breaking news
deteriorating
-
యువ శ్వాసపై హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో యువత ఊపిరితిత్తుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఏడాదికి 81,700 చొప్పున కొత్త కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పెట్టే గణాంకాలివి. ఎప్పుడో వృద్ధాప్యంలో రావాల్సిన ఈ సమస్య ఇప్పుడే మొదలుకావడమన్నదే ఆందోళన కలిగించే విషయం. ట్రాఫిక్ రద్దీలో ఎక్కువ దూరం వెళ్లే నిపుణులు, కాలుష్య వాతావరణమున్న క్లాస్‌రూముల్లో ఎక్కువ సేపు కూర్చునే విద్యార్థులు విష పూరిత వాయువులను నిత్యం పీలుస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లు నిపుణులు తేల్చారు. అయితే, ఈ సమస్య వారు ఎక్కువగా పనిచేసి, సమాజానికి ఉత్పాదకతను అందించే సమయానికి బయటపడుతోందని చెబుతున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెస్పికాన్ సదస్సులో ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ వత్సలా అగర్వాల్ ఈ వివరాలను వెల్లడించారు. శ్వాసకోశ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె పేర్కొన్నారు. ‘స్వచ్ఛమైన గాలి నేడు విలాస వస్తువు కాదు. ఇదో ప్రాథమిక హక్కు. దీనినే మనం ప్రధాన అజెండాగా తీసుకోవాలి. యువత ఊపిరితిత్తులను రక్షించుకోవడమంటే దేశ ఆర్థిక, సామాజిక నిర్మాణాన్ని కాపాడుకోవడమే. దేశ వర్తమాన, భవిష్యత్తును ఈ కాలుష్యం చిదిమేకుండా చూసుకోవాలి’అని డాక్టర్ వత్సల పేర్కొన్నారు. ‘గతంలో ఊపిరితిత్తుల కేన్సర్, సీఓపీడీ, టీబీ వంటి వ్యాధులు వృద్ధుల్లోనే కనిపిస్తాయనే అనుకునేవాళ్లం. ప్రస్తుతం యువతలో ఇవి వేగంగా పెరుగుతున్నాయి’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రాణనష్టంతోపాటు ఆర్థిక విపత్తు భయాలను పెంచుతోందన్నారు. → ఉదయాన్నే పొగలో పరుగెత్తే యువత, ట్రాఫిక్‌లో అత్యధిక సమయం ప్రయాణించే ఉద్యోగులు, కలుíÙత తరగతి గదుల్లో కూర్చునే విద్యార్థుల ఊపిరితిత్తుల ఆరోగ్యం నిత్యం క్షీణిస్తోంది. కంటికి కనిపించని ఉత్పాతం దీర్ఘకాలంలో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. → వంటగదిలో వచ్చే పొగ కూడా మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచుతోంది. చిన్నారులపైనా కాలుష్య ప్రభావం అధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో న్యుమోనియా కేసుల సంఖ్య 14 శాతంగా ఉంది. → భారత్‌లో క్షయ తీవ్రత ఎక్కువగానే ఉంది. ప్రతి లక్ష మందికి 195 కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. → సూక్ష్మ రేణువులు, కాలుష్యం బారినపడకుండా తగ్గించడంతోపాటు సీఓపీడీ, ఆస్తమా, క్షయ వంటి కేసుల్లో నిబంధనలు పాటించినట్లయితే ఏటా వేల మంది ఆస్పత్రి చేరికలను తగ్గించుకోవచ్చని రెస్పికాన్ 2025 ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కె.చావ్లా వెల్లడించారు. → నేటి యువత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోతే.. దేశ భవిష్యత్తు ఇబ్బందికంగా మారుతుందని రెస్పికాన్ 2025 నిర్వహణ కార్యదర్శి ఆదిత్య కె. చావ్లా పేర్కొన్నారు. శ్వాసకోశ ఆరోగ్య రక్షణపై ఏర్పాటు చేసిన ఈ సదస్సులో సీనియర్ శ్వాసకోశ నిపుణులు, అధ్యాపకులు, విద్యార్థులు, అంతర్జాతీయ నిపుణులు సహా దాదాపు 1,200 మంది పాలు పంచుకున్నారు. → స్వచ్ఛమైన గాలి అందించడం, టీబీ బాధితుల సంరక్షణ, వ్యాక్సినేషన్‌ను పెంచడం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం వంటి చర్యలపై నిపుణులు ఈ సమావేశంలో చర్చించారు. విషపూరిత గాలి సగటు భారతీయుల ఆయుర్దాయాన్ని వెయ్యి రోజుల మేర తగ్గిస్తోందని, చడీచప్పుడూ కాకుండా నష్టాన్ని కలిగిస్తోందన్న విషయాన్ని గుర్తు చేశారు. -
కవ్వింపులకు దిగితే మోదీ సర్కారు సహించబోదు: అమెరికా నిఘా వర్గాలు
