breaking news
Deep Concern
-
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారత్ తీవ్ర ఆందోళన
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై తాజా దాడుల నేపథ్యంలో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వానికి ఈ పరిణామాలు ముప్పుగా మారే ప్రమాదం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) హెచ్చరించింది. అన్ని పక్షాలు సంయమనం పాటించి, ఉద్రిక్తతలను వెంటనే తగ్గించడంతో పాటు చర్చలు, దౌత్య మార్గానికే ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.హోర్ముజ్ జలసంధిలో ఇటీవల పలు వాణిజ్య ట్యాంకర్లపై జరిగిన దాడుల అనంతరం అమెరికా ఇరాన్‌కు చెందిన 80కి పైగా సైనిక లక్ష్యాలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, తీర రాడార్ వ్యవస్థలు, నౌకా వ్యతిరేక క్షిపణి సామర్థ్యాలు, ఐఆర్‌జీసీకి చెందిన నౌకా వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. ఈ పరిణామాలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.ఇక అమెరికా దాడులకు ప్రతిస్పందనగా బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా పేర్కొంది. అయితే ఈ దాడుల తీవ్రత, నష్టం వంటి అంశాలపై స్వతంత్ర ధ్రువీకరణ ఇంకా పూర్తిగా వెలువడలేదు. ఈ పరిణామాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో తాజా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. భద్రతా ఆందోళనల కారణంగా పలు చమురు, గ్యాస్ ట్యాంకర్లు తమ ప్రయాణాలను మార్చుకోవడం లేదా వెనక్కి మళ్లడం ప్రారంభించాయి. భారత్‌కు ఇంధన దిగుమతుల్లో గల్ఫ్ దేశాల వాటా అధికంగా ఉండటంతో ఈ పరిస్థితులను న్యూఢిల్లీ అత్యంత నిశితంగా గమనిస్తోంది.భారత్ తన ప్రకటనలో మరోసారి శాంతియుత పరిష్కారానికే మద్దతు ప్రకటించింది. పౌరుల ప్రాణ భద్రత, సముద్ర రవాణా స్వేచ్ఛ, ప్రపంచ వాణిజ్య ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది. వివాదాలకు సైనిక చర్యలు కాకుండా చర్చలు, దౌత్యమే శాశ్వత పరిష్కార మార్గమని పునరుద్ఘాటించింది. -
రష్యా మహిళ, చిన్నారి జాడ తక్షణమే కనిపెట్టండి
న్యూఢిల్లీ: రష్యా మహిళ, ఆమె కుమార్తె కనిపించకుండా పోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా ఆమెకు ఎవరో సాయం చేసి ఉండొచ్చని పేర్కొంది. లుకౌట్ నోటీసు జారీ చేసి, తల్లి, కుమార్తె జాడను త్వరగా తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైకత్ బసు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా శుక్రవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చిల ధర్మాసనం పైవిధంగా స్పందించింది. రష్యా పౌరురాలైన తన మాజీ భార్య విక్టోరియా బసు, నాలుగున్నరేళ్ల చిన్నారి ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ సైకత్ బసు పేర్కొన్నారు. పోలీసులు లుఔట్ నోటీసు జారీ చేశారని, రష్యా ఎంబసీతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి ధర్మాసనానికి నివేదించారు. ఈ నెల 6న ఆమెకున్న కెనరా బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.169 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమె దేశం విడిచి వెళ్లినట్లు ఎయిర్‌పోర్టుల్లో నమోదు కాలేదని వివరించారు. స్పందించిన ధర్మాసనం..విక్టోరియా బసు వేరే మార్గాల ద్వారా దేశం దాటి వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడింది. అన్ని రైల్వే స్టేషన్లు, ఇతర రవాణా వ్యవస్థల నుంచి సమాచారం సేకరించాలని, ఢిల్లీని విడిచారా లేదా నిర్థారించాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే వారి జాడ కనుగొనాలంది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు సైకత్, విక్టోరియా దంపతులు చిన్నారి సంరక్షణను వారంలో చెరో మూడు, నాలుగు రోజులు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ నెలారంభంలో ఢిల్లీలోని రష్యా ఎంబసీ వెనుక వైపు నుంచి ఓ దౌత్యాధికారి వెంట కూతురిని తీసుకుని వెళ్లిన విక్టోరియా జాడ మళ్లీ కనిపించలేదని సైకత్ పేర్కొన్నారు. కుమార్తె సహా ఆమె భారత్ విడిచి వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన


