breaking news
districts Presidents
-
5 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నాయకత్వం 5 జిల్లా లకు అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు కె.సత్యయాదవ్‌ను, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎస్.వెంకటయ్య, కె,.వెంకట్రాములు, కె.రాములు.. సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సీహెచ్ ఉమామహేశ్వర్రావు, వై.వెంకటనరసయ్య, ఆర్.ఉమ, వి.రమేశ్ నియమితులయ్యారు.ఇక నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా రితేశ్ రాథోడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఆకుల శ్రీనివాస్, దశరథ్, ఆడెపు లలిత, పి.సతీశ్వర్‌రావు, కె.అశోక్.. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా బైరి శంకర్‌ముదిరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తోట స్వరూప, వి.రామచంద్రారెడ్డి, వేణుమాధవ్, ఎస్.సత్త య్య, ఎస్.యాదగిరి.. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆర్.గోపీ ముదిరాజ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా కె.కృష్ణస్వామి, జ్ఞానరామస్వామి నియమితులయ్యారు. -
వివిధ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులను ఆయా జిల్లాల కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బండ నరేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన మూడవసారి ఎన్నికవడం విశేషం. ఆదిలాబాద్ తూర్పు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పురాణం సతీష్‌ను, పశ్చిమ జిల్లా అధ్యక్షుడుగా లోక భూమారెడ్డిని కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఈద శంకర్ రెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


