breaking news
Denis Manturov
-
పెట్టుబడులతో రండి!
మాస్కో: సంక్లిష్టమైన భౌగోళిక సవాళ్లు ఎదుర్కోవడానికి భారత్–రష్యా కలిసికట్టుగా పనిచేయాలని, ఇందుకోసం సృజనాత్మక, నూతన మార్గాలు అన్వేషించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పిలుపునిచ్చారు. రెండు దేశాలు పరస్పర సహకార ఎజెండాను మరింత విస్తృతపర్చుకోవాలని, వైవిధ్య భరితంగా మార్చుకోవాలని చెప్పారు. మరిన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో వైవిధ్యం కృషి చేయాలని అన్నారు. భారత్–రష్యా సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, విభిన్నమైన వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం మనం ఆశయం కావాలని స్పష్టం చేశారు. జైశంకర్ బుధవారం మాస్కోలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్మినిస్టర్ డెనిస్ మంతురోవ్తో సమావేశమయ్యారు. భారత్–రష్యా సంబంధాలు, తాజా పరిణామలపై చర్చించారు. ఇండియా–రష్యా ఇంటర్–గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలాజికల్, కల్చరల్ కో–ఆపరేషన్(ఐఆర్ఐజీసీ–టీఈసీ) ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ చర్చలు జరిగాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్–రష్యా సంబంధాల ఆవశ్యకతను జైశంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఇరుదేశాల నడుమ ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పనిచేద్దాం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు. వ్యాపార అభివృద్ధికి భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. నూతన రంగాల్లోనూ స్నేహ సంబంధాలను విస్తరింపజేసుకోవాలని సూచించారు. వ్యాపార, పెట్టుబడుల సంబంధాల్లో పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పని చేద్దామని కోరారు. ఇందుకోసం కొన్ని లక్ష్యాలు, గడువులు నిర్దేశించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమున్నత లక్ష్య సాధన కోసం మనకు మనమే సవాలు విసురుకోవాలని వ్యాఖ్యానించారు. చేతులు కలిపి ఉమ్మడిగా పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి సాధించవచ్చని స్పష్టంచేశారు. ఐఆర్ఐజీసీకి సంబంధించిన వేర్వేరు వర్కింగ్ గ్రూప్లు, బిజినెస్ ఫోరమ్ మధ్య సహకారం కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవాలన్నారు. ఇండియా, రష్యాలోని వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఐఆర్ఐజీసీ తోడ్పడుతుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కారి్మకులను రష్యాకు పంపించబోతున్నట్లు జైశంకర్ చెప్పారు. సెర్గీ లావ్రోవ్తో సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల, స్థిరమైన విధానంలో విస్తరింపజేసుకోవాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం విషయంలో నియంత్రణలు, అవరోధాలను వేగంగా పరిష్కరించుకోవాలని జైశంకర్ చెప్పారు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్తో భేటీ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతున్న అతిపెద్ద సంబంధాల్లో భారత్–రష్యా సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని జైశంకర్, లావ్రోవ్ నిర్ణయానికొచ్చారు. -
వీసా ఎఫెక్ట్: భారతీయులకు రష్యా రెడ్ కార్పెట్
న్యూఢిల్లీ : వీసాలో కఠినతరమైన నిబంధనలతో అమెరికా కంపెనీల్లో తమ భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్న ఉద్యోగులకు ఇతర దేశాలు సాదరంగా ఆహ్వానాలు పలుకుతున్నాయి. కెనడా తర్వాత తాజాగా అమెరికాకు బద్దశత్రువైన రష్యా సైతం భారతీయులు వచ్చి తమ దేశంలో పనిచేసుకోవచ్చని పేర్కొంది. భారత టాలెంట్ ను మాత్రమే తాము ఆహ్వానించడం లేదని, తమ దేశంలో సౌకర్యవంతంగా నివసించే సాయం కూడా తాము అందిస్తామని రష్యా భరోసా ఇస్తోంది. అమెరికాలో వీసా మార్పులపై ప్రతిపాదనలు వెల్లువెత్తడం ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రష్యన్ వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి డెనిస్ మన్టూరావ్ తెలిపారు. ''భారతీయులకు రష్యా వెల్ కం చెబుతోంది. ఎంతో ప్రతిభావంతులైన ఉద్యోగులకు రష్యా ఎప్పుడూ తలుపులు బార్ల తెరిచే ఉంచుతోంది. రష్యాలో సెటిల్ అవడానికి సాయపడతాం. గణితాభవజ్ఞులు, ఎక్కువ ప్రతిభకలిగిన ఉద్యోగులు కలిగి ఉండటంలో రష్యన్, భారతీయులే ప్రపంచంలో బెస్ట్. భారతీయులకు వెల్ కం చెప్పడానికి రష్యన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది'' అని మన్టూరావ్ చెప్పారు. ఈ రెండు దేశాలు కలిసి బిజినెస్ వెంచర్లు ఏర్పాటు చేసే ప్లాన్ ను రూపొందిద్దామని పేర్కొన్నారు. 70 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలు ఉత్సవాల్లో భాగంగా మాన్టూరావ్ భారత్ కు విచ్చేశారు. గత ఆరు నెలల్లోనే ఈ రష్యన్ మంత్రిది రెండో పర్యటన. జూన్ 1 నుంచి 3 వరకు సెయింట్ పిటర్స్బర్గ్ లో జరుగనున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ కు ప్రధాని మోదీని ఈయన ఆహ్వానించనున్నారు. అతిథిగా ప్రధాని అక్కడికి వెళ్లనున్నారు. ఈ ఫోరమ్ లో భారత్ సైతం గెస్ట్ కంట్రీ.