breaking news
dial-100
-
రాయదుర్గం హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: అత్యవసర సేవ అయిన డయల్–100 ఫిర్యాదును పట్టించుకోకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం.రమేష్ ఆదివారం సస్పెండ్ చేశారు. శనివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో జరిగిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో బాధితుడు డయల్–100కు రెండుసార్లు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరాడు. ఇన్చార్జిగా ఉన్న సయ్యద్ యూనస్ ఘటనా స్థలానికి వెళ్లకుండా ‘ఫోన్ చేసిన వ్యక్తి వల్లే ఇబ్బంది’ అంటూ నమోదు చేసి రెండు ఫిర్యాదులను మూసివేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సయ్యద్ యూనస్‌ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
'డయల్ 100పై డైలమా'
డయల్ 100 కొనసాగించాలా? లేదా అన్న డైలమాలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జాస్తి వెంకట రాముడు చెప్పారు. డయల్ 100 కు 95 శాతం వరకు తప్పుడు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. అభయం, ఐక్లిక్లు రెండూ పైలట్ ప్రాజెక్టులే అని డీజీపీ జేవీ రాముడు అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు రియల్ కాల్స్ వస్తేనే ఈ సేవలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. లేని పక్షంలో వాటి గురించి కూడా పునరాలోచించాల్సి వస్తుందన్నారు.


