breaking news
Deputy Chief Minister Tejaswi Yadav
-
'ఆయన ప్రధాని అయితే నాకు ఫుల్ హ్యాపీ'
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు తమ మద్దతు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఉంటుందని డిప్యూటీ సీఎం ఆర్జేడీ అధినేత తనయుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఆయన ప్రతిపక్షాల తరుపు నుంచి ప్రధాని అభ్యర్థిగా ముందుకొచ్చినా తమకు సంతోషమే అని, తన తండ్రి లాలూ కూడా దీనికి సమ్మతంగా ఉన్నారని ఆయన చెప్పారు. 'కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. కానీ, నితీశ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా మారితే అది నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషాన్నిస్తుంది' అని అన్నాడు. ప్రధాని నరేంద్రమోదీకంటే కూడా సీఎం నితీశ్ ప్రధానిగా చాలా సమర్థులు అని, ఆయన నిజంగా ఓ ప్రధాని హోదాకు తగిన అర్హుడని తేజస్వి చెప్పాడు. 2019 ఎన్నికల్లో మాత్రం మరోసారి నరేంద్రమోదీ ప్రధానిగా గెలవలేరు అని జోస్యం చెప్పారు. నితీశ్ కుమార్ తనకు ఓ రాజకీయ గురువు అని గౌరవాన్ని చాటుకున్నాడు. అంతకుముందు లాలు ప్రసాద్ యాదవ్ కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థినా కాదా అనే విషయం తనకు తెలియదని, కానీ.. నితీశ్ మాత్రం ప్రధాని పదవి అలంకరించేందుకు తగిన ముడిసరుకుకలవాడని అన్నారు. -
'మా రాష్ట్రానికి ఇంకెంతకాలం ఈ అపవాదు?'
పాట్నా: తమ రాష్ట్రంపై ఇప్పటికైనా దుష్ప్రచారం ఆపాలని బిహార్ ఉప ముఖ్యమంత్రి లాలూ తనయుడు తేజస్వి యాదవ్ అన్నారు. చక్కగా ఉన్న తమ రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని పైకి తెస్తూ బిహార్‌కు అపఖ్యాతిని మూటగట్టే ప్రయత్నాన్ని బీజేపీ, దాని మిత్రపక్షాలు చేస్తున్నాయని అలాంటి పనులు వెంటనే నిలిపేయాలని అన్నారు. 'బిహార్‌కు వ్యతిరేక రాజకీయాలు ఆపండి. రాష్ట్ర అభివృద్ధికోసం మా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోంది. శాంతిభద్రతలకు ఎలాంటి సమస్య లేదు. బిహార్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మేం చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నాం' అని తేజస్వి అన్నారు. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేందుకు తాము సంసిద్దులై ఉన్నామని, సమన్యాయ పాలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.