వాషింగ్టన్: పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు నానాటికీ మరింతగా క్షీణిస్తున్నాయని, పెరుగుతున్న ఉద్రిక్తతలు సాయుధ ఘర్షణకూ దారితీసే ఆస్కారం లేకపోలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా పాక్ కవ్వింపులను భారత్ గతంలోలా సహించే పరిస్థితి లేదు. మోదీ హయాంలో పాక్‌పై సైనిక చర్యకు దిగే అవకాశముంది’’ అని అంచనా వేశాయి. అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ఈ మేరకు పొందుపరిచాయి. ‘‘ముఖ్యంగా భారత వ్యతిరేక ఉగ్రవాద తండాలకు మద్దతిచ్చిన సుదీర్ఘ చరిత్ర పాక్‌ది. అందుకే ఇకపై పాక్ కవ్విస్తే మోదీ ప్రభుత్వం మౌనంగా ఉండబోదు’’ అని నివేదిక అభిప్రాయపడింది. చైనాతో కూడా పలు సరిహద్దు సమస్యలను భారత్ చర్చల ద్వారా పరిష్కరించుకున్నా 2020 గల్వాన్ ఘర్షణ, తాజాగా అరుణాచల్ సరిహద్దుల వద్ద గొడవ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచాయని పేర్కొంది. చైనాతో అమెరికాకు పెనుముప్పు అమెరికా జాతీయ భద్రతకు, అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వ స్థానానికి చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి అత్యంత ముప్పు పొంచి ఉందని యూఎస్ నిఘా విభాగపు నివేదిక అభిప్రాయపడింది. ‘‘రష్యాతో ఏడాదిగా చైనా బంధం బలపడుతున్న తీరు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. నానాటికీ పెరుగుతున్న ఈ చైనా సవాలును దీటుగా ఎదుర్కొనేందుకు తక్షణం చర్యలు చేపట్టాలి’’ అని ప్రభుత్వానికి సూచించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ సభ్యులకు నిఘా నివేదిక సమర్పించిన సందర్భంగా నేషనల్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. -
నెల్లూరు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
-
కరోనా మందు: మళ్లీ క్షీణించిన కోటయ్య ఆరోగ్యం
సాక్షి, నెల్లూరు: రెండు రోజుల క్రితం ఆనందయ్య ఆయుర్వేద మందుతో ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయన్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఈ రోజు ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో కోటయ్యను ఆస్పత్రికి తరలించారు. కాగా, కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు పంపిణీకి వారం పాటు బ్రేక్ పడింది. కరోనా మందుపై ఆయుష్ కమిషనర్ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య నివాసానికి చేరుకున్న పోలీసులు.. ఆయుర్వేద మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి, పంపిణీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందం రానుంది. బ్లాక్మార్కెట్లో ఆనందయ్య కరోనా మందు మరో వైపు కరోనా మందు పేరుతో బ్లాక్మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ప్రజల అవసరాలను కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఆనందయ్య కరోనా మందుకు బ్లాక్ మార్కెట్లో రూ.3 వేల నుంచి 10 వేల డిమాండ్ ఏర్పడింది. చదవండి: ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్ 50 పడకలు దాటితే.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు -
బలహీనపడిన తుపాను
విశాఖపట్టణం: క్యాంట్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 220 కిలో మీటర్ల దూరంలో, విశాఖపట్టణానికి దక్షిణ నైరుతి దిశగా 260కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నానికి వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంగా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు క్యాంట్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖపట్టణం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కుంభవృష్టిగా కురిసింది. ప్రస్తుతం విశాఖపట్టణంలో ఆకాశం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం జిల్లాలోనూ అక్కడక్కడా తుపాను ప్రభావంగా చిరుజల్లులు కురిశాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. శనివారం విశాఖపట్టణం వేదికగా భారత్-కివీస్ జట్ల మధ్య సిరీస్ లో ఆఖరి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. తుపాను హెచ్చరికలతో చివరి మ్యాచ్ కు ఆటకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సిరీస్ ఫలితం తేల్చే రేపటి మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
బలహీనపడిన తుపాను
-
రోజురోజుకి దిగజారుతున్న పార్టీ పరిస్ధితి