ల విషయానికి వస్తే ఎక్కువ మంది లడ్డూలను ఆర్డర్ చేయగా, మొత్తం అమ్మకాల పరంగా సోన్ పప్డీ ముందంజలో నిలిచింది. పండుగ సందర్భంగా సంప్రదాయ దుస్తులు, వాటికి సంబంధించిన యాక్సెసరీల కొనుగోళ్లు రెండింతలు పెరిగాయి. ఇక బ్యూటీ ఉత్పత్తులకు కూడా దీపావళి రోజున అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో వెల్లడించింది.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో..స్విగ్గీ ఇన్స్టామార్ట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దీపావళి పార్టీలు, వేడుకలకు అవసరమైన వస్తువుల ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 162 శాతం పెరిగాయి. స్నాక్స్, చిరుతిళ్ల కొనుగోళ్లు కూడా 42 శాతం పెరిగాయి. స్వీట్లలో కాజు కట్లీకి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత మోతీచూర్ లడ్డూ, బేసన్ లడ్డూలు ఉన్నాయి.నవంబర్ 8న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అత్యధిక ఆర్డర్లు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉదయం 11:18 గంటలకు ఒక్క నిమిషంలోనే అత్యధిక ఆర్డర్లు వచ్చాయి. దీపావళికి ముందు రోజు డైట్ కోక్ ఎక్కువగా ఆర్డర్ చేసిన నాన్-గ్రోసరీ వస్తువుగా నిలిచింది. దుస్తులు, నగలు, హెయిర్ యాక్సెసరీలు, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వస్తువుల కొనుగోళ్లు కూడా గణనీయంగా పెరిగాయి.బంగారు నాణేలకు డిమాండ్ఇక ధన్తేరస్ సందర్భంగా.. బంగారం, వెండి నాణేలకు కూడా మంచి గిరాకీ కనిపించింది. నవంబర్ 6న అర్ధరాత్రి 12 గంటల 30 సెకన్లకే హైదరాబాద్ నుంచి ఇన్‌స్టామార్ట్‌లో తొలి బంగారు నాణెం ఆర్డర్ నమోదైంది. అది పూల డిజైన్‌తో ఉన్న 24 క్యారెట్ల బంగారు నాణెం. ఆ తర్వాత కేవలం నాలుగు సెకన్లకే బెంగళూరు నుంచి వెండి నాణెం కోసం ఆర్డర్ వచ్చింది.బంగారు నాణేల్లో దాదాపు మూడింట రెండొంతుల మంది పూల డిజైన్లను ఎంచుకోగా, వెండి నాణేల్లో 73 శాతం మంది లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలున్న నాణేలను కొనుగోలు చేశారు. సాయంత్రం 6:38 గంటలకు ఈ కొనుగోళ్లు అత్యధికంగా జరిగాయి. ఇక ముంబైలో ఒక కస్టమర్ ఏకంగా రూ.1.11 లక్షల విలువైన బంగారు నాణేలను ఆర్డర్ చేయడం విశేషం. హైదరాబాద్‌లో 2 గ్రాముల బంగారు నాణెం, 100 గ్రాముల వెండి బార్ కలిపి రూ.52,215 విలువైన ఆర్డర్ నమోదైంది.షాపింగ్ వేదికలుగా క్విక్ కామర్స్ యాప్లుఈ గణాంకాలను చూస్తే క్విక్ కామర్స్ యాప్‌ల వినియోగం ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. ఒకప్పుడు పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులకే పరిమితమైన ఈ యాప్‌లు ఇప్పుడు పండుగ షాపింగ్‌కు కూడా ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. స్వీట్లు, బహుమతులు, పూలు, దుస్తులే కాకుండా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను కూడా ఇంటి వద్దకే తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా చివరి నిమిషంలో షాపింగ్ చేసే వారికి ఇవి సులభమైన మార్గంగా మారాయి. సమయం ఆదా కావడం, ఇంటి నుంచే అన్ని వస్తువులు ఆర్డర్ చేసుకునే సౌకర్యం ఉండటంతో ప్రజలు క్విక్ కామర్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో పండుగల సమయంలో భారతీయుల షాపింగ్ విధానం కూడా క్రమంగా మారుతోంది. -
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
అప్పుడే దీపావళి షాపింగ్ షురూ చేసిన నటి (ఫొటోలు)
-
