breaking news
Dhanya Rajendran
-
జాతీయ స్థాయి జర్నలిస్ట్ పై రెడ్ బుక్ ఆగడాలు
-
‘ఎఫ్‌బీఐ’ పేరుతో ఆగని ఆగడాలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోతున్నా ఖాతరు చేయకుండా గుంటూరు పోలీసులు మరింత బరి తెగిస్తున్నారు! ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) పేరును దుర్వినియోగం చేయడానికి ఏమాత్రం సిగ్గు పడటంలేదు. ఎక్స్ ఖాతాల్లో వందలాది పోస్టుల తొలగింపే లక్ష్యంగా ఎఫ్‌బీఐ పేరుతో దొంగ ఫిర్యాదులు చేస్తున్న గుంటూరు పోలీసుల నిర్వాకం గురువారం మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్, ది న్యూస్ మినిట్ ప్రధాన సంపాదకురాలు ధన్య రాజేంద్రన్ ఎక్స్ ఖాతాపై గుంటూరు పోలీసులు చేసిన ఫిర్యాదులో ఎఫ్‌బీఐగా పేర్కొనడం మరోసారి జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది.దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు తెరతీసిన గుంటూరు పోలీసుల ఎఫ్‌బీఐ అవతారం నవ్వులపాలు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్‌తోపాటు దేశవ్యాప్తంగా సీనియర్ జర్నలిస్టులు, మేధావులు దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విమర్శిస్తే టేక్‌డౌన్ ఫిర్యాదులా?... పోలీసుల పని ఇదేనా? అంటూ నిలదీస్తున్నారు. గుంటూరులో ఎఫ్‌బీఐ ఎప్పుడు పెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వార్త రాస్తే నేరమా? అంటూ మండిపడుతున్నారు.గుంటూరుకు సంబంధించిన ఓ ఘటనపై ధన్య రాజేంద్రన్ పెట్టిన పోస్టును తొలగించాలంటూ పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో ‘ఎక్స్’కు ఫిర్యాదు చేశారన్న వార్త వెలుగులోకి రావడంతో.. ఇది కేవలం ఒక పోస్టు వ్యవహారం కాదని, ఏపీ పోలీసులు తమ అధికారాన్ని సామాజిక మాధ్యమాలపై ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పేందుకు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలను ఎదుర్కోలేక నకిలీ పేర్లతో ఫిర్యాదు చేయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.ఒక్క పోస్టు.. దేశవ్యాప్త చర్చ..గుంటూరు పోలీసులు ఎఫ్‌బీఐగా మారారా..? అంటూ బెంగళూరుకు చెందిన జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తన ఖాతాలోని ఓ పోస్టుపై గుంటూరు అర్బన్ ఎస్పీ మెయిల్ నుంచి సీఐ ఏవీ బ్రహ్మం పేరుతో ఎక్స్‌కు చేసిన ఫిర్యాదులో వాస్తవాలను మరుగునపరిచి అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐగా పేర్కొనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు గుంటూరు పోలీసుల ఫిర్యాదును ట్యాగ్ చేస్తూ ధన్య రాజేంద్రన్ పోస్టు పెట్టారు.ది న్యూస్ మినిట్ ప్రధాన సంపాదకురాలిగా ధన్య రాజేంద్రన్ చమేలి దేవి జైన్ అవార్డు, రెడ్ ఇంక్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలు అందుకున్నారు. 3.37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె ఎక్స్ ఖాతాలో ఏపీ పోలీసులపై పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, మాజీ అధికారులు ఘాటుగా స్పందించారు. ‘ఇదేనా మీ పని?’ఏపీ పోలీస్ 100ను ట్యాగ్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ ఘాటుగా స్పందించారు. ‘‘హాయ్ ఏపీ పోలీస్ 100.. ఇదేనా మీ పని? కథనాలను తొలగించాలని అభ్యర్థనలు పంపడమా? అదీ ఒక సాధారణ స్థాయి టీడీపీ వ్యక్తికి సంబంధించిన విషయంపై? సిగ్గుచేటు.. దానికి బదులుగా నిజంగా ప్రజలకు సహాయపడేందుకు మీ సమయాన్ని వెచ్చించండి’’ అని సూచిస్తూ, గుంటూరు పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో చేసిన ఫిర్యాదును పోస్టు చేశారు. అసమ్మతిని తెలిపే పోస్టులను భారత చట్టాల ఉల్లంఘనలుగా పేర్కొంటూ ఎక్స్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు అందిన కంటెంట్‌ను కేవలం భారత్‌లోనే తొలగించేలా చర్యలు కోరుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘ఎఫ్‌బీఐ–గుంటూరు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు ఘాటుగా బదులిచ్చిన ధన్య రాజేంద్రన్గుంటూరులో ఓ మహిళ వస్త్రాపహరణ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని బాధిత మహిళ, ఆమె కుమారుడిని కలిసినప్పుడు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన పోస్టుపై ధన్య రాజేంద్రన్ ఘాటుగా బదులిచ్చారు.