breaking news
delhi court rejects bail petition
-
మిషెల్ బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: ఈస్టర్ పండగ జరుపుకునేందుకు వారం పాటు బెయిల్ ఇవ్వాలం టూ అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభ కోణంలో నిందితుడు క్రిస్టియన్ మిషెల్ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ న్యాయస్థానం కొట్టివేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో అతడు తప్పించుకు పోయేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. అభియోగాల తీవ్రత దృష్ట్యా మిషెల్‌కు బెయిల్ మంజూరు చేయలేమని ప్రత్యేక జడ్జి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. అగస్టా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసినందున సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అవకాశం లేదని, అధికారుల విచారణకు మిషెల్ సహకరిస్తున్నాడని అతని లాయర్ తెలిపారు. ‘ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు క్రైస్తవులకు పవిత్ర వారం, 21న ఈస్టర్ పండగ. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడంతోపాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా మిషెల్‌కు వారం పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి’ అని కోరారు. దీనిపై ఈడీ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉండి కూడా మిషెల్ పండగ జరుపుకోవచ్చని అన్నారు. -
ఆప్ ఎమ్మెల్యే చౌహాన్‌కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే శరద్ చౌహాన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఎమ్మెల్యేని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా ఆప్ మహిళా కార్యకర్త సోని ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యేని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోని ఆత్మహత్యకు కారణమైన పార్టీ కార్యకర్త రమేశ్ భరద్వాజ్‌కు ఎమ్మెల్యే అండగా నిలిచినట్టు ఆరోపణలున్నాయి. తన ఆత్మహత్యకు భరద్వాజ్ కారణమని మృతురాలు సోనీ సూసైడ్ వీడియోలో తెలిపింది. కాగా వివిధ కేసుల్లో ఇప్పటివరకు అరెస్టైన 'ఆప్' ఎమ్మెల్యేల సంఖ్య 12కు చేరింది.