breaking news
Different looks
-
హీరోలకి బ్లాక్ కలర్ పులుముతున్న డైరెక్టర్స్!
క్యారెక్టర్ కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు హీరోలు. ఇప్పుడు కొందరు హీరోలు ‘నల్ల’గా మారిపోయారు. క్యారెక్టర్‌కి తగ్గట్టు బ్లాక్ మేకప్‌తో కనిపించడానికి రెడీ అయ్యారు. ఫస్ట్ లుక్ అంటూ విడుదలైన ఆ పోస్టర్లను చూసి, అభిమానులు ‘బ్లాక్.. కిర్రాక్’ అంటున్నారు. డిఫరెంట్ మేకప్‌తో కొందరు హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ కటౌట్‌కి ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బ్లాక్ కలర్ పులిమారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ సినిమా కోసమే ప్రభాస్ బ్లాక్ మేకప్ వేసుకున్నారు. రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించారు. రెండు పోస్టర్స్‌లో బ్లాక్ కలర్ నిండుగా ఉంది. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ‘సలార్’ సినిమా షూటింగ్ జరిగింది. సో.. ప్రభాస్ బ్లాక్ లుక్స్‌కు కథే కారణమని ఊహించ వచ్చు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ► ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లో నల్లని మేకప్‌లో ఎన్టీఆర్ ఫెరోషియస్‌గా కనిపించారు. ఇక హీరోగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో ఉంటుంది. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్‌తో చేసే సినిమా ఆరంభమవుతుంది. ► హీరో నాని నటిస్తున్న తాజా సినిమా ‘దసరా’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో నాని ఫుల్ బ్లాక్ లుక్‌లో కనిపించారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా, సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుంది. సో.. ‘దసరా’ ఫస్ట్ లుక్ అలా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ► కామెడీ హీరోగా, వీలైనప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ‘అల్లరి’ నరేశ్. కాగా 2021లో ‘అల్లరి’ నరేశ్ హీరోగా వచ్చిన ‘నాంది’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకుడు. ఇప్పుడు ‘అల్లరి’ నరేశ్, విజయ్ కనకమేడల మరో ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యారు. ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో ఫుల్‌గా మసి పూసుకుని ఉన్నారు నరేశ్. -
సేమ్ టు ఫేమ్
సేమ్ గర్ల్. డిఫరెంట్ లుక్స్.. సూపర్ డూపర్ ఫేమ్! అందానికి నిజమైన నిర్వచనం ఏమిటి? బ్యూటీ అంటే ప్రపంచంలో ఎవడి కొలతలు వాడివే. ఒక్కో కల్చర్దీ ఒక్కో లెక్క. ప్రతి లెక్కకీ ఓ మేకోవర్ ఉంటుంది. అదేమిటో కనుక్కోవాలని ఎస్తర్ హోనిగ్ అనే అమెరికన్ ముద్దుగుమ్మ బయలుదేరింది. ప్రపంచంలోని వివిధ దేశాలకీ తన ఫోటో పంపించి, వారి వారి సాంస్కృతిక నేపథ్యం ప్రకారం అందగత్తె ఎలా ఉండాలో ఫోటోషాప్ చేయమంది. ఆ ఫోటోషాప్ చిత్రాలలో కొన్నింటిని మీరూ వీక్షించండి. ఈ పోస్టును ఇప్పటికే 22,72,569 మంది షేర్ చేశారు. ఇప్పుడు వారాన్ని ఎలాగోలా నెట్టుకురానవసరం లేదు. నెట్టుందిగా.... అదే ఇంటర్ నెట్టుందిగా! ఇంటర్నెట్తో పిడికిట్లో ప్రపంచం. వేలి కొసలపై విశ్వబ్రహ్మాండం!! ఇందులో శృంగారం తీపి, వెటకారం వగరు, చిలిపితనపు పులుపు, అహంకారం కారం ... ఇలా అన్ని టేస్టులూ ఉంటాయి. ఏ ట్వీట్ ఎందుకు అందర్నీ బీట్ చేసింది? ఏ షేర్ ఫేస్ బుక్ షేర్ మార్కెట్‌ను దడదడలాడించింది? ఏ వార్తపై కామెంట్ల కనకవర్షం కురిసింది? ఏ ఫోటోపై ఎన్ని లైకులు వచ్చాయి? ఆన్లైన్లో ట్రెండ్స్... అలా గత ఏడు రోజుల్లో వైరల్ అయిపోయిన టాప్ ట్రెండింగ్ పోస్టులేమిటి? వేలి కొసలకు వైరల్ ఫీవర్ తెప్పించిన బెస్టు బెస్టు పోస్టులేమిటి? చూద్దాం. మురికి వాడల ముత్యం ముంబాయి మురికివాడల్లో ఉండే ఓ పదిహేనేళ్ల అమ్మాయిని బీహార్ తీసుకెళ్లి ఇద్దరు పిల్లల తండ్రికి రెండో పెళ్లాంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగానే పోరాడింది. ఆఖరికి హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే స్వచ్ఛంద సంస్థ ఆ అమ్మాయికి తోడు నిలిచింది. ఈ అమ్మాయి కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ని ఏలుతోంది. 62575 లైక్‌లు, 1365 కామెంట్లు, 4846 షేర్ల్లు ఈ అమ్మాయి కథను ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికీ తీసుకెళ్లాయి. ఆమెకి నెట్ జగత్తు బాసటగా నిలిచింది. ఇంతకీ ఈ అమ్మాయి పేరేమిటి? పేరు బయటికి రాలేదు. ఏం? ‘ముత్యం’ అన్న పేరు బాలేదా? నగ్న సత్యం కిమ్ కర్దషియాన్. ఆమె సోషల్ మీడియా సామ్రాజ్ఞి. ప్రతిరోజూ పతాక శీర్షికలో ఉండటం ఎలాగో తెలిసిన వ్యక్తి. ఈ మధ్య తాను గర్భవతినని ఆమె పోస్టు చేశారు. అయితే ఆమెది ఫేక్ ప్రెగ్నన్సీ అని కొందరు విమర్శించడం మొదలుపెట్టారు. దాంతో ఆమెకి కోపం వచ్చింది. నిజమేమిటో చెబుతాను చూడండి అని ప్రతి సవాలు విసిరింది. ఆమె ఏదో మెడికల్ రిపోర్టులు నెట్లో పెడుతుందనుకున్నారు. కానీ కిమ్ తనదైన శైలిలో నగ్నంగా ఫోటోదిగి దాన్ని సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. చూసుకోండెహె అని సవాలు విసిరింది. ఈ నగ్నసత్యంతో కిమ్మమ్మ అందరినీ కిమ్మనకుండా చేసేసింది. పన్నెండేళ్ల ప్రసవ వేదన! అయ్యవారి పేరు లెన్నార్ట్ నిల్సన్. ఆయన ఓ పుష్కరకాలం పాటు చేస్తున్నది ఒకే ఒక్క పని. ఒక వీర్యకణం, అండానికి ఎలా కన్ను గీటుతుంది. ఆ రెండూ ఎలా లవ్వాడుకుంటాయి. ఆ లవ్వుకి ఫలితంగా పిండం ఎలా పుడుతుంది. ఆ పిండం బ్రహ్మాండంగా ఎదిగి ఓ బుడ్డోడు/బుడ్డది ఎలా తయారవుతారు - ఇదే ఆ ఫోటోగ్రాఫర్ గారి పరిశోధనాంశం. ఆయన ఓ తల్లి గర్భాన్నే తన ఫోటో స్టూడియోగా మార్చేసుకున్నాడు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపుని ఎండోస్కోపీ ద్వారా ప్రవేశపెట్టి పన్నెండేళ్లుగా ఫోటోలు తీస్త్తూనే ఉన్నాడు. ఆ ఫోటోలను నెట్లో ఎగ్జిబిషన్ పెడితే ఇక చూడండి షేర్లే షేర్ల్లు. లైకులే లైకులు. అసలు లెన్నార్ట్ నిల్సన్ గారి వెబ్ సైట్ ని ఒకసారి విజిట్ చేస్తే సృష్టిమూలమైన సూక్ష్మచిత్రం మీ కళ్ల ముందుంటుంది. వెక్కిరింతలు వేయి రకాలు! ఎదుటి మనిషికి కోపం తెప్పించాలంటే ఏం చేయాలి? వెక్కిరించాలి. వెవ్వెవ్వె అనాలి. అంతే కోపం తన్నుకువచ్చేస్తుంది. అలా కోపం తెప్పించే 26 వెక్కిరింత పద్ధతులను ఒకేచోట మన సౌకర్యం కోసం పోగు చేశారు రచయిత అంకుశ బహుగుణ. మెన్ ఎక్స్పీలోని ఈ కథనం పట్టుమని పది రోజుల్లో పేస్‌బుక్‌లో 15 వేలు, ట్విట్టర్లో 13 వేలు, గూగుల్ హాంగౌట్లో దాదాపు మూడు వేల మంది షేర్ చేశారు. ఈ షేర్‌ఖాన్‌ను మీరూ చూడాలంటే http://www.mensxp.com/special&features/today/27099&26&most&hilarious&ways&to&insult&someone.htmని క్లిక్ చేయండి. ఓ మై గాడెస్! ఓ మై గాడ్ సినిమా చూశారా? అందులో ఓ ఫ్యాషనబుల్ సన్యాసిని లిప్ స్టిక్ పెదాలతో పరమపదం గురించి చెబుతుంది. అదిగో ... సరిగ్గా అలాంటి సన్యాసినే మన సుఖ్విందర్ కౌర్ ఉరఫ్ రాధే మా! ఆమెను పూజించదలచుకున్న భక్తుడు ఆమెను ఎత్తుకోవాల్సిందే. ఆలింగనమే ఆమె ఇచ్చే ఆశీర్వాదం. ఆకలేస్తే అన్నం పెట్టాల్సిన రాధే మా మూడొస్తే ముద్దులు పెట్టేలా ఉన్న ఫోటోలు, దానిపై ట్విట్టర్లో జోకులు, కేకలు వైరల్ ఫీవర్లా వ్యాపిస్తున్నాయి.