‘‘నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదు. ఆ కథనంలో కూడా ఎటువంటి వీడియో లేదు. ఇలాంటి ఘటనల గురించి మేం వార్తలు రాయకూడదని మీరు అంటున్నారా? లైంగిక హింసకు గురైన బాధితులందరూ తమ గురించి వార్తలు వచ్చేటప్పుడు గౌరవం దక్కాలని కోరుకుంటారు. ఆ విషయంలో మేం ఎప్పుడూ రాజీ పడం’’ అని ఆమె స్పష్టం చేశారు.‘మీడియాను వేధించడమే పనిగా పెట్టుకున్నారా?’ధన్య రాజేంద్రన్ పోస్టును ట్యాగ్ చేస్తూ సీనియర్ జర్నలిస్టు చిత్రా సుబ్రమణ్యం ఏపీ పోలీసుల తీరును ప్రశ్నించారు. మీడియాను వేధించేందుకు ఏపీ పోలీస్ 100 ఎప్పటి నుంచి నిర్ణయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, ప్రతిపక్షాలకు టేక్‌డౌన్ నోటీసులు పంపుతున్నారంటూ విమర్శించారు.ఎఫ్‌బీఐగా నటిస్తూ ఫిర్యాదు ఎందుకు?’మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ధన్య రాజేంద్రన్ పోస్టును ట్యాగ్ చేస్తూ..‘‘గుంటూరు అర్బన్ ఎస్పీ ఎందుకు ఎఫ్‌బీఐగా నటిస్తూ సీనియర్ జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ ఖాతాను తొలగించాలని ఫిర్యాదు చేశారు?’’ అని ప్రశ్నించారు. ఈ చర్యను ‘స్పష్టమైన నేరపూరిత దుష్ప్రవర్తన’గా అభివర్ణించిన ఆయన.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో చేస్తున్న చర్యలకు సీఎం, హోంమంత్రి, మంత్రి నారా లోకేశ్, డీజీపీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ అనుమతి ఉందా? అని సంబంధిత ఖాతాలను హ్యాష్ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. ‘వాస్తవాలు చెబితే టేక్‌డౌన్ నోటీసులా?’ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, ఫ్యాక్ట్ చెక్కర్ మహ్మద్ జుబేర్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ‘జర్నలిస్టులకు, ప్రతిపక్షాలకు టేక్‌డౌన్ నోటీæసులను ఏపీ పోలీసులు ఎందుకు పంపుతున్నారు? హల్లో.. ఏపీ డీజీపీ, నారా లోకేశ్.. వాస్తవాలు చెప్పినందుకు ఏపీ పోలీసులు ఎక్స్ ద్వారా టేక్‌డౌన్ నోటీసులతో ఎందుకు బెదిరిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.‘ఇది చాలా విచిత్రంగా ఉంది’ది సౌత్ ఫస్ట్ డాట్‌కామ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు అనుష రవి సూద్ కూడా ధన్య రాజేంద్రన్ పోస్టును ట్యాగ్ చేస్తూ స్పందించారు. ఆమె పెట్టిన పోస్టును తొలగించాలని ఏపీ పోలీసులు ఎక్స్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి ఎఫ్‌బీఐగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలాంటి పద్ధతులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. ఇది చాలా విచిత్రంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.టేక్‌డౌన్ ఫిర్యాదులపై స్పష్టత ఏదీ?చంద్రబాబు సర్కారు ఆదేశాలతో చెలరేగిపోతున్న ఏపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టులు, మాజీ అధికారులు, సామాజిక కార్యకర్తల పోస్టులకు సంబంధించి పోలీసులు ఎక్స్‌కు చేసిన ఫిర్యాదుల స్వభావం, వాటికి ఆధారంగా చూపిన చట్టపరమైన నిబంధనలు, తొలగించాలని కోరిన కంటెంట్ వివరాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలను అణచివేయడానికే చంద్రబాబు సర్కారు ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు మరోసారి స్పష్టమైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
మనం నమ్మిందే రాయాలి!
