breaking news
Dena
-
అమెరికాకు బుద్ధి చెప్తాం
న్యూఢిల్లీ: ఇరాన్ యుద్ధ నౌక ‘దేనా’ను హిందూమహా సముద్ర జలాల్లో అమెరికా ముంచేయడంపై భారత్‌లో ఆ దేశ రాయబారి మహ్మద్ ఫతాలీ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా పాల్పడిన చర్య దారుణ హత్యతో సమానమని, ఇరాన్ తగు రీతిలో బదులు తీర్చుకుంటుందని స్పష్టం చేశారు. శాంతియుత విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తున్న నిరాయుధంగా వస్తున్న నౌకను ధ్వంసం చేయడాన్ని బట్టి చూస్తే అమెరికా, జియోనిస్టులకు అంతర్జాతీయ చట్టాలను నాశనం చేయాలనే దుర్భుద్ధి ఉన్నట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మా ప్రజలు, ఆత్మవిశ్వాసాన్నే నమ్ముకున్న మా దేశం ఈ చర్యకు తీవ్రమైన రీతిలో సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్, భారత్‌ల మధ్య బలమైన సంబంధాలు, ఉమ్మడి ప్రయోజనాలు, బలమైన సాంస్కృతిక వారసత్వం ఉన్నాయన్నారు.హెచ్చరిక లేకుండానే దాడియుద్ధ నౌక దేనాపై అమెరికా సబ్మెరీన్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా టార్పెడో దాడి చేసిందని ముంబైలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ సయీద్ రెజా అన్నారు. నౌకా విన్యాసాల నుంచి తిరిగి వెళ్లే యుద్ధ నౌకల్లో సాధారణంగా ఎటువంటి మందుగుండు సామగ్రి ఉందన్నారు. ఒకవేళ ఉన్నా దానిని విన్యాసాల సమయంలో ఉపయోగించే అవకాశం తక్కువని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిగేట్ దేనాను లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ఈ ఘటనలో 100 మంది వరకు నౌకా సిబ్బంది, సైనికులు వీరమరణం పొందడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను రోడ్డు మార్గంలో స్వదేశానికి తరలించేందుకు నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అన్వేషణలో శ్రీలంకకు తోడుగా..అమెరికా టార్పెడో దాడిలో హిందూ మహా సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధ నౌక వద్ద అన్వేషణ, సహాయ కార్యక్రమాల్లో శ్రీలంకకు భారత్ తోడైంది. లాంగ్ రేంజ్ పెట్రోల్ విమానం సాయంతో బుధవారం ఉదయం 10 గంటల నుంచి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు నేవీ తెలిపింది. ఆ ప్రాంతంలోనే మోహరించి ఉన్న ఐఎన్ఎస్ తరంగిణి కూడా అన్వేషణలో పాల్గొంటోందని పేర్కొంది. ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా కొచ్చినుంచి బయలుదేరిందని వివరించింది. -
ప్రభుత్వ బ్యాంకులకు మొండి బకాయిల భారం
♦ రూ. 51 కోట్లకు తగ్గిన పీఎన్బీ లాభం ♦ దేనా, ఆలహాబాద్ బ్యాంక్‌లకు భారీ నష్టం న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. మొండి బకాయిల కేటాయింపుల కారణంగా ఈ బ్యాంకుల నికర లాభాల్లో భారీగా కోత పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి సంబంధించి మంగళవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల నికర లాభాలపై మొండి బకాయిలు విశ్వరూపం చూపించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 93 శాతం క్షీణించగా, దేనా బ్యాంక్‌కు రూ.663 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.486 కోట్ల చొప్పున నికర నష్టాలు వచ్చాయి. వివరాలు... దేనాబ్యాంక్కు 663 కోట్ల నష్టం దేనా బ్యాంక్‌కు డిసెంబర్ క్వార్టర్లో రూ.663 కోట్ల నష్టం వచ్చింది. మొండి బకాయిలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.77 కోట్ల నికర లాభం ఆర్జించామని వివరించింది. గత క్యూ3లో రూ.2,867కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,722 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 5.61 శాతం నుంచి9.85 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 93% తగ్గిన పీఎన్బీ నికర లాభం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంపై మొండి బకాయిలకు కేటాయింపులు తీవ్రమైన ప్రభావం చూపాయి. గత క్యూ3లో రూ.775 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 93 శాతం క్షీణించి రూ.51 కోట్లకు పడిపోయిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.12,905 కోట్లనుంచి 8 శాతం వృద్ధితో రూ.13,891 కోట్లకు పెరిగిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ చెప్పారు ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం రూ.4,120 కోట్లు, వడ్డీయేతర ఆదాయం రూ.1,671 కోట్లు చొప్పున ఆర్జించామని చెప్పారు. పరిశ్రమ తీవ్రమైన కష్టాల్లో ఉందని, రుణాలు అధికంగా ఇచ్చే బ్యాంకుల్లో ఒకటైనందున తమ బ్యాంక్‌పై తీవ్రమైన ప్రభావం పడిందని. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా ఉషా మాట్లాడారు. అలహాబాద్ బ్యాంక్... అధిక కేటాయింపుల ఫలితం అలహాబాద్ బ్యాంక్‌కు 3వ త్రైమాసికలో రూ.486 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని బ్యాంక్ తెలిపింది. గత క్యూ3లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,387 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.5,030కు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 5.46 శాతం నుంచి 6.40 శాతానికి ఎగశాయి.


