breaking news
debacle
-
అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..!
‘మా నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలం గడిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నగదు బదిలీ లాంటి పథకాలతో హడావుడి చేశారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చేస్తున్నారు. అందుకే చంద్రబాబు పనిగట్టుకుని దుష్ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోవడం లేదు’. – టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్య జిల్లాలో టీడీపీ వరస ఓటములతో కుదేలవుతోంది. భవిష్యత్‌పై ఆశలు సన్నగిల్లడంతో తమ్ముళ్ల వ్యవహారశైలిలో మార్పు వస్తోంది. పట్టున్న పల్లెలు కూడా జారిపోవడంతో మనోధైర్యం దెబ్బతింటోంది. చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే వారిలో సైతం అంతర్మథనం మొదలైంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి గుడ్‌బై చెప్పే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. పెద్దసంఖ్యలో నేతలు రాజీనామా బాటపట్టడంతో అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. వైఎస్సార్సీపీలో చేరికలు పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. సాక్షి, తిరుపతి : జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి టీడీపీ శ్రేణుల్లో మార్పు కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు తీరుతో కార్యకర్తలు విసిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం వృథా అని నిర్ణయానికి వస్తున్నారు. కొందరు తటస్థంగా ఉండటానికి ఇష్టపడుతుంటే.. మరి కొందరు పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. చిత్తూరులో గురువారం కొందరు టీడీపీ జిల్లా, మండల నాయకులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మరి కొందరు పార్టీని వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బాబు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజక వర్గం విషయానికి వస్తే. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో అధికశాతం ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరిపోయారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న శాంతిపురం, గుడుపల్లె నాయకులు కూడా ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, కుప్పం నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. కుప్పంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్థానికులు టీడీపీకి గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ నుంచి ఇప్పటికే ముఖ్యమైన నాయకులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీకి కంచుకోటగా ఉన్న రామచంద్రాపురం మండలంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. మొత్తం 10 పంచాయతీల్లోనూ విజయం సాధించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి పనితీరుకు రామచంద్రాపురం మండలంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అనూహ్య మార్పులు పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాక జిల్లా రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనన్నట్లు మేధావులు విశ్లేషిస్తున్నారు. పుంగనూరు, తంబళ్లపల్లె పరిధిలో టీడీపీ ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోయింది. తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడీ నెల్లూరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, పలమనేరు పరిధిలోని అన్ని మండలాల్లోనూ పెద్దసంఖ్యలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల తర్వాత మిగిలిన టీడీపీ నాయకులు కూడా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తర్వాత మరి కొన్ని వలసలు ఉండే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం తీరుతో విసిగి పోయిన తమ్ముళ్లు గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. (చదవండి: ‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
ఓటమి బాటలో డజను ఎంపీ మంత్రులు
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినా ఉత్కంఠ పోరులో కాంగ్రెస్‌దే పైచేయి సాధించింది. 230 స్ధానాలున్న మధ్యప్రదేశ్‌లో మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 115 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 105 స్ధానాల్లో ముందంజలో ఉంది. బీఎస్పీ రెండు స్ధానాల్లో, ఇతరులు ఏడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ అవకాశాలను దెబ్బతీయగా, కాంగ్రెస్‌కు ఇదే కలిసివచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌లోని దాదాపు డజను మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంత్రి నరోత్తం మిశ్రా దాటియా స్ధానంలో 6200 ఓట్లతో ఎదురీదుతుండగా, మొరెనా నియోజకవర్గంలో మంత్రి రుస్తం సింగ్ మూడో స్ధానంలో ఉన్నారు. ఇక ఖర్గోవ్‌లో బాలక్రిష్ణ పటిదార్, గొహద్‌లో లాల్ సింగ్ ఆర్యా, షహ్పురా స్ధానం నుంచి ఓం ప్రకాష్ దుర్వే వెనుకంజలో ఉన్నారు. ఇక అంతర్ సింగ్ ఆర్య సెంద్వా స్ధానంలో వెనుకబడగా, హట్‌పిప్లియా నుంచి దీపక్ జోషి, సిల్వాని నుంచి రాంపాల్ సింగ్, బుర్హాన్‌పురాలో అర్చనా చిట్నిస్ ఓటమి అంచుల్లో ఉన్నారు. ఇక ఆర్థిక మంత్రి జయంత్ మాలవీయ దామో స్ధానంలో, శరద్ జైన్ జబల్పూర్ నార్త్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. మరో మంత్రి జల్బన్ సింగ్ గ్వాలియర్‌లో, మాజీ ప్రదాని వాజ్‌పేయి మేనల్లుడు అనూప్ మిశ్రా బితర్వార్ స్ధానంలో వెనుకంజలో ఉన్నారు. -
టాటా గ్రూపును వీడని మిస్త్రీ బోర్డ్ వార్!
ముంబై: టాటా-మిస్త్రీ బోర్డ్ వార్ ఇంకా టాటా గ్రూపును ఇంకా వెన్నాడుతూనే ఉంది. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ ఉద్వాసన అనంతర పరిణామాల నేపథ్యంలో టాటా గ్రూపునకు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలో టాప్ 100 బ్రాండ్ ర్యాంక్ నుంచి వైదొలగింది. బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం టాటా గ్రూప్ ర్యాంకింగ్ 21 స్థానాలు కిందికి దిగజారింది. గత ఏడాది 82వ స్థానం నుంచి ఈ ఏడాది 103 స్థానంలో నిలిచింది. అంతేకాదు టాప్ 100 జాబితానుంచి కిందికి పడిపోవడం ఇదే మొదటి సారని బ్రాండ్ ఫైనాన్స్ నివేదించింది. ఒకపుడు టాప్ 100 జాబితాలో ఏకైక భారతీయ బ్రాండ్ గా నిలిచిన టాటా గ్రూపు 2016 సం.రానికి వచ్చేసరికి అసలు ఆ జాబితాలోనే చోటును కోల్పోయింది. 2014లో 34 వ స్థానంలో ఉన్నటాటా గ్రూపు క్రమంగా తన ర్యాంకింగ్ ను కోల్పోతూ వస్తోంది. 2015లో 65వ స్థానానికి, ఆతరువాత 82 స్థానానికి పరిమితమైంది. బ్రాండ్ ఫైనాన్స్ టాప్ 500 కంపెనీల జాబితాలో ఎయిర్టెల్ ర్యాంక్ బాగా ఎగబాకింది. 2015 లో 242 స్థానం నుంచి పుంజుకుని 190 వద్ద నిలిచింది. ఇదే బాటను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనుసరించింది . 283 వ ర్యాంక్ నుంచి 222 స్థానానికి అధిగమించింది. ఇన్ఫోసిస్ ర్యాంక్ 251గా ర్యాంక్ ను సాధించగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ర్యాంక్ 244 నుంచి 294 ర్యాంక్ కు పడిపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 442నుంచి 345కి ఎగబాకింది. కాగా గత ఏడాది అక్టోబర్ లో టాటా సన్స్ ఛైర్మన్ గా ఉన్న మిస్త్రీని అకస్మాత్తుగా తొలగించింది టాటా గ్రూపు. గ్రూపు అధినేత రతన్ టాటా తాత్కాలిక ఛైర్మన్ గా బాధత్యలను స్వీకరించడంతో దుమారం రేగింది. టాటా గ్రూపునకు, మిస్త్రీకి మధ్య వార్ ఇంకా కొనసాగుతోంది. అటు టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ను టాటా సన్స్ కొత్త చైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.