breaking news
Delhi BJP
-
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి. -
ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్, బీజేపీ తమ కత్తులకు పదునుపెడుతున్నాయి. మూ డో విడత అధికారం కైవసం చేసుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ..ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల చోటుచేసుకున్న పలు నేర ఘటనలను ప్రస్తావిస్తూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ శాంతి భద్రతల పరిస్థితి దారుణమంటూ కాషాయ దళంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి బదులుగా అన్నట్లు, సీఎంగా ఉన్న సమయంలో కేజ్రీవాల్ 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్డులోని అధికార నివాసానికి రూ.42 కోట్లు వెచ్చించిన అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రజాధనంతో విలాసవంతమైన శీష్ మహల్(అద్దాల మేడ), ‘7 స్టార్ రిసార్ట్’ను కట్టుకున్నారంటూ ఆ బంగ్లా వీడియోను మంగళవారం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ విడుదల చేశారు.కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే..‘సామాన్యుడని చెప్పుకునే కేజ్రీవాల్ నిర్మించిన అద్దాల మేడ ఇదే. దీన్ని గురించిన వాస్తవాలను మీ ముందుంచబోతున్నాను’ అని పేర్కొంటూ సచ్దేవ్.. ‘ఢిల్లీ ప్రజల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకొని ఒక సామాన్యుడు అద్దాల మేడను నిర్మించాడు. అధికారంలోకి వస్తే ప్రభుత్వ కారు, బంగ్లా, భద్రతను తీసుకోనని చెప్పిన ఈయన, ఇప్పుడు వైభవోపేతమైన 7 స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నాడు’అని పేర్కొ న్నారు. ‘రూ.1.9 కోట్ల విలువైన మార్బుల్ గ్రానైట్ లైటింగ్, రూ.1.5 కోట్లతో ఇన్స్టాలేషన్, సివిల్ వర్క్, రూ.35 లక్షల విలువైన జిమ్, స్పా పరికరాలు కలిపి మొత్తంగా వీటికే రూ.3.75 కోట్లు ఖర్చు చేశారు. కేజ్రీవాల్ కూడబెట్టిన నల్లధనానికి రుజువు ఇదే’ అని విమర్శించారు. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోబోమని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ ఉల్లంఘించారన్నారు. ఈ డబ్బుతో నిరుపేదలకు 34 ఇళ్ల ఫ్లాట్లు, లేదా 326 ఈ–రిక్షాలను అందజేయవచ్చన్నారు. బీజేపీ ఎంపీ ప్రవీణ ఖండేల్వాల్ స్పందిస్తూ, కేజ్రీవాల్ చెప్పిన ‘ఆమ్ ఆద్మీ’కథలను అద్దాల మేడ బట్టబయలు చేసిందని వ్యాఖ్యానించారు.తిప్పికొట్టిన ఆప్ఈ విమర్శలను ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తిప్పికొట్టారు. ‘హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఆస్పత్రుల నిధుల దుర్వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వడానికి బదులుగా, వారు కేజ్రీవాల్ నివసించిన అధికారిక నివాసంపై దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే, బీజేపీ నేతలు సీఎం నివాసం గురించి మాట్లాడుతున్నారు’అని ఎదురుదాడికి దిగారు.చదవండి: ముచ్చటగా మూడోసారి.. తేల్చేసిన కేజ్రీవాల్రానున్న ఎన్నికల్లో ఈ అద్దాల మేడ అంశాన్నే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ యోచిస్తోందని, ఈ అంశం రాజకీయంగా ఆప్‌ను ఇరుకున పెట్టేదేనని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం ఆధునీకరణకు అయిన మొత్తం వ్యయం రూ.52.71 కోట్లని విజిలెన్స్ డైరెక్టరేట్ 2023లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేసిన నివేదికలో పేర్కొంది. రూ.10 లక్షల బీమా, కుమార్తెల పెళ్లికి సాయంఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ ఎన్నికల హామీఢిల్లీ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో జరగాల్సిన ఎన్నికలకు ప్రచారంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లకు పలు హామీలను ప్రకటించారు. మంగళవారం కేజ్రీవాల్ కొండ్లిలో ఆటో డ్రైవర్ నవనీత్ కుటుంబంతో మాట్లాడారు. ‘ఆటో డ్రైవర్ల కోసం ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తున్నాను. అవి.. రూ.10 లక్షల వరకు జీవిత బీమా, రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుమార్తెల వివాహానికి రూ.1 లక్ష సాయం, పోటీ పరీక్షలకు హాజరయ్యే వీరి పిల్లలకు ఉచిత శిక్షణ ఇస్తాం’ అని తెలిపారు. -
లడ్డూలు మార్చుకోవడం కుదరదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడుతున్న ప్రజల ఓపికకు మెచ్చుకొని వారికి లడ్డూలు పంచాలని ఢిల్లీలోని బీజేపీ శాఖ నిర్ణయించింది. ప్రతి పార్టీ కార్యకర్త ఇందులో క్రియాశీలకంగా పాల్గొనాలని. జనవరి ఒకటవ తేదీ నుంచి పది తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక ఇంటికి ఒక లడ్డూ లేదా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లడ్డూల చొప్పున ఇవ్వాలంటూ ఆయన చేసిన సూచనపై సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. ‘నెలలో నాలుగు లడ్డూలు మాత్రమే ఇస్తారు. పాత వాటితోని కొత్త లడ్డూలు మార్చుకోవడం కుదరదు. పది లడ్డూలకు మించి లడ్డూలుంటే ఐటీ దాడులు జరుగుతాయి...ఏటీఎంల ముందు క్యూలో నిలబడితే లడ్డూలు ఇస్తారట, వాస్తవానికి రెండు లడ్డూలు వస్తాయి. ఒకటి క్యూలో, మరోటి ఏటీఎం నుంచి....లడ్డూ వ్యాసానికి సరిపడే పరికరాలు ఏటీఎంలో లేవట. వాటన్నింటిని మూసేసి మరమ్మతులకు పంపిస్తారట...డబ్బుకు బదులుగా లడ్డూలు ఇమ్మని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదంటూ ఆర్బీఐ వివరణ....మొదటి రోజు కుటుంబానికి ఒక లడ్డూ ఇస్తారు. రెండో రోజు మూడు కుటుంబాలకు కలిపి రెండు లడ్డూలు ఇస్తారు. మూడోరోజు ఆప్ లడ్డూ కా రహా హై, వా బార్డర్ పర్....నరేంద్ర మోదీ క్యాష్‌లెస్ సొసైటీ కోరుకుంటున్నందున నమో యాప్‌పై డిజిటల్ లడ్డూలను పంచుతారు....’ఇలా తమదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. -
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ తాను ఏ పదవికీ అభ్యర్థిని కాదని సోమవారం చెప్పారు. ముందుగా అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల పార్టీలో విభేదాలు వస్తాయని, దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో హర్షవర్ధన్‌తో పోటీపడుతున్నారా అన్న ప్రశ్నకు.. తాను ఏ పదవికీ పోటీదారుడు కాదని గోయెల్ బదులిచ్చారు. ఈ విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపిక చేస్తుందని తెలిపారు. హర్షవర్ధన్‌ను ఎంపిక చేస్తే పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలను గోయెల్ ఖండించారు. పార్టీ అగ్రనేతలు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీలతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు.