breaking news
deepesh
-
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
టీమిండియావైపు మరో పేస్ గన్ దూసుకొస్తున్నాడు. అతడి పేరు దీపేశ్ దేవేంద్రన్. తమిళనాడుకు చెందిన ఈ కుర్రాడి వయసు 17 ఏళ్లు. కుడి చేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేసే దీపేశ్.. తాజాగా ముగిసిన అండర్-19 ఆసియా కప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు.ఈ టోర్నీలో దీపేశ్ అంచనాలను మించి రాణించాడు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీసి యంగ్ ఇండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడి 4.77 ఎకానమీతో 14 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో దీపేశ్ ఈ ప్రదర్శన నమోదు చేశాడు.సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ను ఆదర్శనంగా తీసుకొనే దీపేశ్.. అతనిలాగే పేస్‌ను ఆయుధంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీపేశ్‌కు వేగంతో పాటు లైన్ అండ్ లెంగ్త్ మెయింటైన్ చేసే కంటిస్టెన్సీ ఉంది. అలాగే కీలక సమయాల్లో బ్యాటర్లను ఒత్తిడిలోని నెట్టి, వికెట్లు తీసే సత్తా కూడా ఉంది. ఆదిలోనే వికెట్లు తీసే సామర్థ్యం దీపేశ్ సొంతం. పైన ప్రస్తావించిన విషయాలన్నీ తాజాగా జరిగిన ఆసియా కప్‌లో దీపేశ్ చేసి చూపించాడు.దీపేశ్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మధురై పాంథర్స్ తరఫున సత్తా చాటడం ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ ప్రదర్శనల కారణంగానే దీపేశ్‌కు ఆసియా కప్ అండర్-19 జట్టులో చోటు దక్కింది.వేగం, కచ్చితత్వం, దూకుడుతో పాటు లైన్ ఆండ్ లెంగ్త్ కంట్రోల్‌తో టాపార్డర్‌ను కూలదోసే సామర్థ్యం దీపేశ్‌ను మిగతా వారితో పోలిస్తే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. సాధారణంగా వీటన్నిటి కలయిక ఒకే బౌలర్లో ఉండటం చాలా అరుదు. ఈ అసాధారణ ప్రతిభే దీపేశ్‌ను భావి భారత ఫాస్ట్ బౌలర్‌గా చిత్రీకరిస్తుంది.ప్రస్తుతం గంటకు 140 కిమీ వేగానికి దగ్గరగా బౌలింగ్ చేస్తున్న దీపేశ్.. సరైన శిక్షణ ఇస్తే మరింత పేస్‌ను రాబట్టగలడని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపేశ్లో పేస్ వేరియేషన్ కూడా ఉంది. స్ట్రైక్ బౌలర్‌గానే కాకుండా ఫస్ట్ ఛేంజ్ బౌలర్‌గా కూడా ఉపయోగపడగలడు. 17 ఏళ్ల వయసులోనే ఖండాంతర టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన దీపేశ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్పై కూడా దృష్టి పెట్టగలిగితే త్వరలోనే టీమిండియా తలుపులు తట్టే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో ఫైనల్ మినహా దీపేశ్ ప్రతి మ్యాచ్‌లో చాలా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. దీపేశ్బ్యాటింగ్లోనూ అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. పాక్‌తో జరిగిన ఫైనల్లో ఇది కూడా నిరూపితమైంది. ఆ మ్యాచ్ లో భారత ఓటమి ఖరారైనా దీపేశ్ బ్యాట్ ఝలిపించాడు. ఈ ఆల్‌రౌండ్ లక్షణం దీపేశ్‌ను టీమిండియా అవకాశానికి మరింత చేరువ చేస్తుంది. తాజాగా ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో దీపేశ్ ప్రదర్శనలు.. పాకిస్తాన్‌పై 3/16మలేషియాపై 5/22శ్రీలంకపై 1/25యూఏఈపై 2/21పాకిస్తాన్‌పై 3/83 -
విషాదం.. క్రికెట్ ఆడుతూ ప్రముఖ నటుడు మృతి
సినీ పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు, కామెడియన్ దీపేష్ భాన్(41) కన్నుమూశారు. నేడు ఉదయం క్రికెట్ ఆడుతూ కిందపడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే దీపేష్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్తను అసిస్టెంట్ డైరెక్టర్ కవిత కౌశిక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి: నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం దీపేష్ హఠ్మారణంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపేష్ చాలా ఫిట్‌గా ఉంటారని, మద్యపానం, పొగతాగే అలవాట్లు కూడా లేవంటూ ఆమె భావోద్వేగానికి లోనియ్యారు. కాగా దీపేష్ మృతికి పలువుకు సినీ, టీవీ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ‘భాబీ జీ ఘర్ పర్ హై’ అనే సీరియల్‌తో పాటు ‘కామెడీ కా కింగ్ ఖాన్’, ‘కామెడీ క్లబ్’, ‘భూత్వాలా’, ‘ఎఫ్ఐఆర్’, ‘ఛాంప్’ వంటి షోలతో ఆయన మంచి గుర్తింపు పొందారు. -
వేధింపులు తట్టుకోలేక...
న్యూఢిల్లీ: వేధింపులను తట్టుకోలేక జాతీయస్థాయి వర్ధమాన క్రీడాకారిణి అర్జు ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థి, బంధువు కూడా అయిన దీపేశ్ శంకర్ అనే యువకుడి వేధింపులను భరించలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి దీపం, క్రీడాజ్యోతి ఆరిపోయిందని అర్జు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అర్జు తల్లిదండ్రులిద్దరూ ఉన్నతోద్యోగులు. అన్న శివం డాక్టర్ వృత్తిలో వున్నాడు. చిన్నప్పటినుంచి ఆమెకు బాస్కెట్ బాల్ అంటే ప్రాణం. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే కెప్టెన్‌గా ఎదిగింది. ఇటీవల గుజరాత్ లో జరిగిన జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో తన జట్టును రెండవ స్థానంలో నిలిపింది. భవిష్యత్తు మరింత ఎత్తుకు ఎదగాలని కలలు కంది. కానీ ఓ మృగాడి రూపంలో విధి ఆమెతో ఆడుకుంది. అర్జును తరచూ వేధించే దీపేశ్ శుక్రవారం ఇంటికి వచ్చి మరీ గొడవ పడ్డాడు. సోదరుడు శివం అడ్డుకోవడంతో ఇద్దరి మధ్యా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో శివం ఫిర్యాదు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అర్జు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.


