Dharmarao
-
తెలుగు తమ్ముళ్ల ఘరానా మోసం
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం కేంద్రంగా మొదలై.. హైదరాబాద్ వరకు ఇద్దరు టీడీపీ నేతలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చిoది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట 350 మందికి టోకరా వేసి సుమారు రూ.6 కోట్లతో పరారైన వైనం బయటపడింది. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొచ్చెర్ల ధర్మారావురెడ్డి పోలెండ్‌లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఏజెంట్‌గా అవతారం ఎత్తి స్థానిక యువకులకు ఉద్యోగాల ఎర వేశాడు. దగ్గర బంధువుల్లో నిరుద్యోగులుగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ఇటలీలో అదిరిపోయే ఉద్యోగాలున్నాయని ఊరించాడు. ధర్మారావురెడ్డి తన బంధువులైన ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)తో ప్రచారం ఊదరగొట్టించాడు. ఇటలీలో ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్ల కంపెనీలు, ప్యాకింగ్ మొదలైన సంస్థల్లో మంచి ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మించాడు. ఎంత వీలైతే అంతమందికి ఉద్యోగాలున్నాయని.. ఎక్కువ మందిని తీసుకొస్తే ఫీజులో కొంత తగ్గిస్తానంటూ ఆశ చూపించాడు. టీడీపీ నేతల మాటలు నమ్మిన నిరుద్యోగులు.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న బంధువులు, స్నేహితులను సంప్రదించారు. వారిని కూడా ఈ ఉచ్చులోకి తీసుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ధర్మారావురెడ్డి, దిలీప్ కలిసి ప్లాన్ వేసినట్లు పక్కాగా స్పష్టమవుతోంది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధం.. ఏం జరిగినా పార్టీ కాపాడుతుందన్న తెగింపుతో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 350 మందిని ఎంపిక చేశారు. ఇచ్చాç³#రంలో లాడ్జిని తీసుకొని మొదటి విడతలో 2024 ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.20 వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్షలు వసూలు చేశారు. ఆగస్టులో హైదరాబాద్‌లో మరో 175 మందిని ఇంటర్వ్యూ చేసి రూ.1.35 లక్షలు చొప్పున తీసుకున్నారు. జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి రూ.50 వేలు వంతున వసూలు చేశారు. అందరి దగ్గర విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌లు, ఫొటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో ఇటలీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారని చెప్పి ఇచ్ఛాపురంలోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో 350 మంది నిరుద్యోగులకు వారి సొంత డబ్బు తోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ వెళ్లాక బట్టబయలైన మోసంఇటలీ ప్రయాణానికి మొదటి విడతలో 30 మంది పాస్‌పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ధర్మారావు, దిలీప్ రెండు వారాల క్రితం చెప్పడంతో.. ఢిల్లీ వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. వాళ్లు చెప్పిన అడ్రస్‌లు, పాస్‌పోర్టు చెకింగ్లు అంతా మోసమని గ్రహించారు. 350 మందితో ఒక వాట్సప్ గ్రూప్ పెట్టిన టీడీపీ నేతలు.. ’’మీతో పాటు మేము కూడా మోసపోయాం.. అందరూ క్షమించాలి‘‘ అంటూ వాయిస్ మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్చాఫ్ చేసేశారు. బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డున పడ్డారు. పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవడం లేదు.! ధర్మారావురెడ్డి బాధితులు ఫిబ్రవరి 17న ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలిస్తామని చెప్పారు తప్ప.. విచారణకు సాహసించలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి.. విచారణను ఆపుతున్నట్లు బాధితులు గ్రహించారు. చేసేదిలేక విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌కు వచి్చనా పట్టించుకోలేదంటూ బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. రాజకీయ పలుకుబడితో.. కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.