ధన్యా రాజేంద్రన్ సొంతూరు కేరళ రాష్ట్రం, పాలక్కాడ్. ఢిల్లీ నుంచి జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. వార్తా పత్రికలు, టీవీ చానెళ్లలో పని చేసిన తర్వాత సొంతంగా న్యూస్ వెబ్సైట్ ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ అందించారు. ఓటర్ల నమోదులో ఉద్దేశపూర్వకంగా జరిగిన మోసాన్ని ద న్యూస్ మినిట్ వెబ్సైట్ ద్వారా బయటపెట్టారు. ‘అవుట్ స్టాండింగ్ ఉమన్ మీడియా పర్సన్’చమేలి దేవి జైన్ అవార్డు (2022) అందుకున్నారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొనడానికి హైదరాబాద్ నగరానికి వచ్చారు జర్నలిస్ట్ ధన్యా రాజేంద్రన్. ది న్యూస్ మినిట్ న్యూస్ (టీఎన్ఎమ్) వెబ్సైట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆమె. సమాచారాన్ని నిజాయితీగా అందించాలంటే పత్రికా స్వేచ్ఛతోపాటు జర్నలిజంలో జవాబుదారీతనం కూడా ఉండాలంటూ అనేక విషయాల పట్ల తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే... ‘నేను నమ్మింది నమ్మినట్లు చెప్పడం కోసమే సొంత మీడియా సంస్థను ప్రారంభించాను. టీవీల్లో సమాజానికి అవసరమైన వార్తా కథనాలకంటే రేటింగ్‌ల కోసం ప్రసారాలే ఎక్కువగా కనిపించాయి. మహిళల కోసం, అణగారిన వర్గాల కోసం కథనాలు రాసే అవకాశం కలగలేదు. సొంత సంస్థను స్థాపించి నేను రాయాలనుకున్న కథనాలు రాయడం మొదలు పెట్టాను. నాతోపాటు ఇద్దరు మహిళా జర్నలిస్టులే మా ఎడిటోరియ ల్ టీమ్. ఎంతకాలం నడిపించగలనో తెలియని అయో మయ పరిస్థితుల్లోనే ధైర్యంగా ముందడుగు వేశాను. ఇప్పుడు నా వెబ్సైట్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగింది. ఏం రాస్తున్నామో స్పష్టత ఉండాలి కెరీర్ విషయంలో మా తరం కంటే ఇప్పుడు కొత్త తరం జర్నలిస్టుల ముందు పెద్ద అయోమయం నెలకొని ఉంది. సమా జం అనేక కోణాల్లో విభజితమై, దేనికదిగా కేంద్రీకృతమై ఉంది. ఈ స్థితిలో మనం ఏం రాస్తున్నామనే విషయంలో స్పష్టంగా ఉండాలి. ఒక విషయం, ఒక వ్యక్తి గురించి రాసే ముందు మనకు నమ్మకం కలగాలి. పేద, దళిత, ఆదివాసీల సమస్యలు రాయడానికి ముందు వాటిని విశ్వసించాలి. మన కలం గొంతు పెగల్చలేని నిస్స హాయులకు గొంతుక కావాలి. వారి గళాన్ని మన కలంతో సమాజానికి వినిపించాలి. మహిళలకు నిత్యం సమస్యలే!: ఆడవాళ్లకు సవాళ్లు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతున్నాయి. చదువుకోవడం, ఉద్యోగం, పెళ్లి, రోడ్డు మీద నడవడం నుంచి బస్సులో ప్రయాణించడం వరకు ప్రతిదీ ఒక సవాలే. మనదేశంలో మహిళ ఇంకా ఈ సమస్యలన్నింటినీ నిత్యం ఎదుర్కోవాల్సిన స్థితిలోనే ఉంది. కంపెనీ సీఈవోలు, మీడియా సంస్థలో ఎడిటర్‌గా మహిళలు చాలా తక్కు వ, డిజిటల్ యుగం కావడంతో మహిళలు సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకుని ఎడిటర్లు అయిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. గడచిన నాలుగైదేళ్లుగా మన దేశంలో మహిళలను వెనక్కు నెట్టివేయడం స్పష్టంగా తెలుస్తోంది. -
కేరళ వర్షాలు : మోకాళ్లలోతు చేరిన వరద నీరు
-
విజయ్ అభిమానుల్లో ఎందుకావేశం?