జోరుగా దీపావళి షాపింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ధన్‌తేరస్‌తో నగరంలో దీపావళి షాపింగ్ పరాకాష్టకు చేరుకుంది. ధన్తేరస్ నాడు బంగారం, వెండి లేదా స్టీలు వస్తువును కొనడం శుభప్రదమని ఉత్తరాదివాసుల నమ్మకం. ధనతేరస్ రోజున బంగారం, వెండి కొనే తాహతులేకపోతే కనీసం ఓ స్టీలు వస్తువు కొనుక్కోవాలని ఉత్తరాదివాసులనుకుంటారు. దాంతో మంగళవారం బంగారు, వెండి ఆభరణాల దుకాణాలతో పాటు స్టీలు సామగ్రి విక్రయించే దుకాణాలు కూడా కొత్తకొత్త స్కీములతో, ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గణేషుడు, లక్ష్మీప్రతిమలు, లక్ష్మీ వినాయక వెండినాణేలు, రూపాయినోట్ల నమూనాలు వెండి దుకాణాలలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. బంగారం, వెండి ధరలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువగా ఉండడంతో నగరవాసులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతారని దుకాణాదారులు ఆశించినప్పటికీ ఊహించినంత సందడి కనిపించలేదు. అయినప్పటికీ ధన్తేరస్ కొనుగోలుదారులతో పాటు దీపావళి షాపర్లతో నగర మార్కెట్లు కిటకిటలాడాయి. దీపావళి సమయంలో తమతో వ్యాపారలావాదేవీలు నిర్వహించేవారికి, బంధుమిత్రులకు మిఠాయిలు, కానుకలు పంచడం ఉత్తరాదిలో మరోసాంప్రదాయం. దానితో మిఠాయిలు, కానుకలు కొనుగోలు చేసేవారితో రోడ్లపై గంటలతరబడి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడతాయి. సాధారణంగా కానుకలు పంచే తతంగాన్ని చాలామంది వారం రోజుల ముందునుంచే ప్రారంభించినప్పటికీ దీపావళి రోజులలో ఇది పతాకస్థాయికి చేరుతుంది. దీపావళికి ఇచ్చిపుచ్చుకునే కానుకలలో ప్రధానంగా చెప్పుకోవలసింది డ్రైఫ్రూట్స్. డ్రైప్రూట్స్ కొనుగోలుదారులతో ఆసియాలోనే మసాలాలకు అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఖరీబౌలీ మార్కెట్లో మంగళవారం కాలుపెట్టడానికి చోటులేకుండా పోయింది. కాలిఫోర్నియా, కాబూల్ బాదాం, రాజస్థాన్, చైనా కిస్మిస్, ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న డీహ్రైడేటెడ్ పళ్లు... డ్రైఫ్రూట్స్‌లో వెరయిటీకి అంతులేనట్లున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చే ైడ్రె ఫ్రూట్స్ నాణ్యమైనవని దుకాణాదారులు చెప్పారు. చాలారకాల డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా దిగమతి చేసుకుంటారు కనుక వాటి ధర పంటదిగుబడితో పాటు డాలర్ రేటుపై ఆధారపడి ఉంటుందని వారు చెప్పారు. ఈ సంవత్సరం డ్రైఫ్రూట్స్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులు అనుకున్నదానికంటే తక్కువ స్థాయిలో కొనుగోళ్లు జరుపుతున్నారని వారు చెప్పారు. దీపావళి కొనుగోళ్లనగానే మొదట గుర్తుకొచ్చే బాణసంచా గురించి చివరగా చెప్పుకుంటే.... ఈ సంవత్సరం చైనా బాణసంచా పై నిషేధం అమల్లోకి తేవడంతో చాలాదుకాణాలు చైనా ఉత్పత్తులు తమ వద్దలేవనే బోర్డులు వేలాడదీశాయి. అయినప్పటికీ మార్కెట్లలోని చిన్నాచితకా దుకాణాలలో విక్రయించే చైనా బాణసంచా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ప్రమాదాలను, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వం చైనా టపాసుల విక్రయాన్ని నిషేధించినప్పటికీ వాటి ధర దేశీ బాణసంచా కంటే తక్కువగా ఉండడం కొనుగోలుదారులను ఆక ర్షిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది టపాసుల ధరలు ఎక్కువగా ఉన్నాయని అంగీకరించిన పెద్ద దుకాణదారులు ధరల ప్రభావం తమ అమ్మకాలపై కనిసిస్తోందని చెప్పారు. పర్యావరణ సన్నిహితంగా దీపావళి జరుపుకునేవారి సంఖ్య పెరగడం కూడా బాణసంచా అమ్మకాలపై ప్రభావం చూపుతోందని వారు చెప్పారు.