సీఎం కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం టీడీపీ నేతల బాధితులు ధర్మారెడ్డి మంచివాడు అని నమ్మబలికిన దిలీప్ మధ్యవర్తిత్వంతో అందరం డబ్బు చెల్లించాం. మోసపోయామని చివరి నిమిషంలో తెలిసింది. దిలీప్‌ను నిలదీసినా స్పందించలేదు. ఇచ్ఛాపురం పోలీసులు పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్లారని చెప్పడంతో.. సీఎం కార్యాలయంలోనూ, మంత్రి లోకేష్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాం. మా ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడును కలిసి ఫిర్యాదు చేస్తే.. రెండు రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పారు. వారం దాటినా ఎలాంటి స్పందన లేదు. చాలామంది ఉన్న ఉద్యోగం వదిలి డబ్బులు కట్టాం. రోడ్డున పడ్డాం. డబ్బు తిరిగి చెల్లించాలి. -
తెలుగు సినిమాకి బహూకరిస్తున్నాం
‘‘ఒక వివాహ వేడుకలా అద్భుతంగా జరిగిన ఈ అంకితోత్సవం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో అందమైన విషయాలతో కూడిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని తెలుగు సినిమాకు బహూకరిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఇంత మంచి గ్రంథాన్ని మాకు అంకితం చేసినందుకు రచయిత డా. కె.ధర్మారావుకు అభినందనలు’’ అని ‘తెలుగు సినిమా గ్రంథం’ స్వీకర్తలు కృష్ణ, విజయనిర్మల అన్నారు. సినీ లెజెండ్స్ అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, రామానాయుడు, డి.వి.ఎస్.రాజు సలహాదారులుగా, ప్రోత్సాహకులుగా ఏర్పడిన ‘ఫిలిం అనలిటికల్ అండ్ అసోసియేషన్’ (ఫాస్), డా. కె.ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ గ్రంథం ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. విశిష్ట అతిథి, దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘484 పేజీల్లో విషయం, మరో 24 పేజీల రంగుల పుటలతో విశిష్ట సమాచారంతో పాటు చక్కటి ఫొటోలతో తెలుగు సినిమా విశేషాలను ఈ గ్రంథంలో బాగా ఆవిష్కరించారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక ఎన్సైక్లోపీడియాగా ఉపయోగపడుతుంది’’ అన్నారు.‘‘తెలుగు సినిమా చరిత్రను ధర్మారావు చక్కగా విశదీకరించి, తెలుగు సినిమా సేవలో మరో అడుగు ముందుకు వేశారు’’ అన్నారు నటుడు నరేశ్. ఈ సమావేశానికి ముందు గాయకులు టి.లలితరావు, డా. టీవీ రావు కలిసి కృష్ణ, విజయనిర్మల నటించిన చిత్రాల్లోని పాటలను పాడి అలరించారు. రచయిత కె.ధర్మారావు, రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, డా.కీమల ప్రసాదరావు, ఫాస్ గౌరవాధ్యక్షులు ప్రసాదరావు, కొదాల బసవరావు, రచయిత భార్య ఆదుర్తి సూర్యకుమారి పాల్గొన్నారు. -
బీచ్‌రోడ్‌లో స్కూల్ బస్ బీభత్సం
► జనాలపైకి దూసుకెళ్లిన బస్సు ► ఒకరు మృతి, 8 మందికి గాయాలు ► ముగ్గురు పరిస్థితి విషమం సమయం.. రాత్రి 8 గంటలు.. వేసవి సెలవులు, ఆపై ఆదివారం.. ఉదయం నుంచి భానుడు భగ్గుమనడంతో సేద తీరేందుకు పెద్దసంఖ్యలో జనం సాగరతీరానికి చేరుకున్నారు. అంతా ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. చిల్డ్రన్ పార్క్ ఎదురుగా బీచ్‌రోడ్డు గోడపై కూర్చొని కబుర్లు చెప్పుకొంటున్నారు. ఇంతలో.. నోవాటెల్ డౌన్ నుంచి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. ఎదురుగా ఉన్న వారిని ఢీకొట్టింది.. కేరింతలు కాస్తా.. హాహాకారాలుగా మారిపోయాయి. బీచ్ రోడ్డు భీతావహంగా మారిపోయింది. సాగరతీరం కన్నీటి సంద్రమైంది. ప్రమాదానికి కారణమైన బస్సు ఒకరిని పొట్టన పెట్టుకోగా, ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ఐదుగురు గాయపడ్డారు. విశాఖ సిటీ/బీచ్‌రోడ్/జగదాంబ : బీచ్‌రోడ్డులో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన బస్సు నోవాటెల్ డౌన్ నుంచి వేగంగా దూసుకొచ్చి బీచ్ రోడ్డు గట్టుపై కూర్చొన్న వారిపైకి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి తరలించారు. మరణించిన