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో భిన్నాభిప్రాయాలుగల ప్రజలు ఉన్నట్లే సినిమా అభిమానుల్లో విభిన్నంగా స్పందించే వాళ్లు ఉంటారు. సహేతుకంగా స్పందిస్తే కొందరు అహేతుకంగా స్పందిస్తారు. ఎవరు, ఎలా స్పందించినా మర్యాద, మన్నలను దాట కూడదు, వారి మాటలు శ్రుతిమించిన రాగానా పడకూడదు. తమిళ నటుడు విజయ్ అభిమానులు స్పందన కూడా శ్రుతి మిచ్చిందని చెప్పవచ్చు. ‘ది న్యూస్ మినట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్యా రాజేంద్రన్ పట్ల వారి స్పందన దారుణంగా ఉంది. ఇంతకు ఆమె పట్ల ఆ విజయ్ అభిమానులకు ఆ వీరావేశం ఎందుకొచ్చింది? షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘హారీ మెట్ సేజల్’ చిత్రాన్ని ధన్యా రాజేంద్రన్ సమీక్షిస్తూ 2010లో విడుదలైన విజయ్ నటించిన తమళ సినిమా ‘సురా’కన్నా ఆధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె విమర్శనలో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించకుండా కొంత మంది విజయ్ అభిమానులు ట్విట్టర్లో దారుణంగా ధ్వజమెత్తారు. కొడతాం, చంపుతామని బెదిరించి వారు చివరకు ‘పబ్లిషిటీ బీమ్ధన్యా’ హ్యాష్ ట్యాగ్‌తో లైంగిక దాడులు కూడా జరుపుతామని బెదిరించారు. అప్పటి వరకు ఎంతో ఉపేక్షించిన మహిళా జర్నలిస్టు 65 వేల అర్థరహిత దూషణల తర్వాత స్పందించి బుధవారం నాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారు. ఆమె కేసు పెట్టకముందే స్పందించాల్సిన తమిళ హీరో ఆలస్యంగా బుధవారం అర్ధరాత్రి ముక్తిసరిగా ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలను కించపర్చరాదంటూ అతి పేలవంగా తన అభిమానులకు హితవు చెప్పారు. అన్ని పురుషాధిక్య పాత్రల్లోనే నటించే విజయ్ అభిమానుల్లో కూడా పురుషాధిక్యత భావం ఎక్కువగానే ఉండవచ్చు. కానీ తాను సినిమాల్లో ఏది చేసినా అది తన అభిమానులపై ప్రభావం చూపిస్తుందన్న అవగాహన కలిగిన ఏ నటులైన శ్రుతిమించిన అభిమానుల స్పందనపై ఘాటుగానే స్పందిస్తారు. తమ హీరోను ఆఫ్ట్రాల్ విజయ్‌తో పోలుస్తారా ? అంటూ షారూక్ ఖాన్ అభిమానులు కూడా దారుణ దూషణలకు దిగితే....ఆ హీరో ఎలా స్పందిస్తారో చూద్దాం! -
నేను మహిళలను కించపరచను: హీరో విజయ్
సాక్షి, చెన్నై: సామాజిక మీడియా, ఇతర ఆన్లైన్ వేదికలపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే మహిళలను కించపరిచే సంస్కృతికి తాను వ్యతిరేకమని తమిళ సూపర్ స్టార్ విజయ్ చెప్పారు. తాను మహిళలను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఎవరి సినిమానైనా విమర్శించే హక్కు ఉందన్నారు. సోషల్ మీడియాలో మహిళలు నొచ్చుకునే విధంగా ఎవరూ కామెంట్లు పెట్టవద్దని ఆయన అభిమానులను కోరారు. ధన్యా రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్టు, ఇటీవల విడుదలైన షారుక్ ఖాన్ చిత్రం జబ్ హ్యారీ మెట్ సెజల్, గతంలో విడుదలైన విజయ్ చిత్రం ‘సూర’ లాగా బాగా లేదని, ఆట మధ్యలోనే లేచి వచ్చేశా అంటూ పోస్టు పెట్టారు. అయితే ఈ పోస్టు విజయ్ అభిమానులకు కోపం తెప్పించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో ధన్యా రాజేంద్రన్ చెన్నైలోని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయ్ మహిళను కించపరిచే విధంగా పోస్టులు పెట్టొందంటూ అభిమానులను కోరారు. -
అభిమానులకు హీరో హితవు
