సమాజంలో భిన్నాభిప్రాయాలుగల ప్రజలు ఉన్నట్లే సినిమా అభిమానుల్లో విభిన్నంగా స్పందించే వాళ్లు ఉంటారు.
సాక్షి, న్యూఢిల్లీ: సమాజంలో భిన్నాభిప్రాయాలుగల ప్రజలు ఉన్నట్లే సినిమా అభిమానుల్లో విభిన్నంగా స్పందించే వాళ్లు ఉంటారు. సహేతుకంగా స్పందిస్తే కొందరు అహేతుకంగా స్పందిస్తారు. ఎవరు, ఎలా స్పందించినా మర్యాద, మన్నలను దాట కూడదు, వారి మాటలు శ్రుతిమించిన రాగానా పడకూడదు. తమిళ నటుడు విజయ్ అభిమానులు స్పందన కూడా శ్రుతి మిచ్చిందని చెప్పవచ్చు. ‘ది న్యూస్ మినట్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్యా రాజేంద్రన్ పట్ల వారి స్పందన దారుణంగా ఉంది. ఇంతకు ఆమె పట్ల ఆ విజయ్ అభిమానులకు ఆ వీరావేశం ఎందుకొచ్చింది?
షారూక్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘హారీ మెట్ సేజల్’ చిత్రాన్ని ధన్యా రాజేంద్రన్ సమీక్షిస్తూ 2010లో విడుదలైన విజయ్ నటించిన తమళ సినిమా ‘సురా’కన్నా ఆధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె విమర్శనలో ఉన్న ఔచిత్యాన్ని ప్రశ్నించకుండా కొంత మంది విజయ్ అభిమానులు ట్విట్టర్‌లో దారుణంగా ధ్వజమెత్తారు. కొడతాం, చంపుతామని బెదిరించి వారు చివరకు ‘పబ్లిషిటీ బీమ్‌ధన్యా’ హ్యాష్ ట్యాగ్‌తో లైంగిక దాడులు కూడా జరుపుతామని బెదిరించారు. అప్పటి వరకు ఎంతో ఉపేక్షించిన మహిళా జర్నలిస్టు 65 వేల అర్థరహిత దూషణల తర్వాత స్పందించి బుధవారం నాడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టారు.
ఆమె కేసు పెట్టకముందే స్పందించాల్సిన తమిళ హీరో ఆలస్యంగా బుధవారం అర్ధరాత్రి ముక్తిసరిగా ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలను కించపర్చరాదంటూ అతి పేలవంగా తన అభిమానులకు హితవు చెప్పారు. అన్ని పురుషాధిక్య పాత్రల్లోనే నటించే విజయ్ అభిమానుల్లో కూడా పురుషాధిక్యత భావం ఎక్కువగానే ఉండవచ్చు. కానీ తాను సినిమాల్లో ఏది చేసినా అది తన అభిమానులపై ప్రభావం చూపిస్తుందన్న అవగాహన కలిగిన ఏ నటులైన శ్రుతిమించిన అభిమానుల స్పందనపై ఘాటుగానే స్పందిస్తారు. తమ హీరోను ఆఫ్ట్రాల్ విజయ్‌తో పోలుస్తారా ? అంటూ షారూక్ ఖాన్ అభిమానులు కూడా దారుణ దూషణలకు దిగితే....ఆ హీరో ఎలా స్పందిస్తారో చూద్దాం!