breaking news
deploy
-
అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ
దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీఎస్) పోర్టల్ల్లో అత్యాధునిక ఏఐ చాట్బాట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.ఈ-శ్రమ్, ఎన్సీఎస్ పోర్టల్స్‌లో ఏఐ చాట్బాట్లుఇండియా ‘ఏఐ-ఫస్ట్ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్‌సీఎస్‌లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.ఈ చాట్బాట్లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్లేషన్ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్‌ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు -
3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు
రహదారి భద్రతను, మౌలిక సదుపాయాల నాణ్యతను గణనీయంగా పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను కవర్ చేస్తూ అధునాతన 3డీ సెన్సార్లు, డేటా సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది.సాంకేతికతతో పర్యవేక్షణఈ ప్రాజెక్టులో భాగంగా రహదారుల ఉపరితల లోపాలను (గుంతలు, పగుళ్లు వంటివి) అత్యంత కచ్చితత్వంతో గుర్తించడానికి ప్రత్యేకంగా అమర్చిన వాహనాలను ఎన్హెచ్ఏఐ ఏర్పాటు చేయనుంది. ఈ వాహనాల్లో 3డీ లేజర్ ఆధారిత స్కానింగ్ వ్యవస్థలు సిద్ధం చేస్తుంది. ఇందులో గుర్తించిన లోపాలను ఇనెర్షియర్ మెజర్మెంట్ యూనిట్స్(IMU) ద్వారా జియోట్యాగ్ చేయడానికి జీపీఎస్ (GPS) ఉంటుంది. ఈ టెక్నాలజీల సాయంతో రియల్‌టైమ్ డేటా సేకరిస్తూ దాన్ని విశ్లేషించే వీలుంటుంది. దాని ద్వారా సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుంది.డేటా లేక్ఇలా సేకరించిన మొత్తం డేటా ఎన్హెచ్ఏఐ ఏఐ ఆధారిత పోర్టల్ ‘డేటా లేక్’లో అప్లోడ్ అవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల బృందం ఆ డేటాను విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ డేటా ఆధారిత విధానం రహదారి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. సేకరించిన డేటాను ప్రామాణిక ఫార్మాట్లలో భద్రపరచనున్నారు. ఇది దీర్ఘకాలిక సాంకేతిక, ప్రణాళిక ప్రయోజనాలకు తోడ్పడుతుంది.భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు అభివృద్ధి పనులకు ముందే డేటా సేకరణ ప్రారంభమవుతుంది. ఆరు నెలలపాటు ఇది కొనసాగుతుంది. రెండు నుంచి ఎనిమిది లేన్ల రహదారులతో కూడిన అన్ని ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఎన్హెచ్ఏఐ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది.ఇదీ చదవండి: గూగుల్‌కు పోటీగా ఓపెన్ఏఐ కొత్త బ్రౌజర్ -
ఇక సరిహద్దులో బ్రహ్మోస్
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దులో అత్యంతశక్తిమంతమైన బ్రహ్మోస్ క్షిపణులను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగుదేశానికి ధీటుగా ఉండాలని, ఎప్పటికప్పుడు శత్రువు వ్యూహాలను తిప్పకొట్టాలనే ఉద్దేశంతో వీటిని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తూర్పు సరిహద్దు వద్ద వీటిని మోహరించాలని నిర్ణయించినట్లు, ఈ మేరకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చినట్లు డిఫెన్స్ అధికారులు చెప్పారు. 290 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేయగల సూపర్ సోనిక్ అణు క్షిపణులను భారత్ మోహరించాలనుకుంటుంది. మొత్తం రూ.4,300 కోట్ల వ్యయంతో ఈ నాలుగో బ్రహ్మోస్ దళాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మొత్తం 100 క్షిపణులను సిద్ధం చేయనున్నారు. అలాగే ఐదు మొబైల్ లాంచింగ్ వెహికల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా క్షిపణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. చివరి పరీక్ష గత సంవత్సరం (2015) మే నెలలో చేశారు.