వ్యక్తి విజయవాడ అదనపు ఎస్పీ దూసి నందకిశోర్ తండ్రి దూసి ధర్మారావు(85)గా గుర్తించారు. నందకిశోర్ గృహప్రవేశం కావడంతో కుటుంబమంతా విశాఖ వచ్చారు. బంధువులతో కలసి సాయంత్రం అంతా బీచ్‌కు రాగా ఈ దుర్ఘటన సంభవించింది. గాయపడిన వారిలో ఏడీఎస్పీ నందకిశోర్ సహా, ఆయన కుమారుడు దేవగురు, కుమార్తె మంజీర కూడా ఉన్నారు. వీరిలో కుమారుడు దేవగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిలో విజయవాడకు చెందిన దేవరగట్టు పద్మావతి, దేవరగట్టు ప్రసాదరావు, ఒకే కుటుంబానికి చెందిన పైడిపాల వెంకట్, పైడిపాల సునీత, పైడిపాల వేణుగోపాల్, అన్నపూర్ణ ఉన్నారు. వీరితో సహా గాజువాకు చెందిన తీడ శ్రీకర్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పల్లి కృష్ణారావు, కింజరాపు కేశవకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ధాటికి బీచ్ గోడ ధ్వంసం కాగా.. అక్కడే పార్క్ చేసి ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రచయితను కోల్పోయిన ఉత్తరాంధ్ర విశాఖ సిటీ : బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దూసి ధర్మారావు ప్రముఖ రచయిత. శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంగ్లిష్ అధ్యాపకుడు ధర్మారావు. ప్రస్తుతం జిల్లాలో ఇంటాక్ శ్రీకాకుళం ఛాప్టర్ కన్వీనర్‌గా పని చేస్తూ జిల్లాలోని ప్రాచీన సాహితీ, సాంస్కృతిక పరిరక్షణకు సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన రచించిన ‘సామ్రాట్ చోడ గాంగ’ చారిత్రాత్మక నాటకం ఆకాశవాణి నాటకోత్సవాల్లో మార్చి 23వ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రసారమైంది. ఆయన తాళపత్ర గ్రంథాల సేకరణకు చాలా కృషి చేశారు. సుమారు 15 వరకూ రచనలు చేశారు. శ్రీకాకుళం జిల్లా విశేషాలు, సామాజిక వ్యవహారాలు, చరిత్ర పై ధర్మారావు రాసిన పుస్తకాలు ప్రశంసలు అందుకున్నాయి. ఈయన మృతితో ఉత్తరాంధ్ర కలం మూగబోయింది. కుమారుడి గృహప్రవేశానికి వచ్చి.. మృత్యుఒడి చేరిన దూసి ధర్మారావు కొద్దిగంటల క్రితం వరకు మామిడి తోరణాలతో కళకళలాడిన ఆ ఇల్లు శోకనిలయమైంది. కుమారుడి గృహప్రవేశానికి ఎంతో ఆనందంగా వచ్చిన ఆ తండ్రి మృత్యుశకటానికి బలయ్యారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఆ ఇంటి పెద్దను మృత్యుఒడికి చేర్చింది. బంధువులతో కలసి సరదాగా సాగరతీరానికి వెళ్లిన శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కవి, రచయిత దూసి ధర్మారావు (85) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ధర్మారావు కోరికపైనే.. విజయవాడలో అదనపు ఎస్పీగా పని చేస్తున్న నంద కిశోర్ మధురవాడలో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశారు. శనివారం గృహప్రవేశం చేశారు. బంధువులంతా ఉండడంతో బీచ్‌కు వెళ్దామని ధర్మారావే కోరారు. దీంతో కుటుంబ సభ్యులంతా బీచ్‌కు వచ్చారు. మొదట వేరే స్థలంలో కూర్చున్న కుటుంబసభ్యులు వారి పక్కన నీరు ఉందని, అక్కడి నుంచి గోడ వద్దకు వచ్చి కూర్చున్నారు. చిన్నాన్న బతికించాడు వేసవి సెలవులకు శ్రీకర్ ఇక్కడికి వచ్చాడు. సోమవారం విజయనగరం వెళ్లవలసి ఉంది. బీచ్‌కు వెళ్దామని కోరడంతో గాజువాక నుంచి మేం కుటుంబం అంతా కలసి బీచ్‌కు వచ్చాం. బస్సు దూసుకు వస్తున్న సమయంలో శ్రీకర్ చిన్నాన్న చూసి వెంటనే అతన్ని పక్కకి లాగటంతో తీవ్ర గాయాలైనా, బతికి బయటపడ్డాడు. – జి.సత్యవతి, టి.శ్రీకర్ బంధువు పరిశీలించిన కమిషనర్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే నగర పోలీస్ కమిషనర్ æయోగానంద్ ఘటనా స్థలిని పరిశీలించారు. ఆదివారం కావడంతో బీచ్ రోడ్డులో పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉండటంతో, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించి క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగలిగారు. ప్రమాద తీవ్రతను పరిశీలించిన సీపీ, బస్సు కండిషన్‌ను పరిశీలించాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. రవాణాశాఖ అధికారులు బస్సుని పరిశీలించారు.