breaking news
Death anniversary
-
AP: వైఎస్ఆర్కు రాష్ట్రవ్యాప్తంగా నేతల ఘన నివాళులు
సాక్షి,విశాఖపట్నం: దివంగత నేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం(సెప్టెంబర్2) వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్‌రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్కు ఉన్న ప్రజాదరణ దేశంలో మరే సీఎంకు లేదు: బొత్సవైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి.ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగింది.పార్టీలకతీతంగా వైఎస్‌ను ప్రజలు ఆరాధిస్తారు.వైఎస్ అడుగుజాడల్లోనే వైఎస్జగన్ పయనిస్తున్నారు. ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారు.వైఎస్ ఆశయాలను మేమంతా కలిసి ముందుకు తీసుకువెళ్తామని ప్రమాణం చేస్తున్నాంప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్.. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుపేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.వైఎస్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు.మళ్లీ వైఎస్ జగన్ ను మనమంతా కలిసి ముఖ్యమంత్రిగా చేసుకోవాలివైఎస్ఆర్ జిల్లాలో.. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మునిసిపల్ ఛైర్మన్ లక్ష్మీదేవి, మాజీ ఆప్కోబ్ చైర్మన్ మల్లెల జాన్సీ,కౌన్సిలర్లు, నాయకులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన -
ఆ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు అవార్డు
సాక్షి, తెనాలి: ఆయన పద్య గానం పౌరాణిక నాటక రంగాన్ని ప్రకాశింపజేసింది. తెనాలి కళారంగ ఆణిముత్యాల్లో ఒకడిగా నిలిపింది. రంగస్థలంపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం అనిర్వచనీయం. అందుకే అర్ధశతాబ్దం పాటు నాటక ప్రియులను ఆయన రంజింపజేశారు. ప్రేక్షక మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయనే తెనాలికి చెందిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు. ఇంతటి కళా ప్రముఖుడి స్మారకార్థం ఏటా ఒక ప్రముఖ రంగస్థల నటుడికి ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 26న అవార్డును ప్రదానం చేస్తూ.. కళాకారుల పత్రిష్టను ఎలుగెత్తి చాటుతున్నారు. ఏవీ సబ్బారావు రంగస్థల సమాఖ్య వారి శ్రీపూర్ణశ్రీ నాట్యకళాసమితి ఆధ్వర్యంలో గురువారం తెనాలిలోని శివాజీచౌక్‌లో 9వ వార్షిక అవార్డును అనంతపురానికి చెందిన ప్రముఖ నటుడు ‘కళాతపస్వి’ ఆకులేటి నరసింహమూర్తికి ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 మంది కళామూర్తులను సత్కరించనున్నారు. సినీ సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా, పౌరాణిక నటుడు గుమ్మడి గోపాలకృష్ణ, తెనాలి సబ్‌కలెక్టర్ కె.దినేష్‌కుమార్ తదితర ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. నాటకాలపై ఆసక్తితో రంగస్థలం వైపు.. ఏబీ సుబ్బారావుగా రంగస్థల ఖ్యాతి పొందిన ఆరాధ్యుల వెంకట సుబ్బారావు స్వస్థలం తెనాలి సమీపంలోని అనంతవరం. పేద రైతు కుటుంబం. పెద్దగా చదువు లేదు. పొలం పనులతోనే జీవనం. నాటకాలపై ఆసక్తి ఆయన్ని కళాకారుడిని చేస్తే, నిరంతర శ్రమ, కఠోరదీక్ష ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేశాయి. గ్రామంలో పక్క బజారులో ఉండే రంగస్థల నటుడు కుప్పా సూర్యనారాయణ శిష్యరికంతో సుబ్బా రావు కళామతల్లి సేవకు అంకితమయ్యారు. పాత్రలో పరకాయ ప్రవేశం.. శ్రీరాముడు పాత్రకు పద్యాలు, పాటలు, సంభాషణలను సుబ్బారావు వంటపట్టించుకున్నారు. ‘బాలనాగమ్మ’ ఫేం వల్లూరి వెంకట్రామయ్య ఆహ్వానంపై రెండేళ్లు ఆ బృందంలో ‘కార్యవర్ధి రాజు’గా నటించారు. ఆక్రమంలో 1958లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీల్లో ‘పాండవోద్యోగ విజయం’లో ఏవీ సుబ్బారావు శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ యన అద్భుత ప్రదర్శనతో మరోసారి అక్కడే నా టకం ఏర్పాటు చేసి, పూర్తయ్యాక ఆయన్ని 75 తులాల వెండి కిరీటంతో సత్కరించారు. ఇక అప్పటి నుంచి సుబ్బారావు వెనుదిరిగి చూడలేదు. పద్య గానం మధురం.. ఆంధ్ర రాష్ట్రమంతా సుబ్బారావు పద్య గానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాధించింది. 