breaking news
Dead bodies available
-
బావిలో మృతదేహాలు లభ్యం
-
విషాద బంధం సంగారెడ్డిలో ఘోరం..
- పట్టణ శివార్లలో నలుగురి మృతదేహాలు - ఇద్దరు చిన్నారులతో కలిసి జంట ఆత్మహత్య - కలతలు, కలహాలే కారణం?! సంగారెడ్డి క్రైం: మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణ శివారులో సోమవారం నలుగురి మృతదేహాలు బయటపడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మూడు రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మృతుల వివరాలు తెలియక చాలాసేపు గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్ జిల్లా ఖిలాఘనపురం మండలం కమాలొద్దీన్పూర్కు చెందిన రాజు (35) పదిహేనేళ్లుగా హైదరాబాద్‌లోని మియాపూర్, మదీనాగూడ, కొండాపూర్ ప్రాంతాల్లో ఉంటున్నాడు. అతను రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన అనిత(30)వివాహేతర సంబంధం కొనసగిస్తూ ఆమె ఇద్దరు కుమార్తెలు అఖిల (14), ఉమ (12)తో కలిసి ప్రస్తుతం దీప్తిశ్రీనగర్ ప్రాంతంలోని గుడిసెలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని మల్కాపూర్ గ్రామ శివారుకు వచ్చిన రాజు, అనిత జాతీయ రహదారి సమీపంలో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. దీప్తిశ్రీనగర్‌లో కలకలం... మృతుడు రాజు కొన్నేళ్లుగా ఎంఏ నగర్ తదితర ప్రాంతాల్లో ఫాస్ట్‌ఫుడ్ బండి నడుపుకునేవాడు. చాలాకాలంగా కాలనీలో ఉంటున్నా ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదని స్థానికులు పేర్కొన్కానరు. సోమవారం రాత్రి వారు నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. 8 నెలల క్రితమే వివాహం.. వివాహేతర సంబంధం.. కుటుంబ కలహాల కారణంగానే నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడు రాజు (30)కు 8 నెలల క్రితమే అడ్డాకుల మండలం దాసరిపల్లికి అక్క కూతురు అరుణ అలియాస్ రాధతో వివాహం జరిగింది. అయితే అతను తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటూనే ఆమెకు తెలియకుండా అనితతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. అయితే అతను గత కొద్ది రోజులుగా దిగాలుగా ఉంటున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుటుంబ కలహాలు కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సంగారెడ్డి పోలీసులు అనుమానిస్తున్నారు.