కోలీవుడ్ అభిమానుల ప్రవర్తన చాలా సందర్భాల్లో తమ హీరోలకు ఇబ్బందికరంగా మారుతుంటుంది. ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మహిళా జర్నలిస్టు ధన్య రాజేంధ్రన్, విజయ్ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం జబ్ హ్యరీ మెట్ సెజల్ బాగోలేదు అని చెప్పేందుకు విజయ్ సినిమాను సురను ఉదహరించిన ధన్యాపై విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ లు చేశారు. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం పై స్పందించిన హీరో విజయ్, అభిమానుల చర్యలను తప్పు పట్టారు. తాను వ్యక్తిగతంగా మహిళలను గౌరవిస్తానన్న విజయ్, ప్రతీ ఒక్కరికీ ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుందన్నాడు. మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదని అభిమానులకు హితవు పలికారు. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెర్సల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. -
మహిళా జర్నలిస్టుకు హీరో ఫ్యాన్స్ అసభ్య మెసేజ్‌లు!
చెన్నై: తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ అభిమానం శ్రుతి మించారు. తన హీరో నటించిన సినిమా బాగోలేదని కామెంట్ పెట్టిన ఓ మహిళా జర్నలిస్టుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే....బెంగళూరుకు చెందిన జర్నలిస్టు ధన్య రాజేంద్రన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జబ్ హ్యారీ మెట్ సీజల్’ కి వెళ్లింది. అయితే ఆ సినిమా ఆమెకు అంతగా నచ్చకపోవడంతో ఇంటర్వెల్ కాకుండానే థియేటర్ నుంచి వచ్చేసింది. అదే విషయాన్ని ధన్య రాజేంద్రన్ శుక్రవారం ట్వీట్ చేస్తూ కొన్నేళ్ల క్రితం హీరో విజయ్ నటించిన ‘సురా’ సినిమా చూసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ కలిగిందని, అయితే ఆ సినిమా కనీసం ఇంటర్వెల్ దాకా అయినా కూర్చోబెట్టిందని, షారుక్ సినిమా అంతకంటే దారుణంగా ఉందని పోస్ట్ చేసింది. దీంతో విజయ్ ఫాన్స్ ఆమెపై సోషల్‌మీడియాలో వల్గర్ కామెంట్లతో ప్రతిదాడికి దిగారు. అసభ్య పదజాలంతో రీ ట్వీట్ చేయటమే కాక బూతు మెసేజ్‌లు, ట్రోలింగ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతేకాకుండా మహిళా జర్నలిస్టుపై బెదిరిస్తూ పోస్టులు పెట్టారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో గత మూడు రోజులుగా సుమారు 45వేలకు పైగా ట్విట్లు వచ్చాయి. దీంతో ధన్య రాజేంద్రన్ పోలీసుల్ని ఆశ్రయించారు. పక్కా ఫ్లాన్ ప్రకారం తనపై హీరో అభిమానులు ట్రాలింగ్ చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ధన్యా రాజేంద్రన్ ఫిర్యాదుపై విచారణ అధికారులు మాట్లాడుతూ... ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. అయితే అసభ్యంగా కామెంట్లు చేసిన పలువురు తమ ట్విట్టర్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు సీనియర్ అధికారి పేర్కొన్నారు. పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అసభ్యకర పదజాలం, చిహ్నాలు, ప్రతీకాత్మక చిత్రాలు, బొమ్మలు, దృశ్యాలు వంటివి పోస్ట్ చేసి సదరు వ్యక్తి పేరు, ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలిగించేలా చేసినా శిక్షార్హులే. అంతేకాదు, మహిళ ఆత్మాభిమానాన్ని కించపరిచేలా పదాలు, చిహ్నాలు వంటివి పెట్టినా ఐపీసీ సెక్షన్ 509 కింద నేరం). కాగా ఈ వివాదంపై హీరో విజయ్ ఇంతవరకూ స్పందించలేదు.