1960లో శ్రీ పూర్ణశ్రీ నాట్య కళాసమితిని స్థాపించారు. ఈ సమాజంలోనే 30 ఏళ్లపాటు నాటక ప్రదర్శనలిచ్చారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో ఆయన ప్రదర్శనలు పేక్షక మన్ననలు పొందాయి. మూడు తరాల కళాకారులతో.. మూడు తరాల కళాకారులతో నటించిన మరో ఘనత కూడా సుబ్బారావుకు ఉంది. ఈల పాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖి ఆంజనేయరాజు వంటి హేమాహేమీలతో కలిసి శ్రీకృష్ణుడి పాత్రను ఒకే వేదికపై పంచుకున్నారు. ఆంజనేయుడు పాత్రలో నరసింహమూర్తి ఆకులేటి నరసింహమూర్తి ఆరు వేల ప్రదర్శనలు.. మొత్తం మీద సుబ్బారావు ఆరు వేల ప్రదర్శనలిచ్చారు. ఆయన పద్యాలను హెచ్ఎంవీ, ఏవీఎం సంస్థలు గ్రామఫోన్, ఆడియో క్యాసెట్ల రూపంలో విడుదల చేశాయి. రెండు చిత్రాల్లో కాంతారావు, రావి కొండలరావుకు ప్లేబ్యాక్ పద్యాలు గానం చేశారు. 2010 డిసెంబర్ 26న సుబ్బారావు కన్నుమూశారు. ఆయన స్మారకార్థం కళారంగంలోనే స్థిరపడిన ఆయన ముగ్గురు కుమారులు ప్రతిఏటా పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ రంగంలో నిష్ణాతులైన వారికి ‘ఆంధ్ర గానకోకిల ఏవీ సుబ్బారావు అవారు’ ను ప్రదానం చేస్తున్నారు. ఆంజనేయుడి పాత్రలో ఆకులేటి.. ఏవీ సుబ్బారావు అవార్డును స్వీకరించనున్న ఆకులేటి నరసింహమూర్తి అనంతపురం జిల్లా శింగనమల దగ్గర్లోని ఆకులేడు గ్రామ వాసి. 1950లో జన్మించారు. చిన్నతనం నుంచే రాగాలాపన చేసేవారు. గ్రామంలోని హార్మోనిస్టు సుబ్బరాజు దగ్గర ఆంజనేయుడి వేషం, పద్యాలు నేర్చారు. పది నాటకాల్లో నటించారు. తదుపరి అనంతపురంలో శ్రీవెంకటేశ్వర నాట్యమండలి సమాజంలో గురువు దగ్గర మూడేళ్ల పాటు పద్యనాటక సాధన తర్వాత వసంతోత్సవాల్లో ఏవీ సుబ్బారావు శ్రీరాముడిగా, నరసింహమూర్తి ఆంజనేయుడిగా పలు గ్రామాల్లో ఇచ్చిన ప్రదర్శనలు సూపర్ హిట్ అయ్యాయి. నరసింహమూర్తి కాస్తా.. ఆకులేటి ఆంజనేయుడయ్యారు. ప్రఖ్యాత నటులు షణ్ముఖి ఆంజనేయరాజు, ఈలపాట రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, ధూళిపాళ్ల, ఆచంటి వెంకటరత్నం నాయుడు, అమరపు సత్యనారాయణ, ఏవీ సుబ్బారావు కుమారులు వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, గుమ్మడి విమలకుమారితో వేదికను పంచుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇచ్చిన ఓ ప్రదర్శనలో 50 కిలోల వెండిగదను బహుమతిగా అందుకున్నారు. ఇప్పుడు కూడా ఏమాత్రం గాత్రం తగ్గకుండా ప్రదర్శనలిస్తుండటం విశేషం. -
వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదో వర్ధంతిని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహోరాత్రాలు కృషి చేసిన మహనీయుడు వైఎస్ అని కొనియాడారు. రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకువచ్చారని, ఆయన అనుసరించిన విధానాలు పొరుగు రాష్ట్రాలకే కాక, ఇతర దేశాలకూ ఆదర్శనీయమయ్యాయన్నారు. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే ఉద్దేశంతో వైఎస్ అమలు చేసిన పథకాలను ఆయన అనంతరం ఏ ప్రభుత్వాలూ కొనసాగించకపోవటం సిగ్గుచేటని నాని విమర్శించారు. పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు కార్పొరేట్ ఉన్నత విద్య అవకాశాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆయన పాలనా దక్షతకు మచ్చుతునకలుగా చెప్పుకోవచ్చన్నారు. ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోవడానికి అధికారంలోకి రాక ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారని గుర్తు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన అనంతరం రైతులకు ఉచిత విద్యుత్ అందించి మేలు చేశారన్నారు. సమాజంలో వివిధ వర్గాలకు ఉన్నతస్థితి కల్పించడానికి రిజర్వేషన్ల శాతం పెంచడంలో ఆయన పాటించిన నిబద్ధత అపూర్వమన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల పక్షాన పోరాడడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, వైఎస్ కుమారుడు, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల కోసం ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ ఆశయాలను ప్రజలెవరూ మరిచిపోనప్పటికీ ఆయనను మరోసారి గుర్తు చేసుకోవడం రాష్ట్ర ప్రజల బాధ్యత అని నాని పేర్కొన్నారు. ఈ నెల 2న మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సిద్ధం కావాలని నాని సూచించారు.